Monday, March 13, 2023

ప్రతి ఇంట్లోనూ శివలింగం ఉండాలని అంటారు🙏🙏


 *ప్రతి ఇంట్లోనూ శివలింగం ఉండాలని అంటారు🙏🍃☘️*


_శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేసిన వాళ్ళకి శివుడు దొడ్లో కామధేనువుని కట్టేసి కల్పవృక్షాన్ని పెడతాడట..._


పూర్వకాలం ఎవరింట్లో అయినా భోజనం చేయాలంటే వాళ్ళ ఇంట్లో శివలింగం ఉందో లేదో అడిగి చేసే వారట... అలాగే శివాలయం, హనుమంతుని కోవెల లేని ఊర్లో అడుగు పెట్టేవారు కాదట...


కాశీ వెళ్ళినప్పుడు ఒక చిన్న శివలింగాన్ని కొనుక్కుని గంగా నది లో పడవ మీద వెళ్తూ నది మధ్యలో ప్రతిష్ట చేస్తున్నట్టుగా భావించి శివ పంచాక్షరి స్మరణతో నదిలో శివలింగాన్ని జారవిడిస్తే సాక్షాత్త్ స్థిర శివలింగాన్ని ప్రతిష్ట చేస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో అంతకంటే వెయ్యిరెట్లు ఫలితం లభిస్తుంది. 

అంత్యకాలంలో అనాయాస మరణంతో శివపదం పొందుతారు.


*( మార్కండేయ పురాణం లోనిది )*

No comments:

Post a Comment