_జగద్గురు ఆదిశంకరాచార్యుల ప్రశ్నోత్తర రత్న మాలిక_
*1.ఇహలోకంలో కోరిన కోర్కెలు తీర్చే చింతామణి లాగా దుర్లభమైనది ఏది?*
జ: ప్రియవాక్కులతో కూడిన దానగుణం, గర్వంలేని జ్ఞానం.
క్షమాగుణం కలిగిన శూరత్వం, ధనంతో పాటు త్యాగ గుణం
ఈ నాలుగింటినీ చతుర్భద్రం అంటారు.
*2.మెరుపులా తాత్కాలికమైనది ఏది?*
జ: చెడ్డ వారితో సాన్నిహిత్యం, యవ్వనం.
*3.కలికాలంలో కూడా తన గౌరవాన్ని నిలబెట్టే వారు, శీలం నుంచి విచలితం కాని వారు ఎవరు?*
జ: సజ్జనులే!
*4.బాధ పడ వలసిన విషయం ఏది?*
జ: ఎంత వైభవమున్నా దయనీయంగా బ్రతకడం.
*5.ప్రశంసనీయమైనది ఏది?*
జ: ఉదారగుణం
*6.మేధావులకు సైతం పూజ్యుడు ఎవరు?*
జ: ఎల్లప్పుడూ సహజంగానే వినయవంతుడై ఉండే వాడు.
*7.వంశకీర్థి అనే కమలాన్ని వికసింపజేసే సూర్యుడు ఎవరు?*
జ: ఎన్నో సద్గుణాలున్నా నమ్రత కలిగి ఉండే వాడు.
*8.ఈ లోకం ఎవరికి సదా లోబడి ఉంటుంది?*
జ: ప్రేమతో, మేలు చేకూర్చే మాటలు పలికే వానికి, ధర్మాచరణలో నిమగ్నుడై ఉండే వాడికి
*9.లక్ష్మీ దేవి ఎవరిని ఇష్టపడుతుంది?*
జ: సోమరితనం లేని వారిని, నీతి బద్ధమైన ప్రవర్తన కలిగి వారిని..
*10.లక్ష్మీ దేవి ఎవరిని వెంటనే విడిచి పెడుతుంది?*
జ: సోమరిని, బ్రాహ్మణ, గురు, దేవతలని నిందించే వారిని.
*11.ఎక్కడ నివాసముండాలి?*
జ: మంచి వాళ్ళ చెంత. లేదా కాశీధామంలో
*12.ఏటువంటి ప్రదేశంలో ఉండకూడదు?*
జ: నిందారోపణలు చేసే ప్రజలున్న, లోభులైన నాయకులున్న చోటును వదిలిపెట్టాలి.
*13.అతి చిన్నతనం కలిగించే పనికి మూలమేమిటి?*
జ: విషయాసక్తుడైన పామరుడిని యాచించడం.
*14.వీరుడు, శూరుడు ఎవరు?*
జ: కామదేవుని బాణాలు తగిలినా నిశ్చలంగా, ధృడంగా ఉండే వాడు.
*15.కన్నులున్నా అంధులెవరు?*
జ: పరమేశ్వరుని పైన, వేదాలు, పరలోకం పైన విశ్వాసం లేనివారు.
( శ్రీపీఠం నుండి )
No comments:
Post a Comment