Monday, January 16, 2017

రాయలసీమ కొన్ని నిజాలు ..
*ప్రపంచంలోనే ఎర్ర చందనం పెరిగే ఏకైక ప్రాంతం దక్షిణ నల్లమల , శేషాచలం అడవులు ఇది పూర్తిగా రాయలసీమ ప్రత్యేకం
*కలివి కోడి (jerdon's courser) – భారతదేశంలోని critically endangered పక్షులలో ఒకటైన కలివికోడి చివరి ఆవాసం (ప్రపంచంలోనే ) కడప జిల్లా లంకమల అభయారణ్యం
*ప్రపంచంలోనే అతి పెద్ద బైరటీస్ నిల్వలు ఉన్న ప్రాంతం కడప జిల్లా మంగంపేట గనులు
*ఆంధ్రలో మానవుని నాగరికత కర్నూల్-కడప జిల్లాలో మొదలయ్యి ఉత్తరాదిసగా వ్యాపించింది అన్నది anthropologistsల మాట
*తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి గుడి ప్రపంచంలోనే రెండవ ధనిక ఆలయం
*రాయలసీమ లో ఒక జ్యోతిర్లింగం (శ్రీశైలం మల్లికార్జున స్వామి ) ఒక పంచభూత లింగం (శ్రీకాళహస్తి వాయు లింగం )అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి (శ్రీశైలం భ్రమరాంబిక )నవ నారసింహ క్షేత్రాలలో రెండు (కదిరి లక్ష్మీ నరసింహ స్వామి మరియు అహోబిలం నరసింహ స్వామి ) కలవు
*ప్రపంచంలోనే అతి పురాతన లింగం (మొట్టమొదటి లింగం ) చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో కలదు
*తెలుగు భాష మొదటి శాసనం కడప జిల్లా కలమళ్ళ శాసనం
*మన జాతీయగీతం మన మదనపల్లి లో రాయబడింది
*తెలుగులో మొదటి కవయిత్రి మన తాళ్ళపాక తిమ్మక్క
*దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వు మన శ్రీశైలం టైగర్ రిజర్వు
*కదిరి దగ్గరి తిమ్మమ్మ మర్రిమాను దక్షిణభారతంలో అతి పెద్ద చెట్టు
*కడప జిల్లాలో దేశంలోనే అతి పెద్ద Crysotile Asbestos నిల్వలుకలవు
*తెలుగు సినిమా పుట్టినిల్లు మన సురభి గ్రామం (కడప జిల్లా )
*ప్రథమ స్వాతంత్ర్య పోరాటానికంటే ముందే బ్రిటిష్ వారిపై తిరిగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వారు
*కర్నూలు జిల్లా బెలుం గుహలు దేశంలోనే రెండవ పెద్ద గుహా సముదాయాలుగా పేరుపొందాయి .వేర్పాటు వాదుల ఖిల్లా గాలివారి పల్లె,రాజంపేట సరేసరి.
.
*ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద జిల్లా మన అనంతపురం జిల్లా ..
ఇంకా ఇంకా రాయలసీమ అంటే ... వేమన్న పద్యం , అన్నమయ్య కీర్తన , మొల్ల రామాయణం , వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం , కన్నప్ప భక్తీ , అష్టదిగ్గజ వైభవం , రాయల రాజసం , బుడ్డా వెంగల్ రెడ్డి దాతృత్వం , ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరత్వం , తరిగొండ వెంగమాంబ భక్తి , గడియారం వెంకటశేష శాస్త్రి , పుట్టపర్తి నారాయణాచార్యుల సాహిత్యం , లక్కోజు సంజీవ రాయ శర్మ మేధస్సు , జిడ్డు కృష్ణమూర్తి తత్త్వం
నా తల్లి రాయలసీమ .. సంస్కృతీ కళల పట్టుగొమ్మ...
రాయలసీమ అంటే రాళ్ళు రప్పలు , కరువులు , ఫ్యాక్షన్ హత్యలు తప్ప ఇంకేమి లేదనుకోనేవారి కోసం..... 

No comments:

Post a Comment