Saturday, March 11, 2023

How To Do Sri Chakra Pooja In House


 *గృహంతర్గత శ్రీ చక్ర పూజ ...!!🙏🌹*


శ్రీ చక్రం అనేది విశ్వానికి ప్రతి రూపం,

అందులో ఉన్నది విశ్వవ్యాప్త భావనలు,

శ్రీ చక్రం పూజ అంటే విశ్వాన్ని తనలో నింపుకున్న అమ్మవారిని పూజ చేయడం, వేరు వేరు శక్తులలో కూడా బాసిస్తున్న అమ్మవారిని పూజ చేయడం, .

ఈ పూజను మనము మూడు రకాలుగా చెప్పచ్చు .


1.ప్రతిష్ఠ చేసి పూజించే విధానం, అంటే శ్రీశైల భ్రమరాంబిక దేవి ఎదుట ఉన్న విధంగా


2.మహమేరువు, అర్ధ మెరువు, కూర్మవృస్టమ్, భూప్రస్తారం అనే పేర్లతో, దోరికేటివి ఇంట్లో అర్చించు కోవడం..

అయితే శ్రీ చక్ర పూజ సుదీర్ఘమైనది అందులోని ప్రతి దేవతని నమస్కరించడం ,తర్పణం చేయడం తర్వాత పూజించడం అనేది విధిగా పాటించాలి..

ఉదాహరణకు హృదయ దేవి తర్పయామి ఆలాగన్నమాట, దీన్నే సమగ్రంగా "నవావరణ" అర్చన అంటారు. తొమ్మిది ఆవరణలలోని దేవతలను అర్చన చేయడం ఇది సుదీర్ఘమైనది ఇందులో కొన్ని మంత్రాల ఉపదేశము, ఆచరణ,అందులో సిద్ధి ఉన్న వారు మాత్రమే ఆచరిస్తారు..


౩. ఇక మూడో విధానం విశ్వమంతా వ్యాపించిన అమ్మవారిని ప్రక్రుతి స్వరూపిణి అయిన జగన్మాతను శ్రీ చక్రంలో భావించడం,

ఇది పూజ గదిలోని మిగతా విగ్రహాలతో సమానంగా భావించి చేసే పూజ, ఇందులో నవావరణ పూజ లాగా మంత్రాలు ఉండవు, నియమాలు కూడా తక్కువగా ఉంటాయి..

అయితే నియమాలు అన్నవి మన నిగ్రహం కోసం కానీ విగ్రహం కోసం కాదు కాబట్టి నియమాలను ఎంత విధిగా పాటిస్తే అంత మంచిదని గుర్తించాలి నియమ నిష్ఠలు ఖచ్చితంగా పాటించే ఉద్దేశం ఉంటేనే శ్రీ చక్రం ఇంట్లో పెట్టుకోవాలి..


ఎందుకంటె శ్రీ చక్రం జగన్మాత రూపం, ఆ తల్లికి నాలుగు రూపాలు, స్థూల రుపం అంటే బొమ్మల్లో వేసుకొని చూపించే రూపం, సూక్ష్మ రూపం, సూక్ష్మ తర ,సూక్ష్మ తమ రూపం అని నాలుగు విధాలా రూపాలలో ఆ తల్లి ఉంటుంది..


శ్రీ చక్రం లో అమ్మవారు పరివార దేవతలతో సూక్ష్మ రూపంలో ఉంటుంది , అమ్మవారు సూక్ష్మ రూపం లో ఉండేది యంత్రం లోనే కాబట్టి ,స్థూల రూపం కన్నా సూక్ష్మ రూపానికి మరింత నియమాలు ఉండాలి , నియమాలు అంటే ఏమిటో అనుకోని కంగారు పడకండి ,ఇల్లు శుభ్రము గా ఉంచాలి, స్త్రీ మైలసమయ కాలం, జాతశౌచం,మృతశౌచం లాంటివి ఉన్నపుడు తదనుగుణంగా ఉండాలి, ఉతికిన వస్త్రాలు ధరించాలి, శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే శ్రీచక్రం ఉన్న గదిలోకి వెళ్లి చక్రం ముట్టుకోవాలి, వారానికి ఒక్కసారి అయినా పసుపు నీళ్లు పాలు తో అభిషేకం చేయాలి... కచ్చితంగా రోజు నైవేద్యం పెట్టాలి.. బెల్లం కి నిలువ దోషం లేదు కనుక రోజు బెల్లం ముక్క పెట్టడం మంచిది, వడపప్పు రోజు కొద్దిగా నివేదన చేయగలితే మంచిది, కుదరకపోతే ఏదైనా పండు పెట్టచ్చు కానీ కచ్చితంగా నివేదన చేయాలి.. ఎందుకంటే శ్రీ చక్రం శక్తి కేంద్రం అందులో ఆహుతులను సమర్పించాల్సిన అవసరం ఉంది అందుకే నైవేద్యం రోజు పెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో ను శ్రీచక్రం మురికి చేరకుండా శుభ్రపరచాలి..


ఈ నియమాలను పాటిస్తూ రోజు నిత్యా పూజ శ్రీచక్రం కి ఎలా చేయాలో చూద్దాము........


1.శ్రీ చక్రం వీలైతే అన్నిరోజులు పసుపు నీటితో అభిషేకం చేయండి... అభిషేకం చేస్తున్నపుడు

"శ్రీ మాత్రే నమః" అనే మంత్రం జపిస్తూ చేయఁడి, రోజు కుదరక పోతే వరకు ఒకసారి శుక్రవారం రోజు పౌర్ణమి రోజు చేయచ్చు...


2. శ్రీ చక్రానికి గంధం పసుపు కుంకుమ పుష్పాలు పెట్టి అలకరించండి...

3.మీ గోత్రం నామం చెప్పుకొని యధాశక్తి నిన్ను పూజించు కుంటున్నాము తల్లి అని సంకల్పించుకొని నమస్కారం చేసుకోండి.


4. ధూపము ఇవ్వాలి, సాంబ్రాణి(ఉంటే) ఇవ్వాలి


5. లలితా సహస్రనామం ,లేక లలిత అష్టోత్తరం కానీ, మీ సమయం విలును పట్టి నిర్ణయించుకొని ఆ నామాలు జపిస్తూ కుంకుమతో అర్చన చేయాలి.


6.మీ శక్తి కొలది నైవేద్యం సమర్పించి నివేదన చేసి... హారతి ఇవ్వాలి. శ్రీ సూక్తం తెలిసిన వారు శ్రీసూక్తంతో అభేషేకం చేస్తారు అది తెలియక పోయినా

"శ్రీ మాత్రే నమః" అనుకుంటూ అభేషేకం చేయచ్చు..


అష్టోత్తరం అయ్యాక కూడా మీకు సమయము ఓపిక ఉన్నంత వరకు శ్రీమాత్రే నమః అనుకుంటూ ఎంత సేపైన కుంకుమ పూజ చేసుకొని హారతి ఇవ్వొచ్చు... ఏదైనా పని ఉంది బయటకు వెళ్లి వస్తే మాత్రం ఆ వస్త్రాలు మార్చకుండా శ్రీ చక్ర పూజ చేయకూడదు పూజ వరకు ఒక రెండు జతలు విడిగా ఉంచుకోవడం మంచిది....

అమ్మవారిని విగ్రహము లేదా చిత్రపటము రూపంలో పూజించడం అంటే రాతిని ముట్టుకున్నట్టు అయితే

అదే అమ్మవారిని శ్రీ యంత్రం లో పూజించడం కరెంట్ ని ముట్టుకోవడం తో సమానం...

షాక్ కొట్టకుండా ఉండాలి అంటే భక్తి అనే రక్షణ కవచం, నమ్మకం అనే వివేకం ఉండాలి అప్పుడు

ఆ విద్యుత్ కాంతి తరంగాలు మీ చుట్టూ రక్షణ కవచం అవుతుంది...


ఓం శ్రీమాత్రే నమః🙏🌹

No comments:

Post a Comment