*వాన పలుకులు *తెలుగా మజాకా*
మనకు వర్షం గురించే తెల్సు.. వానలు కురుస్తాయి. ఎప్పుడూ ఒకే వాన కురిస్తే ఎలా? ఇన్ని రకాల వానలు కురిస్తే?
* గాంధారి వాన = కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే వాన
* మాపుసారి వాన = సాయంత్రం కురిసే వాన
* మీసరవాన = మృగశిరకార్తెలో కురిసే వాన
* దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన
* సానిపి వాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన
* సూరునీల్ల వాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన
* బట్టదడుపు వాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన
* తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన
* సాలు వాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన
* ఇరువాలు వాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన
* మడికట్టు వాన = బురదపొలం దున్నేటంత వాన
* ముంతపోత వాన = ముంతతోటి పోసినంత వాన
* కుండపోత వాన = కుండతో కుమ్మరించినంత వాన
* ముసురు వాన = విడువకుండా కురిసే వాన
* దరోదరి వాన = ఎడతెగకుండా కురిసే వాన
* బొయ్య బొయ్య గొట్టే వాన = హోరుగాలితో కూడిన వాన
* రాళ్ల వాన = వడగండ్ల వాన
* కప్పదాటు వాన = అక్కడక్కడా కొంచెం కురిసే వాన
* తప్పడ తప్పడ వాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.
* దొంగ వాన = రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన
* కోపులు నిండే వాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన
* ఏక్దార వాన = ఏకధారగా కురిసే వాన
* మొదటివాన = విత్తనాలకు బలమిచ్చే వాన
* సాలేటి వాన = భూమి తడిసేంత భారీ వాన
* సాలు పెట్టు వాన = దున్నేందుకు సరిపోయేంత వాన
.
అమ్మో ఇన్నివానలా ! *తెలుగా మజాకా*!!!
No comments:
Post a Comment