Wednesday, March 1, 2023

Importance of 108

 అష్టోత్తర శతం


108. ఏమిటి ఈ సంఖ్య?  ఏదైనా మంత్రం చదివితే, 108 సార్లు అంటారు. ప్రదక్షిణాలు చేసినా, 108 సార్లు చేస్తే మంచిదంటారు. ఇది చాదస్తమా?  సాంప్రదాయమా? లేక,  ఈ అంకె వెనక ఏదైనా మిస్టరీ ఉందా? భారతీయుల అద్భుత గణిత పరిజ్ఞానానికి బ్రాండ్ నెంబర్ 108. అవును. దిమ్మతిరిగే  పరిశోధనలను భారతీయులు వేల ఏళ్ళ క్రితమే ఎలా చేశారు? అని చెప్పడానికి ప్రపంచానికి ఇచ్చిన ఎన్క్రిప్టెడ్ కోడ్  108.  ఆలయంలో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి? అంటే, చదువు రానివారు కూడా 108 చేస్తే మంచిది అంటారు. రుద్రాక్ష తులసి, ఇలా ఏ మాల తీసుకున్నా,, 108 పూసలు ఉన్నాయా? అని గుచ్చి గుచ్చి మరీ అడుగుతాం. "ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి, మంచిది" అంటాడు పురోహితుడు. ఏమిటి ఈ  108? కొందరు దేవుడిని నమ్ముతారు. కొందరు నమ్మరు కూడా . కానీ, అందరూ నమ్మేది సైన్స్. కనుకే, అందరూ నమ్మే పరిశోధనలు చేశారు, భారతీయు ఋషులు. అవి అలాంటి ఇలాంటి పరిశోధనలు కాదు, అందుకు సరైన ఉదాహరణ ఈ 108. ఈ 108 వెనుక అంతరిక్ష శాస్త్రమే దాగుంది. ఈ భూమి ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఖగోళం అనే వృత్తంలో సూర్యుడు, సూర్యుడు చుట్టూ ఎంత దూరంలో తిరుగుతున్నాడు? వీటన్నిటికీ సమాధానం 108..


 వేదకాలంలో ఎన్నో అద్భుత పరిశోధనలు జరిగాయి వాటిలో అంతరిక్ష శాస్త్రం కూడా ఒకటి. సూర్యుడికి భూమికి, చంద్రుడికి భూమికి మధ్య దూరాలు ఓ రెండు మూడు వందల ఏళ్ళ క్రితమే కనుక్కున్నారని పుస్తకాల్లో చదివాం. కానీ, వేదాల్లో ఈ డిస్టెన్స్ లు ఎప్పుడో చెప్పేసారు. ఎలా అంటే, 108 తో.. భూమికి, చంద్రుడికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు. భూమికి సూర్యునికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లు. సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు. ఏంటి? ఆశ్చర్యంగా ఉందా? అవును. మనం నివసించే భూమి, మన భూమికి ప్రాణాన్నిచ్చే సూర్యుడు, భూమి ఆకర్షణను బ్యాలెన్స్ చేసే చంద్రుడు, అన్నిటి లెక్కలు ,అన్నిటి దూరాలు ఈ 108తో లింకప్  అయి ఉన్నాయి. ప్యూర్ ఎస్ట్రనామికల్ సైన్స్. ఊహించారా?  108 వెనక ఇంతకథ ఉందని.. ఇవన్నీ కాకి లెక్కలు కావు. ఆధునిక సైన్స్ పెద్దపెద్ద కంప్యూటర్లతో, మిషన్లతో, శాటిలైట్లతో కనిపెట్టిన గ్రహాల దూరాలకి వేద కాలంలో భారతీయ ఋషులు 108 కోడ్ తో చెప్పిన ఈ డిస్టెన్స్ కి కరెక్ట్ గా సరిపోయాయి. మరి ఎవరు గొప్ప? ఇక్కడితో ఆగిపోతే మనం భారతీయులం ఎలా అవుతాం? మన జీన్స్ లోనే ఫిలాసఫీ ఉంది.  సైన్స్ ఉంది. 


ఆయుర్వేదం అందరికీ తెలిసిన వైద్యగ్రంథం. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో 107+1 మర్మ స్థానాలు ఉంటాయి. ఈ మర్మస్థానాలే మన శరీరంలో అన్ని భాగాలకు ప్రాణాన్ని సరఫరా చేస్తే శక్తి ఉత్పత్తి కేంద్రాలు.


 మర్మకళ అని ప్రాచీన కేరళ వద్ద కళ ఒకటి ఉంది. వాళ్లు మన మర్మాల మీద దాడి చేసి ఆ పార్టులు పనిచేయకుండా చేయగలరు.


 శ్రీ చక్రం వినడం వినడమే కానీ, శ్రీ చక్రం అంతరార్థం ఏంటో చాలామందికి తెలియదు. సృష్టి రహస్యానికి బ్లూ ప్రింట్ అది., శ్రీ చక్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. మొత్తం 108. పాజిటివ్ నెగిటివ్ కలిస్తే ఎనర్జీ. శక్తిని ఉత్పత్తి చేసే ప్రాచీన యంత్రం,అది. .శ్రీ చక్రం ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీలను పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుందని విశ్వాసం.


 జ్యోతిష్య శాస్త్రం కొంతమందివల్ల అది మూఢనమ్మకమనే మచ్చ పడింది. కానీ, జ్యోతిష్యం అంటే కంప్లీట్ సైన్స్. కంప్లీట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. దీనికి 108కి సంబంధమేంటి? అంటే, మనిషిలోని బిహేవియర్లకు సూచికలు. ప్రతి మనిషిలోనూ వారి వారి ప్రవర్తనలకు సూచికలు 27 నక్షత్రాలు. మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రం, ఏ గ్రహం, ఈ భూమి మీద ప్రభావం చూపిస్తాయో, వాటి ప్రవర్తనలే మన జాతకాల మీద, మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. అశ్విని, భరణి 27 నక్షత్రాలు. ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు 27 నక్షత్రాన్ని ఈ నాలుగు పాదాలతో గుణిస్తే, అక్కడ 108 వస్తుంది. ఇందులో 9 పాదాలు ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అలా రాశులు మళ్ళీ 12 ఉంటాయి.


 ఆధునిక మానసిక తత్వశాస్త్రం కూడా మనిషిలో ముఖ్యమైన బిహేవియర్లు 108 ఉంటాయని చెబుతోంది.


 మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనిషి సగటున ప్రతి రోజు 21,600 సార్లు శ్వాస తీస్తాడు. అందులో పదివేల ఎనిమిది వందల సూర్యాంశ, అంటే ప్రాణశక్తి. పదివేల ఎనిమిది వందల సార్లు చంద్రాంశ. అంటే, మనం వదిలే కార్బన్డయాక్సైడ్ అనుకోవచ్చు. ఆక్సిజన్ పీల్చుకొని, కార్బన్డయాక్సైడ్ ని వదలడం అన్నమాట. పదివేల ఎనిమిది వందలని అంటే 108 వందలే కదా.


 భరతుని నాట్య శాస్త్రంలో చేతులు, కాళ్లు కలిపి చేసే నాట్య భంగిమలు 108 ఉంటాయి. ఈ ఒక్కో భంగిమ ఒక్కో సంకేతాన్ని చెప్తూ ఉంటుంది. నటరాజస్వామి చేసే నాట్య భంగిమలు కూడా 108.


 మన ఉపనిషత్తుల సంఖ్య 1080. మన ఇంట్లో, ఆలయాల్లో అష్టోత్తర శతనామావళి అంటాం. అంటే, 108 నామాలను జపించాలని.


  ఇలా, మన శాస్త్రాలన్నీ మొత్తం 108తో ముడిపడి ఉన్నాయి. అందుకే, ఆ నెంబర్ కి మన ప్రాచీన ఋషులు అంత ప్రాధాన్యతనిచ్చారు.

No comments:

Post a Comment