Wednesday, March 1, 2023

Upadesa Saram ఉపదేశ సారం


 *శ్రీరమణ మహర్షీ కృతమ్ ఉపదేశసారమ్

*॥ ఉపదేశసారమ్ ॥*

*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*1)కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలమ్ । కర్మ కిం పరం కర్మ తజ్జడమ్ ॥*



*2)కృతిమహోదధౌ పతనకారణమ్ । ఫలమశాశ్వతం గతినిరోధకమ్ ॥*



*3)ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతమ్ ।చిత్తశోధకం ముక్తిసాధకమ్ ॥*



*4)కాయవాఙ్మనః కార్యముత్తమమ్ । పూజనం జప శ్చిన్తనం క్రమాత్ ॥*



*5)జగత ఈశధీ యుక్తసేవనమ్ । అష్టమూర్తి భృద్దేవ పూజనమ్ ॥*



*6)ఉత్తమస్త వాదుచ్చమన్దతః । చిత్తజం జపధ్యాన ముత్తమమ్ ॥*



*7)ఆజ్యధారయా స్రోతసా సమమ్ । సరలచిన్తనం విరలతః పరమ్ ॥*



*8)భేదభావనాత్ సోఽహమిత్యసౌ । భావనాఽభిదా పావనీ మతా ॥*



*9)భావశూన్య సద్భావసుస్థితిః । భావనా బలాద్భక్తి రుత్తమా ॥*



*10)హృత్స్థలే మనః స్వస్థతా క్రియా । భక్తియోగ బోధాశ్చ నిశ్చితమ్ ॥*



*11)వాయురోధ నాల్లీయతే మనః । జాలపక్షివద్రోధ సాధనమ్ ॥*



*12)చిత్తవాయవశ్చిత్క్రియాయుతాః । శాఖయోర్ద్వయీ శక్తిమూలకా ॥*



*13)లయవినాశనే ఉభయరోధనే ।  లయగతం పునర్భవతి నో మృతమ్ ॥*



*14)ప్రాణబన్ధ నాల్లీనమానసమ్ । ఏకచిన్తనాన్నాశమేత్యదః ॥*



*15)నష్టమానసోత్కృష్టయోగినః । కృత్యమస్తి కిం స్వస్థితిం యతః ॥*



*16)దృశ్యవారితం చిత్తమాత్మనః । చిత్త్వదర్శనం తత్త్వదర్శనమ్ ॥*



*17)మానసం తు కిం మార్గణే కృతే । నైవ మానసం మార్గ ఆర్జవాత్ ॥*



*18)వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః । వృత్తయో మనో విద్ధ్యహం మనః ॥*



*19)అహమయం కుతో భవతి చిన్వతః । అయి పతత్యహం నిజవిచారణమ్ ॥*



*20)అహమి నాశ భాజ్యహమహంతయా । స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్ ॥*



*21)ఇదమహం పదాఽభిఖ్య మన్వహమ్ । అహమిలీనకేఽప్యలయసత్తయా ॥*


*22)విగ్రహేన్ద్రియ ప్రాణధీతమః । నాహమేకసత్తజ్జడం హ్యసత్ ॥*



*23)సత్త్వభాసికా చిత్క్వవేతరా । సత్తయా హి చిచ్చిత్తయా హ్యహమ్ ॥*



*24)ఈశజీవ యోర్వేషధీభిదా । సత్స్వభావతో వస్తు కేవలమ్ ॥*



*25)వేషహానతః స్వాత్మదర్శనమ్ । ఈశదర్శనం స్వాత్మరూపతః ॥*



*26)ఆత్మసంస్థితిః స్వాత్మదర్శనమ్ । ఆత్మనిర్ద్వయాదాత్మనిష్ఠతా ॥*



*27)జ్ఞానవర్జితాఽజ్ఞానహీనచిత్ । జ్ఞానమస్తి కిం జ్ఞాతుమన్తరమ్ ॥* 



*28) కిం స్వరూప మిత్యాత్మదర్శనే । అవ్యయాఽభవాఽఽపూర్ణచిత్సుఖమ్ ॥* 



*29)బన్ధముక్త్యతీ    తం పరం సుఖమ్ ।విన్దతీహ జీవస్తు దైవికః ॥*



*30)అహమపేతకం నిజవిభానకమ్ । మహదిదంతపో రమణవాగియమ్ ॥* 



*॥ ఇతి రమణమహర్షీకృతమ్ ఉపదేశసారమ్ సంపూర్ణమ్ ॥*




*ఉపదేశసారము తాత్పర్యం*

*ॐॐॐॐॐॐॐॐॐॐॐ*


*1. దైవశాసనము బట్టి కర్మఫలము లభిస్తుంది. కర్మదైవమా? కానేకాదు కర్మ జడపదార్థం.*



*2. కర్మఫలం అనిత్యమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు హేతువగుచున్నది. అందుచే పరమగతిని అది నిరోధిస్తుంది.*



*3. ఈశ్వరార్పణ బుద్దితో ఆచరించిన నిష్కామ కర్మలు మనస్సును పరిశుద్ధి కావించి ముక్తికి సాధక మవుతాయి.*


       

*4. పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనస్సు చేత చేయబడు తున్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనది.*



*5.  బ్రహ్మ భావనతో చేయు మానవ సేవయే అష్టమూర్తులు గల భగవానుని పూజ యగుచున్నది.*



*6.  భగవత్ స్తుతి కంటే వాచక జపము, వాచకజపము కంటే మౌనజపము, మౌనజపము కంటే ధ్యానము ఉత్తమములు.*



*7.  నదీ ప్రవాహంలా, నేతి ధారలా, నిరాఘాటంగా సాగే సరళధ్యానం ఆటంకంతో కూడిన విరళచింతనం కన్నా మిన్న.*



*8. పరమాత్మా వేరు, నేను వేరు అనే భేద జ్ఞానము కన్నా అతడే నేను అనే అభేద జ్ఞానమే పావనమైనది.*


       

*9. ద్వైత భావమును దాటి ‘ఆ పరమాత్మే నేను’ నీలోను నాలోను అన్నిటా ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావనా బలిమిచే కలిగే సద్భావస్థితిని ఉత్తమమైన భక్తి అంటారు.*



*10.  మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ,భక్తీ,జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం.*



*11.  వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామము చేత మనస్సు కుదుటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము.*



*12.  ఈస్వరశక్తి యనెడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి.*



*13.  లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును. నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు.*



*14.  ప్రాణ సంధానముచే లయించిన మనస్సు ఆత్మ యనెడి ఒకేఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది.*



*15.  మనసు నశించిన పరమయోగికి చేయదగిన కర్మ అంటూ ఏముంటుంది?*



*16.  దృశ్య వస్తువుల నుండి చిత్తమును వెనుకకు మరల్చి చిత్స్వరూపమును ఎరుగుటయే తత్త్వ దర్శనము.*



*17.  మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసేలేదని రూడి అవుతుంది. అదే సరైనదారి.*



*18.  వృత్తులన్నీ అహం (అంటే నేను) వృత్తిపై ఆధారపడి యున్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు.*



*19.  నేను అనేది ఎక్కడనుంచి పుడుతోంది? అని అన్వేషిస్తే ఆ నేను పతనమౌతుంది. ఇదే ఆత్మవిచారము.*



*20.  ఎప్పుడైతే ఈ నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది, పరిపూర్ణమైనది, సత్ స్వరూపమైనది నగు ‘అహం అహం’ అను ఆత్మయే ప్రకాశించును.*



*21.  అహం వ్రుత్తి లయించినపుడు సదా సత్పదార్థము భాసించుటచే అదే నేను అను పదమును లక్ష్యార్ధమైయున్నది.*



*22.  దేహము, ఇంద్రియములు ప్రాణము,బుద్ధి,అవిద్య నేను కాను. అవి జడములు. ఏకసద్రూపమే నేను.*



*23.  సత్తు ను తెల్పుటకు చిత్తు వేరుగా యున్నదా? సత్తుయే చిత్తూ, చిట్టుయే నేను?*



*24.  శరీరాది ఉపాదులవలన జీవేశ్వరులలో భేదము కనుపించు నప్పటికీ ఇద్దరు సత్స్వ రూపులు అవడంవల్ల ఒకే వస్తువై యున్నారు.*



*25.  ఉపాధులను తొలగించినచో జీవుడు ఈశతత్వమును దర్శిస్తాడు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది.*



*26.  ఆత్మ అద్వితీయము కనుక ఆత్మగా నుండుటయే ఆత్మను తెలుసుకొనుట యగును.*



*27.  జ్ఞానము – అజ్ఞానము రెండింటిని దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానము.సమస్తమునకు అతీతమై, సర్వాత్మకమై వెలయు జ్ఞానమును తెలుసుకొనుటకు వేరువస్తువు ఏమున్నది.*



*28.  తన నిజస్వరూపము ఎప్పుడైతే దర్శించబడిందో, అప్పుడు తనే ఆద్యంతములు లేని పూర్ణ చిదానందమని తెలుసుకొనును.*



*29.  తన్ను తాను తెలుసుకొనెడి ఈ అత్మానుభావమును పొందిన దైవికుడు జ్ఞాని బంధము గాని ముక్తిగాని లేని పరమ సుఖస్థితిని పొందుతాడు.*



*30.  నేను అనునదిలేని స్వస్వరూపానుభవమే ఉన్నతమైన తపస్సుయని రమణుని దివ్యవాణి పల్కుచున్నది.దేహము ఘటము వాలే జడమైనది. దీనికి నే నను తలపు లేనందునను, దేహము లేని నిద్రయందు గూడ దినమును మనముండుట చేతను, దేహము నేను కాదు; నేను ఎవరిని?ఎక్కడ నించి వచ్చాను? అని సూక్ష్మ బుద్ధి చేత వెదికి చూచి,తన యందు నిలకడ జెందిన వారల హ్రుదయాంతరంగమందు పరిపూర్ణు డైన అరుణాచల  శివుడు ‘అహం’ స్పురణరూపుడై స్వయంగా భాసితున్నాడు.*రమణ సమూహం లో చేర దలచినవారు ఈ నెంబర్ కు మెసేజ్ పెట్టండి 9490860693

No comments:

Post a Comment