Monday, March 13, 2023

Prasnotthara Rathna Malika ప్రశ్నోత్తర రత్నమాలిక


 *ప్రశ్నోత్తర రత్నమాలికలో అడగబడ్డ కొన్ని ప్రశ్నలకు శంకరులు ఇచ్చిన‌ జవాబులు మనకు దిశా నిర్దేశం చేస్తాయి...*


ఏది అన్నిటికన్నా ప్రయోజనకరమైనది?

జవాబు: ధర్మం 


ఏది వాంఛింపదగినది?

జవాబు: స్వ, పర హితం. 


శత్రువు ఎవరు?

జవాబు: సోమరితనం.


ఏది దుఃఖం?

జవాబు: ఉత్సాహం‌ లేకపోవడం.


ఏది‌ జాడ్యం?

జవాబు:‌ నేర్చుకున్నది ఆచరించకపోవడం.


ఏది వెలలేనిది?

జవాబు: అవసరం వచ్చినప్పుడు ఇవ్వబడేది.


ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది?

జవాబు: సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత.


 ఏది దానం?

జవాబు: అకాంక్ష లేనిది.


ఎవరు స్నేహితులు?

జవాబు: పాపాన్ని నివారించే వాళ్లు‌.


ఏది పాతకం?

జవాబు:‌ హింస.


ఎవరు ఎదుగుతారు?

జవాబు: వినయం ఉన్నవాళ్లు. 


ఎవరు ప్రత్యక్ష దేవత?

జవాబు: అమ్మ.


వేటిని మనుషులు సంపాదించాలి?

జవాబు: విద్య, ధనం, బలం, కీర్తి , పుణ్యం.


వేటిని కాపాడుకోవాలి?

జవాబు:‌ కీర్తి , పతివ్రత, బుద్ధి 


ఎవరు శూరులు?

జవాబు: భయంతో ఉన్నవాళ్లను రక్షించేవాళ్లు.


"శంకరత్వం ఒక‌ సుజ్ఞాన సత్వం

సదా అనుగమించాల్సిన తత్త్వం"


సేకరణ ...🙏

No comments:

Post a Comment