Thursday, March 9, 2023

Sri Shashti Devi Stuthi


 షష్టి దేవి స్తుతి.......!!


పిల్లలను రక్షిస్తూ..వాళ్ళకి ఎలాంటి ఆపదలు 

దరి చేరనివ్వకుండా చూసుకునే తల్లి  దేవసేనమాత.. ఆవిడ షష్టి దేవిగా పూజలు అందుకుంటోంది...


ఈ దివ్యమైన స్తుతి..రోజూ ఒక్కసారి చదువుకుంటే 

ఆవిడ పరమ ప్రసన్నురాలై పిల్లలకు రక్షణగా ఉంటుంది.


బాలారిష్టాలు తొలగిపోతాయి .

పిల్లలకు ఆయురారోగ్యాలను ప్రసాదించే అమ్మ...


షష్టి దేవి నమో నమః 


నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః 

శుభాయై దేవసేనాయై షష్ట్యై దేవ్యై నమో నమః


వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః

సుఖ దాయై మోక్షదాయై షష్ట్యై దేవ్యై నమో నమః


సృష్టె షష్ఠాంశరూపాయై సిద్ధాయైచ నమో నమః

మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః


సారయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః

బాలాధిష్ఠా తృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః


కల్యాణ దేవ్యై కల్యాణ్యై ఫల దాయైచ కర్మణాం

ప్రత్యక్షా యై సర్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః 


పూజ్యాయై స్కందకాంతాయై సర్యేషాం సర్వ కర్మసు

దేవ రక్షణ కారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః


శుద్ధ సత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా

హింసా క్రోధ వర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః


ధనం దేహి జయం దేహి పుత్రందేహి సురేశ్వరీ !

మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి 


ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవి నమో నమః

దేహి భూమిం ప్రజాం దేహి విద్యాందేహి సుపూజితే


కల్యాణం చ జయం దేహి విద్యా దేవి నమో నమః

నమోస్తుతే నమోస్తుతే షష్ఠీ దేవి నమో నమః🙏

No comments:

Post a Comment