*ఆదిశేషుని ప్రశస్తి...!!*
ఆదికాలంనుండి శ్రీమన్నారాయణుని పానుపై సర్వశక్తి సంపన్నుడైన భగవంతుడు తన పైన ఆశీనుడైనప్పుడు అంతటి భారాన్ని మోసిన ఘన కీర్తి ఆది శేషునిదే.
సంకర్షణ నామంతో
శ్రీ మన్నారాయణుని రూపంలో వచ్చినది ఆదిశేషువే, శ్రీ వైకుంఠం లో, వీరాసనంలో, దర్శనమిస్తున్న పరవాసుదేవమూర్తికి
కావలసిన సేవలు తక్షణమే అందించే, నిత్య సేవకులకి పర్యవేక్షక నాయకుడు
ఆదిశేషువే.
భూలోకానికి అడుగున పాతాళ లోకం వున్నది.
పాతాళ లోకానికి క్రింద మరో
పధ్నాలుగు లోకాలు వున్నట్లు మన పురాణాలు చెప్తున్నాయి, యీ పధ్నాలుగు లోకాలకి అధిపతి ఆదిశేషువు.
శ్రీవైష్ణవ ఆలయాలలో
శ్రీ మన్నారాయణుడు
శేషతల్ప శయన మూర్తిగా
దర్శనమిస్తాడు.
ప్రకృతి ప్రళయాల వలన,
దుష్టశక్తులవలన,దేవతామూర్తులకు ఎట్టి ఛేదము జరుగకుండా,
యీ విగ్రహాల పరిరక్షణకు
నాగులను ఏర్పాటు చేసేది ఆదిశేషువు.
అష్టసర్పాల నాయకులకు
అధిపతి ఆదిశేషువు,
మహాభారతం లో శ్రీ కృష్ణుడు రధసారధ్యం వహించిన అర్జునుని రధం కూడా ఆదిశేషువే, ఆదిశేషుని, అపరమితమైన శక్తిని
'అయస్కాంత' శక్తి అంటారు.
భూలోకానికి, సూర్యుని తో అనుసంధానం చేసి నడిపించేది యీ అయస్కాంత శక్తి. లేక భూమ్యాకర్షణ శక్తి.
ఆదిశేషుని తల తిరుపతి
సప్తగిరులు, దేహం ఆహో బిలం, తోక శ్రీ శైలమని అంటారు.
శ్రీ వైష్ణవమతాన్ని, స్ధాపించిన
శ్రీ రామానుజాచార్యులవారు సాక్షాత్తు ఆదిశేషుని అవతారమని శ్రీవైష్ణవులంతా ఆయనను భక్తిశ్రధ్ధలతో ఆరాధిస్తారు..🙏🙏
No comments:
Post a Comment