Friday, June 2, 2023

శ్రీ ఆది శంకరాచార్య ప్రతిష్టిత ఏకైక ఆంజనేయ స్వామి ఆలయం....


 **శ్రీ ఆది శంకరాచార్య ప్రతిష్టిత ఏకైక ఆంజనేయ స్వామి ఆలయం.....!!*

దక్షిణభారతదేశంలో పడమటి కర్నాటక రాష్ట్రంలో పడమటి కనుమల్లో మలండ ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు, లోయలు, అరణ్యాలతో ఆకర్షించే పవిత్ర శృంగేరిలో ఆది శంకరరాచార్యుల వారు ప్రతిష్టించిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, దీన్ని కేరే ఆంజనేయ దేవాలయం అంటారు. 


కేరే అంటే సరస్సు అని కన్నడ అర్ధం, సరస్సు ఒడ్డునే ఆలయం ఉంది. 

శ్రీ శంకర భగవత్ పాదులు భారతదేశం మొత్తం మీదక్కడ శృంగేరిలో ఒక్క చోట మాత్రమే శ్రీ ఆంజనేయస్వామిని ప్రతిష్టించారు. 

అందువల్ల దీనికి విపరీతమైన ప్రసిద్ధి వచ్చింది, శృంగేరిలో పశ్చిమాన కేరే ఆంజనేయ స్వామి దేవాలయం ఇప్పుడున్నకొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నది. 

కోనేరు స్థానంలో ఇప్పుడు బస్ స్టాండ్ కట్టారు, చిన్న దేవాలయం అయినా చాలా అందంగా ఉంది. 

ప్రకృతి దృశ్యాలక మధ్య ఉంది. కేరే ఆంజనేయ స్వామిని దర్శించాలి అంటే 27 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. 


శృంగేరికి వచ్చిన భక్తులు ముందుగా శ్రీ కేరే ఆంజనేయ స్వామిని దర్శించి , ఆ తర్వాత మిగతా దైవ దర్శనం చేస్తారు.


ఆంజనేయస్వామి ఈ క్షేత్ర పాలకుడు కావటమే దీనిలోని విశేషం.

ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి దక్షిణ దిశాగా దర్శన మివ్వటం ఒక ప్రత్యేకత.


స్వామి ఎడమ చేతిలో తామర పుష్పాన్ని ధరించి ఉంటాడు, కుడి చేయి అందరిని దీవిస్తున్నట్లు ఉండటం విశేషం.

స్వామి వాలం శిరస్సు ఆ వ్యాపించి ఉంటుంది. 

తోక చివర చిన్న గంట కట్టి ఉంటుంది, కాలికి నూపురం ఉంటుంది. 

చేతికి కేయూరం ధరించి ఉంటాడు. 

ఆయన నేత్రాలు కృపా సింధువులై భక్త జనాల పై కరుణా కటాక్షాలు వర్షిస్తున్నట్లు విశాలంగా, తేజో పుంజాలను వేద జల్లేవిగా కనిపిస్తాయి. 


కేరే ఆంజ నేయస్వామికి వైదిక మంత్రాలతో పూజ చేస్తారు.

 కార్తీక మాసంలో కృష్ణపక్షంలో శనివారాలలో కన్నుల పండుగగా దీపోత్సవం నిర్వహించటం ఇక్కడి రివాజు,  ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు వరకు, సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు.


శృంగేరిలో జగద్గురువులు

 శ్రీ ఆది శంకరాచార్య ప్రతిష్టించిన చదువుల తల్లి శారదాదేవి ఆలయం భారతదేశమంతా ప్రసిద్ధి చెందింది. 

కాల భైరవ, వన దుర్గ, కాళికాంబ దేవాలయాలు దర్శించతగినవి........!!*

దక్షిణభారతదేశంలో పడమటి కర్నాటక రాష్ట్రంలో పడమటి కనుమల్లో మలండ ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు, లోయలు, అరణ్యాలతో ఆకర్షించే పవిత్ర శృంగేరిలో ఆది శంకరరాచార్యుల వారు ప్రతిష్టించిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, దీన్ని కేరే ఆంజనేయ దేవాలయం అంటారు. 


కేరే అంటే సరస్సు అని కన్నడ అర్ధం, సరస్సు ఒడ్డునే ఆలయం ఉంది. 

శ్రీ శంకర భగవత్ పాదులు భారతదేశం మొత్తం మీదక్కడ శృంగేరిలో ఒక్క చోట మాత్రమే శ్రీ ఆంజనేయస్వామిని ప్రతిష్టించారు. 

అందువల్ల దీనికి విపరీతమైన ప్రసిద్ధి వచ్చింది, శృంగేరిలో పశ్చిమాన కేరే ఆంజనేయ స్వామి దేవాలయం ఇప్పుడున్నకొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నది. 

కోనేరు స్థానంలో ఇప్పుడు బస్ స్టాండ్ కట్టారు, చిన్న దేవాలయం అయినా చాలా అందంగా ఉంది. 

ప్రకృతి దృశ్యాలక మధ్య ఉంది. కేరే ఆంజనేయ స్వామిని దర్శించాలి అంటే 27 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. 


శృంగేరికి వచ్చిన భక్తులు ముందుగా శ్రీ కేరే ఆంజనేయ స్వామిని దర్శించి , ఆ తర్వాత మిగతా దైవ దర్శనం చేస్తారు.


ఆంజనేయస్వామి ఈ క్షేత్ర పాలకుడు కావటమే దీనిలోని విశేషం.

ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి దక్షిణ దిశాగా దర్శన మివ్వటం ఒక ప్రత్యేకత.


స్వామి ఎడమ చేతిలో తామర పుష్పాన్ని ధరించి ఉంటాడు, కుడి చేయి అందరిని దీవిస్తున్నట్లు ఉండటం విశేషం.

స్వామి వాలం శిరస్సు ఆ వ్యాపించి ఉంటుంది. 

తోక చివర చిన్న గంట కట్టి ఉంటుంది, కాలికి నూపురం ఉంటుంది. 

చేతికి కేయూరం ధరించి ఉంటాడు. 

ఆయన నేత్రాలు కృపా సింధువులై భక్త జనాల పై కరుణా కటాక్షాలు వర్షిస్తున్నట్లు విశాలంగా, తేజో పుంజాలను వేద జల్లేవిగా కనిపిస్తాయి. 


కేరే ఆంజ నేయస్వామికి వైదిక మంత్రాలతో పూజ చేస్తారు.

 కార్తీక మాసంలో కృష్ణపక్షంలో శనివారాలలో కన్నుల పండుగగా దీపోత్సవం నిర్వహించటం ఇక్కడి రివాజు, ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు వరకు, సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు.


శృంగేరిలో జగద్గురువులు

 శ్రీ ఆది శంకరాచార్య ప్రతిష్టించిన చదువుల తల్లి శారదాదేవి ఆలయం భారతదేశమంతా ప్రసిద్ధి చెందింది. 

కాల భైరవ, వన దుర్గ, కాళికాంబ దేవాలయాలు దర్శించతగినవి...

Friday, April 14, 2023

_జగద్గురు ఆదిశంకరాచార్యుల ప్రశ్నోత్తర రత్న మాలిక_


 _జగద్గురు ఆదిశంకరాచార్యుల ప్రశ్నోత్తర రత్న మాలిక_


*1.ఇహలోకంలో కోరిన కోర్కెలు తీర్చే చింతామణి లాగా దుర్లభమైనది ఏది?*

జ: ప్రియవాక్కులతో కూడిన దానగుణం, గర్వంలేని జ్ఞానం.

క్షమాగుణం కలిగిన శూరత్వం, ధనంతో పాటు త్యాగ గుణం

ఈ నాలుగింటినీ చతుర్భద్రం అంటారు.


*2.మెరుపులా తాత్కాలికమైనది ఏది?*

జ: చెడ్డ వారితో సాన్నిహిత్యం, యవ్వనం.


*3.కలికాలంలో కూడా తన  గౌరవాన్ని నిలబెట్టే వారు, శీలం నుంచి విచలితం కాని వారు ఎవరు?*

జ: సజ్జనులే!                                                                  

*4.బాధ పడ వలసిన విషయం ఏది?*

జ: ఎంత వైభవమున్నా దయనీయంగా బ్రతకడం.


*5.ప్రశంసనీయమైనది ఏది?*

జ: ఉదారగుణం                                                    

*6.మేధావులకు సైతం పూజ్యుడు ఎవరు?*

జ: ఎల్లప్పుడూ సహజంగానే వినయవంతుడై ఉండే వాడు.                                                                                 

*7.వంశకీర్థి అనే కమలాన్ని వికసింపజేసే సూర్యుడు ఎవరు?*

జ: ఎన్నో సద్గుణాలున్నా నమ్రత కలిగి ఉండే వాడు.      


*8.ఈ లోకం ఎవరికి సదా లోబడి ఉంటుంది?*

జ: ప్రేమతో, మేలు చేకూర్చే మాటలు పలికే వానికి, ధర్మాచరణలో నిమగ్నుడై ఉండే వాడికి


*9.లక్ష్మీ దేవి ఎవరిని ఇష్టపడుతుంది?*

జ: సోమరితనం లేని వారిని, నీతి బద్ధమైన ప్రవర్తన కలిగి వారిని..                                                      

*10.లక్ష్మీ దేవి ఎవరిని వెంటనే విడిచి పెడుతుంది?*

జ: సోమరిని, బ్రాహ్మణ, గురు, దేవతలని నిందించే వారిని.                                                                

*11.ఎక్కడ నివాసముండాలి?*

జ: మంచి వాళ్ళ చెంత. లేదా కాశీధామంలో


*12.ఏటువంటి ప్రదేశంలో ఉండకూడదు?*

జ: నిందారోపణలు చేసే ప్రజలున్న, లోభులైన నాయకులున్న చోటును వదిలిపెట్టాలి.


*13.అతి చిన్నతనం కలిగించే పనికి మూలమేమిటి?*

జ: విషయాసక్తుడైన పామరుడిని యాచించడం.     


*14.వీరుడు, శూరుడు ఎవరు?*

జ: కామదేవుని బాణాలు తగిలినా నిశ్చలంగా, ధృడంగా ఉండే వాడు.                                          


*15.కన్నులున్నా అంధులెవరు?*

జ: పరమేశ్వరుని పైన, వేదాలు, పరలోకం పైన విశ్వాసం లేనివారు.


( శ్రీపీఠం నుండి )

శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం


 శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం


గురువు అనగా అజ్ఞానమును రూపుమాపి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేసి ఆత్మోన్నతిని కలుగజేసేవాడు. అటువంటి గురువులకే గురువు, గురుశ్రేష్ఠుడూ దక్షిణామూర్తి.


ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో పరిపుష్టులో వారు మాత్రమే దక్షిణామూర్తి వైభవాన్ని తెలుసుకోగలరని ఆదిశంకరుల వాక్కు.


ఇది అది అని లౌకిక విషయాలు కాదు. ఆయన ఇవ్వలేని దంటూ ఏదీ లేదు. ఏదైనా అపారంగా వర్షిస్తాడు. పరమ కారుణ్యమూర్తి ఉపాసనాపరంగా మనల్ని వెంట ఉండి నడిపించే శక్తి ఆయన..


అయితే ఆయనను ఆరాధించే వారు ఎవరూ కూడా లౌకిక విషయాలు అడగలేరు. ఎందుకంటే ఆయన పాదాలను మనం పట్టే స్థితికి వచ్చాము అంటే మనకు లౌకిక విషయాల పట్ల కోరికలను కోరుకునే స్థితి ఉండదు. అంతా నీ కృప స్వామి ఏది ఇచ్చినా నీవే. కాపాడినను నీవే, కష్టపెట్టినా నీవే. అని నమ్మి అన్నింటినీ సాక్షి గా చూసే స్థితి ఉన్న వారే ఆయన అనుగ్రహానికి పాత్రులౌతారు. అలాంటి దక్షిణామూర్తి స్తోత్రం మన ఉన్నతి కోసం. ఆదిశంకరుల అనుగ్రహ విరచితం.


శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రమ్


మూలేవటస్య మునిపుఙ్గవసేవ్యమానం ముద్రావిశేషముకులీకృతపాణిపద్మమ్ |

మన్దస్మితం మధురవేష ముదారమాద్యం తేజస్తదస్తు హృది మే తరుణేన్దుచూడమ్ ॥ 1॥


శాన్తం శారదచన్ద్ర కాన్తి ధవళం చన్ద్రాభిరమాననం చన్ద్రార్కోపమ కాన్తికుణ్డలధరం చన్ద్రావదా తాంశుకమ్ ।

వీణాపుస్తకమక్ష సూత్రవలయం వ్యాఖ్యానముద్రాంకరైర్బిభ్రాణం కలయే హృదా మమ సదా శాస్తారమిష్టార్థదమ్॥ 2॥


కర్పూరపాత్రమరవిన్దదళాయతాక్షం కర్పూరశీతలహృదం కరుణావిలాసమ్ ।

చన్ద్రార్ధశేఖరమనన్తగుణాభిరామ- మిన్ద్రాదిసేవ్యపదపఙ్కజమీశమీడే ॥ ౩॥


ద్యుద్రోధః స్వర్ణమయాసనస్థంముద్రోల్లసద్బాహుముదారకాయమ్ ।

సద్రోహిణీనాథ కళావతంసం భద్రోదధిం కఞ్చన చిన్తయామః ॥ 4 ॥


ఉద్యద్భాస్కరసన్నిభం త్రిణయనం శ్వేతాఙ్గరాగప్రభం బాలం మౌఞ్జిధరం ప్రసన్నవదనం న్యగ్రోధ మూలేస్థితమ్ ।

పిఙ్గాక్షం మృగశావకస్థితికరం* *సుబ్రహ్మసూత్రా కృతిమ్ భక్తానామభయప్రదం భయహరం శ్రీదక్షిణామూర్తికమ్ ॥ 5॥


శ్రీకాన్తద్రుహిణోపమన్యు తపన స్కన్దేన్ద్రనన్ద్యాదయః ప్రాచీనాగురవోఽపియస్య కరుణాలేశాద్గతా గౌరవమ్ ।

తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మన్దస్మితాలఙ్కృతం చిన్ముద్రాకృతిముగ్ధపాణినళినం చిత్తం శివం కుర్మహే ॥ 6॥


కపర్దినం చన్ద్రకళావతంసం త్రిణేత్రమిన్దుపతి మాననోజ్వలమ్ ।

చతుర్భుజం జ్ఞానదమక్షసూత్ర-పుస్తాగ్నిహస్తం హృది భావయేచ్ఛివమ్ ॥ 7॥


వామోరూపరి సంస్థితాం గిరిసుతామన్యోన్యమాలింగితాం శ్యామాముత్పల ధారిణీ శశినిభాంచాలోకయన్తం శివమ్ ।

ఆశ్లిష్టేన కరేణ పుస్తకమధో కుంభం సుధాపూరితం ముద్రాం జ్ఞానమయీం దధానమపరైర్ముక్తాక్షమాలాం భజే॥ 8 ॥


వటతరునికట నివాసం పటుతరవిజ్ఞాన ముద్రితకరాబ్జమ్ ।

కఞ్చనదేశికమాద్యం కైవల్యానన్దకన్దళం వన్దే ॥ 9 ॥


ఇతి శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం సమ్పూర్ణమ్ ॥🙏🌺☘️

శ్రీ ముద్గల పురాణ శ్రీ సిద్ధి వినాయక స్తోత్రమ్ 


 *శ్రీ సిద్ధి వినాయక స్తోత్రం....!!*



1)విఘ్నేశ విఘ్నచయ ఖండననామధేయ శ్రీశంకరాత్మజ సురాధిప వంద్యపాద |


దుర్గామహావ్రతఫలాఖిలమంగలాత్మన్- విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||



2)సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతిః శ్రీసిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీః |


దక్షస్తనే వలయితాతి మనోజ్ఞశుండో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||



3) పాశాంకుశాబ్జ పరశూంశ్చ దధ చ్చతుర్భి- -ర్దోర్భిశ్చ శోణకుసుమస్త్ర గుమాంగజాతః |


సిందూరశోభితలలాటవిధుప్రకాశో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||



4)కార్యేషు విఘ్నచయభీతవిరంచిముఖ్యైః సంపూజితః సురవరైరపి మోదకాద్యైః |


సర్వేషు చ ప్రథమమేవ సురేషు పూజ్యో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||



5) శీఘ్రాంచన స్ఖలన తుంగరవోర్ధ్వకంఠ స్థూలేందు రుద్రగణ హాసితదేవసంఘః |


శూర్పశ్రుతిశ్చ పృథు వర్తులతుంగతుందో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||



6)యజ్ఞోపవీత పదలంభితనాగరాజో మాసాది పుణ్యదదృశీ కృతఋక్షరాజః |


భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||



7)సద్రత్నసారతతిరాజితసత్కిరీటః కౌసుంభ చారు వసనద్వయ ఊర్జితశ్రీః |


సర్వత్ర మంగళకర స్మరణప్రతాప విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||



8)దేవాంతకాద్యసురభీత సురార్తి హర్తా విజ్ఞాన బోధన వరేణ తమోఽపహర్తా |


ఆనందితత్రిభువనేశ కుమారబంధో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||


ఇతి శ్రీముద్గలపురాణే శ్రీసిద్ధివినాయక స్తోత్రమ్ సంపూర్ణం ||...🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🥀శ్రీగణేశస్తోత్రం🥀    (సామవేదోక్తం)


 *🥀శ్రీగణేశస్తోత్రం🥀*

                                

   (సామవేదోక్తం)


1) ఖర్వం లంబోదరం స్ఠూలం జ్వలంతం బ్రహ్మతేజసా |

  గజవక్త్రం మహానిర్వాణ మేకదంతమనంతకం ||


2) సిద్ధానాం యోగినామేవ జ్ఞానినాంచ గురోర్గురుం |

   ధ్యాతం మునీంద్రైర్దేవేంద్రైఃబ్రహ్మేసాశేషసమ్జకైః ||


3) సిద్ధేంద్రైర్మునిభిః సద్భిర్భగవంతం సనాతనం |

   బ్రహ్మస్వరూపం పరమం మఙ్గలం మఙ్గలాలయం ||


4) సర్వవిఘ్నహరం శాంతం దాతారం సర్వసంపదాం |

   భవాబ్ధిమాయా పోతేవ కర్ణధారంచ కర్మిణాం ||


5) శరణాగత దీనార్త పరిత్రాణాయ పరాయణం |

  ధ్యాయేద్ధ్యానాత్మకం సాధ్యం భక్తేశం భక్తవత్సలం ||


6) పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |

   విఘ్ననిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం ||


7) సురాసురేంద్రైః సిద్ధేంద్రైః స్తుతం స్తౌమి పరాత్పరం |

   సురపద్మదినేశం చ గణేశం మఙ్గలాలయం ||


8) ఇదం స్తోత్రం మహాపుణ్యం విఘ్నశోకహరంపరం |

   యః పఠేత్ప్రాతరుద్థాయ సర్వవిఘ్నాత్ప్రముచ్యతే ||

Tuesday, April 11, 2023

 *గాయత్రీ మంత్రం విశిష్టత..!!*


 *గాయత్రీ మంత్రం విశిష్టత..!!*


అతి శక్తివంతమైన శ్రీ గాయత్రీ మహమంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారం. 

అనన్యం,సర్వసిద్ధిప్రదం.


1. త - అజ్ఞానాన్ని పోగొట్టునది

2. త్స - ఉపపాతకములను నివారించునది

3. వి - మహాపాతములను నివారించునది

4. తు - దుష్టగ్రహ దోషాలను నివారించునది.

5. ర్వ - భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేయునది

6. రే - తెలియక చేసిన పాపాలను పోగొట్టునది

7. ణి - తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించునది.

8. యం - బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపచేయునది


9. భ - పురుష హత్యా పాతకాన్ని పోగొట్టునది.

10. ర్గో - గోహత్యా దోషాన్ని నివృత్తి చేయునది.

11. దే - స్త్రీహత్యా పాతకాన్ని పోగొట్టునది

12. వ - గురు హత్యాపాపాన్ని నివారించును.

13,. స్య - మానసిక దోషాలను నివారించును

14. ధీ - మాతృ, పితృ వధా పాతకాన్ని పరిహరించును.

15. మ - పూర్వ జన్మార్జిత పాపాల నుండి రక్షించును

16. హి - అనేక పాప సమూహాలను నశింపచేయును


17. ధి - ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడును

18. యోః - సర్వపాపాలను నివృత్తి చేయును.

19. యో - సర్వపాపాలను నివృత్తి చేయును

20. నః - ఈశ్వరప్రాప్తి నిచ్చును

21. ప్ర - విష్ణులోక ప్రాప్తి

22. చో - రుద్రలోక ప్రాప్తి

23. ద - బ్రహ్మలోక ప్రాప్తి

24. యాత్ - పరబ్రహ్మైక్య సిద్ధి ప్రసాదించును.


గాయత్రీ కవచంలో ఉన్న రూపాలు తానే అయిన దేవి ఇలా వర్ణించబడింది.


గాయత్రి - తూర్పు దిక్కును

సావిత్రి - దక్షిణ దిక్కును

సంధ్యాదేవి - పడమర దిక్కును

సరస్వతి - ఉత్తర దిక్కును

పార్వతి - ఆగ్నేయాన్ని

జలశాయని - నైరుతిని

పవమాన విలాసిని - వాయువ్య దిక్కును

రుద్రాణి - ఈశాన్య దిక్కును రక్షీంచుగాక


తుత్ - పాదాలను

సవితుః - జంఘలను

వరేణ్యం - కటిని

భర్గః - నాభిని

దేవస్య - హృదయాన్ని

ధీమహి - చెక్కిళ్ళను

ధియః - నేత్రాలను

యః - లలాటంను

నః - శిరస్సును

ప్రచోదయాత్ - శిఖా భాగాన్ని రక్షించుగాక.


ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతిభాగం శ్రీ గాయత్రీ మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయి.


తత్ - శిరస్సు

సకారం - ఫాలం

వి - నేత్రాలు

తు - కపోలాలు

వ - నాసాపుటాలు

రే - ముఖం

ణి - పైపెదవి

యం - కింది పెదవి


భ - మద్య భాగం

ర్గో - చుబుకం

దే - కంఠం

వ - భుజాలు

స్య - కుడి చేయి

ధీ - ఎడమ చేయి

మ - హృదయం

హి - ఉదరం


ధి - నాభి

యో - కటి

యో - మర్మప్రదేశం

నః - తొడలు

ప్ర - జానువులు

చో - జంఘం

ద - గుల్ఫం

యా - పాదాలు

త్ - సర్వ అంగాలు


ఈ విధంగా మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ తల్లిని వేడుకుందాం.


స్వస్తి..!!🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

*సకల సౌభాగ్యాలనిచ్చే - వట్టి వేరు🌾*

 *సకల సౌభాగ్యాలనిచ్చే - వట్టి వేరు🌾*


🌾దైవీకమైన సువాసనలు వెదజల్లే స్ధానాలలో మహాలక్ష్మీ నివసిస్తున్నది.


🌾పసుపు, కుంకుమ, చందనం వంటి సువాసన పూజా ద్రవ్యాలు అన్నీ దేవికి

ప్రీతికరంగా భావింపబడుతున్నాయి.


🌾దేవి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు మనని చేరడానికి

సహాయపడే  పూజాద్రవ్యం

వట్టి వేరు, జీవితంలో విజయాలను ప్రసాదించే

వట్టివేరు.  

సువాసనలు

వెదజల్లే యీ వట్టివేరు

పూజకి ఉపయోగించే విధానాలు..


🌾గుప్పెడు వట్టివేరు తీసుకుని వచ్చి పూజ చేసే

గదిలో పెడితే  ఆధ్యాత్మిక

ప్రకంపనలు కలుగ చేస్తుంది.


🌾 ఒక చిన్న కప్పులో నీళ్ళు పోసి అందులో వట్టివేరు

నిమ్మ కాయ  వేసి పూజాగదిలో పెడితే

లక్ష్మీ దేవి పూర్ణానుగ్రహం

మనకి లభిస్తుంది.

(నిమ్మ కాయను అప్పుడు అప్పుడు మారుస్తూ వుండాలి)

🌾ఇందువలన  ఋణబాధలు

తొలగుతాయి.సిరిసంపదలు

లభిస్తాయి.


🌾వట్టివేరుతో చేసిన వేంకటేశ్వరుడు,గణపతి, యితర దైవాల మూర్తులను

పూజాగదిలో  పెడితే

శుభ ఫలితాలు లభిస్తాయి...*సకల సౌభాగ్యాలనిచ్చే - వట్టి వేరు🌾*


🌾దైవీకమైన సువాసనలు వెదజల్లే స్ధానాలలో మహాలక్ష్మీ నివసిస్తున్నది.


🌾పసుపు, కుంకుమ, చందనం వంటి సువాసన పూజా ద్రవ్యాలు అన్నీ దేవికి

ప్రీతికరంగా భావింపబడుతున్నాయి.


🌾దేవి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు మనని చేరడానికి

సహాయపడే  పూజాద్రవ్యం

వట్టి వేరు, జీవితంలో విజయాలను ప్రసాదించే

వట్టివేరు.  

సువాసనలు

వెదజల్లే యీ వట్టివేరు

పూజకి ఉపయోగించే విధానాలు..


🌾గుప్పెడు వట్టివేరు తీసుకుని వచ్చి పూజ చేసే

గదిలో పెడితే  ఆధ్యాత్మిక

ప్రకంపనలు కలుగ చేస్తుంది.


🌾 ఒక చిన్న కప్పులో నీళ్ళు పోసి అందులో వట్టివేరు

నిమ్మ కాయ  వేసి పూజాగదిలో పెడితే

లక్ష్మీ దేవి పూర్ణానుగ్రహం

మనకి లభిస్తుంది.

(నిమ్మ కాయను అప్పుడు అప్పుడు మారుస్తూ వుండాలి)

🌾ఇందువలన  ఋణబాధలు

తొలగుతాయి.సిరిసంపదలు

లభిస్తాయి.


🌾వట్టివేరుతో చేసిన వేంకటేశ్వరుడు,గణపతి, యితర దైవాల మూర్తులను

పూజాగదిలో  పెడితే

శుభ ఫలితాలు లభిస్తాయి...

*శివపంచాక్షరీ స్తోత్రం -*  *తాత్పర్యము :*


 *శివపంచాక్షరీ స్తోత్రం -* 

*తాత్పర్యము :*


నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ


మందాకినీ సలిల చందనచర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ

మందారపుష్ప బహుపుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ


శివాయ గౌరీవదనాబ్జవృంద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ

శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ


వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ


యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ

దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ


పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచిత శివపంచాక్షరీ స్తోత్రం సమాప్తం


తాత్పర్యము: 


నాగేంద్రుని హారము వలె ధరించిన, మూడు నేత్రములు కలిగిన, శరీరమంతా భస్మవిలేపనము కలిగిన, మహేశ్వరుడైన, శాశ్వతుడు, శుద్ధమైన వాడు, దిగంబరుడు, 'న'కార రూపుడయిన ఆ శివునికి నా నమస్కారములు.


మందాకినీ మొదలగు నదుల జలములతో అర్చించబడి, గంధలేపనము చేయబడి, మందారము మొదలగు బహు సుపుష్పములచే పూజించబడే, నంది మొదలగు ప్రమథ గణములకు అధిపతి అయిన 'మ'కార రూపుడైన శివునికి నా నమస్కారములు.


సకల శుభకరుడు, కమలము వంటి గౌరీ దేవి వదనమును వికసింప చేసే సూర్యుడు, దక్ష యజ్ఞము నాశనము చేసిన వాడు, నీలకంఠుడు, వృషభము (ఎద్దు) పతాకముపై చిహ్నముగా కలవాడు, 'శి'కార రూపుడు అయిన శివునికి నా నమస్కారములు.


వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలగు మునీంద్రులచే పూజింపబడిన శిరస్సు (లింగం) కలిగిన, చంద్రుడు, సూర్యుడు, అగ్ని త్రినేత్రములుగా కలిగిన, 'వ'కార రూపుడైన శివునికి నా నమస్కారములు.


యక్ష రూపములో ఉన్న, జటా ఝూటములు కలిగిన, పినాకము (అనే ధనుస్సు) చేత కలిగిన, సనాతనుడు (ఆది/అంతము లేని వాడు, అన్నిటికన్నా ముందు వచ్చిన వాడు), దివ్యమైన వాడు, దేవ దేవుడు, దిగంబరుడు, 'య'కార రూపుడు అయిన శివునికి నా నమస్కారములు.


ఫల శృతి:


శివుని సన్నిధిలో ఈ పంచాక్షరి స్తోత్రమును పఠనం చేసిన వారికి శివలోక ప్రాప్తి, శివుని సహవాసం కలుగును. ఇది శ్రీమచ్ఛంకరాచార్యులు రచించిన పంచాక్షరీ స్తోత్రం.

 *శివుడి వద్ద నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం ఎందుకు? పరమార్థం ఏమిటి?*


 *శివుడి వద్ద నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం ఎందుకు? పరమార్థం ఏమిటి?*


ఆది పరాశక్తి , జగజ్జనని అయిన పార్వతీదేవికి భర్త అయ్యి శివుడు అర్ధనారీశ్వరుడైనాడు...

గణపతి, అయ్యప్ప, కుమారస్వామి పుత్రులు గల శివుని దగ్గర ఉండే సన్నిహిత చిహ్నాలు, వాటికి ఈశ్వరుడికి గల సంబంధం గురించి కొంత తెలుసుకుందాం.


నంది (ఎద్దు):- శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్త మిత్రులలో ఒకటి. ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల కనబడుతుంది. 


శివ భక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమని నందీశ్వరుని చెవులవద్ద భాదలను నివారించమని స్వామివారికి చెప్పు అని గుసగుసగా చెప్పుకుంటారు. 


త్రిశూలము :- శంకరుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలము. శివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. త్రిశూలములో ఉండే మూడు వాడి అయిన మొనలు ఉంటాయి అవి ఏమిటనగా కోరిక, చర్య , జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి.


నెలవంక చంద్రుడు :- శివుడిని తరచుగా తన 'జటా' ఒక అర్ధ చంద్రాకార చంద్రుని కళా రూపాలతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ది చెందటం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందుమత క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది.


నీలిరంగుకంఠం :- శివునికి మరొక పేరు నీలకంఠుడు అని. శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగడం జరిగింది. అప్పుడు పార్వతిదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన కంఠం నీలం రంగులోకి మారినది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నాడు. 


రుద్రాక్ష :- శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారమును ధరిస్తాడు. అంతే కాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటుంది. 'రుద్రాక్ష' అనే పదము 'రుద్ర' ( శివ యొక్క మరొక పేరు ) మరియు 'అక్ష్' అంటే కన్నీళ్లు నుండి వచ్చింది. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులోకి వెళ్లినాయి. 


పాము :- శివుడు ఆయన మెడ చుట్టూ మూడు సార్లు చుట్ట బడిన ఒక పామును ధరిస్తారు. పాము మూడు చుట్టలకు అర్ధం .భూత,వర్తమాన,భవిష్యత్ కాలాలను సూచిస్తాయి.నాగదేవతను హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా తెలుస్తుంది.


మూడో కన్ను:- శివుని చిహ్నాలలో ఒకటిగా మూడో కన్నును చెప్పవచ్చు. ఆయన నుదుటిపైన మధ్య భాగంలో మూడో కన్ను ఉంటుంది. అయన చాలా కోపాని గురిఅయినప్పుడు చెడును నివారించాలనుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది.అప్పటి నుండి మూడో కన్ను జ్ఞానం మరియు సర్వ వ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది. 


డమరుకం :- శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు. 


జటా :- అట్టకట్టుకొని పీచులాగా ఉన్న జుట్టు.సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది. 


కానీ శివ విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది.శివుని అట్టకట్టుకొని జుట్టు లేదా 'జటా' అందం పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టు చూపిస్తుంది.


శివుడిని భక్తితో కోలిస్తే తనపై ఒక్క చెంబేడు నీళ్ళను మంచి మనస్సుతో పోసి పూజిస్తే భక్తుల కోరికలను కరునించే బోళాశంకరుడు.శివపంచాక్షరీ ఆపదకాలంలో శివ భక్తులకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది.

 *ఆశుతోషుని అనుగ్రహం - శివరహాస్యం నుంచి...!!*


 *ఆశుతోషుని అనుగ్రహం - శివరహాస్యం నుంచి...!!*

ఇళ్ళలో పూజించే లింగం పిడికిలిలో ఇమిడేలా (అంగుష్ఠ ప్రమాణం) ఉండాలి...

పార్థివలింగం అయితే తెరచిన పిడికిలి పరిమాణంలో ఉండవచ్చు (ఆరు అంగుళాలకి తక్కువ ఉండరాదు). 

ఆరు అంగుళాలకి తక్కువ ఉంటే ఆయుఃక్షీణం అవుతుంది.

అయితే అధిక సంఖ్యలో - (సహస్ర)లింగాలు చేసేటప్పుడు అనేక లింగాలు పెడతాం గనుక అవి చిన్నవే ఉంటాయి. 

వాటికి లెక్క లేదు, ఆలయాలలో పూజించే లింగములు ఇంతకంటే పెద్దవి ఉండవచ్చు.

శివపూజను చేసే చేతులు, శివాలయానికి వెళ్ళే కాళ్ళు, శివాలయంలో ప్రదక్షిణ చేసే పాదములు, శివునికి అర్పించిన మారేడుదళాదుల వాసనను ఆఘ్రాణించడం ,


శివనైవేద్యాలను భుజించడం, హృదయంలో శివుని ధ్యానించడం - ఈ అయిదు క్రియలు ఎవరికైతే ఉంటాయో వారికి దుఃఖాలు ఉండవు.

వాళ్ళు జన్మను సార్థక పరచుకున్నవారు, శివభక్తులలో గొప్పవారు అని చెప్పబడతారు, జీవికగా అయినా సరే ఆలయాలు శుభ్రం చేస్తే పదివేల చాంద్రాయణ వ్రతములు చేసిన ఫలితం పొందుతాడు.

తడిగా ఉన్న వస్త్రంతో తుడిస్తే అతిరాత్రమనే వైదిక యజ్ఞం చేసిన ఫలం కలుగుతుంది, శివాలయంలో బియ్యపు పిండితో రంగవల్లులు దిద్దినా, రకరకాల వన్నెలతో పద్మము, శంఖము మొదలైన ఆకృతులతో ముగ్గులు వేసినా అగ్నిష్టోమము అని చెప్పబడుతున్న వేదక్రతువు చేసిన ఫలం కలుగుతుంది.


కపిలగోవు కానీ మరి ఏ ఇతర (దేశీయ) గోవు క్షీరంతో అయినా శివునకు అభిషేకం చేస్తే వాని యొక్క వందలకొలది అపరాధాలైనా సరే ఆశుతోషుడు క్షమించి అనుగ్రహిస్తాడు.

కృష్ణాష్టమినాడు, సోమవారంనాడు ప్రదోషకాలంలో శివునికి నేతితో అభిషేకిస్తే దాని ఫలితం అమోఘమైనది, అనంతమైనది.


చెరకురసంతో పరమేశ్వరునికి అభిషేకం చేసినవారు వారి వంశంలోని అనేక తరాలతో సహా కైలాసాన్ని చేరతారు.


ప్రాతఃకాలం, సంగమకాలం, మధ్యాహ్నకాలం, ప్రదోష కాలాలలో శివలింగాన్ని చూసినా, అర్చించినా వారు శివగణములలో ముఖ్యమైన వారు అవుతారు.


కుశ (దర్భల) జలములతో అభిషేకం భక్తితో చేసినవారు బంగారు విమానంలో బ్రహ్మలోకానికి చేరుకుంటారు...

దీనికి కొనలతో ఉన్న దర్భలు ఉపయోగించాలి, దర్భకు చివరిభాగాన్ని లవం అంటారు.


పచ్చకర్పూరము, అగరు మొదలైన వాటితో కూడిన జలముతో శివుని అభిషేకం చేస్తే సర్వపాపములూ తొలగి శివమందిరాన్ని చేరుకుంటారు.


పితృదేవతలు సద్గతిని పొందాలి అని సంకల్పించుకుని శివలింగానికి చల్లని నీటితో అభిషేకం చేస్తే, ఒకవేళ పితరులు నరకంలో ఉంటే ఉద్ధరింపబడి ఉత్తమలోకాలకు చేరతారు.


నెయ్యితో అభిషేకం చేశాక బియ్యపుపిండి కానీ, గోధుమపిండి కానీ తీసుకుని ఆ పిండిలో సుగంధములు కలిపి గోరువెచ్చని నీరు పోస్తూ శివలింగాన్ని శుభ్రం చేయాలి.


లింగ పీఠాన్ని, అంతటినీ బిల్వపత్రములతో శుద్ధి చేయాలి. ఇలా శుభ్రం చేసిన వారికి పదివేల ధేనువులు దానం చేసిన ఫలం లభిస్తుంది.


పుష్పమాలలు సమర్పించడం, పుష్పమండపం తయారుచేయడం, క్రిందివరకూ పూల మాలలు వ్రేలాడుతూ ఉండేలా చేస్తే ఆశ్చర్యకరంగా దేవతలు దగ్గరుండి దివ్యవిమానముల మీద శివపురమునకు తీసుకువెళ్తారు.


లింగమును, లింగపీఠాన్ని పూజించడం వల్ల దేవీ దేవతలను ఇద్దరినీ పూజించినట్లు అవుతుంది.


స్వామికి చేసే నివేదనలలో గోధుమలతో శర్కర (పటికబెల్లం/ బెల్లం) కలిపి అపూపములు (అప్పాలు) ఆవునేతితో వేయించి చేస్తే అది ఉత్కృష్టమైన భక్ష్యమై తరింపజేస్తుంది.


శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే ఒకొక్క అడుగుకి వెయ్యి అశ్వమేధాలు చేసిన ఫలం లభిస్తుంది.


ఆవుపాలు, నెయ్యి, పెరుగులతో కలిపిన అన్నములు, అనేక రకములైన కూరలు కలిపిన అన్నం, పూరీలు, అప్పాలు, మొదలైనవి విశేషంగా శివునకు నివేదన చేస్తే వారు నరకాలు చూడరు, వారికి పాపఫలాలు ఉండవు సరికదా ... దివ్యమైన భోగములు అనుభవిస్తారు.


శివునకు నివేదన చేసినప్పుడు ఎన్ని బియ్యపు గింజలు అందులో ఉన్నాయో ఒకొక్క మెతుకుకీ వెయ్యి సంవత్సరాల చొప్పున యుగ సహస్రాలు దివ్యలోకాలలో ఉంటారు. 

నిష్కామంగా చేసిన వారు రుద్రలోకానికే చేరుతారు.


గంధ జలములతో శివలింగాన్ని అభిషేకించినవారు గంధర్వాది లోకాలకు చేరుతారు.


లవంగము, కర్పూరము, మాదీఫలం, కొబ్బరి పలుకులు, జాతీపత్రం అనబడే పంచ సౌగంధికములతో తాంబూలం సకామంగా సమర్పిస్తే అనంతకాలం స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారు.


నిష్కామంగా చేసినవారికి ఇహంలోనే జ్ఞానం, కైవల్యం క్రమంగా సిద్ధిస్తుంది...


స్వస్తి..🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

 శివుడు శ్మశానంలో ఎందుకు కొలువై ఉంటాడు?


 *శివుడు శ్మశానంలో కొలువై ఉండే - శివుడికి ఇష్టమైన ప్రాంతం శ్మశానం..!!*


శవాలను దహనం చేసే ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు కొలువై ఉంటాడో సాక్షాత్ పార్వతీదేవికి సందేహం వచ్చింది.. 

ఇదే విషయాన్ని మహాశివుడి వద్ద పార్వతీ దేవి స్వయంగా ప్రస్తావిస్తుంది.. 


దీనికి శివుడు ఏమని సమాధానం ఇచ్చారంటే...


పార్వతీ... శ్మశానంలో నేనేమీ ప్రయత్న పూర్వకంగా కూర్చోవడం లేదు. 

లోకంలో ఉగ్రమైన భూతములన్నీ కొలువైవున్న ప్రాంతం శ్మశానం, ఇక్కడ ఏ ఒక్క పుణ్యకార్యం జరుగకుండా భూతప్రేతాత్మలు అడ్డుకుంటున్నాయి...


దీన్ని గమనించిన బ్రహ్మ.. స్వయంగా నా వద్దకు వచ్చి ఓ విన్నపం చేశారు.. 

లోకంలో మంగళ కార్యాలేవీ జరగడం లేదు. 

దీనికి కారణం ఉగ్ర  భూతములన్నీ లోకంలో కొలువై ప్రతి మంగళకార్యాన్ని అడ్డుకుంటున్నాయి.


పైగా.., ఈ లోకంలో సంచరించే ప్రతి బిడ్డా మీ బిడ్డలే కదా, అన్ని ప్రాణులకు తల్లిదండ్రులు మీరే కదా. 

మీ పిల్లలు చేసే తప్పొప్పులను సరిదిద్దుతూ వారిని అదుపు ఆజ్ఞల్లో ఉంచేందుకు శ్మశానంలోనే కొలువై వుండాలని ప్రార్థించాడు... 


అందువల్లే నేను శ్మశానంలో కొలువై వున్నాను అని చెప్పాడు...


*ఇది మొదటి కారణం కాగా... మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి...!!*


జీవించి వున్న సమయంలో నేనే గొప్ప అని జబ్బలు చరుచుకునే ధనవంతుడు, ఆకటితో అలమటించే కడు పేదవాడు చనిపోయాక వచ్చేది శ్మశానానికే.. 

అంటే.. ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే.. ఈ విషయాన్ని లోకానికి చాటిచెప్పేందుకే శ్మశానంలో ఉంటున్నాడు పరమేశ్వరుడు..


*చివరి కారణం...* 

జీవించి వున్నంత కాలం నావాళ్లూ నావాళ్లూ అంటుంటారు. 

తీరా చనిపోయాక శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు.. 

అలా శ్మశానంలో వదిలి వెళ్లిన వారికి తోడుగా నేనున్నాను అని చెప్పేందుకే అక్కడ నివశిస్తున్నట్టు పార్వతికి శివుడు చెపుతాడు..


అసలు ఈ లోకమే ఓ శ్మశానం.. చనిపోయే వాడు శ్మశానంలోకి వచ్చి చనిపోతున్నాడా? లేదు కదా... గృహాల్లో, ఆస్పత్రుల్లో, రోడ్లపై, పార్కుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నారు. 

అంటే ఈ లోకమంతా ఓ శ్మశానమే.. ఇలా చనిపోయిన ప్రాణులన్నీ ఈ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రాంతం శ్మశానం.. ఈ ప్రాంతంలో నేను నివశిస్తున్నాను కాబట్టే శ్మశానం అన్నారు.. 


పైగా, ఈ లోకంలో మృత్యు భీతి లేకుండా చనిపోయే ప్రాంతమేదైనా ఉందంటే అది కాశీ అని పార్వతికి శివుడు వివరిస్తాడు....


స్వస్తి..🙏🌹

వటపత్ర శాయి


 *వటపత్ర శాయి అనగా?....!!*

మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని.  

ఈ వృత్తాంతం మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది, మార్కండేయుడు ఆరు మన్వంతరములు తపస్సు చేశాడు. 

ఏడో మన్వంతరములో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు, 

వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు.


చలించని మార్కండేయునికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ‘ఏం వరం కావాలో కోరుకో’ అనగా ‘నీ మాయను చూడాలని ఉంది’ అని అడుగుతాడు.


ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రచండ గాలీ, ధారాపాత వర్షమూ విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి. నీటి తో సమస్తం మునిగిపోతుంది...

మార్కండేయుడు మోహశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు. 

అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రిఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. 

చేతి వ్రేళ్ళతో కాలిని పట్టుకుని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు. 

అతడే వటపత్రశాయి, మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపై నున్న వటపత్రశాయి కడుపులోకెళ్లి చూస్తాడు. 

నీట మునిగిన సమస్త భూమీ, ప్రాణ కోటి కనిపిస్తుంది.


మళ్ళీ మరోచోట సృష్టి ప్రారంభము చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు.

శ్రీమహావిష్ణువు వరం ప్రకారం విష్ణు మాయను తెలుసుకుంటాడు...


స్వస్తీ..🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

శ్రీ ఆదిత్య స్తవం


 *శ్రీ ఆదిత్య స్తవం*

                         

*నమస్తే యన్మయం సర్వమేతత్సర్వ మయశ్చ యః|*

*విశ్వమూర్తిః పరంజ్యోతిర్యత్తద్ధ్యాయంతి యోగినః[1]*


*య ఋఙ్మయో యో యజుషాం నిధానం సామ్నాం చ యో యోనిరచింత్యశక్తిః|*

*త్రయీమయః స్థూలతయార్ధమాత్రా పరస్వరూపో గుణపారయోగ్యః[2]*


*త్వాం సర్వహేతుం పరమంచ వేద్యమాద్యం పరంజ్యోతిరవేద్యరూపమ్|*

*స్థూలం చ దేవాత్మతయా నమస్తే భాస్వతమాద్యం పరమం పరేభ్యః[3]*


*సృష్టిం కరోమి యదహం తవశక్తిరాద్యా తత్ప్రేరితో జలమహీపవనాగ్నిరూపామ్|*

*తద్దేవతాదివిషయాం ప్రణవాద్యశేషాం నాత్మే2చ్ఛయా స్థితిలయావపి తద్వదేవ[4]*


*వహ్నిస్త్వమేవ జలశోషణతః పృథివ్యాః సృష్టిం కరోషి జగతాం చ తథాద్య పాకమ్|*

*వ్యాపీ త్వమేవ భగవన్ గగనస్వరూపం త్వం పంచధా జగదిదం పరిపాసి విశ్వమ్[5]*


*యజ్ఞైర్యజంతి పరమాత్మవిదో భవంతం విష్ణుస్వరూపమఖిలేష్టిమయం వివస్వన్|*

*ధ్యాయంతి చాపి యతయో నియతాత్మచిత్తాః సర్వేశ్వరం పరమమాత్మవిముక్తికామా[6]*


*నమస్తే దేవరూపాయ యజ్ఞరూపాయ తే నమః|*

*పరబ్రహ్మస్వరూపాయ చింత్యమానాయ యోగిభిః[7]*


*ఉపసంహారతేజో యత్తేజసః సంహతిస్తవ|*

*సృష్టేర్విధాతాయ విభో సృష్టౌ చా2హం సముద్యతః[8]*


*మార్కండేయ ఉవాచ:-*

*ఇత్యేవం సంస్తుతో భాస్స్వాన్ బ్రహ్మణా సర్గకర్త్రణా|*

*ఉపసంహృతవాంస్తేజః పరం స్వల్పమధారయత్[9]*


*చకార చ తతః సృష్టిం జగతః పద్మసంభవః|*

*తథా తేషు మహాభాగః పూర్వకల్పాంతరేషు వై[10]*


*దేవాసురాదీన్మర్త్యాంశ్చ పశ్వాదీన్వ్రక్షవీరుధః|*

*ససర్జ పూర్వవద్బ్రహ్మా నరకాంశ్చ మహామునే[11]*



*ఇతి శ్రీ మార్కండేయ పురాణే షణ్ణవతితమోధ్యాయే ఆదిత్యస్తవమ్!*

🙏🌞🌞🌞🌞🌞🌞🌞🌞🙏

నవగ్రహాలకి ఇష్టం లేని పనులు.


 *నవగ్రహాలకి ఇష్టం లేని పనులు...!!*


అద్దం నకు చంద్రుడు కారణము, అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదట...


సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుందట...


బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపము, అందునా బుధవారం అస్సలు చేయకూడదట...


వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన, 

జ్ఞానం ఉంది అని విర్రవీగిన  కోపము,

శనికి పెద్దల్ని కించపరచిన, 

మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపము అని చెబుతారు...


తల్లితండ్రిని చులకన చేసిన కోపము, సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు...

పితృ దేవతలని దూషిస్తే రవికి కోపము, సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట...


శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపమట...

లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే...

అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరు,

గొడవలు లేని ఇల్లు ఇష్టము,

అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపము.


వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడు... జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకాడిన, 


మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపము.


ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది. 

రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగును...

ఈయన భ్రమ మాయ కి కారణము..!!..


స్వస్తి..🙏🌹

 సూర్యమండల స్తోత్రం


 *సూర్య మండల స్త్రోత్రం..* 🙏🌻


నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే 

సహస్రశాఖాన్విత సంభవాత్మనే 

సహస్రయోగోద్భవ భావభాగినే 

సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ ||


యన్మండలం దీప్తికరం విశాలం 

రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |

దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ ||


యన్మండలం దేవగణైః సుపూజితం | 

విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |

తం దేవదేవం ప్రణమామి సూర్యం | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||


యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | 

త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |

సమస్త తేజోమయ దివ్యరూపం 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ ||


యన్మండలం గూఢమతి ప్రబోధం | 

ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |

యత్సర్వ పాపక్షయకారణం చ 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ ||


యన్మండలం వ్యాధివినాశదక్షం 

యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |

ప్రకాశితం యేన చ భూర్భువః స్వః | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ ||


యన్మండలం వేదవిదో వదంతి | 

గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |

యద్యోగినో యోగజుషాం చ సంఘాః | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౭ ||


యన్మండలం సర్వజనైశ్చ పూజితం | 

జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే 

యత్కాల కాలాద్యమరాది రూపం | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౮ ||


యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం | 

యదక్షరం పాపహరం జనానామ్ |

యత్కాలకల్పక్షయకారణం చ | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౯ ||


యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం | 

ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |

యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౦ ||


యన్మండలం సర్వగతస్య విష్ణోః | 

ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |

సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౧ ||


యన్మండలం వేదవిదోపగీతం | 

యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |

తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౨ ||


సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |

సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||


*ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం..సంపూర్ణం*..||


🌹🔅🌹🔅🌹🔅🌹🔅🌹

సమస్త పాప నాశన శ్రీ విష్ణు స్తోత్రమ్


 *సమస్త పాప నాశన శ్రీవిష్ణు స్తోత్రమ్....!!🙏☘️🌿*



        *పుష్కర ఉవాచ:-*


     1) పరదార పర ద్రవ్యజీవహింసాదికే యదా !


_ప్రవర్తతే నృణాం చిత్తం ప్రాయశ్చిత్తం స్తుతిస్తదా... !!_



2) విష్ణవే విష్ణవే నిత్యం విష్ణవే విష్ణవే నమః !


నమామి విష్ణుం చిత్తస్థమహంకారగతిం హరిం !!



చిత్తస్థమీశమ వ్యక్తమనంత మపరాజితం !


విష్ణుమీడ్యమశేషేణ అనాది నిధనం విభుం !!



4) విష్ణుశ్చిత్తగతో యన్మే విష్ణుర్బుద్ధి గతశ్చ యత్ !


యచ్చాహంకారగో విష్ణుర్యవ్దిష్ణుర్మయిసంస్థితః !!



5) కరోతి కర్మభూతోఽసౌ స్థావరస్య చరస్య చ !


తత్ పాపన్నాశ మాయాతు తస్మిన్నేవ హి చింతితే !!



6) ధ్యాతో హరతి యత్ పాపం స్వప్నే దృష్టస్తు భావనాత్ !


తముపేంద్ర మహం విష్ణుం ప్రణతార్తి హరం హరిం !!



7) ప్రణతార్తి హరం జగత్యస్మిన్నిరాధారే మజ్జమానే తమస్యధః !


హస్తావలంబనం విష్ణుం ప్రణమామి పరాత్పరం !!



8) సర్వేశ్వరేశ్వర విభో పరమాత్మ న్నధోక్షజ !


హృషీకేశ హృషీకేశ హృషీకేశ నమోఽస్తుతే !!



9) నృసింహానంత గోవింద భూతభావన కేశవ !


దురుక్తం దుష్కృతం ధ్యాతం శమయాఘ న్నమోఽస్తుతే !!



10) యన్మయా చింతితం దుష్టం స్వచిత్తవశవర్త్తినా !

అకార్యమహదత్యుగ్రంతచ్ఛమన్నయ కేశవ !!



11) బ్రహ్మణ్యదేవ గోవింద పరమార్థ పరాయణ !


జగన్నాథ జగద్ధ్యాతః పాపం ప్రశమయాచ్యుత !!



12) యథా పరాహ్నే సాయాహ్నే మధ్యాహ్నే చ తథా నిశి !


కాయేన మనసా వాచా కృతం పాపమజానతా !!



13) జానతా చ హృషీకేశ పుండరీకాక్ష మాధవ !

నామత్రయోచ్చారణతః స్వప్నే యాతు మమ క్షయం !!



14) పాపం యాతు శరీరం మే హృషీకేశ పుండరీకాక్ష మాధవ !!


పాపం ప్రశమయాద్యత్వం వాక్కృతం మమ మాధవ !!



15) యద్భుంజన్యత్స్వపంస్తిష్ఠన్ గచ్ఛన్ జాగ్రద్ యదాస్థితః !


కృతవాన్ పాపమద్యాహం కాయేన మనసాగిరా !!



16) యత్ స్వల్పమపి యత్ స్థూలం కుయోని నరకావహం !


తద్యాతు ప్రశమం సర్వ వాసుదేవాను కీర్తనాత్ !!



17) పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమంచ యత్ !


తస్మిన్ ప్రకీర్తితే విష్ణౌ యత్ పాపం తత్ ప్రణశ్యతు !!



18) యత్ ప్రాప్య న నివర్తంతే గంధస్పర్శాది వర్జితం !


సూరయస్తత్ పదం విష్ణోస్తత్ సర్వం శమయత్వధం !!



19) మాహాత్మ్యం పాపప్రణాశనం స్తోత్రం యః పఠేచ్ఛృణు యాదపి !


శారీరైర్మానసైర్వాగ్జైః కృతైః పాపైః ప్రముచ్యతే !!



20) సర్వపాపగ్రహా దిభ్యో యాతివిష్ణోః పరం పదం !


తస్మాత్పాపే కృతే జప్యంస్తోత్రంసర్వాఘమర్దనం !!



21) ప్రాయశ్చిత్తమ ఘౌఘానాం స్తోత్రం వ్రతకృతే వరం !


ప్రాయశ్చిత్తైః స్తోత్రజపైర్వ్రతైర్నశ్యతి పాతకం !!


శ్రీ సమస్త పాప నాశన శ్రీ విష్ణు స్తోత్రమ్ సంపూర్ణo...


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Thursday, April 6, 2023

Amma, Look at Me

 

_*ఇది చదవండి! తేనెలూరు తెనుగు పదాల ఊట మనసును నింపుతుంది.*_

(మరొక సమూహం నుండి సేకరణ)

_*అమ్మవారికి అచ్చ తెనుగు మాటల ఆత్మ నివేదన*_






    ఏంటమ్మా ఇది.. 

    ఎప్పుడూ ఆ ఆదిశంకరుడు, కాళిదాసు, మూకశంకరులేనా! 

    కొంచెం మావైపు కూడా చూడొచ్చు కదా! 

   “ఏమిట్రా నీ గోల! నేను మీవైపు చూడకుండానే మీరంతా పెద్దాళ్ళైపోతున్నార్రా!” అని ఉరమకు. 

    చూడటం అంటే అలా ఇలా చూడమని కాదు. 

    పామరుడిని మహాకవిని చేయడానికీ, మూగవాడితో అయిదొందల పద్యాలు చెప్పించడానికీ, నువ్వొక చూపు చూశావే! అదీ, ఆ చూపూ చూడాలి. 

    అమ్మా! అవడానికి అక్షరాలను పుట్టించింది మీ ఆయనే అయినా, నీ చూపు పడకపోతే అవి కదలనే కదలవేంటమ్మా! 

     ఆమాట కొస్తే, సర్వేశ్వరుడైన నీ మగడే, నీ అనుమతి లేనిదే ఏ పనీ చేయడు. 

     అప్పట్లో హాలాహలం పుట్టి లోకాలను దహించి వేస్తుంటే.. 

    పాపం ఆ దేవతలంతా మీ ఇంటిముందు బారులు తీరి.. “కుయ్యో! మొర్రో! విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు” అని ఏడుపులు, పెడబొబ్బలూ పెడుతుంటే.., 

    అప్పుడు కూడా అంతటి ఆ భోళాశంకరుడూ, వెళ్ళిరానా?  అన్నట్టు నీవైపు చూశాడు. 

   “పాపం మీ అన్నయ్య ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. నేను వెళ్ళి ఈ హాలాహలం సంగతేదో చూస్తే, అతను పొంగిపోతాడు” అంటూ నీ పుట్టింటి వారి మాటలు చెప్పి మరీ, నిన్ను ఒప్పించి బయల్దేరాల్సి వచ్చింది. 

    మరి నువ్వు భర్తను కొంగున ముడేసుకున్న *“స్వాధీనవల్లభ”* వు కదా! 

    పుట్టింటివాళ్ళ పేరు చెబితే పొంగిపోతావన్న మాట నిజమే కానీ, వాళ్ళైనా మీ ఆయన గురించి, ఒక చిన్నమాట తప్పుగా అన్నా, కళ్ళెర్ర జేస్తావు. అసలే నువ్వు *సదాశివపతివ్రతవు*. 

    *కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరవు.* 

     మీ నాన్న దక్షుడు నీ మగని కోసం నానా మాటలు అంటే, ఆ తరువాత ఏం జరిగిందో మాకు తెలియనిదా! 

    మీ  ఆయనకు కూడా నీవంటే ఎంత ప్రేమో కదా! నువ్వు నవ్వితే ఉబ్బితబ్బిబ్బైపోతాడు ఆ కామారి. 

   మరి *“మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా”* అని ఊరికే అన్నారా ఆ వసిన్యాది దేవతలు. 

    నీ నవ్వులో ఉన్న మధురిమముందు ఆ చదువుల తల్లి వీణానాదమే వెలవెల బోయిందటగా. *“నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ”* అని వాళ్ళువీళ్ళూ చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది. 

    మా ఆది శంకరులు కూడా సౌందర్య లహరిలో *“విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః.. ”* అంటూ మొదలయ్యే ఓ శ్లోకంలో ఈ విషయాన్నే చెప్పారు. 

    సరస్వతీ దేవి నీ దగ్గర కూర్చొని, మీ ఆయన లీలలను తన వీణ కచ్ఛపిపై గానం చేస్తోందట. నువ్వేమో పొంగిపోయి, “భలే పాడుతున్నావ్!” అన్నావట. అసలు నీ మాటలలో ఉన్న మాధుర్యం ముందు నా వీణానాదం మరీ తీసికట్టుగా ఉందనుకుంటూ, ఆవిడా గభాలున ఆ వీణను మూటకట్టేసిందట. 

    ఇక్కడ ఇంకొక విషయం.. మీ ఆయనన్నా, మీ ఆయనను కీర్తించేవారన్నా నీకు ఎంతిష్టమో కదా! 

*“ఓ మహా కామేశ మహిషీ”* అని పిలిస్తే చాలు పొంగిపోతావ్. అవున్లే అసలు ఉన్నదంటూ మీ ఇద్దరే కదా! 

    ఈ సృష్టి మొత్తం లయం చేసేసి, నీ మగడు ఆనంద తాడవం చేస్తుంటే.. అసలు పోలికే లేనంత అందమైన చుబుకం గల *“అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా”* వైన నువ్వు, నీ పల్లవముల వంటి అందమైన చేతులను అలా ఆ చుబుకం కింద పెట్టుకుని, ఆ తాండవాన్ని చూసి పరవశించిపోతూ.. *“మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి”గా* ఉన్నావు. 

    నువ్వసలే *“లాస్యప్రియ”వు* కూడానాయే. 

   ఎంతటి *“మహాలావణ్య శేవధి”వి*. *“ఆబ్రహ్మకీటజనని”వి* అయినా, 

    నీకు మీ ఆయన తొడమీద కూర్చుని, *“శివకామేశ్వరాంకస్థా”* అని అనిపించుకోవడమే ఇష్టం.  

    అందుకే మా కాళిదాసు 

*"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే*

*జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”* అంటూ మీ ఇద్దరి అభేదాన్ని చూపిస్తూ, నమస్కరించుకున్నాడు. 

  అసలు మా కాళిదాసు నీపై వ్రాసిన *“దేవీ అశ్వధాటి”* స్తోత్రం చదివితే తెలుస్తుందమ్మా! మా కవుల కవిత్వంలోని సొగసు. 

    సంగీతం ఏమాత్రం రానివాడికి కూడా తనకు సంగీతం వచ్చేసునేమో అన్న భ్రమకలిగించేంత అందంగా ఉంటుందా శ్లోకాల నడక.


*చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ* 

*కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా* 

*పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా* 

*ఘోటీఖురా దధికధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతామ్* 


    ఆహా! మొదటి శ్లోకమే ఎంత అందంగా ఉందో చూశావా? 

    ఇలాంటివి 13 శ్లోకాలున్నాయి ఆ స్తోత్రంలో. ఈ శ్లోకాలలో కూడా ఒకచోట నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమను రసవత్తరంగా చెప్పాడు కాళిదాసు. 

   *“శంభా వుదార పరిరంభాంకుర త్పులక దంభానురాగ పిశునా..”* అంటాడు. 

    మీ ఆయన నిన్ను గాఢంగా ఆలిగనం చేసుకున్నప్పుడు నీకు కలిగే పులకరింతలు నీకా పరమేశ్వరునిపై ఉన్న అపారమైన అనురాగానికి సూచికలట. 

    మీ ఆయన కోసమే చెప్పుకుంటూ కూర్చుంటే నీకూ, నాకూ ఇద్దరికీ ఇక ఈ లోకం పట్టదు. 

    కనుక కాసేపు వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం.


    అమ్మా! అసలు మీ అన్న దశావతారాలను అలా నీ చేతివేళ్ళ గోళ్ళలో నుండి అలా ఎలా పుట్టించేశావమ్మా! చిత్రం కాకపోతేను. 

   *“కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః”* అన్న మాట తలచుకుంటేనే భలేగా ఉంటుంది.


ఇక్కడే ఇంకొక్క


విషయం చెప్పాలి. మళ్ళీ మరచిపోతానేమో! 

   *“సాగరమేఖలా”* అనే నీ పేరు కూడా నాకెంత ఇష్టమో!  

     సముద్రాన్నే వడ్డాణంగా పెట్టుకున్న దానివంటకదా! ఎంత బావుంటుందో తెలుసా ఈ మాట. 

     ఈ నీ నామాన్నే మా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు 

   *“తేనెలతేటల మాటలతో, మన దేశ మాతనే కొలిచెదమా..”* అనే ఓ చక్కని గీతంలో అందంగా వాడారు. 

  *“సాగర మేఖల చుట్టుకొని -  సురగంగ చీరగా మలచుకొని”* అంటూ నీ నామాన్ని దేశమాతకు అన్వయిస్తూ వ్రాశారు. 

    అసలు మా సినీ కవులు కూడా నీమీద పాట రాయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెలరేగిపోతారు. 

    ముందుగా మాత్రం నేను మా మల్లాది రామకృష్ణశాస్త్రి గారినే చెబుతాను. 

*“లలిత భావ నిలయ నవ రసానంద హృదయ*

*విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ*

*మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ*

*సుమరదన విధువదన.. దేవి…”* అంటూ ఆయన వ్రాస్తే, 

    ఆ సాహిత్యానికి మా ఘంటశాల వేంకటేశ్వర్రావు గారు బాణీ కట్టారు. 

    మల్లాది వారి సూచన మేరకు, ఈ పాటలో 

    సరస్వతీ దేవి కోసం వచ్చినప్పుడు సరస్వతి రాగంలో, 

     శ్రీదేవి కోసం వచ్చినప్పుడు శ్రీరాగంలో, 

     లలితాదేవి కోసం వచ్చినప్పుడు లలితరాగంలో స్వరరచన చేశారు మా ఘంటశాల. 

     ఇలాంటి పాట వింటూ నాలాంటి పామరుడే పులకించిపోతుంటే.. 

   *“కావ్యాలాప వినోదిని”వి,* 

  *“రసజ్ఞ”వు.* *“కావ్యకాళా”* రూపిణివి అయిన నీవెంత మురిసిపోతుంటావో కదా! 

    ఆయనే వ్రాసిన *“శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా”* పాట కూడా మరో మేలిమి ముత్యం! 

   *“జగముల చిరునగవుల పరిపాలించే జననీ*

    *అనయము మము కనికరమున కాపాడే జననీ”* అంటూ.. 

   *“అనేకకోటిబ్రహ్మాండజనని”* వైన నిన్ను కీర్తిస్తూ.. 

   *“మనసే నీ వశమై స్మరణే జీవనమై*

    *మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి”* అంటూ మా అందరి తరపునా ఆయనే ప్రార్థించేశారు.

    ఇక సముద్రాలగారి *“జననీ శివకామినీ..”*, పింగళిగారి *“శివశంకరీ..”* పాటలు కూడా మమ్మల్ని ఆనందడోలికల్లో మునకలేయించేవే.

    మా వేటూరి గారి సంగతైతే చెప్పనక్కరనే లేదు. 

*“అఖిలాండేశ్వరి చాముండేశ్వరి*

*పాలయమాం గౌరీ*  *పరిపాలయమాం గౌరీ”* అంటూ మొదలయ్యే ఆ పాట, కాళిదాసు కవిత్వంలా సొగసుగా పరుగులు తీస్తుంది.

*“శుభగాత్రి గిరిరాజపుత్రి*  

*అభినేత్రి శర్వార్ధ గాత్రి* 

*సర్వార్థ సంధాత్రి* 

*జగదేక జనయిత్రి”* ఇలా అద్భుతంతా సాగిపోతుందా పాట. 

    మీ ఆయన అయిన శర్వునిలో నీవు సగభాగం కాబట్టి *శర్వార్ధ గాత్రి* అన్నారు. గాత్రము అంటే శరీరం అనే అర్థం ఉంది కదా!  అలానే సర్వ కార్యసిద్ధిని ఇచ్చుదానవు కనుక *సర్వార్థ సంధాత్రి* అన్నారు. అసలు శర్వార్థ, సర్వార్థ అనే పదాలు వినడానికి కొంచెం ఒకేలా ఉన్నా, ఎంతటి భేదం ఉందో కదా వాటి మధ్య. అదీ మరి మా వేటూరంటే! 

    అదీ నీ కరుణ ప్రసరించిన వారి కవిత్వమంటే. 

    ఈరోజు  నీతో ఇలా ఏవోవో చెప్పేస్తున్నాను. 

    అప్పట్లో శివరాత్రికి మీ ఆయనకోసం, 

    శ్రీరామనవమికి మీ అన్నయ్యకోసం రెండుత్తరాలు వ్రాశాను. 

    వాళ్ళకు వ్రాసి, మీ అందరికీ తల్లినైన నాకు మాత్రం వ్రాయవా అంటావమోనని ఈ మాటలన్నీ అరచి మరీ చెబుతున్నాను. వింటున్నావు కదా! 

    ఇక్కడ వంటింట్లో పని చేసుకుంటున్న మా అమ్మకు ఏదో ఒకటి చెబుతూ, 

    మధ్యమధ్యలో “ఇదిగో అమ్మా, వింటున్నావా? ఓ అమ్మా!!” అని అరుస్తుంటాను. 

    మా అమ్మేమో, ఊ! చెప్పరా” అంటుంది తన పని తాను చేసుకుంటూనే. కాకపోతే ఆవిడకు ఇక్కడ ఒకింటి పనే కాబట్టి ఇబ్బంది లేదు. 

    కానీ నీ సంగతి అలా కాదు కదా! 

    అనంతకోటి బ్రహ్మాండాలన్నింటినీ పరిపాలించే తల్లివి. 

    లోకాలన్నీ తన బొజ్జలో దాచుకున్న ఆ పరమశివుని భార్యవు. *“సదాశివకుటుంబిని”వి.* 

    అందుకే, కోట్లాదిమంది పిలుపులలో నా పిలుపెక్కడ వినబడదో అన్న భయం చేత, ఇంకాస్త గట్టిగా అరచి చెబుతున్నాను. 

    *ఇదిగో అమ్మా! ఇటూ.. ఈవైపు.. నావైపు చూడు! నేనూ..* 

          *స్వస్తి!*

Tuesday, March 28, 2023

Parijatham Flower

 *పంచ మహాపాత కాలను పోగొట్టే పారిజాతపుష్పం...!!*

*పారిజాత పుష్పాలు 9రకాలు*

1.ఎర్ర(ముద్ద)పారిజాతం

2.రేకు పారిజాతం

3.తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతం (ఎక్కువగా అందుబాటులో ఉన్నది)


4.పసుపు పారిజాతం

5.నీలం పారిజాతం

6.గన్నేరు రంగు పారిజాతం


7.గులాబీరంగు పారిజాతం

8.తెల్లని పాలరంగు పారిజాతం

9.ఎర్ర రంగు పారిజాతం


ఎరుపు రంగు పారిజాతం తో విష్ణువును ఆరాధించరాదు...

ఎరుపు తమోగుణం విష్ణువు సత్వగుణం, పారిజాత పుష్పాలు క్రింద పడిన వాటినే వాడాలి, చెట్టు నుండి కోసి వాడరాదు.

పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాగు కోకూడదని వరం పొందినది, రంగు,..వైశాల్యం,..గుణం,..దేవతా స్వరూపాన్ని బట్టి దేవతలను ఆరాధించాలి.


ఏ పూలను క్రింద పడ్డవి పూజకు వాడరాదు, ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పూవు తప్ప.

భూ స్పర్శ, మృత్తికా(మట్టి)స్పర్శ

జల స్పర్శ ,హస్త స్పర్శ

తరువాత స్వామి స్పర్శ.

ఈ 5 స్పర్శల తోను

పంచ మహా పాతకాలను

పోగొట్టేదే పారిజాతం...


స్వస్తి..🙏🌹


🌸🌹🌺🌷🪷🌻🍂🍃

Sri Anjaneya Dandakam


 *శ్రీ ఆంజనేయ దండకమ్...!!*


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం

భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం

భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు

సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి

నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ

నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై

రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్

నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే

నా మొరాలించితే నన్ను రక్షించితే

అంజనాదేవి గర్భాన్వయా దేవ

నిన్నెంచ నేనెంతవాడన్

దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్

దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై

స్వామి కార్యార్థమై యేగి

శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి

సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి

వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి

కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్

లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్

యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి

యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్^^జేసి

సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి

యాసేతువున్ దాటి వానరుల్^మూకలై పెన్మూకలై

యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి

బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్^వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు

సంజీవినిన్^దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా

కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని

వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ

నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,

సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,

యంతన్నయోధ్యాపురిన్^జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న

నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా

నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్^ల్బాయునే భయములున్

దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో

వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర

నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్

వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్

తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ

నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల

కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్

పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్

నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్

బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని

రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి

రారోరి నాముద్దు నరసింహ యన్^చున్ దయాదృష్టి

వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా

నమస్తే సదా బ్రహ్మచారీ

నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః...🙏🙏🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Bhadrachalam- Sri Sitha Rama


 *భద్రాచలం లో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం గురించి...!!*

భద్రుడు అనే ఋషి,,, శ్రీ రాముడిని,,  ఒక వరం అడిగాడు.

అసలు భద్రుడు,,, ఎవరు అంటే... మేరు పర్వత రాజుకి 2 కొడుకులు.

రత్నుడు,,,,భద్రుడు,,,,

ఇద్దరూ విష్ణు భక్త్తులు.,,ముక్తి పొంది పర్వతాలుగా,,, మారారు,,,,

రత్నుడు అన్నవరం లో రత్నగిరిగా ,,,,  భద్రుడు భద్రాచలం లో " భద్రగిరి' గా మారారు).

ఆ వరం ఏంటంటే నేను తిరిగే ఈ కొండల్లో నీవు కొలువై వుండాలి.,,,  దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకటానికి వెళ్తున్నాను.,,,  తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినపుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట.,,,


కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మరచిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు, అది తెలిసిన భద్రుడు ఘోరతపస్సు చేయటంతో శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి ఆ కొండపై వెలిసాడు,,


అయితే ఆయన వచ్చే కంగారులో రామావతారంలో ఉపయోగించిన బాణం, విల్లుతో పాటు విష్ణువు చేతిలో వుండే శంఖచక్రాలను కూడా తనతో తీసుకువచ్చేశాడని అక్కడ వెలిసే కంగారులో ఎప్పుడూ కుడివైపునే లక్ష్మణుడు ఎడమవైపున నిల్చొన్నట్లు పురాణాలను బట్టి తెలుస్తుంది.

అందుకే భద్రాచలం లో మూల విగ్రహం ఎక్కడా లేని విధంగా వుంటుంది. 

రాములవారి విగ్రహం నాలుగు చేతులతో వుండగా లక్ష్మణ స్వామి ఎడమవైపున వున్నట్లు కనపడుతుంది. 

ఆయన నాలుగు చేతులలో కుడివైపున వున్న రెండు చేతులలో శంఖము, బాణము వుండగా, వున్న రెండు చేతులలో విల్లు, చక్రము కనిపిస్తుంది...


జై శ్రీరామ్ ..🙏🌹

Sunday, March 26, 2023

Sivalaya Seva Phalam


 *శివాలయ సేవాఫలం...!!*

                        

🌸మనలో చాలామంది ఆలయాలకు వెళ్తాం. రోజూగానీ, వారానికోసారి కానీ, ఏదైనా పండుగలు, ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తాం.


🌸 ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకుంటాం. అక్కడ విశేషమైన ఆర్జిత సేవలు జరిపించుకుంటాం. అవకాశాన్ని బట్టి అక్కడి ఇతర ఆలయాలను, సందర్శనీయ స్థలాలను దర్శిస్తాం.


🪷 క్షేత్రంలో నిద్రచేస్తాం. అంతవరకే చాలా మందికి తెలిసిన విషయం.

భక్తులకు తెలియాల్సిన మరో విషయం ఏంటంటే ఆలయంలో ఎన్నో సేవలను మనం స్వచ్ఛందంగా నిర్వహించవచ్చు. అలా చేస్తే కలిగే ఫలితం చాలా విశేషంగా చెప్పబడింది.


🌸శివాలయం నిర్మాణం చేస్తే.. నిర్వహణ చేస్తే.. పునరుద్ధరణ చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో దానితో సమానమైన ఫలితాలు శివాలయ సేవ ద్వారా పొందవచ్చని శివధర్మశాస్త్రంలో వివరించబడింది.


     🌹🙏 దర్శిస్తే చాలు...🙏🌹


🌷దూరతః శిఖరం దృష్ట్వా నమస్కుర్యాచ్ఛివాలయమ్ |


 సప్తజన్మకృతం పాపం క్షిప్రమేవ వినశ్యతి ||🌷


🪷దూరం నుండి ఆలయశిఖరాన్ని దర్శించిన వెంటనే నమస్కరించాలి. అలా చేస్తే ఏడుజన్మలలో తాను చేసిన పాపాలనుండి వెంటనే విముక్తుడౌతాడు. 


    🌹🙏  పరిశుభ్రం చేస్తే...🙏🌹


🌷పశ్యన్ పరిహరన్ జంతూన్ మార్జన్యా మృదుసూక్ష్మయా |


శనైస్సమ్మార్జనం కుర్యాత్ చాంద్రాయణఫలం లభేత్ ||🌷


🌸శివాలయానికి వెళ్లిన భక్తులు అక్కడ ఏవైనా ప్రాణులు, పశువులు తిరుగుతుంటే వాటిని హింసించకుండా బయటకు పంపి , మెత్తటి మార్జని (చీపురు)తో ఆలయాన్ని తుడిచి పరిశుభ్రం చేస్తే చాంద్రాయణ వ్రతం ఆచరించిన ఫలితం కలుగుతుంది.


🌹🙏ఆవు పేడతో అలికితే...🙏🌹


🌸ఆవు పేడతో ఆలయాన్ని శుభ్రంగా అలికితే కూడా ఎంతో ఫలితం ఉందని చెప్పబడుతోంది. ఆ ఆవు పేడను మంచి ఆవుల నుండి సేకరించాలి. 

తన ఇంటినుంచి తీసుకురావాలి. లేదా పవిత్రమైన చోటునుండి తేవచ్చు. ఆ గోమయాన్ని కూడా పైభాగం, కిందభాగం వదిలి మధ్యలో శుద్ధం, మలినం కాని ఆవుపేడనే తీసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. 

అలాంటి గోమయంతో శివాలయ పరిసర ప్రాంతాన్ని చక్కగా అలికితే తమ పూర్వీకులు తరించి గోలోకం చేరుకుంటారు. అంతేకాక అలా చేస్తే సిరిసంపదలతో తులతూగుతారు.


    🌹🙏నీటితో శుభ్రపరిస్తే...🙏🌹


🌷యః కుర్యాత్ సర్వకార్యాణి వస్త్రపూతేన వారిణా |


స ముని స్స మహాసాధు స్స యోగీ స శివం ప్రజేత్ ||🌷


🌸వస్త్రంతో వడగట్టిన నీటితో ఆలయాన్ని పరిశుభ్రం చేసినవారు సజ్జనులు. అతడు యోగియై శివుని చేరుకుంటాడు. 

అలాగే శివాలయం నేలను అద్దంలా.. అంటే నేలవైపు చూస్తే, తన ప్రతిబింబం కనపడేలా తుడిచినా ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది.


🌹🙏పూలతో అలంకరిస్తే...🙏🌹


🌷యావద్ధస్తా భవే ద్భూమిః సమన్తా దుపశోభితా


తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే🌷


🌸శివాలయాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించినా.. అందంగా తీర్చిదిద్దినా...ఎంత ప్రదేశం తీర్చిదిద్దాడో దాన్ని అంగుళాలతో కొలిచి అంతకాలం రుద్రలోకంలో నివసిస్తారని చెప్పబడుతోంది. పుష్పవనాలను పాదుగొల్పినా శివలోకం చేరతాడు.


🌹🙏శివరూపాలను చిత్రిస్తే...🙏🌹


🌷యావంతి రుద్రరూపాణి స్వరూపాణ్యపి లేఖయేత్ |


తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే ||🌷


🪷చిత్రకారులను రప్పించి వారితో శివాలయంలో వేదపురాణాలలో పేర్కొనబడిన శివుని అవతారాలు, లీలలకు సంబంధించిన చిత్రాలు వేయించాలి. 


🌸అలా ఎన్ని బొమ్మలు చిత్రిస్తారో అంతకాలం రుద్రకాలంలో గొప్పగా ప్రకాశిస్తారు.


    🌹🙏వెల్ల వేయిస్తే...🙏🌹


🌷సుధావిలిప్తం యః కుర్యాత్ సర్వయత్నైశ్శివాలయమ్ |


తావత్పుణ్యం భవేత్ సోపి యావదాయతనే కృతే ||🌷


🪷శివాలయానికి, ప్రాకారం గోడలకు సుధాకర్మ (సున్నం పూయించడం) చేయించినవారికి ఆలయనిర్మాణం చేసిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది. 

అలాగే ప్రతి సంవత్సరం విడువకుండా, పాలవంటి తెల్లసున్నంతో లేదా వేరే రంగులతో అందంగా వెల్లవేయించినా అతడికి శివలోకవాసపుణ్యం లభిస్తుంది.

 ఎన్నోసేవలు...

అలాగే ఆలయంలోని గోడలకు సుగంధాలు పూయడం, గుగ్గిలంతో ధూపం వేయడం, చక్కగా రంగురంగుల ముగ్గులు పెట్టడం,


🌸పూలతోటలను బాగుచేయడం, ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తీసివేయడం, దీపాలకు కావాల్సిన వత్తులను సిద్ధం చేయడం, తోటి భక్తులకు సాయం చేయడం, ఆలయంలో భక్తులకు మంచినీరు ఇవ్వడం, ప్రసాదవితరణ ఇలా ఎన్నో సేవలను భక్తులు ఆచరించవచ్చు. 


🌸ఈ అవకాశం మనం గ్రామాల్లో ఉండే ఎన్నో ఆలయాల్లో మనం నిర్వహించుకుంటే ప్రతీ దేవాలయం దివ్యమైన భవ్యమైన శోభతో అలరారుతుంది. 

భక్తులకూ కల్పవృక్షమై నిలుస్తుంది. మరింకెందుకాలస్యం ?

ఆలయ సేవలో నిమగ్నమౌదాం. 

శివానుగ్రహాన్ని పొందుదాం.🙏🙏🌿☘️

Saturday, March 25, 2023

Types of Rains

 *వాన పలుకులు  *తెలుగా మజాకా*

మనకు వర్షం గురించే తెల్సు.. వానలు కురుస్తాయి. ఎప్పుడూ ఒకే‌ వాన కురిస్తే ఎలా? ఇన్ని రకాల వానలు కురిస్తే?


* గాంధారి వాన = కంటికి ఎదురుగా ఉన్నది  కనిపించనంత జోరుగా కురిసే వాన

* మాపుసారి వాన = సాయంత్రం కురిసే వాన

* మీసరవాన = మృగశిరకార్తెలో కురిసే వాన

* దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన

* సానిపి వాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన

* సూరునీల్ల వాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన

* బట్టదడుపు వాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన

* తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన

* సాలు వాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన

* ఇరువాలు వాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన

* మడికట్టు వాన = బురదపొలం దున్నేటంత వాన

* ముంతపోత వాన = ముంతతోటి పోసినంత వాన

* కుండపోత వాన = కుండతో కుమ్మరించినంత వాన

* ముసురు వాన = విడువకుండా కురిసే వాన

* దరోదరి వాన = ఎడతెగకుండా కురిసే వాన

* బొయ్య బొయ్య గొట్టే వాన = హోరుగాలితో కూడిన వాన

* రాళ్ల వాన = వడగండ్ల వాన

* కప్పదాటు వాన =  అక్కడక్కడా కొంచెం కురిసే వాన

* తప్పడ తప్పడ వాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.

* దొంగ వాన = రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన

* కోపులు నిండే వాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన

* ఏక్దార వాన = ఏకధారగా కురిసే వాన

* మొదటివాన = విత్తనాలకు బలమిచ్చే వాన

* సాలేటి వాన = భూమి తడిసేంత భారీ వాన

* సాలు పెట్టు వాన = దున్నేందుకు సరిపోయేంత వాన

.

అమ్మో ఇన్నివానలా ! *తెలుగా మజాకా*!!!

Telugu Is God

 *తెలుగు భాషలోని వాగ్దేవతలు ..వారి అద్భుత శక్తులు..!!*

తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల.. దాని అంతర్నిర్మాణం


'అ నుండి అః' వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని 'చంద్ర ఖండం' అంటారు. 

ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత 'వశిని' అంటే వశపరచుకొనే శక్తి కలది.


'క' నుండి 'భ' వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని 'సౌర ఖండం' అంటారు.


'మ' నుండి 'క్ష' వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని ' అగ్ని ఖండం' అంటారు.


ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.


సౌర ఖండంలోని ' క 'నుండి 'ఙ' వరకు గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి. అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.


'చ' నుండి 'ఞ' వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత 'మోదిని' అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.


'ట' నుండి 'ణ' వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి 'విమల'. అంటే మలినాలను తొలగించే దేవత.


'త' నుండి 'న' వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత 'అరుణ' కరుణను మేలుకొలిపేదే అరుణ.


'ప' నుండి 'మ' అనే ఐదు అక్షరాలకు అధిదేవత 'జయని'. జయమును కలుగ చేయునది.


అలాగే అగ్ని ఖండంలోని 'య, ర,ల, వ అనే అక్షరాలకు అధిష్టాన దేవత ' సర్వేశ్వరి'. శాశించే శక్తి కలది సర్వేశ్వరి.


ఆఖరులోని ఐదు అక్షరాలైన 'శ, ష, స, హ, క్ష లకు అధిదేవత 'కౌలిని'


ఈ అధిదేవతలనందరినీ 'వాగ్దేవతలు' అంటారు...

అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది...

ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి ఉద్భవించింది. అంటే బ్రహ్మమే శబ్దము. ఆ బ్రహ్మమే నాదము.


మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.


అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి.


కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.


మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత. 

మనం చేసే శబ్దమే ఆ దేవత, మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత. 

ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత. ఎంత అద్భుతం,

ఇది మన తెలుగు వైభవం. 

ఇది సనాతన ధర్మం, ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం...🙏🌹

Friday, March 24, 2023

What not to do.......

 ► బొట్టు లేకుండా ఉండటం, కాటుక పెట్టుకోకపోవడం (అధికారం, ఆచారం కలిగినవాళ్ళు)

► గడపలపై కూర్చోవటం

► నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం.

► ఎడమ చేతితో పిల్లలను కొట్టటం (కుడి చేత్తో కొడితే శుభమని అర్థం కాదు).

► స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవటం (ఉతికిన బట్టలు ఉండి కూడా) 

► రాత్రిపూట ఇళ్ళు చిమ్మటం, అన్నం ఎత్తి పడవేయటం

► కూర్చున్న కుర్చీల కింద, పీటల కింద నీళ్ళు చిమ్మటం (పోయటం)

► కాళ్ళు దాటుకుంటూ వెళ్ళటం (నడవటం)

► రోళ్ళు, రోకలిబండ, పాత్రలు కడగకుండా ఉంచటం

► చీకట్లో భోజనం చేయటం, కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేయటం

► భోజనం చేసి స్నానం చేయటం, సహపంక్తి భోజనాలలో మధ్యలో లేచిపోవటం

► భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావడం (అన్నం మనిషి కొరకు ఎదురు చూడకూడదు)

► అన్నం తింటూ చేతులు నాక్కోవటం

► బుసలు కొడుతూ కాఫీ, టీ వంటివి తాగటం  

► అదేపనిగా కాళ్ళు ఊపడం

► ఒళ్ళో కంచం పెట్టుకుని భోజనం చేయటం

► అన్నం చిన్నముద్దలుగా చేసి గాలిలో ఎగరవేస్తూ నోటితో లాఘవంగా పట్టుకొని తినడం

► మంగళ సూత్రాలతో నారింజ, బత్తాయి వంటి పండ్లను కోయడం. (మంగళ సూత్ర లోహము నిత్య ఉపయోగార్థమైన వస్తువు కాదు. పవిత్రతకు మాంగల్యానికి చిహ్నము)

► మంచం మీద కూర్చుని భోజనం చేయటం

► దీపారాధనకు ఒక్కటే వత్తి వెలిగించటం, దీపాన్ని నోటితో ఊది ఆర్పివేయటం 

► అదేపనిగా ఉమ్మి వేయటం, పళ్ళు కుట్టుకోవడం, చెవులలో పుల్లలు పెట్టి కెలకటం, గోళ్ళు కొరకటం, కనుబొమ్మలు కత్తిరించుకొనుట (రంగస్థల కళాకారులు కానివారు)

► రొమ్ము మీద వెంట్రుకలు కత్తిరించుకొనుట (రంగస్థల కళాకారులు కానివారు)

► మిట్టమధ్యాహ్నం స్నానం చేయడం.

Tuesday, March 21, 2023

Sri Anjaneya Navarathna Mala Stotram


 *హనుమగుణగణములతో /శ్రీ ఆంజనేయ నవరత్నమాలాస్తవం*


   గుణగణములు

**************

       రామ పూజారి పర ఉపకారి

       మహావీర భజరంగ బలీ        

       సద్ధర్మ చారి సద్బ్రహ్మ చారి 

       మహా వీర భజరంగబలీ!        


జ్ఞాన గుణసాగర

రూప ఉజాగర

శంకర సువన

సంకట మోచన 

మహా వీర భజరంగబలీ!        

        

కేసరి నందన

కలిమల భంజన

రాఘవ దూత

జయ హనుమంత 

మహా వీర భజరంగబలీ!        

        

అంజని నందన

అసురనికందన

మంగళహారతి

మారుతి నందన

మహా వీర భజరంగబలీ!

    

జయ రణధీర

జయ రణశూర

జయ బలభీమ

జయ బలధామ 

మహా వీర భజరంగబలీ!  


వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము. 

సుందరకాండ సారమైన 

9 శ్లోకములతో ఏర్పడినదే.........

*శ్రీఆంజనేయ నవరత్నమాలాస్తోత్రం.*


రత్ననములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామివారికి సమర్పంచబడినది.


ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది. 

ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. 

ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది. 

శ్లోకము తత్‌సంబంధిత గ్రహము, రత్నముల వివరములు స్తోత్రంలో తెలుపబడినవి. నవగ్రహములకు ఆయా శ్లోకములతో జపముచేసి ఫలితం పొందవచ్చునని చెప్పబడినది.  


     *శ్రీ ఆంజనేయ నవరత్నమాలాస్తోత్రం* 


1) మాణిక్యం (సూర్యుడు)

**************


శ్లో!! తతో రావణనీతాయా: సీతాయాశ్శత్రుకర్శన: |

ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||


అర్థము : అనంతరము అరివవీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతజాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను.



2) ముత్యం (చంద్రుడు)

**************


శ్లో!!యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర

 యథా తవ|

స్మృతిర్మతిర్ధృ తిర్ధాక్ష్యం

 స కర్మసు న సీదతి ||


అర్థము : నీవలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వముగలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు.


3) ప్రవాలం (కుజుడు)

**************


శ్లో!! అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం |

అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక: ||


అర్థము : దిగులుపడకుండా ఉత్సాహముతో నుండుటవలన కార్యసిద్ధియు, పరమ సుఖము కలుగును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి యుండటయే శ్రేయస్కరము.



4) మరకతం (బుధుడు)

****************


శ్లో!! నమోస్తు రామాయ సలక్ష్మణాయ

దేవ్యై చతస్యై జనకాత్మజాయై |

నమోస్తు రుద్రేంద్రయమనిలేభ్య:

నమోస్తు చంద్రార్కమరుద్గణభ్య: ||


అర్థము : శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు.



5) పుశ్యరాగం (గురుడు)

*****************


శ్లో!! ప్రియన్న సంభవేద్దు:ఖం అప్రియాదధికం భయం|

తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం|| 



6) హీరకం (శుక్రుడు)

**************


శ్లో!! రామ: కమలపత్రాక్ష: సర్వసత్త్వమనోహర|

రూపదాక్షిణ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే ||


అర్థము : ఓ జానకీ! శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులుగలవాడు. తన నిరుపమానకాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహసౌందర్యము, గుణసంపదయు గలవాడు.



7) ఇంద్రనీలం (శని)

***************


శ్లో!! జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: |

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ: ||


అర్థము : మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. అసహాయ శూరుడు, కోసలదేశప్రభువు ఐన శ్రీరామునకు నేను దాసుడను.



8) గోమేదికం (రాహువు)

*****************


శ్లో!!యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తప: |

యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమత: ||


అర్థము : నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచిరించియున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా! హనుమంతుని చల్లగా చూడుము.



9) వైడూర్యం (కేతువు)

*****************


శ్లో!!నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం |

అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||


అర్థము : శత్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతోగూడి అయోధ్య యందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలో చూడగలవు.


ఇతి శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం సంపూర్ణం.🙏

Sri Subrahmanya Aparaadha Kshamapana Stothram


 *సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం🙏🌿🌺🌹*


నమస్తే నమస్తే గుహ తారకారే

నమస్తే నమస్తే గుహ శక్తిపాణే ।

నమస్తే నమస్తే గుహ దివ్యమూర్తే

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 1 ॥


నమస్తే నమస్తే గుహ దానవారే

నమస్తే నమస్తే గుహ చారుమూర్తే ।

నమస్తే నమస్తే గుహ పుణ్యమూర్తే

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 2 ॥


నమస్తే నమస్తే మహేశాత్మపుత్ర

నమస్తే నమస్తే మయూరాసనస్థ ।

నమస్తే నమస్తే సరోర్భూత దేవ

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 3 ॥


నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూప

నమస్తే నమస్తే పరం జ్యోతిరూప ।

నమస్తే నమస్తే జగం జ్యోతిరూప

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 4 ॥


నమస్తే నమస్తే గుహ మంజుగాత్ర

నమస్తే నమస్తే గుహ సచ్చరిత్ర ।

నమస్తే నమస్తే గుహ భక్తమిత్ర

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 5 ॥


నమస్తే నమస్తే గుహ లోకపాల

నమస్తే నమస్తే గుహ ధర్మపాల ।

నమస్తే నమస్తే గుహ సత్యపాల

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 6 ॥


నమస్తే నమస్తే గుహ లోకదీప

నమస్తే నమస్తే గుహ బోధరూప ।

నమస్తే నమస్తే గుహ గానలోల

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 7 ॥


నమస్తే నమస్తే మహాదేవసూనో

నమస్తే నమస్తే మహామోహహారిన్ ।

నమస్తే నమస్తే మహారోగహారిన్

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 8 ॥


*ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రం🙏*

Monday, March 20, 2023

Navagraha Mangalashtakam

 *॥ నవగ్రహమంగళశ్లోకాః (నవగ్రహ మంగళాష్టకం) ॥*


*భాస్వాన్ కాశ్యపగోత్రజోఽరుణరుచిర్యస్సింహపోఽర్కస్సమి-*

*త్షట్త్రిస్థోఽదశశోభనో గురుశశీ భౌమాస్సుమిత్రాస్సదా,*

*శుక్రో మన్దరిపుః కళిఙ్గజనపశ్చాగ్నీశ్వరౌ దేవతే*

*మధ్యేవర్తులపూర్వదిగ్దినకరః కుర్యాత్సదా మంగళమ్  ౧ *


*చంద్రః* *కర్కటకప్రభుస్సితనిభశ్చాత్రేయగోత్రోద్భవ-*

*శ్చాత్రేయశ్చతురశ్రవారుణముఖశ్చాపే ఉమాధీశ్వరః,*

*షట్సప్తాగ్ని దశైకశోభనఫలో నోరిర్బుధార్కౌప్రియౌ*

*స్వామీ యామునజశ్చ పర్ణసమిధః కుర్యాత్సదా మంగళమ్  ౨ *


*భౌమో దక్షిణదిక్త్రికోణయమదిగ్వింధ్యేశ్వరః ఖాదిరః*

*స్వామీ వృశ్చికమేషయోస్సు గురుశ్చార్కశ్శశీ సౌహృదః,*

*జ్ఞోఽరిష్షట్త్రిఫలప్రదశ్చ వసుధాస్కందౌ క్రమాద్దేవతే*

*భారద్వాజకులోద్వహోఽరుణరుచిః కుర్యాత్సదా మంగళమ్  ౩ *


*సౌమ్యః పీత ఉదఙ్ముఖస్సమిదపామార్గో త్రిగోత్రోద్భవో*

*బాణేశానదిశస్సుహృద్రవిసుతశ్శేషాస్సమాశ్శీతగోః,*

*కన్యాయుగ్మపతిర్దశాష్టచతురష్షణ్ణేత్రగశ్శోభనో*

*విష్ణుర్దేవ్యధిదేవతే మగధపః కుర్యాత్సదా మంగళమ్  ౪ *


*జీవశ్చాంగిరగోత్రజోత్తరముఖో దీర్ఘోత్తరాశాస్థితః*

*పీతోఽశ్వత్థసమిచ్చసింధుజనితశ్చాపోఽథ మీనాధిపః,*

*సూర్యేందుక్షితిజాః ప్రియా బుధసితౌ శత్రూ సమాశ్చాపరే*

*సప్త ద్వే నవ పంచమే శుభకరః కుర్యాత్సదా మంగళమ్  ౫ *


*శుక్రోభార్గవగోత్రజస్సితరుచిః పూర్వాముఖః పూర్వదిక్*

*పాంచాలస్థ వృషస్తులాధిపమహారాష్ట్రాధిపౌదుంబరః,*

*ఇంద్రాణీమఘవాబుధశ్చ రవిజో మిత్రోర్క చన్ద్రావరీ*

*షష్ఠత్రిర్దశవర్జితేభృగుసుతః కుర్యాత్సదా మంగళమ్  ౬ *


*మందః కృష్ణనిభః సపశ్చిమముఖః సౌరాష్ట్రపః కాశ్యప-*

*స్స్వామీ నక్రసుకుంభయోర్బుధసితౌ మిత్రౌ కుజేన్దూద్విషౌ,*

*స్థానంపశ్చిమదిక్ప్రజాపతియమౌ దేవౌ ధనుష్యాసనౌ-*

*ష్షట్త్రిస్థశ్శుభకృచ్ఛమీరవిసుతః కుర్యాత్సదా మంగళమ్  ౭ *


*రాహుస్సింహళదేశపో నిఋఋతిః కృష్ణాంగశూర్పాసనః*

*యఃపైఠీనసగోత్రసంభవసమిద్దూర్వాముఖో దక్షిణః,*

*యస్సర్పః పశుదైవతోఽఖిలగతస్స్వామ్యాద్విశేషప్రద*

*షట్త్రిస్థశ్శుభకృచ్చ సింహకసుతః కుర్యాత్సదా మంగళమ్  ౮ *


*కేతుర్జైమినిగోత్రజః కుశసమిద్వాయవ్యకోణేస్థితః*

*చిత్రాంకధ్వజలాంఛనోహిభగవాన్యో దక్షిణాశాముఖః,*

*బ్రహ్మాచైవతు చిత్రగుప్తపతిమాన్ప్రీత్యాధిదేవస్సదా-*

*షట్త్రిస్థశుభ కృచ్చ బర్బరపతిః కుర్యాత్సదా మంగళమ్  ౯ *


*ఇతి నవగ్రహమంగళశ్లోకాః (నవగ్రహ మంగళాష్టకం) |*

Sri Hanuman Manyusuktham


 *హనుమాన్ మన్యుసూక్తం..!!*


          _మన్యుసూక్తం_

(ఋగ్వేద సంహితా; మండలం 10; సూక్తం 83,84)


యస్తే” మన్యో‌உవి’ధద్ వజ్ర సాయక సహ ఓజః’ పుష్యతి విశ్వ’మానుషక్ | 

సాహ్యామ దాసమార్యం త్వయా” యుజా సహ’స్కృతేన సహ’సా సహ’స్వతా 1 



మన్యురింద్రో” మన్యురేవాస’ దేవో మన్యుర్ హోతా వరు’ణో జాతవే”దాః | 

మన్యుం విశ’ ఈళతే మాను’షీర్యాః పాహి నో” మన్యో తప’సా సజోషా”ః  2 



అభీ”హి మన్యో తవసస్తవీ”యాన్ తప’సా యుజా వి జ’హి శత్రూ”న్ | 

అమిత్రహా వృ’త్రహా ద’స్యుహా చ విశ్వా వసూన్యా భ’రా త్వం నః’  3 



త్వం హి మ”న్యో అభిభూ”త్యోజాః స్వయంభూర్భామో” అభిమాతిషాహః | 

విశ్వచ’ర్-షణిః సహు’రిః సహా”వానస్మాస్వోజః పృత’నాసు ధేహి  4 



అభాగః సన్నప పరే”తో అస్మి తవ క్రత్వా” తవిషస్య’ ప్రచేతః | 

తం త్వా” మన్యో అక్రతుర్జి’హీళాహం స్వాతనూర్బ’లదేయా”య మేహి’  5 



అయం తే” అస్మ్యుప మేహ్యర్వాఙ్ ప్ర’తీచీనః స’హురే విశ్వధాయః | 

మన్యో” వజ్రిన్నభి మామా వ’వృత్స్వహనా”వ దస్యూ”న్ ఋత బో”ధ్యాపేః  6 



అభి ప్రేహి’ దక్షిణతో భ’వా మే‌உధా” వృత్రాణి’ జంఘనావ భూరి’ | 

జుహోమి’ తే ధరుణం మధ్వో అగ్ర’ముభా ఉ’పాంశు ప్ర’థమా పి’బావ  7 



త్వయా” మన్యో సరథ’మారుజంతో హర్ష’మాణాసో ధృషితా మ’రుత్వః | 

తిగ్మేష’వ ఆయు’ధా సంశిశా”నా అభి ప్రయం”తు నరో” అగ్నిరూ”పాః  8 



అగ్నిరి’వ మన్యో త్విషితః స’హస్వ సేనానీర్నః’ సహురే హూత ఏ”ధి | 

హత్వాయ శత్రూన్ వి భ’జస్వ వేద ఓజో మిమా”నో విమృధో” నుదస్వ  9 



సహ’స్వ మన్యో అభిమా”తిమస్మే రుజన్ మృణన్ ప్ర’మృణన్ ప్రేహి శత్రూ”న్ | 

ఉగ్రం తే పాజో” నన్వా రు’రుధ్రే వశీ వశం” నయస ఏకజ త్వమ్  10 



ఏకో” బహూనామ’సి మన్యవీళితో విశం”విశం యుధయే సం శి’శాధి | 

అకృ’త్తరుక్ త్వయా” యుజా వయం ద్యుమంతం ఘోషం” విజయాయ’ కృణ్మహే  11 



విజేషకృదింద్ర’ ఇవానవబ్రవో(ఓ)3’‌உస్మాకం” మన్యో అధిపా భ’వేహ | 

ప్రియం తే నామ’ సహురే గృణీమసి విద్మాతముత్సం యత’ ఆబభూథ’  12 



ఆభూ”త్యా సహజా వ’జ్ర సాయక సహో” బిభర్ష్యభిభూత ఉత్త’రమ్ | 

క్రత్వా” నో మన్యో సహమేద్యే”ధి మహాధనస్య’ పురుహూత సంసృజి’  13 



సంసృ’ష్టం ధన’ముభయం” సమాకృ’తమస్మభ్యం” దత్తాం వరు’ణశ్చ మన్యుః | 

భియం దధా”నా హృద’యేషు శత్ర’వః పరా”జితాసో అప నిల’యంతామ్  14 



ధన్వ’నాగాధన్వ’ నాజింజ’యేమ ధన్వ’నా తీవ్రాః సమదో” జయేమ |

ధనుః శత్రో”రపకామం కృ’ణోతి ధన్వ’ నాసర్వా”ః ప్రదిశో” జయేమ ||


భద్రం నో అపి’ వాతయ మనః’ ||



ఓం శాంతా’ పృథివీ శి’వమంతరిక్షం ద్యౌర్నో” దేవ్య‌உభ’యన్నో అస్తు |

శివా దిశః’ ప్రదిశ’ ఉద్దిశో” న‌உఆపో” విశ్వతః పరి’పాంతు న్ శాంతిః శాంతిః శాంతిః’ ||...🙏🙏☘️🌿

Sunday, March 19, 2023

Eswra -- Trayambaka


 *త్రయంబకుడు అంటే అర్థం ఏమిటి......?*

*శివుడి మూడు నామాలకి ఉన్న పరమార్థం ఏమిటి...?*


_మహా మృత్యుంజయ మంత్రం_


ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |

ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||

అంటే...

అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. 

దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక!


'మహా మృత్యుంజయ మంత్రం పై కొన్ని సందేహాలుంటాయి...

ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా, మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదా అని!!...


మరి అలాంటప్పుడు ఈ _మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు?_


అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? 

అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధమో తెలియదు!!! అర్థం కాదు!!... 


మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదు... 

పునర్జన్మ లేకపోవడం, అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. 

అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. 

ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. 

ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి.

ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. 


*అది ఎలాగంటారా?*

ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి, సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. 

ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది.


జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. 

అంటే మాయనుండి విడివడతాడు. 

పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను..


దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. 

(జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు.


ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు...

పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కద...


ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. 


_ఆ ఆరాధన ఎలాగుండాలంటే - జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం._


మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం. 

ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. 

అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి, శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -

*పంచభూతాత్మకుడు :-*

శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.


*త్రయంబకుడు :-* 

శివుని మూడుకన్నులు కాలాలను (భూత, భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. 

ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. 

ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. 

దీనినే త్రివేణి సంగమం అని అంటారు.


*నామము :-* 

శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. 

అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు.


*విభూతిదారుడు :-* 

సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. 

అంటే భస్మంగాక తప్పదు, నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.


*త్రిశూలం :-* 

సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.


*నాగాభరణుడు :-* 

సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం.


అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు.


అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.


 సేకరణ ....

స్వస్తి🙏🌿☘️