Tuesday, April 11, 2023

వటపత్ర శాయి


 *వటపత్ర శాయి అనగా?....!!*

మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని.  

ఈ వృత్తాంతం మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది, మార్కండేయుడు ఆరు మన్వంతరములు తపస్సు చేశాడు. 

ఏడో మన్వంతరములో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు, 

వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు.


చలించని మార్కండేయునికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ‘ఏం వరం కావాలో కోరుకో’ అనగా ‘నీ మాయను చూడాలని ఉంది’ అని అడుగుతాడు.


ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రచండ గాలీ, ధారాపాత వర్షమూ విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి. నీటి తో సమస్తం మునిగిపోతుంది...

మార్కండేయుడు మోహశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు. 

అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రిఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. 

చేతి వ్రేళ్ళతో కాలిని పట్టుకుని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు. 

అతడే వటపత్రశాయి, మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపై నున్న వటపత్రశాయి కడుపులోకెళ్లి చూస్తాడు. 

నీట మునిగిన సమస్త భూమీ, ప్రాణ కోటి కనిపిస్తుంది.


మళ్ళీ మరోచోట సృష్టి ప్రారంభము చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు.

శ్రీమహావిష్ణువు వరం ప్రకారం విష్ణు మాయను తెలుసుకుంటాడు...


స్వస్తీ..🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments:

Post a Comment