Wednesday, March 1, 2023

Pithapuram

Pithapuram

 *పిఠాపురం....*


             *శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం!*

                 

*పిఠాపురాన్ని ఒకప్పుడు పీఠికాపురమని పిలిచేవారు.*


*దేశంలోని త్రిగయల్లో పిఠాపురంలోని 'పాదగయ క్షేత్రం' ఒకటి.*


*ఇక్కడే కుక్కుటేశ్వరస్వామి ఆలయం కూడా ఉంది. గయాసురుడునే రాక్షసుడ్ని సంహరించడానికి శివుడు కోడిరూపం ధరించడంతో స్వామికి కుక్కుటేశ్వరుడనే పేరు వచ్చింది.*


*ఆదిశంకరాచార్యుడు ప్రతిష్టించిన రాజరాజేశ్వరీ దేవి ఆలయం కూడా ఇక్కడే ఉంది. పిఠాపురం సుప్రసిద్ధ దత్తక్షేత్రం.*


*దత్తాత్రేయుని తొలి అవతారమైన 'శ్రీపాదవల్లభుడు' తిరిగిన ప్రాంతం ఇది. కుక్కుటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో వున్న ఔదంబర వృక్షం (మేడిచెట్టు) మహిమాన్వితమైనదని చెప్పారు. చెట్టు మొదలులో ఉన్న పాదుకలు శ్రీపాదవల్లభునివని భక్తుల ప్రగాఢ నమ్మకం.*


*శ్రీపాదవల్లభుని వృత్తాంతం :*


 *పూర్వం పిఠాపురంలో సుమతి, అప్పరాజు శర్మ అనే దంపతులు ఉండేవారు. వారు దత్తుడి భక్తులు. పిఠాపురంలో స్వయంభువుగా వేసిన దత్తుడు వారి ఇంటికెళ్ళి నిత్యం బిక్ష స్వీకరించేవాడు. ఓ సందర్భంలో సుమతి కోరికను మన్నించి దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాదవల్లభుడి రూపం కళ్ళకు కట్టినట్లు చూపించాడు. కంటే ఇలాంటి బిడ్డను కనాలి అనుకుంది ఆ ఇల్లాలు.*


*ఆ కోరికను మన్నించి సుమతమ్మ గర్భంలో జన్నించాడు దత్తుడు. భరద్వాజ మహర్షి ఇక్కడొక యజ్ఞాన్ని చేస్తాడు.*


*ఆ ఫలాన్ని దత్తాత్రేయుడికిస్తూ 'ఇక్కడ జన్మించి ఈ నేలను చరితార్థం చేయగలవా?' అని వేడుకున్నాడు. అలా మహర్షి కోరిక మరియు పుణ్య కోరిక తీర్చడానికి శ్రీపాదవల్లభుడిగా పిఠాపురంలో జన్మిస్తాడు.*


*ఆరో ఏట ఉపనయనం అయిన పిమ్మట చతుర్వేదాలను గడగడ అప్పజెప్పాడు. పదహారో ఏట తన అవతార లక్ష్యాన్ని తల్లికి వివరించి సన్యాస దీక్ష స్వీకరించాడు. దత్తధర్మ ప్రచారానికి వెంటనే బయలుదేరాడు. అట్నుంచి అనేక ప్రాంతాలు సంచరించి మహబూబ్‌నగర్ జిల్లా కురుపురానికి చేరుకొని భక్తకోటికి అనేక మహిమలు చూపాడు.*


*శ్రీపాద వల్లభుడితో పాటు శ్రీ నరసింహ సరస్వతి స్వామి (మహారాష్ట్ర), శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్‌ (గుల్బర్గా), అక్కల్‌కోట మహారాజ్‌ (అక్కన) దత్తుని అవతారామని చెబుతారు.*


*దత్తాత్రేయ జననం :*


*అత్రి మహర్షి అనసూయాదేవి ఆదర్శ దంపతులు. ముల్లోకాలలోనూ ప్రసిద్ధికెక్కారు. ఒకసారి లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ దేవి అనసూయను పరీక్షించటానికి త్రిమూర్తులను భిక్షువుల రూపంలో భూలోకానికి పంపారు.* 


*ఆ అతిధులను సాదరంగా ఆహ్వానించింది అనసూయా దేవి. అప్పుడు వారు 'దేవీ నువ్వు వివస్త్రగా మారి మాకు వడ్డన చేయాలి!' అన్న షరతు విధించారు.* 


*అనసూయాదేవి ఆ ముగ్గురినీ పసిపిల్లలుగా చేసి గోము చేసి గోరుముద్దలు తినిపిస్తుంది. జోలపాడి నిద్రపుచ్చుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పసిసిల్లలై పోవటంతో నారదుడి సలహాప్రకారం లక్ష్మీ,సరస్వతీ, పార్వతీదేవి ముగ్గురూ అనసూయాదేవిని క్షమాపణ అడిగారు.* 


*దీంతో త్రిమూర్తులకు ఇదివరకటి రూపాలు వస్తాయి. అనసూయా దేవి భక్తికి మెచ్చి తమ అంశతో ఒక బిడ్డను ప్రసాదిస్తారు.. మార్గశిర పౌర్ణమినాడు దత్తాద్రేయుడు అనసూయా దేవి గర్భాన జన్మిస్తాడు. *


*ఎలా వెళ్ళాలి :*


పిఠాపురానికి, సామర్లకోట వరకూ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో చేరుకుని అక్కనుండి పదికిలోమీటర్ల దూరం ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. 

లేదంటే కాకినాడకు వెళ్ళి 20 కి.మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వెళ్ళవచ్చు ...🙏

No comments:

Post a Comment