😆భార్యలకు మాత్రమే 😌
(హాస్యానికి మాత్రమే ✍)
1) శ్రీవారికి తలనొప్పిగా వుంటే మీరు మౌనం
వహిస్తే చాలు, ఆయనే కోలుకుంటాడు అమృతాంజనం అక్కర్లేదు 🤒
2) ఉదయం లేవగానే ఆయన కాళ్ళకు
నమస్కరించకున్నా పర్లేదు, అతన్ని బెడ్ కాఫీ
అడక్కుండా ఉంటే చాలు. 😜
3) వారానికి కనీసం 4సార్లు ఆయనకు
భోజనం స్వయంగా వడ్డించండి. ఆ అల్ప సంతోషి ఆనందిస్తాడు 😂
4) మిగిలిన ఆహారం పనిమనిషికో, కుక్కకో వేసే ముందు, ఆయన తిన్నాడో లేదో
చూడండి.అమాయకపు పక్షి మొహమాటం ఎక్కువ.😉
5) నలుగురిలో,ముఖ్యంగా ఆయనను మీ
అత్త మామలను (మీ పుణ్యాన వాళ్ళు జీవించి వుంటే) చులకన చేయకండి.😵
6) మీ కన్నవారింటిలో పొరపాటున మీ అయన
ఉండవలసి వచ్చినప్పుడు. అతనికి మీరు సేవ చేస్తున్నట్లు నటించండి. అలవాటుప్రకారం
అదేశించవద్దు.😟
7) నెల మొదటి వారంలోనే కాక, అన్నిరోజులూ ఆయనను ప్రేమగా చూడండి,
పిచ్చి మారాజు అన్ని ఆదాయాలు మీ చేతిలోనే పోస్తాడుగా.😊
8) అలిగి పుట్టింటికి వెళ్తానని ఉత్తుత్తినే
ఆయన్ను బెదిరించకండి, కొన్నిసార్లైనా
మాట నిలబెట్టుకోండి .😀
9) వరాలక్ష్మీవ్రతం,
అక్షయ తృతీయ వంటి సందర్భాలలో మీ ఆయనకి కూడా ఒక గుడ్డముక్క
తీయండి.సంబరపడిపోతాడు😅.
11) మీ బంగారు నగల్ని తరచూ మారుస్తూ మీ
శ్రీవారిని ఏమార్చవద్దు.మీ అయన మనసే బంగారమని నమ్మండి . 😍
12) మీవారు వేరే అమ్మాయిని చూస్తే, కుళ్ళు కోకుండా ఆమెలో మీ వారికి నచ్చిన అంశాలు మీరు
అలవర్చుకోండి .😘
13) దిక్కుమాలిన టీవీ సీరియళ్ళు చూడడం మాని, సరదాగా మీ వారికొక ప్రేమలేఖ వ్రాయండి అందులో ఆయనలో మీకు
నచ్చిన అంశాలు వ్రాయండి - కవితలు వద్దు అర్భకుడు తట్టుకోలేడు....😢
- ఇంకా వున్నాయి ప్రస్తుతానికివి పాటించి
మీ శ్రీవారి మనసు దోచుకోండి.. పర్సును కాదు. ....😜😫😖😷😇😩😅😴
గృహిణులూ మన్నించండి.. 🙏
No comments:
Post a Comment