*🔔శఠగోపం మహిమ🔔*
శ్రీవైష్ణవాలయాల దర్శనానికి వెళ్ళినప్పుడు అర్చకస్వాములు తీర్ధం, తులసీ ప్రసాదంగా యిచ్చి అందరి శిరస్సులపై మహావిష్ణువు పాదుక ముద్రలుండే శఠగోపాన్ని పెట్టి ఆశీర్వదిస్తారు.
ముకుళిత సస్తాలతో , శిరస్సు వంచి ఆ శఠగోపాన్ని భక్తితో
శిరస్సు పై పెట్టించుకోవాలి,
మన తలవ్రాతలని మార్చే శక్తి శఠగోపానికి వున్నది.
మహావిష్ణువు చరణాలను ఆశ్రయించి శరణు వేడుకుంటున్నాము అంటే మన శిరస్సును
ఆయన పాదలపై పెడుతున్నాము అని అర్ధం...
ప్రత్యక్షంగా శ్రీ మహావిష్ణువు పాదాలపై తలపెట్టే మహాద్భాగ్యం ఏ పుణ్యపురుషులకో తప్ప అందరికీ లభించదు.
కాని భగవంతుని పాదుకల ముద్రలను శఠగోప రూపంలో పెట్టించుకొని నందువలన మహావిష్ణువు పాదాలే మన శిరస్సుకి తగిలి
పాప విముక్తు లవుతున్నామనే పవిత్ర భావన, తృప్తి కలుగుతుంది.
స్వామి వేదాంత దేశికర్ " పాదుకా సహస్రం"
అనే అద్భుతమైన గ్రంధం రచించారు.
శ్రీ రంగనాధుని పవిత్ర చరణాల మహిమలను తెలిపే గ్రంథం యిది.
వేదాంతదేశికర్ కి
" కవి తార్కిక కేసరి"
అనే బిరుదును లభింప చేసినది యీ గ్రంధం.
ఒకే రాత్రిలో వ్రాసిన యీ అద్భుత గ్రంధంలో శ్రీ పాదుకల మహిమలే కాకుండా శ్రీవైష్ణవమత ఔన్నత్యం కూడా వివరంగా వర్ణించబడింది.
పాదుకలు భగవంతుని చరణాలను ధరించినవి...
అటువంటి పాదుకలను మనము శిరస్సున ధరిస్తున్నాము.
శ్రీ వైష్ణవులు తమ నుదుటిన ధరించే భస్మ నామము
యీ పాదుకల చిహ్నం.
శరణాగతి మార్గమైన ప్రపత్తి మార్గాన్ని నమ్మాళ్వారు ప్రతిపాదించారు.
" వేరుదారిలేని నేను నీపాదాలనే నమ్ముతున్నాను." అన్నదే ఆయన తెలిపిన మార్గం.
వేదాల సారం తిరువాయ్మొళి అనే గ్రంధం ద్వారా
అనుగ్రహించారు నమ్మాళ్వారు.
శ్రీ రంగనాధుని దివ్య పాదుకలుగా అవతరించారు నమ్మాళ్వారు.
తిరిగి ఆ పాదుకలే శ్రీ రామానుజాచార్యులుగా అవతరించాయి.
ఈ వివరాలన్ని స్వామి
మణవాళ మాముని గ్రంధంలో వ్రాశారు.
శరణాగతి సులభమైన ఉన్నత మార్గమని వ్రాశారు. శరణుకోరేవారికి భగవంతుని చరణాలాశ్రయించడం సులభ మార్గం.
శ్రీ రంగనాధుని పాదుకలను ఏ భక్తుడైతే శఠగోపం రూపాన శిరస్సున ధరిస్తాడో ఆభక్తుని విధివ్రాత తప్పక మారుతుంది.
పాదుకా సహస్రం గ్రంధంలోని ఒక శ్లోకం లోశ్రీ దేశికన్
గురువుకి , శిష్యునికి గల సంబంధాన్ని పాదుకలతో పోల్చి స్తుతించారు.
శ్రీ రాముని పాదుకలు శ్రీ రాముని పాదస్పర్శ
పొందినవి.
శ్రీ రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆ పాదుకలే 14 సంవత్సరాలు అయోధ్యా రాజ్యాన్ని పాలించాయి.
అటువంటి పాదుకలవలె శిష్యుడు వినమ్రుడై గురువును అంటిపెట్టుకు వున్నట్లైతే గురువు ఆశీర్వాద బలం వలన ప్రపంచాన్నే జయించగలడు.
శ్రీ వేదాంతదేశికన్ ఆశువుగా శఠగోపం యొక్క పలు
మహిమలను కల్పనాచాతుర్యంతో తార్కిక తత్వార్ధములతోను వర్ణిస్తూ వేయి పాదుకా స్తోత్రాలతో స్తుతించారు.🙏🙏🙏
No comments:
Post a Comment