*శివుడు శ్మశానంలో కొలువై ఉండే - శివుడికి ఇష్టమైన ప్రాంతం శ్మశానం..!!*
శవాలను దహనం చేసే ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు కొలువై ఉంటాడో సాక్షాత్ పార్వతీదేవికి సందేహం వచ్చింది..
ఇదే విషయాన్ని మహాశివుడి వద్ద పార్వతీ దేవి స్వయంగా ప్రస్తావిస్తుంది..
దీనికి శివుడు ఏమని సమాధానం ఇచ్చారంటే...
పార్వతీ... శ్మశానంలో నేనేమీ ప్రయత్న పూర్వకంగా కూర్చోవడం లేదు.
లోకంలో ఉగ్రమైన భూతములన్నీ కొలువైవున్న ప్రాంతం శ్మశానం, ఇక్కడ ఏ ఒక్క పుణ్యకార్యం జరుగకుండా భూతప్రేతాత్మలు అడ్డుకుంటున్నాయి...
దీన్ని గమనించిన బ్రహ్మ.. స్వయంగా నా వద్దకు వచ్చి ఓ విన్నపం చేశారు..
లోకంలో మంగళ కార్యాలేవీ జరగడం లేదు.
దీనికి కారణం ఉగ్ర భూతములన్నీ లోకంలో కొలువై ప్రతి మంగళకార్యాన్ని అడ్డుకుంటున్నాయి.
పైగా.., ఈ లోకంలో సంచరించే ప్రతి బిడ్డా మీ బిడ్డలే కదా, అన్ని ప్రాణులకు తల్లిదండ్రులు మీరే కదా.
మీ పిల్లలు చేసే తప్పొప్పులను సరిదిద్దుతూ వారిని అదుపు ఆజ్ఞల్లో ఉంచేందుకు శ్మశానంలోనే కొలువై వుండాలని ప్రార్థించాడు...
అందువల్లే నేను శ్మశానంలో కొలువై వున్నాను అని చెప్పాడు...
*ఇది మొదటి కారణం కాగా... మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి...!!*
జీవించి వున్న సమయంలో నేనే గొప్ప అని జబ్బలు చరుచుకునే ధనవంతుడు, ఆకటితో అలమటించే కడు పేదవాడు చనిపోయాక వచ్చేది శ్మశానానికే..
అంటే.. ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే.. ఈ విషయాన్ని లోకానికి చాటిచెప్పేందుకే శ్మశానంలో ఉంటున్నాడు పరమేశ్వరుడు..
*చివరి కారణం...*
జీవించి వున్నంత కాలం నావాళ్లూ నావాళ్లూ అంటుంటారు.
తీరా చనిపోయాక శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు..
అలా శ్మశానంలో వదిలి వెళ్లిన వారికి తోడుగా నేనున్నాను అని చెప్పేందుకే అక్కడ నివశిస్తున్నట్టు పార్వతికి శివుడు చెపుతాడు..
అసలు ఈ లోకమే ఓ శ్మశానం.. చనిపోయే వాడు శ్మశానంలోకి వచ్చి చనిపోతున్నాడా? లేదు కదా... గృహాల్లో, ఆస్పత్రుల్లో, రోడ్లపై, పార్కుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నారు.
అంటే ఈ లోకమంతా ఓ శ్మశానమే.. ఇలా చనిపోయిన ప్రాణులన్నీ ఈ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రాంతం శ్మశానం.. ఈ ప్రాంతంలో నేను నివశిస్తున్నాను కాబట్టే శ్మశానం అన్నారు..
పైగా, ఈ లోకంలో మృత్యు భీతి లేకుండా చనిపోయే ప్రాంతమేదైనా ఉందంటే అది కాశీ అని పార్వతికి శివుడు వివరిస్తాడు....
స్వస్తి..🙏🌹
No comments:
Post a Comment