Monday, January 16, 2017

ఆరోగ్య సూత్రాలు :

🍐అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

🌿కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

🍒నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

🍑గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

🍇అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.

🍏జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

🍷బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

🍪సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

🍋మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

🍓దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

🍲ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

🍍అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

🍈కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

🍃మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

🍒ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.

🍠బీట్ రూట్ రసం లో బీపీ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

🍉క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

🌽మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

🍅ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

🍑అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
🍐పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

🍊సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

🍜దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

🍲ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

🐬🐟చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

🍊కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

🍉క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

🍎యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

🍵వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

🍏పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.

🍇ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

🍒ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.

🍏జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

🍎ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

🍒నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

🍑మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.


🌾మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
😆భార్యలకు మాత్రమే 😌
(హాస్యానికి మాత్రమే )

1) శ్రీవారికి తలనొప్పిగా వుంటే మీరు మౌనం వహిస్తే చాలు, ఆయనే కోలుకుంటాడు అమృతాంజనం అక్కర్లేదు 🤒

2) ఉదయం లేవగానే ఆయన కాళ్ళకు నమస్కరించకున్నా పర్లేదు, అతన్ని బెడ్ కాఫీ అడక్కుండా ఉంటే చాలు. 😜

3) వారానికి కనీసం 4సార్లు ఆయనకు భోజనం స్వయంగా వడ్డించండి. ఆ అల్ప సంతోషి ఆనందిస్తాడు 😂

4) మిగిలిన ఆహారం పనిమనిషికో, కుక్కకో వేసే ముందు, ఆయన తిన్నాడో లేదో చూడండి.అమాయకపు పక్షి మొహమాటం ఎక్కువ.😉

5) నలుగురిలో,ముఖ్యంగా ఆయనను మీ అత్త మామలను (మీ పుణ్యాన వాళ్ళు జీవించి వుంటే) చులకన చేయకండి.😵

6) మీ కన్నవారింటిలో పొరపాటున మీ అయన ఉండవలసి వచ్చినప్పుడు. అతనికి మీరు సేవ చేస్తున్నట్లు నటించండి. అలవాటుప్రకారం అదేశించవద్దు.😟

7) నెల మొదటి వారంలోనే కాక, అన్నిరోజులూ ఆయనను ప్రేమగా చూడండి, పిచ్చి మారాజు అన్ని ఆదాయాలు మీ చేతిలోనే పోస్తాడుగా.😊

8) అలిగి పుట్టింటికి వెళ్తానని ఉత్తుత్తినే ఆయన్ను బెదిరించకండి, కొన్నిసార్లైనా మాట నిలబెట్టుకోండి .😀

9) వరాలక్ష్మీవ్రతం, అక్షయ తృతీయ వంటి సందర్భాలలో మీ ఆయనకి కూడా ఒక గుడ్డముక్క తీయండి.సంబరపడిపోతాడు😅.

11) మీ బంగారు నగల్ని తరచూ మారుస్తూ మీ శ్రీవారిని ఏమార్చవద్దు.మీ అయన మనసే బంగారమని నమ్మండి . 😍

12) మీవారు వేరే అమ్మాయిని చూస్తే, కుళ్ళు కోకుండా ఆమెలో మీ వారికి నచ్చిన అంశాలు మీరు అలవర్చుకోండి .😘

13) దిక్కుమాలిన టీవీ సీరియళ్ళు చూడడం మాని, సరదాగా మీ వారికొక ప్రేమలేఖ వ్రాయండి అందులో ఆయనలో మీకు నచ్చిన అంశాలు వ్రాయండి - కవితలు వద్దు అర్భకుడు తట్టుకోలేడు....😢

- ఇంకా వున్నాయి ప్రస్తుతానికివి పాటించి మీ శ్రీవారి మనసు దోచుకోండి.. పర్సును కాదు. ....😜😫😖😷😇😩😅😴


గృహిణులూ మన్నించండి.. 🙏
పిల్లల పట్ల మీరు చూపే ప్రేమాభిమానాలు విలువైనవి... అమూల్యమైనవి... వెలకట్టలేనివి ... కాకపోతే ఈ ప్రేమలో పడి చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద పొరపాటు... ''నేను పడే కష్టం, శ్రమ నా బిడ్డ పడకూడదు'' ఇదీ అమ్మానాన్నల నిష్పక్షపాతమైన... కల్మషం లేని... పవిత్ర ప్రేమకు చిహ్నం. కాని పిల్లల్ని ఎంతో అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు ఒక విషయం మర్చిపోతున్నారు...
   మీరు కష్టాలు, శ్రమలు పడ్డారు కాబట్టే ఇంత పైకి వచ్చి బాధ్యతగా ఉంటున్నారు. అదే మీ పిల్లల విషయంలో మీరు కఠినంగా ఉండకుండా సున్నితంగా వారికి లోకం తెలియకుండా పెంచితే మాత్రం మీరు, మీ పిల్లలు, వారితో వున్న ప్రతీ ఒక్కరు మూల్యం చెల్లించాల్సి వుంటుంది. కష్టమేమిటో ఎరగని వారికి సుఖం విలువ తెలియదు. నష్టమేమిటో ఎరుగని వారికి లాభం విలువ తెలియదు.
కాలమేమిటో తెలియని వారికి జీవితం విలువ తెలియదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి... ''అతి ప్రేమ, అతి గారాబం, అతి అలుసు అనేది అస్సలు మంచిది కాదు''. పిల్లలకు ఏ లోటూ రాకుండా పెంచాలనే భావనతో చాలామంది వారి పిల్లల్ని మరీ సున్నితంగా పెంచుతున్నారు. ఇదే నేడు సమస్యగా మారింది.
మౌనిక ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమె తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. అడిగింది కాదనకుండా ఇంకా ఎక్కువగా ఆమెకు తెచ్చి అందిస్తారు. చిన్నతనం నుండి ఓ మహారాణి అన్న భావనను మౌనికలో పెంచారు. ఉన్నత చదువులు చదివి, పెళ్లయ్యాక భర్త ఆమెను ప్రత్యేకంగా చూడకపోవడంతో గొడవ పడేది. ఇలా పెరగడం వల్లే చివరికి విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇలా మౌనిక ఒక్కటే కాదు.. ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్నచిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
పెంపకంలోని లోపాలే ఇలాంటి వాటికి కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు.

So please teach the value of life and money... 
"శరీర భాగాలు - ఉపయోగాలు"
-------------------
తల - తాకట్టు పెట్టుకోవదానికి
గడ్డం - పట్టుకుని బతిమాలాడడానికి
ముక్కు - పిండి వసూలుచేయడానికి
వీపు - విమానం మోత మోగించడానికి
కాలు - బలపం కట్టుకుతిరగడానికి
కాళ్లు - పట్టుకుని బతిమాలాడడానికి
అరికాలు - దానిమంట తలకెక్కించుకోడానికి
కన్ను - కొట్టడానికి
కళ్ళు - నిప్పులు పోసుకోవడానికి
భుజాలు - గుమ్మడి కాయ దొంగెవరంటే తడుముకోవడానికి
చెంప - చెల్లుమనిపించడానికి
వేలు - ఎత్తి చూడడానికి
చేతులు - జోడించి నమస్కరించడానికి
అరచేయి - వైకుంఠం చూపించడానికి
పొట్ట - తిప్పలకోసం
నడుము - వంచి పనిచేయడానికి
నొసలు - చిట్లించడానికి

టోటల్ గా దేహం - తనువు చాలించటానికి
నేర్చుకోవడం............

సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి. సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది. పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్‌ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.


సోక్రటీస్‌ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్‌ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమికావాలన్నాడు. సోక్రటీస్‌ కిటికీలోంచి చూపించి మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు. జైలర్‌ అయ్యో!దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు. సోక్రటీస్‌ ఆ బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్‌ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాటపాడాడు. సోక్రటీస్‌ ఆ పాట పాడుతూ లైర్‌ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు. సోక్రటీస్‌ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్‌ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్‌ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది. శిష్యులు గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు. కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు. సోక్రటీస్‌ నవ్వి జీవితమంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు. నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది. గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను. ఇంకా నాజీవితంలో గంట సమయముంది. అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముందిఅన్నాడు. శిష్యుల నోట్లో మాట రాలేదు.
ఆరింటికి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.." అనగానే లేచి కూచునేవాళ్ళం. గబగబా దంతధావనం కానిచ్చేసి కాసిన్ని పాలు తాగేసి హోమ్ వర్కేఁవైనా వుంటే కానిచ్చేసి కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికి పుష్పాంజలి మొదలయ్యేది.

సోమవారంనాడు భూకైలాస్, భక్త కన్నప్ప పాటలు, మంగళవారం సూపర్‌మేన్ లో శ్రీ ఆంజనేయా ప్రసన్నాంజనేయా" అన్నపాటో, కలియుగ రావణాసురుడు సినిమాలో నమో నమో హనుమంతా" అన్నపాటో...ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ వుండేది ఏంవినబోతున్నామో!

స్కూలునించి మధ్యాహ్నం భోజనానికి వస్తే ఆకాశవాణి! ఈవార్తలు ఇంతటితో సమాప్తం!" అంటూ కందుకూరి సూర్యనారాయణో, అద్దంకి మన్నారో, పార్వతీ ప్రసాదో..ఎవరో ఒకరు పలకరించేవారు. అన్నాలకి లేవండి! మళ్ళా ఆలస్యఁవైందంటారు!" అని అమ్మ తరుముతోంటే గబగబా తింటూ కార్మికుల కార్యక్రమం వినేవాళ్ళం.

చిన్నక్క, ఏకాంబరం కలిసి కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాలు ప్రసారం చేసేవారు. సరిగ్గా ఒంటిగంటా పదినిమిషాలవ్వగానే పసిడిపంటలు మొదలయ్యేది. అంతే! పరుగోపరుగు. నడిచి స్కూలుకెళ్ళడానికి ఇరవై నిమిషాలు పట్టేది.

ఎప్పుడైనా సెలవురోజు ఇంట్లోవుంటే పసిడిపంటలవ్వగానే ప్రాంతీయ వార్తలు చదివేవారు ప్రయాగ రామకృష్ణ, తిరుమలశెట్టి శ్రీరాములు....వీళ్ళంతా! అవవ్వగానే మనోరంజని! మీరు కోరిన మధురగీతాలు వింటారు!" అని మీనాక్షో, ఏవియస్ రామారావో అనగానే ఇంట్లో అందరం సంబరపడిపోయేవాళ్ళం. ఆ అరగంటా ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచిమంచి పాటలన్నీ వేసేవారు. అవన్నీ చెవులు రిక్కించిమరీ వినేవాళ్ళం.

రెండవ్వగానే ఇంగ్లీషులో వార్తలు..ఢిల్లీనించి ప్రసారమయ్యేవి. ఆ ఇంగ్లీషు వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో, స్పష్టమైన ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో నేర్చుకునేవాళ్ళం.

ఇప్పుడు వాట్సప్పుల్లోను, ఫేస్ బుక్కుల్లోను కనబడే హ్మ్......., లోల్....., ఆర్వోఎఫ్ఫెల్....., కె..కె...(ఓకే ఓకే కొచ్చిన తిప్పలు)..ఇవన్నీ చదువుతోంటే నవ్వు, అసహ్యం, భయం....ఈమూడురకాల భావాలు ఒకేసారి కలుగుతున్నాయి.

నిన్నొకటి చూసాను. డబ్ల్యూ సి' అని రాస్తున్నారు. చాలాచోట్ల చూసాక అడిగితే అది వెల్ కమ్' అని చెప్పారు మా వంశోద్ధారకులు. నా సందేహమేంటంటే వీళ్ళు కొన్నాళ్ళకి వెల్ కమ్ స్పెల్లింగు మర్చిపోతారేమోనని!

సర్సరే! రేడియోలో వున్నాంకదా! ఇక ఆదివారాలు సాయంత్రం నాటికలు, నాటకాలు ప్రసారం చేసేవారు. వి.వి.కనకదుర్గ, నండూరి సుబ్బారావు, ఏబియస్ రామారావు, పాండురంగ విఠల్... వీరందరూ ఎక్కువగా వినబడేవారు. వాళ్ళ గొంతు వింటోంటే మంత్రముగ్ధులమైపోయేవాళ్ళం. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు, ఉచ్చారణలో ఎట్టి పొల్లూలేని ఆ భాష వింటే చాలు మనకి ఎంత ప్రయత్నించినా వక్రభాష రాదు.

ఇప్పుడు మన యాంకర్లు, టీవీ డబ్బింగ్ ఆర్టిస్టులు, దుష్టచతుష్టయపు హీరోలు...వీరందరూ మాట్లాడుతున్న భాష వినికూడా మనం బ్రతికున్నామంటే ఏదో బలమైన కారణం, మనవల్ల ఈ సమాజానికి జరగాల్సిన మంచి వుండివుంటాయి 😜

ఇక రాత్రిపూట చిత్రలహరి, మధురిమ అంటూ పాటలవీ వేస్తుండేవారు. అన్నీ అయ్యాక రాత్రి ఢిల్లీనుంచి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెలువడేది. ఉద్దండులైన కళాకారులందరూ వినిపించే ఆ స్వరవిన్యాసాన్ని ఆలకించిన మాజన్మలు ధన్యం.

రేడియో ఒక ప్రసారసాధనంలానో, పాటలపెట్టెలానో కాకుండా మాకు భాషమీద మంచి పట్టును తెచ్చిపెట్టిన యంత్రంలా మేమందరం ఇప్పటికీ గుర్తుంచుకుంటాం.

ఉండడానికి వేలాది ఛానల్స్ వున్నాయిప్పుడు. పార్టీ ప్రచారాలు, డప్పులు, ర్యాంకుల రాద్ధాంతాలతో కొందరు, ‘జంక్షన్లో నా ఫంక్షన్ పెడితే పిల్లో బోర్ల పడతవె పిల్లో' అన్నపాటకి అత్తాకోడళ్ళు ఇద్దరిచేతా సిగ్గులేని డ్యాన్సులు చేయించే వెధవాయిలు కొందరు...! ఇక సినిమాలైతే ఐనాక్సువాడు పద్దెనిమిదేళ్ళు నిండనివాళ్ళకి చూపించని సినిమాలన్నీ టీవీలో యధేచ్ఛగా చూసెయ్యచ్చు.


గొంగట్లో తింటూ వెంట్రుకలేరుకోడమంటే ఇదేనేమో?!
Om...
Om...
Om...

ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు.
గుడ్డు, పాలు శాకాహారామా? మాంసాహారమా?
ముందుగా మనం శాకాహారం అంటే ఏమిటి? మాంసాహారం అంటే ఏమిటి? అనే విషయం పై పండితులు చెప్పిన వివరణ పరిశీలిద్దాం.
భగవంతుని ప్రేరణ చేత ఈ భూమి పై చరాచర సృష్టి (పుట్టుక) అనేది నాలుగురకాలుగా విభజించి అర్ధంచేసుకోబడింది. వీటిని జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని పిలుస్తారు.
1. జరాయుజములు:- గర్భంలోని పిండమునావరించియుడు మాయవలన పుట్టునవి. మనుష్యులు పశువులు.
2. అండజములు:- గ్రుడ్డు నుండి పుట్టు పక్షులు, పాములు మొదలగునవి.
3. స్వేదజములు:- చెమటవలన పుట్టు దోమలు, నల్లులు మొదలగునవి.
4. ఉద్భిజములు :- విత్తనము పగలదీసి జన్మించు వృక్షలతాదులు
ఇక ఇందులో రెండురకాలు చర సృష్టి’, ’అచర సృష్టి’…. జరాయుజములు, అండజములు, స్వేదజములను చర సృష్టిఅనియు, ఉద్భిజములనుమాత్రం అచరసృష్టి అనియు చర అంటే కదిలేవి. మనుషులు, పశువులు, పక్షులు, పాములు, దోమలు, నల్లులు ఇటువంటివి కదలిక కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా తమ కదలికను తమను తాము కాపాడుకునే పనిలోనూ తమ ఆహారప్రయత్నంలోనూ వాడతాయి. ఇవి రజోగుణ, తమోగుణ స్వభావులు; అందువల్ల ఇవిధరించే శరీరాలను దోషభూయిష్టమైనవిగా, అంతర్గతంగా దుర్గంధాన్ని ఆవరించి యుండేవిగా భావించి వీటిని నీచమనీ’, ’మాంసమనీ’, మాంసాహారమనీ పూర్వీకులు చెప్పారు. ఈ నీచము అనేమాటనుండే నీచు అనే అర్థం మాంసానికి వచ్చింది. ఈ చరసృష్టి అంతా తల కిందకు దించి తమ ఆహారాన్ని స్వీకరించ ప్రయత్నంచేస్తాయి. పశువులు మేతమేసినా, మానవులు ఆహారంతింటున్నా తలను నీచానికి చూస్తారు కాబట్టి నీచం అనే పదం వాడారు కాబట్టి వేరేవిధంగా అర్ధం చేసుకోగూడదు.
ఇకపోతే ఉద్భిజములు విత్తనమునుండి వచ్చేవి. వీటిని ఉచ్చములు అని పిలిచారు. ఇవి వీలైనంతవరకూ సూర్యుడిని అందుకోవడానికి ఆకాశంవైపు సాగుతాయి. ఇవి అత్యధికశాతం సత్వగుణపూరితములు. అందువల్ల వీటిని శాకాహారమనిపిలిచారు.
చరసృష్టిని ఆహారముకొరకు వాడగూడదు అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. ఒక లేడి యొక్క ఒక కాలు మనం కత్తిరిస్తే అది జీవితాంతం కుంటుతుంది. అంతేగానీ వేరొకకాలు మొలిపించుకోలేదు. అలాగే తనకు ఒకచోట బృతిదొరకలేదుగదా అని వేరొకచోటకు వెళ్లగలిగిన రజోగుణం లేడి, మానవుడు, పాము, నల్లి వంటి చరసృష్టికలిగిన జంతువులలో ఉంటుంది.
కానీ అచరసృష్టి దీనికి భిన్నం. ఒక చెట్టుయొక్క ఒక కొమ్మని నరికితే అది వేరొక కొమ్మను మళ్లీ మొలిపించుకుంటుంది. చెట్టు తన ఆకులను సమృద్ధిగా రాల్చేస్తుంది. చెట్టు తన పండ్లను రాల్చేస్తుంది. అలాగే వరి వంటి మొక్కల ధాన్యాన్ని మనం ఆ మొక్క ప్రకృతిసిద్ధంగా చనిపోయిన తర్వాతే పంటను కోసి విత్తనాలను ఇంటికి తెచ్చుకుంటాము. ఈ అచరసృష్టి తమకు ఒకచోట ఆహారం దొరకలేదుగదా అని వేరొకచోటికి కదలవు వీటిలో సత్వగుణం (సత్వం సుఖే సంజయతి). అందువల్ల అరటి, మామిడి, గోధుమలు, యవలు, తిలలు, వంటి వాటిని భుజిస్తే సత్వగుణవృద్ధి జరిగి ఆలోచనలో క్రూరత్వం నశించి మనిషి ఆరోగ్యపూరితమైన జీవనాన్ని సాగిస్తాడు కాబట్టి శాకాహారము (అచర చేతనా సృష్టి) ని భుజించి మానవుడు సుఖించి కైవల్యాన్ని పొందవచ్చని సాధనాగ్రంధములలో ఋషులు బోధించారు.
ఇకపోతే ఈ శాకాహార మాంసాహారచర్చ అనేది జరాయుజములలోనే సాధ్యం! మానవులు మావినుండి పుడతారు. తల్లి పాలు తాగి పెరుగుతారు. అలాగే తోటి జరాయుజములైన ఆవులు, లేడులు, గుర్రముల వంటి వాటి పాలు వీరు తాగవచ్చు అని చెప్పారు. ఈ పాలు అనేవి తమ బిడ్డతాగేదానికంటే రెండింతల ఎక్కువగానే జరాయుజములు ఉత్పత్తిచేస్తాయి. కాబట్టి దూడ తాగిన తర్వాత మిగిలిన పాలను ఈ జరాయుజములు సహజంగానే విసర్జించేస్తాయి. అంటే మీరు పితకకపోతే ఎక్కువైనపాలను ఏ చెట్టుకో పొదుగును అదిమిపెట్టి కార్చేస్తాయి. కాబట్టి ఇలాంటి పాలు సేకరించడంవల్ల జరాయుజముల ప్రాణనష్టాన్ని కలిగించడం జరగడంలేదు! కాబట్టి పాలు ఖచ్చితంగా శాకాహారమే! అయితే దీనికి ఒక నియమం చెప్పారు. ఉద్భిజములనుతిని బ్రతికే జరాయుజములపాలుమాత్రమే శాకాహారం అంటే గడ్డితిని పాలిచ్చే ఆవుపాలు శాకాహారం. కానీ మిగిలినవాటిని తిని పాలిచ్చే జరాయుజముల పాలు మాంసాహారం అంటే ఆవును తిని పాలిచ్చే పులిపాలు మాంసాహారమే!. మానవులు స్వతస్సిద్ధంగా ఉద్భిజములనుతిని బ్రతికే జరాయుజములు’.
గుడ్డు అనేది ఖచ్చితంగా మాంసాహారమే! Sterile Egg అనేదాన్ని కొన్ని రసాయనాలనుపయోగించి పెరగకుండా దానిలోని జీవాన్ని మాతృగర్భంలో ఉండగానే చంపేస్తారు. అందుకే అది పుట్టిన తర్వాతగూడా పెరగకుండా గుడ్డులాగా మిగిలిపోతుంది. ఆ గుడ్డులోనుండి పిల్ల బైటికిరాకుండా రసాయనాలువాడి, పైగా పిల్లరాదుగదా అది శాకాహారమే అని చెప్పడం అర్ధంలేని వాదం.
కాబట్టి సూక్షంగా ఏది కదులుతుందో, ఏది కదిలి తన ప్రాణాలను కాపాడుకో ప్రయత్నిస్తుందో, ఏది కదలిక కలిగే తనవంటి ప్రతిరూపానికి జన్మనిస్తుందో దానిని తినడం మాంసాహారం. గుడ్డు ఖచ్చితంగా మాంసమే! కానీ పాలు శాకాహారం.
ఏది కదలదో, ఏది తన కొమ్మలను మరింతగా, ఆకులను మరింతగా మొలిపించుకోగలుగుతుందో అది శాకాహారం.

చేపలు అండజములక్రిందకే వస్తాయి. అంటే గుడ్లనుండి పుట్టేవి. కదలిక కలిగినటువంటివి. కాబట్టి చేపలవంటివిగూడా మాంసాహారంక్రిందకే పరిగణించబడుతుంది. ప్రతి జీవికి తన స్వతస్సిద్ధమైన తిండి ఉంటుంది. లేడులు, ఆవులు, గుర్రములు స్వతస్సిద్ధంగా పచ్చికమేస్తాయి. పులులు, సింహములు, దుమ్ములగొండులు, గద్దలు స్వతస్సిద్ధంగ మాంసమును తింటాయి. మానవులు స్వతస్సిద్ధంగా పండ్లు, కూరగాయలు, కొన్నిరకముల గడ్డి (లేతవెదురు) మరియు గడ్డిగింజలు (వరి, గోధుమ మొదలగునవి) తింటారు. మనుషుల శరీర నిర్మాణాకృతి అంతర్గతమైన జీర్ణావయవములు ఈ విషయాన్నే నిర్ధారిస్తాయి. మానవుల ప్రేగులు దాదాపు ఏడు మీటర్ల పొడవుంటాయి. ఇవి మిగిలిన శాకాహార జరాయుజములైన దుప్పి,లేడి, ఆవులను పోలిన నిర్మాణం. కానీ పులి, దుమ్ములగొండి, సింహము వంటి సహజసిద్ధమైన మాంసాహార జరాయుజముల పొట్టలోని ప్రేగులు మీటరు పొడవుగూడా ఉండవు. ఎందుకంటే ఇవి మాంసం తింటాయి, మాంసము అంటే అప్పటికే ఒక జంతువు తిని అరిగించుకుని బలంగా మార్చుకున్న పదార్థం. అందువల్ల తిరిగి మాంసాన్ని అరిగించుకోవాల్సిన అవసరం వీటి ప్రేగులకు ఉండదు, వీటి ప్రేగులపై అంత భారమూ పడదు. అందుకని స్వతస్సిద్ధంగా మాంసం తినే జంతువుల ప్రేగులు చాలా చిన్నవిగా ఉంటాయి. కాబట్టి మానవులు స్వతస్సిద్ధంగా శాకాహరజీవులు.
రెండు పనులు చెయ్యటానికి ఈ ప్రపంచం లో చాలా కష్టపడాలి...

1. మన బుర్రలో ఉన్న ఆలోచనలని ఇతరుల బుర్రలోకి ఎక్కించటం 😄😄
2. ఇతరుల జేబులో ఉన్న డబ్బులను మన          జేబులోకి రప్పించుకోవటం 😄😄

మొదటి పని చేసేవాళ్ళని "టీచర్" అంటారు
రెండో పని చేసేవాళ్ళని "బిజినెస్ మాన్"అంటారు

రెండు పనులూ సులువుగా చేసే వాళ్ళని....
....
....
....

భార్య అంటారు😜😜😄
రావణ  సంహారం  రహస్య  సందేశం .

కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం- ఇవి
జ్ఞానేంద్రియలు.
వాక్కు, పాణి, పాదాలు, మలద్వారం, మూత్ర ద్వారం-
ఈ అయిదూ కర్మేంద్రియాలు.
వీటిని సరిగా వినియోగిస్తే జీవుడు దేవుడు అవుతాడు.
అలా వినియోగించని వాడే రావణుడు, పది ఇంద్రియాలు,
వాడి పదితలలు. దశ ఇంద్రియాలకు లొంగినవాడు
రావణుడు(దశకంఠడు). లొంగనివాడు ఏకకంఠుడు
శ్రీరాముడు. రాముడు రావణుని శిరస్సులు నరకడం

అంటే, ఇంద్రియాల ఉన్మాదాన్ని తొలగించడం.