Wednesday, March 8, 2023

Sri Ganesha Stuthi by Sri Brahma Deva


 _*బ్రహ్మ చేసిన గణేశస్తుతి*_ 🙏


ముకుటేన విరాజన్తం ముక్తారత్నయుజా శుభమ్|

రక్త చందన లిప్తాంగం సిందూరారుణ మస్తకమ్ ||


🪷 ముత్యములతోను రత్నములతోను పొదగబడిన శుభప్రదమయిన కిరీటము కలవాడు, ఎఱ్ఱ చందనమును శరీరమంతట పూసుకొన్నవాడు, సింధూరముతో, అరుణవర్ణముతో విరాజిల్లు శిరస్సు కలవాడు.


ముక్తా హారలసత్ కంఠం సర్పయజ్ఞోపవీతినం|

అనర్ఘ రత్నఘటిత బాహు భూషణ భూషితమ్ ||


🪷 ముత్యాలహారమును కంఠమున ధరించినవాడు, సర్పయజ్ఞోపవీతమును ధరించినవాడు, బహుమూల్యరత్న ఘటితములయిన బాహుభూషణములతో అలంకరింపబడినవాడు.


స్ఫురన్మరకత భ్రాజ దంగుళీయక శోభితం |

మహాహివేష్టిత బృహన్నాభి శోభి మహోదరమ్ II


🪷 ప్రకాశిస్తున్న మరకత మణితో విరాజిల్లు ఉంగరముతో శోభిల్లువాడు, మహా అహిచే (గొప్ప నాగరాజు అయిన శేషుడు) పరివేష్టితమైన పెద్ద నాభితో, మహెూదరముతో కూడినవాడు.


విచిత్ర రత్న ఖచిత కటిసూత్ర విరాజితం |

సువర్ణ సూత్ర విలసత్ రక్త వస్త్ర సమావృతమ్ ||


🪷 చిత్రవిచిత్రములయిన రత్నములచే అలంకరింపబడిన కటిసూత్రము (మొలతాడు) చే విరాజిల్లువాడు, స్వర్ణసూత్రములతో విలసిల్లు ఎఱుపురంగు గల వస్త్రమును ధరించినవాడు.


పూర్ణేందు వద్ భ్రాజమాన దంతకాంతి వరం కరం |

ధ్యాయామి సతతం దేవం వినాయకమనామయమ్ ||


🪷 నిండు చందురుని వలె విరాజమానమైన కాంతివంతమయిన తెల్లని దంతమును, చేత ధరించినవాడు, రోగరహితుడు, దేవదేవుడు అయిన వినాయకుని నేను సర్వదా ధ్యానిస్తున్నాను.

No comments:

Post a Comment