*శ్రీ శివాపరాధక్షమాపణస్తోత్రం అథవా - శివాపరాధభంజనస్తోత్రం*
శ్లోకము:
నగ్నో నిఃసంగశుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాంధకారో
నాసాగ్రే న్యస్తదృష్టిర్విదితభవగుణో నైవ దృష్టః కదాచిత్ ।
ఉన్మన్యాఽవస్థయా త్వాం విగతకలిమలం శంకరం న స్మరామి
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 11 11
పదవిభజన:
నగ్నో నిః సంగ శుద్ధః త్రిగుణ విరహితో ధ్వస్త మోహ అంధకారో
నాస అగ్రే న్యస్త దృష్టిః విదిత భవ గుణో నైవ దృష్టః కదాచిత్ ।
ఉన్మన్య అవస్థయా త్వాం విగత కలిమలం శంకరం న స్మరామి
క్షంతవ్యో మే అపరాధః శివ శివ శివభో శ్రీమహాదేవ శంభో 11 11 11
భావము:
ఓ! పరమ శివా!
దేహ అభిమానము త్యజించి దిగంబరముగా
సంసార బంధ ముక్తుడనై
చెడు ఆలోచనలు విడనాడి నిర్మల మనస్సుతో
సత్వ రజస్ తమో గుణములకు అతీత స్థితి సాధించి,
మనసులోని మోహమును చీకటిని అంతము చేసి,
నీ ధ్యాన యోగాసనములో కూర్చొని
దృష్టిని ముక్కు చివర స్థిరముగా కేంద్రీకరించి,
నీ పరమ కారుణ్య గుణములను ఏమాత్రమైనా ఎన్నిక చేసి,
పాపరహితమైన నీ కల్యాణ స్వరూపము స్మరించి
నీ దర్శనము కోరుకో లేదు.
కావున ఓ! శంకరా! శివా! శివా! పరమేశ్వరా! మహాదేవా!
ఇపుడు నా అపరాధమును క్షమించు,
No comments:
Post a Comment