Friday, January 13, 2023

జై దుర్గా మాత Jai Durga Matha

 🌿🌼🙏ఓం దుం దుర్గాయై నమః🙏🌼🌿

దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32నామాలతో పూజిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు🙏🌼🌿


🌿🌼🙏అర్ధంతో దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళి🙏🌼🌿


దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ

దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ

దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ

దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా

దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ

దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత

దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని

దుర్గమోహ & దుర్గమగ, దుర్గమర్థస్వరూపిణీ

దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధదారిణీ

దుర్గమాంగీ, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరీ

దుర్గభీమా, దుర్గభామా, దుర్లభా, దుర్గధారిణీ.. 

ఇవి దుర్గాదేవి 32 నామాలు.


🌿🌼🙏32 నామాలకు అర్థాలు🙏🌼🌿


1.దుర్గా: భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం.

2.దుర్గార్తిశమణీ: కష్టాలను శమింపచేసేతల్లి నీకు వందనం.

3.దుర్గాపద్వినివారిణీ: ఆపదలను నివారించే తల్లీ నీకు వందనం.

4.దుర్గమచ్ఛేదినీ: కష్టాలను ఛేదించే తల్లీ నీకు వందనం.

5.దుర్గసాధినీ: దుర్గమమైనది సాధించే తల్లీ నీకు వందనం.

6.దుర్గనాశినీ: కష్టాలను నాశనం చేసే తల్లీ నీకు వందనం.

7.దుర్గతోద్దారిణీ: దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లీ నీకు వందనం.

8.దుర్గనిహంత్రీ: మనదెగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లీ నీకు వందనం.

9.దుర్గమాపహ: కష్టాలను వినాశనం చేసే తల్లీ నీకు వందనం.

10.దుర్గమదేజ్ఞానదా: రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లీ నీకు వందనం.

11.దుర్గదైత్యలోకదవానలా: కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లీ నీకు వందనం.

12.దుర్గమ: అమ్మను సాధించడానికి ఆశక్యమైన తల్లీ నీకు వందనం(తేలికగా దర్శనం ఇవ్వని తల్లి).

13.దుర్గమాలోక: చర్మచక్షువులు,పంచేంద్రియాలతో చూడలేని తల్లీ నీకు వందనం.

14.దుర్గమాత్మస్వరూపిణీ: మనలోనే వసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైన తల్లీ నీకు వందనం. అంటే మనలోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని, కళ్ళతో చూడలేని, తెలుసుకోలేని తల్లి స్వరూపంమని అర్ధం

15.దుర్గమార్గాప్రదా: రహస్య మార్గానికి త్రోవచూపేతల్లీ నీకు వందనం.

16.దుర్గమవిద్యా: రహస్యమైన విద్యాస్వరూపమైన తల్లీ నీకు వందనం(శ్రీవిధ్యా స్వరూపం).

17.దుర్గమాశ్రిత: దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లీ నాకు వందనం (శ్రీచక్రం).

18.దుర్గమజ్ఞానసంస్థాన: అలవికాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యంకాని జ్ఞానానికి తల్లీ నీకు వందనం.

19.దుర్గమధ్యానభాసిని: ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాసించే తల్లీ నీకు వందనం.

20.దుర్గమోహ: ఆపదలను లాగేసే తల్లీ నీకు వందనం.

21.దుర్గమగ: కష్టాలను పరిష్కరించే తల్లీ నీకు వందనం.

22.దుర్గమార్థస్వరూపిణీ: ఈ పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అని.. రెండోది దుర్గమమైన అర్ధాలుగల తల్లీ నీకు వందనం.

23.దుర్గమాసురసంహంత్రీ: దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించిన తల్లీ నీకు వందనం.

24.దుర్గమాయుధదారిణీ: దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లీ నీకు వందనం.

25.దుర్గమాంగీ: ఊహించలేని దివ్యమైన అంగాలు కల తల్లీ నీకు వందనం.

26.దుర్గమత: కల్మషాలను దూరం చేసే తల్లీ నీకు వందనం.

27.దుర్గమ్య: సాధించడానికి శక్యం కానీ తల్లీ నీకు వందనం.

28.దుర్గమేశ్వరి: విఘ్నాలకు అధినాయకురాలైన తల్లీ నీకు వందనం.

29.దుర్గభీమా: భీషణమైన పరాక్రమం కల తల్లీ నీకు వందనం.

30.దుర్గభామా: దుర్గ అనే స్త్రీ రూపం లోని తల్లీ నీకు వందనం.

31.దుర్గభా: ప్రకాశం గల తల్లీ నీకు వందనం.

32.దుర్గదారిణీ: రహస్యాన్ని ఛేదించే తల్లీ నీకు వందనం.


🌿🌼🙏ఓం నమో దుర్గాయ నమః  అంటూ ఈ 32నామాల దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళిని 108 సార్లు పారాయణం చేస్తే సర్వ దరిద్రాలు తొలగుతాయి అనేది  పురాణాల కథనం.. భక్తుల నమ్మకం..🙏🌼🌿


🌼🌿ఓం దుం దుర్గాయై నమః🙏🌼🌿

Wednesday, January 11, 2023

భోగి పళ్ళు Bhogi Pallu

 రేగి పండ్లు ఎందుకు పోస్తారు


భోగి రోజు అన్ని చెడు కర్మలు తొలగాలి ఆని పాతవస్తువులు భోగి మంటవేస్తారు ఆ బోగి నుండి దీపం తెచ్చి ఇంట్లో దేవుడి ముందు ఉంచుతారు ఇది సంప్రదాయం దాంతో పాటు ఆ రోజు సాయంత్రం ఐదు సంవస్తారాలు లోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు , పిల్లలకు ఐదు సంవస్తారాలు లోపు ఉండే బాల అరిష్టాలు, దిష్టి  తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకొని ఈ రేగి పండ్లు పోస్తారు ఆ వయసుపిల్లలకు బ్రహ్మ రంద్రం పలుచగా ఉంటుంది రేఖి అరా కూడా పలచగా ఉంటుంది ఈ రేగి పండ్లుకి రోగనిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటుంది. అవి పోసిన సమయంలో రేగి పండ్లు నుండి వచ్చే వాయువు పిల్లల తల పైన బ్రహ్మ రంద్రానికి శక్తిని ఇస్తుంది , మేధస్సుకి శక్తి వస్తుంది ఈ పండ్లు తల పైన నుండి పడటం వల్ల తలలోని మెదడు లోని నరాలకు రేగి పండ్ల నుండి వచ్చే వాయువు వల్ల ఆక్టివ్ అవుతారు.. శీతాకాలంలో వచ్చే జబ్బులు వల్ల పిల్లలు మెతక బడిపోతారు ఈ రేగి పళ్లలో అరా ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది ఇది ఒక శాస్త్రీయ సంప్రదాయం అలాగే చుట్టూ ఉండే అరా బలపడుతుంది..ఎటువంటి పరిస్థితులు అయినా ఎదురుకునే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో ఈ రేగి పండ్లు నే పోస్తారు, అలాగే పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుంది చుట్టు పక్కల వారు కూడా వచ్చి వారు కూడా రేగి పండ్లు పోయడం వల్ల పిల్లలకు అందరి ఆశీర్వాదం కలుగుతుంది.రేగుపళ్లలో ‘సి’విటమిన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా జీర్ణసంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదరసంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగుపళ్లు ఉపయోగపడతాయి.అందుకే రేగుపళ్లని ఎండుపెట్టి వాటితో వడియాలను, రేగుతాండ్రనూ చేసుకుని తినే అలవాటు ఇప్పటికీ తెలుగునాట ఉంది.


ఇంకో కారణం భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు


రేగి పండ్లును బదరీఫలం అంటారు


సాక్షాత్తూ ఆ నరనారాయణులు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారనీ, ఆ ఫలాలని తింటూ తమ తపస్సుని కొనసాగించారనీ ప్రతీతి. వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగి పండ్లు కురిపించారు అంటారు, అందుకే ఆ ప్రదేశానికి బదరీక్షేత్రం అన్న పేరు వచ్చిందని చెబుతారు. భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగు చెట్టు ఎలాంటి ఒడుదొడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుంది. -15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకూ ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని నిలబడుతుంది.


మన దేశంలోనే కాకుండా తూర్పుదేశాలన్నింటిలోనూ రేగుని తమ సంప్రదాయ వైద్యంలో వాడతారు. జలుబు దగ్గర నుంచీ సంతానలేమి వరకూ రేగుని అన్నిరకాల రుగ్మతలకీ దివ్యౌషధంగా భావిస్తారు. రేగుపళ్లు ఉన్నచోట క్రిమికీటకాలు దరిచేరవని ఒక నమ్మకం. ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపిస్తుంది. భూటాన్‌లో అయితే కేవలం ఇంటిని సువాసనభరితంగా ఉంచేందుకు ఈ పళ్లను మరిగిస్తారు.


రేగిపండ్లు, బంతిపూల రెక్కలు (వీటికి వాయువు లో ఉండే క్రిములను నాశనము చేసే గుణం ఉంది) , చిల్లర కూడా కలిపి పిల్లల తలపైన నుండి దోసిటీతో పోయాలి..చివరిగా దిష్టి తీయాలి అలా పోసే టప్పుడు ఇంటి దేవుణ్ణి స్మరించాలి చివరిగా కర్పూరం తో పిల్లలకు దిష్టి తీయాలి..


పిల్లలు లేని వారు కొత్త దంపతులు చిన్ని కృష్ణుని కి బోగిపళ్ళు పోసి పూజ చేసి పిల్లలు కోరుకోవాలి, పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృషుడి కి భోగి పళ్ళు పోసి వేడుకగా భజన చేయవచ్చు... 


 {12 సంవస్తారాలు లోపు పిల్లలకు బోగి పళ్ళు పోయవచ్చు)


సేకరణ