ఒక చీమ రోజు ఆఫీసు కి వెళ్తుండేది . ఆడుతూ పాడుతూ పని
చేసిది . అది పని చేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది . సీఈఓ సింహం రోజూ చీమని చూసి
సంతోసించేవాడు . ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు . చీమ దానంతటది పని చేస్తేనే ఇంత
బాగా చేస్తోంది , దీని పైన ఒక సూపర్ వైజర్ ని పెడితే ఇంక
ఎంత బాగా చేస్తుందో అని . ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్ వైజర్ గ
నియమించాడు . బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు,అటెండేన్స్ లు
ప్రవేశ పెట్టింది . వీటన్నిటిని చుసుకోవడానికి ఒక సాలీడు ని సెక్రటరీ గ
నియమించుకుంది . సింహం గారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వాళ్ళ ఎంత ఉత్పత్తి పెరిగింది
, పని విదానానికి సంబందించిన రిపోర్ట్ లు వగైరా అడిగారు .
ఇవన్ని చేయడానికి బొద్దింక ఒక కంప్యూటర్ ని ఒక ప్రింటర్ ని తెప్పించుకొని వాటిని
ఆపరేట్ చేయడానికి ఒక ఈగని నియమించింది . మరో వైపు ఆడుతూ పాడుతూ పని చేసే చీమ
నీరసించడం మొదలు పెట్టింది . అది చేసే పని కి తోడూ పై అదికారులతో మీటింగ్ లు , ఎప్పటికప్పుడు అంద చేయాలసిన రిపోర్ట్ లు దాని నెత్తి
మీదకొచ్చి పడ్డాయి . ఈ లోగ బొద్దింక అధికారికి తోడూ మరో మేనేజర్ ,వీళ్ళ హోదా కి తగినట్లు ఆఫీసు కు కొత్త హంగులు ,ఆర్భాటాలు మొదలైనాయి . క్రమంగా చీమ కే కాదు ఆఫీసు లో ఎవరికీ
పని పట్ల ఆసక్తి లేకుండా పోయింది . ఉత్పత్తి పడిపోయింది . సిఈఓ సింహం గారు ఈ
సమస్యని పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్ల గూబ కి అప్పగించారు . ఇలాంటి
సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం లో ప్రపంచ ప్రసిద్ది గాంచిన గుడ్లగూబ గారు ఆఫీసు
స్తితిగతులని అద్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తేల్చి
చెప్పారు . వెంటనే సింహం ,బొద్దింక మీటింగ్
పెట్టుకొని చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న చీమని పనిలో నుండి
తొలగించాలని తీర్మానించాయి.
No comments:
Post a Comment