Monday, January 16, 2017

పిల్లల పట్ల మీరు చూపే ప్రేమాభిమానాలు విలువైనవి... అమూల్యమైనవి... వెలకట్టలేనివి ... కాకపోతే ఈ ప్రేమలో పడి చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద పొరపాటు... ''నేను పడే కష్టం, శ్రమ నా బిడ్డ పడకూడదు'' ఇదీ అమ్మానాన్నల నిష్పక్షపాతమైన... కల్మషం లేని... పవిత్ర ప్రేమకు చిహ్నం. కాని పిల్లల్ని ఎంతో అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు ఒక విషయం మర్చిపోతున్నారు...
   మీరు కష్టాలు, శ్రమలు పడ్డారు కాబట్టే ఇంత పైకి వచ్చి బాధ్యతగా ఉంటున్నారు. అదే మీ పిల్లల విషయంలో మీరు కఠినంగా ఉండకుండా సున్నితంగా వారికి లోకం తెలియకుండా పెంచితే మాత్రం మీరు, మీ పిల్లలు, వారితో వున్న ప్రతీ ఒక్కరు మూల్యం చెల్లించాల్సి వుంటుంది. కష్టమేమిటో ఎరగని వారికి సుఖం విలువ తెలియదు. నష్టమేమిటో ఎరుగని వారికి లాభం విలువ తెలియదు.
కాలమేమిటో తెలియని వారికి జీవితం విలువ తెలియదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి... ''అతి ప్రేమ, అతి గారాబం, అతి అలుసు అనేది అస్సలు మంచిది కాదు''. పిల్లలకు ఏ లోటూ రాకుండా పెంచాలనే భావనతో చాలామంది వారి పిల్లల్ని మరీ సున్నితంగా పెంచుతున్నారు. ఇదే నేడు సమస్యగా మారింది.
మౌనిక ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమె తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. అడిగింది కాదనకుండా ఇంకా ఎక్కువగా ఆమెకు తెచ్చి అందిస్తారు. చిన్నతనం నుండి ఓ మహారాణి అన్న భావనను మౌనికలో పెంచారు. ఉన్నత చదువులు చదివి, పెళ్లయ్యాక భర్త ఆమెను ప్రత్యేకంగా చూడకపోవడంతో గొడవ పడేది. ఇలా పెరగడం వల్లే చివరికి విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇలా మౌనిక ఒక్కటే కాదు.. ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్నచిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
పెంపకంలోని లోపాలే ఇలాంటి వాటికి కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు.

So please teach the value of life and money... 

No comments:

Post a Comment