*ఈ ముగ్గురికీ ఏ జ్ఞానం సోకదు అని గీతలో భగవంతుడు చెబుతున్నాడు...!!*
_ఇంతకూ ఎవరు వాళ్ళు? ఒకసారి చూద్దాం...!!_
||అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి
నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః||(4.40)
అర్థం: జ్ఞానం లేనివాడు,
శ్రద్ధ లేనివాడు,
ఎప్పుడూ సందే హించేవాడు,
ఇలాంటి వాళ్ళు పాడైపోతారు.
_ఇలాంటి వాళ్ళకు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలో కూడా సుఖం ఉండదు_.
విశ్లేషణ: ఆత్మ జ్ఞానం లేనివాడు అజ్ఞాని.
ఇటువంటి అజ్ఞానులు ఎంతగానో పాడైపోతున్నారు.
ఎలా?...
వీళ్ళ మనసు బయటి విషయాల కోసం పరుగులు తీస్తూ ఉంటుంది.
వీళ్ళ మనసు కామంతో, కోపంతో ఊగిపోతూ
ఉంటుంది.
అందువల్ల వీళ్ళు చెయ్యరాని పనులు చేస్తూ
పాడైపొతున్నారు.
ఇక శ్రద్ధ లేనివాళ్ళు కూడా పాడైపోతున్నారు.
వీళ్ళు గురువు చెప్పే మాటల పైన, గురువు బోధించే
ఆత్మ విద్య పైన నమ్మకం లేక చెయ్యరాని పనులు చేస్తూ
పాడైపొతున్నారు.
ఇక ఎప్పుడూ సందేహించే వాడు(ప్రతీ దానికీ డౌట్ పడేవాడు) ఏ పనీ చేయకుండా సోమరిపోతుగా ఉంటూ చెడిపోతున్నాడు.
ఇలాంటి వాళ్ళకు ఇక్కడే కాదు,ఎక్కడికివెళ్ళినా
సుఖం, మనశ్శాంతి అనేవి ఉండవు..
_కాబట్టి_ అజ్ఞానం,అశ్రద్ధ,సందేహిస్తూ ఉండడం అనే ఈ
మూడూ మనల్ని బాగా దెబ్బతీస్తాయి అని గుర్తు పెట్టుకోవాలి... వీటిని వదిలేయాలి....
అజ్ఞానం అంటే తెలియని తనం.
మన అసలైన రూపాన్ని తెలియని స్థితినే అజ్ఞానం అనిఅంటారు.
మనలో అజ్ఞానం ఉన్నంత వరకూ మనకు సందేహాలు వస్తూనే ఉంటాయి.
మనలో ఉన్న సందేహాలు ఒక్క ఆత్మ జ్ఞానం తో తప్ప ఇంక దేనితో కూడా పోవు...
No comments:
Post a Comment