కొత్త కోడలు అత్తకు రాసిన ఉత్తరం.!
******************************
అత్తగారికి నమస్కారాలు….
కొత్తగా పెళ్లైన నామీద మీరు చూపిస్తున్న అభిమానానికి
కృతజ్ఞతలు…ఈ ఆదరాభిమానాలే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. నేను
మీరు చేసే ఏ పనిలో తలదూర్చనని హామి ఇస్తున్నాను, మీ పనులను మీరు
నిర్మొహమాటంగా చేసుకోవొచ్చు అందులో నాకెలాంటి అభ్యంతరం లేదు… బట్టలుతకడం, ఇల్లు ఊడ్వడం, వంట చేయడం, గిన్నెలు
తోమడం..ఇలాంటవి గతంలో ఎలా చేసుకునే వారో ఇప్పుడు కూడా అలాగే చేసుకోండి కోడలిగా
మీకు నేను అడ్డు చెప్పను.! ఎందుకంటే అత్తకు అనుభవం ఎక్కువ కదా!!!
నాకు మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఉంది…మొన్న మీరు చేసి ఇచ్చిన కాఫీ చాలా బాగుంది.రోజూ అలాంటిది
ఉదయం 8 గంటలకోసారి ఇస్తే చాలు..అత్తచేతి కాఫీ అమృతం అని ఫీల్
అవుతూ మీరు చచ్చేదాకా హ్యాపీ గా బతికేస్తా!!
టిఫిన్ కోసం ఓ తెగ హైరానా పడిపోకండి… ఉదయం 6 ఇడ్లీలు తప్ప
ఎక్కువ తినను లేండీ, కాకపోతే పల్లీ
చెట్ని కాస్త టేస్ట్ గా ఉండాలి, చట్నీ రోటి మీద
రుబ్బిందైతే మస్త్ ఉంటది, అయినా
మీలాంటోళ్ళకు కొత్తగా చెప్పాలా…? అదొక్కడి
చూసుకోండి.!!
నేను పెద్దగా నాన్ వెజ్ తినను….సండే ఒక్క రోజు
బిర్యానీ వండిపెడితే చాలు… బొక్క కొరికే
ప్రతిసారి ముక్క నమిలే ప్రతిసారీ అత్తను తల్చుకోనూ!! మసాలాలు మస్ట్!!
నేను వచ్చాక కూడా బీరువా తాళాలా గుత్తి మీ దగ్గర ఉండడం
మంచిదికాదత్తయ్యా.! అయినా మీరు అంతంత బరువు మోయొద్దు, పైగా డబ్బుల
వ్యవహారమాయే…. అసలే మీకు BP ఉండే ..సో ఇప్పటి
నుండి దాని బాధ్యత నేను చూసుకుంటా.!
అప్పుడప్పుడు అంటే వారానికి 5 రోజులు నా
పుట్టింటి తరఫు బంధువులు వస్తుంటారు. మీ తరఫు బంధువులు ఎక్కువగా మన ఇంటికి రాకుండా
చూసుకుందాం.! ఎందుకంటే ఇద్దరి తరఫు వారు వస్తే మనకు కాస్త ఇబ్బంది కదండీ!!
ఇప్పటి వరకు అమ్మా..అమ్మా …అని మీ చుట్టూ
తిరిగిన మీ కొడుకుని ఇప్పటి నుండి నా చుట్టే తిప్పుకుంటా..? ఎందుకంటే ఇప్పుడైనా మామగారికి మీ తోడు అవసరం కదా అత్తయ్యా.!
ఇక ఉంటా అత్తగారు…అషాడం అవ్వగానే
కార్ తో పాటు మా ఆయనను పంపిించండి! పనిలో పనిగా వస్తూ వస్తూ మా ఆయనను ఓ 2 లక్షలు తీసుకురమ్మనండి, మా చెల్లి పెళ్ళి
కట్నానికి కాస్త తక్కువ పడ్డాయ్.! అయినా మా చెల్లి అంటే మీకు కోడలు కాదా! ఏంటీ!!
ఇట్లు.
అత్తకు ప్రేమతో …
No comments:
Post a Comment