Thursday, February 2, 2017

Please read this  fully


An Old man has 8 hair on his head.

He went to Barber shop.

Barber in anger asked:

shall i cut or count ?

Old man smiled and said:

"Colour it!" 

LIFE is to enjoy with whatever you have with you, keep smiling

If you feel STRESSED,

Give yourself a Break.

Enjoy Some..

Icecream

Chocolates

Cake

Why?

B'Coz

STRESSED in reverse Spelling

DESSERTS !!!

Alphabetic advice for you:

A B C

Avoid Boring Company..

D E F

Don't Entertain Fools..

G H I

Go for High Ideas .

J K L M

Just Keep a friend like ME..

N O P

Never Overlook the Poor n suffering..

Q R S

Quit Reacting to Silly tales.. 

T U V

Tune Urself for ur Victory..

W X Y Z

We Xpect You to Zoom ahead in life


If   you   see   the   moon ..... You   see    the    beauty    of    God .....  
If    you   see    the   Sun ..... You   see    the    power   of    God .....   And ....   
If   you   see   the   Mirror. You   see     the    best    Creation of   GOD .

So    Believe   in    YOURSELF.

Our aim in life should be
9 8 7 6 5 4 3 2 1 0

..9-glass drinking water.
..8-hrs sound sleep.
..7-wonders tour with family.
..6-six digit income.
..5-days work a week
..4-wheeler.
..3-bedroom flat
..2-cute children.
..1-sweetheart.
..0-tension!


if u like pls send to all people who are important to you...😜
" పిండం అంటూ నీళ్లలో వేసే అన్నం ముద్ద మరొక పేదవాడికి కడుపు నింపుతుంది కదా..?"
"శెభాష్.. నిజమే" అనిపిస్తోంది కదూ..??
మరి ఆ అభిప్రాయం నిజమా? అంటే, ఆ భావన 100శాతం తప్పు .!
మరి ఎందుకో తెలుసుకోవాల్సిన బాధ్యత మనమీదుందని గుర్తించాలి. అందుకే ఎందుకో ఇప్పుడు తెలుసుకే ప్రయత్నం చేద్దాం.
పిండం : ఇవి పలు రకాలు.. కర్మకాండలకు , రకరకాల పిండాలు పెట్టడం హిందూ సంస్కృతిలో ఉంది.. కొందరు మాత్రమే పాటిస్తున్నారు.. కొందరు రాను రాను విసర్జించి ఉంటారు. కొందరు తొలినాళ్ళ నుంచి పాటించి ఉండక పోవచ్చు.
ఈ ప్రశ్న కు సమాధానం చూసే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
విశ్వంలో మనిషి మాత్రమే ఉన్నాడా?? ప్రాణంతో ఉన్న ఇతర జాతులేమీ లేవా?
మీరనే సైన్సే ఏమి చెబుతోందో తెలుసా..!??
8.7 మిలియన్ల జీవరాశులు భూమిమీద జీవిస్తున్నాయని సైన్స్ పత్రిక చెబుతోంది. ఇంకా కూడా ఎక్కువే ఉండొచ్చుకూడా.
ఇక భారతదేశం కి వస్తే అవి కూడా ఖచ్చితంగా లక్షల సంఖ్యల్లోనే ఉంటాయి.
అందరికన్న మేథస్సున్న మానవుడు మూఢాచారాలు నమ్మొచ్చా? అనే వాదం ఉన్నవారికి, మరి ఆయా ఇతర జీవులు ఎలా జీవిస్తాయో అన్న అనుమానం ఎందుకు కలుగట్లేదో అర్ధం కాని ప్రశ్న.
మన కడుపుకి తింటే చాలా..??
ఒక గిరి గీసుకుని అందులో మఠం వేసుకు కూర్చుని, ఎదుటి వారిమీద దుమ్మెత్తి పోయటం చాలా సులభమే..! కానీ గతించిన మంచోళ్ళు అలా చేయలేదు.. పూర్వీకులు అన్నింటి గురించీ పట్టించుకున్నారు. అన్ని ప్రాణుల అవసరాలనీ ఏదో ఒక రూపంలో తీర్చాలన్న నీతి ని ప్రభోదించారు..
అందులో భాగమే ఈ పిండ ప్రదానం,తర్పణం అనే కార్యక్రమం లేదా క్రతువు.
ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారం..
శాస్త్రంలో మంత్ర విధానంగా ..
"ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం"
(గద్దలు, కాకులు, జలచరాలు రూపంలో పిత్రుదేవతలకు ఆహారం అందించాలి)
1. కాలం చేసిన వారి పేరుతో , వారిని గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతో (ఆత్మ శాంతి కోసం) ఊరి జనం మొత్త్తాన్ని పిలిచి స్థోమతకు తగ్గట్టు అన్నదానం చేస్తారు. ఇది బ్రాహ్మణ , బ్రాహ్మణేతరులకు కూడా అన్నదానం జరుగుతుంది. కాబట్టి మనుష్య జాతికి భోజనం పెట్టారు ఆ కుటుంబం వాళ్ళూ.
2. వాయస పిండం (కాకి కి పిండం) :
"కాకులు దూరని కారడవి అంటారు." ఈ ఉపమానం ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అంటే కాకి ఎక్కువగా కనిపించే పక్షి జాతి కి చెందిన జీవి. (క్రతువు ఎప్పుడు, ఎక్కడ,మాసికమా, ఏడూడా అనేది మాత్రం ఇక్కడి సమస్యకాదని పురహితులు గుర్తించాలి.) ఆ పక్షిజాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్ధం .
నువ్వులు, అన్నం,నెయ్యి కలిపిన ముద్ద పెడతారు.
అంతే ఇక్కడ కాకి తినే పదార్ధాలనే ఉపయోగిస్తారనేది గ్రహించాలి.
3. వికిర పిండం /నీటిలో వదిలే పిండం: ఇక ఈ పాటికే మీకు సమస్యకు సమాధానం అర్ధం అయి ఉంటుందనుకుంటున్నా..! కానీ మన హేతువాద సోదరులకి హేతుబద్ధంగా చెప్పాలనేదే ఈ ప్రయత్నం.!
నీటిలో అనేక జీవజాతులున్నయ్. మనిషి కన్న ముందు పుట్టిన మత్స్యజాతి ఉంటుంది. ఆ చేపలకు ఆహారమే నీటి లో వదిలే పిండం.
మనిషికి , పక్షిజాతికి, జలచరాలకీ కూడా ఆహారం అందిస్తున్నారు.. అది కూడా చనిపోయిన వారి పేరు మీద.. అది ప్రేతం అన్నాగానీ, ఆత్మ శాంతి అన్నా గానీ, ఆయా పేర్లు , ఆయా కాలమాన పరిస్థితుల బట్టి పెట్టుకోనే అవకాశం ఉంది. అవసరార్ధం మార్చే చాన్స్ వెయ్యి శాతం ఉంది.
4. ఇక గోవుకు పెట్టే పిండం. సరే మనిషికి పెట్టారు, పక్షియైన కాకికి పెట్టారు. జలచరాలైన చేపలకి పెట్టారు,అదేరీతిలో జంతువైన ఆవుకి పెట్టారు. అది కూడా ఆవుకి బలిష్టమైన ఆహారం మాత్రమే అనేది తెలుసుకోవాల్సిన విషయం.
ఈ మధ్య గో సేవా అంటూ గోవుల్ని ఆదుకుంటున్నాం అని చెబుతున్నవారు, పిండాన్ని గోవులకి పెట్టనీయటం లేదనే విమర్శ కూడా ఉండి. అది చాలా తప్పు.. అపోహ కూడా.! ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రదానంలోని గుణం.
(శాస్త్రం ప్రకారం కర్మకాండలో గోవుకు పిండ ప్రదానం నిషిద్దం కూడా.)
ఇక పెడవాదులు వేసే మరో ప్రశ్న.. జంతువంటే గోవు మాత్రమేనా? ఇంకేం లేవా..? కుక్కకో పిల్లికో పెట్టొచ్చుకదా? కాకికే పెట్టాలా పిచ్చుకకో పిట్టకో పెట్టొచ్చు కదా..?
కావాలని ..అడగాలని అడిగే ప్రశ్నలకీ కూడా సమాధానాలు ఉంటాయ్. !!
ఆవు ఎన్నో ఔషద గుణాలున్న మేలు జాతి పశువని గుర్తించారోయ్ మన పూర్వీకులు. అంతే కాదు ప్రతి ఇంటిలో కుక్క ఉన్నా, లేకున్నా ఆవు మాత్రం ఉండేది. అందుకే ఆ కాలం వారు సుభిక్షంగా ఉన్నారనడంలో సందేహం లేదు. అన్నీ ఇళ్ళల్లో ఆవులుంటాయి కాబట్టి, వాటికి కూడా భోజనం పెట్టడమే ముఖ్యోద్దేశ్యం. కాకికే కాదు గ్రద్దకూ పెట్టొచ్చని మంత్రం చెబుతోంది.
ఇందులో కూద మరొక గొప్ప మర్మం ఉంది కూడా.. ఎక్కడైతే కాకులు, లేదా గ్రద్దలు తిరుగు తుంటాయో.. అక్కడ విష జంతువులైన పాముల వంటి జీవులు సంచరించక పోవడం కూడా గమనించాలి.
ఇక ..
ఆవులకు పెట్టె పిండాలలో పాలు పాల పదార్ధాలైనవి (నెయ్యి వంటీవి) కలవవు. అలాగే చేపలకి పెట్టే పిండంలో మినుములు ఉండవు.
కాకులకి అంటే వాయసాలకి పెట్టే పిండంలో నెయ్యి,నువ్వులు ఉంటాయి. అవి బలమైన ఆహారం వాటికి. అలా ప్రతిదీ ఆచి తూచి ప్రయోగాత్మకంగా విజయం సాధించి మాత్రమే చేశారు.
కానీ అంతటీ గొప్ప సంస్కారవంతమైన గొప్ప ఆచారాన్ని కొనసాగించడానికి ఏదో ఒక పద్దతి వాడాలి కనుక.. అలా ఆదేశించారు. అందుకే ఇంతకాలం ఆ ఆచారాలు కొనసాగుతున్నాయ్.. ఈ రోజు ఏ చట్టం చేసినా వెంటనే తుంగలో తొక్కేస్తున్నారు.. ఆ దుస్థితి ఎందుకు దాపురించిందో మన హేతు మేథావులు చెప్పాల్సిందే..!
కొన్ని మంచి విషయాలు పాటించడానికి "భక్తి" అని చెప్పేరు. కొన్ని విషయాలను "ముక్తి " అని చెప్పారు.. అంతే..!
మనం ఏ కళ్ళతో చూడాలో అవేకళ్ళు పెట్టుకు చూడాలి. దృష్టి లోపం లేనోడు చత్వారం కళ్ళజోడు వాడితే నొప్పి ఖాయం.
అలాగే హేతుబద్దంగా ఉన్న వాటిని జనవిజ్ఞానులు ఎందుకు చెప్పటం లేదో అర్ధం కావడం లేదు.
వారు కేవలం వారికి తెలిసి గిరి గీసుకుని అదే ప్రపంచం అనే అపోహలో కొట్టు మిట్టాడుతున్నారో.. లేక కేవలం హిందువుల సంస్కృతి సంప్రదాయాల మీద జరుగుతున్న దాడులో అర్ధం కాకుండా వుంది. మరి దొంగ బాబాల తప్పులను ఎత్తి చూపిన జన మేథావులకి .. హైందవంలో మంచి కూడా ఉందన్న విజ్ఞానాన్ని ఎందుకు బోధించడంలేదో వెయ్యిడాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
మనసును తడిమే - తడిపే ఓ మంచి కథ.....                 శ్రీమతి సుశీలా సోమరాజు

*ప్రయాణం*


పెద్దతనం, ముసలి తనం, వృద్ధాప్యం అని అందరూ
హడలగొట్టి చంపేసే ఆ దశ వచ్చేసిందా? అప్పుడే వచ్చేసిందా?

నిన్నగాక మొన్ననేగా మావయ్య కొనిచ్చిన కొత్త ఓణీ చూసి మురిసి ముక్క చెక్కలయిందీ !
ఎదురింట్లో అద్దెకున్న స్టూడెంట్ కుర్రాడు ఇంకా కాలేజీకి వెళ్ళడేమిటా
అని విసుక్కున్నదెప్పుడూనాలుగు రోజుల క్రితమేగా!

ప్రతి పెళ్ళిచూపులకి సింగారించుకుని కూచుని, తీరా వాళ్లు జాతకాలు నప్పలేదని కబురు పెడితే
తిట్టరాని తిట్లన్నీ అందరం కలిసి తిట్టుకుంటూ ఎంజాయ్ చేసింది నిన్న మొన్నేగా!
నాన్నని కష్టపెట్టకూడదని కూడబలుక్కుని, ఇంటి అరుగుమీద పెళ్ళి,
పెరట్లో కొబ్బరి చెట్టుకింద బూందీ, లడ్డూ, కాఫీలతో రిసెప్షనూ ఇచ్చి,
ఇంటి ఇల్లాలినయి ఎన్నాళ్ళయిందనీ !
అందుకు తగ్గట్టే పెళ్లివారు ఒకే పట్టుచీర తెచ్చి అన్నిటికీ దాన్నే తిప్పితే,
నలుగురూ నవ్వినందుకు పౌరుషం వచ్చి, ‘మేం బొంబాయిలో కొనుక్కుంటాంఅని గొప్పలు పోయింది ఈ మధ్యనేగా !

అయినా ఏం లోటయిందని ?
వాయిల్సూ, జార్జెట్ లూ, బిన్నీలూ, బాంబే డయింగులూ, విమలలూ,
వెంకటగిరి , ఉప్పాడ, గద్వాల, గుంటూరు, బెనారసు, కంచి, మైసూరు, ధర్మవరం, మహేశ్వరం, ఒరిస్సా, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్అబ్బ.. అబ్బబ్బ ఎన్ని రాష్ట్రాలని పాలించాం! ఎన్ని చీరలు కట్టాం!

ముగ్గురు పిల్లల్నేసుకుని రిక్షాలెక్కుతూ దిగుతూ, హాస్పిటళ్లూ, స్కూళ్లూ, పెళ్లిళ్లూ, పేరంటాలూ, పురుళ్లూ, తద్దినాలూ, నోములూ, వ్రతాలూఎన్నెన్ని పండగలూ, ఎంతెంత హైరానాలూ….ఒక్కరోజయినా నడుం నొప్పని పడుకుని ఎరుగుదుమా, ఎవరైనా పలకరించడం విన్నామా?!
పాపాయ్, నానీ, చిట్టితల్లీ, బంగారం, అక్కా, వదినా, ఇదిగో, కోడలమ్మా, పిన్నీ, అత్తా, చిన్నమ్మా. అమ్మా, పెద్దమ్మా, అమ్మమ్మా, నానమ్మా, పెద్దమ్మమ్మా, పెద్ద బామ్మా, జేజమ్మాఅమ్మో ఎన్ని మెట్లెక్కాం! ఎన్నెన్ని పిలుపులకి పలికాం !

ఇంతట్లోకే పెద్దయిపోయామా! అప్పుడే అందరూ అమ్మగారనడం మానేసి మామ్మగారంటున్నారు!
అంటే అన్నారుగాని పాపం లేవబోతుంటే చేయందిస్తున్నారు!
చేతనున్న చిన్న బ్యాగు తామే తెస్తామని లాక్కుంటున్నారు….
పదికిలోల బియ్యం అవలీలగా వార్చిన వాళ్లం! ఈ బరువొక లెక్ఖా, వాళ్లంత ముచ్చట పడుతుంటే కాదనడం ఎందుకని గానీ?

పెద్దయితే అయ్యాంగానీ ఎంత హాయిగా ఉంటోందో!
మండే ఎండల తర్వాత వాన చినుకు పడ్డట్టు
ముసుళ్ల వానల ముజ్జిడ్డులు దాటి, వెన్నెల మోసుకొచ్చే చందమామ కనపడ్డట్టు
గజ గజ లాడే చలి వణుకులు వణికాక వెచ్చటి కమ్మటి మట్టిగాలి పలకరించినట్టు
ఎంత హాయిగా వుందో!

ఒకటే ఇడ్లీ తింటే గంటకే ఆకలేస్తుంది.. పోనీ అని రెండు తింటే అపరాహ్నమయినా అన్నానికి లేవబుధ్ధి కాదు!
ఆవకాయని చూస్తే బీపీ, మామిడి పండుని తల్చుకుంటే సుగరూ, పగలు కాస్త రెండు ముద్దలెక్కువయితే
రాత్రికి మజ్జిగ చాలుఎంత తేలిక అవసరాలు!

సగం భోజనం మిగతా సగం మందులు .. అవి ఉండ బట్టే కదా ఇంకా మనగల్గుతున్నాం!
ఇంకొక పెద్ద విశేషం ఉందండోయ్, ఎవరికీ తెలియనిదీ మనం పైకి చెప్పనిదీ ..
మనం ఎవరికీ అక్కర్లేదు కాబట్టి మనకీ ఎవరూ అక్కర్లేదు!
ఎవరూ మన మాట వినిపించుకోరు కాబట్టి మనమూ ఎవరి మాటా వినిపించుకోనక్కర్లేదు !
అంతా నిశ్శబ్ద సంగీతం!
ఏరుని ఎప్పుడూ గలగలా ప్రవహించమంటే కుదుర్తుందా? సముద్రం దగ్గర పడుతుంటే హాయిగా నిండుగా హుందాగా అడుగులేస్తుంది కదా!

అయినా ఎపుడేనా మనకి తిక్క పుట్టినపుడు అడ్డంగా, అర్ధం పర్ధం లేకుండా వాదించి ఇవతల పడచ్చు.
ఇంత వయసు వచ్చాక ఆ మాత్రం చేయ తగమా !
ఈ మధ్యనే నేను కనిపెట్టాను ఇంకొక పెద్ద విశేషంఅస్తమానం ప్రవచనాలు వింటూ హైరానా పడక్కర్లేదు.
మనకి చెప్పడం రాదు గానీ వాళ్ళు చెప్పేవన్నీ మనకూ తెలుసు!
కాబట్టి హాయిగా పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ కుళ్లు జోకులకి కూడా గట్టిగా నవ్వుకోవచ్చు. ఎవరూ ఏమీ అనుకోరు.

అవునూమనం కనపడగానే మొహం ఇంత చేసుకుని ఆనంద పడిపోయే మన పిన్నిలూ, బాబాయిలూ, అత్తయ్యలూ, మామయ్యలూ ఏమయిపోయారు? ఎప్పుడెళ్లిపోయారు?
పిచ్చిపిల్లా కొత్త మాగాయలో వేడన్నం కలుపుకుని, ఈ నూనె చుక్కేసుకుని రెండు ముద్దలు తినుఅంటూ వెంటబడే వాళ్లెవరూ లేరే?
అంటే మనమే పెద్దవాళ్లయిపోయామన్నమాట!
చూస్తూండగానే సాటివాళ్లు కూడా కనిపించడం మానేస్తున్నారు. కొందరుండీ లేనట్టే. లేకా వున్నట్టే. జీవితానికి విశ్రాంతి దానంతటదే వస్తోంది.

అయినా రైలెక్కాక కిటికీ పక్కన కూచుని దారిలో వచ్చే పొలాలూ, కాలవలూ, కుర్రకారూ, పల్లెపడుచులూ, టేకు చెట్లూ, భవనాలూ, వాటి పక్కనే గుడిసెలూ, అక్కడాడుకుంటూ చేతులూపే చిన్నారులూ, ఉదయిస్తూ అస్తమిస్తూ అలుపెరగక డ్యూటీ చేసే సూర్యనారాయణమూర్తులూ, మిణుకు మిణుకుమని హొయలుపోయే చుక్కలూ చూస్తూ ప్రయాణం ఎంజాయ్ చెయ్యాలి గానీ స్టేషనెప్పుడొస్తుందో అని ఎదురుచూడడం ఎందుకూ?


తీరా అదొస్తే ఏముందీ! జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి దిగిపోవడమేగా
*లీటరు మంచినీళ్లు రూ.36 వేలు!*


😳😳😳🙄🙄🙄🤔🤔🤔

క్రికెట్‌ మ్యాచ్‌ల సమయంలో విరాట్‌ కోహ్లీ ఏ హోటల్లో బస చేసినా అతడికోసం తప్పకుండా *ఎవియాన్‌’*మంచినీళ్ల బాటిళ్లను తెప్పించాల్సిందేనట. మామూలుగా అయితే ఈ విషయాన్ని అంత ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కానీ ఈ బ్రాండ్‌ నీళ్ల ఖరీదు లీటరు రూ.600కు పైనే. అంటే మంచినీళ్లకే రోజుకి కొన్ని వేలవుతాయన్నమాట. అయ్యబాబోయ్‌ అంత రేటా అనకండి. ఎందుకంటే దీనికన్నా ఎన్నో రెట్లు ఖరీదైన మంచినీళ్ల బ్రాండ్లు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే ఖరీదైన ఆ నీటి కథలేంటో చూద్దామా...

*కోనా నిగరి... 750మి.లీ రూ.27వేలు*

ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవే. వీటిని తాగితే ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు, బరువు తగ్గి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందనీ ఒత్తిడి దూరమవుతుందనేది కొందరి నమ్మకం. ఇంతకీ అంత ప్రత్యేకత ఆ నీటికెలా వచ్చిందంటారా... హవాయి దగ్గర్లోని పసిఫిక్‌ సముద్ర తీరంలో రెండువేల అడుగుల లోతు నుంచి తీసుకొచ్చే నీరిది. ప్రత్యేక పద్ధతుల్లో ఆ నీటిలోని ఉప్పదనాన్ని పోగొట్టి బాటిళ్లలో నింపుతారు. సముద్రం కింద వేల అడుగుల లోతునుంచి వస్తాయి కాబట్టి, స్వచ్ఛంగా ఉండడంతో పాటు వీటిలో ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయట. కోనా నిగరి నీటికి జపాన్‌లో ఎంత డిమాండ్‌ ఉందంటే రోజుకి 80వేలకు పైగా బాటిళ్లు అక్కడకు దిగుమతి అవుతున్నాయి.


*బ్లింగ్‌ హెచ్‌ టూవో... రూ.2,680*


సెలెబ్రిటీల చేతిలో ఉండే మంచినీళ్ల బాటిల్‌ కూడా ఆకర్షణీయంగా ఉండాల్సిందే. ఎలాగూ ఖరీదైన నీళ్లను కొనేది వారే. ఈ సూత్రంతోనే తమ నీళ్ల బాటిల్‌ ధరను మరింతగా పెంచింది బ్లింగ్‌ హెచ్‌టూవోకంపెనీ. టెనెస్సీ దగ్గరున్న నీటి బుగ్గల నుంచి సేకరించిన జలంతో నింపే ఈ బాటిళ్లను స్వరోవ్‌స్కీ రాళ్లతో తీర్చిదిద్దుతారు. దాంతో బాటిల్‌ తయారీకి అయ్యే ఖర్చు కూడా అదనమన్నమాట.

*వీన్‌... 750మి.లీ రూ.1500*

వీన్‌ నీటిని నోట్లో పోసుకున్న ప్రతిసారీ నాలుకకు ఏదో సుతిమెత్తని అనుభూతి కలుగుతుందట. కాలుష్యం లేకుండా పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం ఉన్న వివిధ ప్రాంతాల్లోని నీటి బుగ్గల నుంచి జలాన్ని సేకరించి బాటిళ్లలో నింపుతోంది ఫిన్లాండ్‌కి చెందిన వీన్‌ కంపెనీ. అలా లాప్‌లాండ్‌ నుంచీ ప్రపంచంలోనే ప్రకృతి సంపద ఎక్కువున్న దేశంగా గుర్తింపు పొందిన భూటాన్‌లోని హిమాలయ ప్రాంతం నుంచీ నీటిని సేకరించి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

*10థౌజండ్‌ బీసీ... 750మి.లీ రూ.950*


కెనడాలోని వాంకోవర్‌ నగరానికి 200 మైళ్ల దూరంలో ఉన్న ఆ పర్వత ప్రాంతంలో ఎవరూ ఉండరు. జంతువులు కూడా కనిపించవు. అక్కడ ఆరువేల అడుగుల లోతుతో వాలుగా ఉండే హిమనీనదాలను కరిగించి బాటిళ్లలో నింపుతోంది 10థౌజండ్‌ కంపెనీ. ఈ చోటుకి ఎవరూ వెళ్లలేరు, జంతువులు కూడా ఉండవు కాబట్టి, అక్కడి నీరు కలుషితం అయ్యే అవకాశం ఉండదు. పైగా హిమనీనదాల నుంచి వచ్చే నీరు కాబట్టి, వీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందనీ చర్మం మీద ముడుతల్లాంటివి రావనీ చెబుతోంది సంబంధిత కంపెనీ.


*ఆక్వా డెకో... 750మి.లీ రూ.800*


పద్దెనిమిది వేల సంవత్సరాల కిందట ఘనీభవించిన హిమనీనదాల నుంచి సేకరించిన నీరిది. కెనడాకు చెందిన ఆక్వా డెకోఉత్తమ నాన్‌ కార్బొనేటెడ్‌ స్ప్రింగ్‌ వాటర్‌గా 2007లో బంగరు పతకాన్ని కూడా సాధించింది.

*ఎవియాన్‌... లీటరు రూ.600కు పైనే*


1789లో ఫ్రాన్స్‌కి చెందిన మార్కిస్‌ అనే వ్యక్తి రోజూ వాకింగ్‌కి వెళ్తూ స్థానికంగా ఎవియాన్‌ లెస్‌ బెయిన్స్‌ దగ్గరున్న నీటి బుగ్గ దగ్గర నీరు తాగేవాడట. ఆ నీరు తాగడం మొదలుపెట్టాక అతడికున్న కిడ్నీ, లివర్‌ సమస్యలు నయమయ్యాయట. అదికాస్తా ప్రచారం కావడంతో ఆ నీటిని అమ్మడం వ్యాపారంగా మారింది. అదే తర్వాతి కాలంలో ఎవియాన్‌ బ్రాండ్‌గా విస్తరించింది. చాలామంది ప్రముఖులు ఈ నీటిని ప్రత్యేకంగా తెప్పించుకుని తాగుతారు. మనదేశంలోనూ ఆన్‌లైన్‌ ద్వారా ఈ బాటిళ్లను అమ్ముతున్నారు.

*లాక్వెన్‌ ఆర్టెస్‌ వాటర్‌ 750మి.లీ రూ.400*


దక్షిణ అమెరికాలోని ఆండెస్‌ పర్వతాల దగ్గర ఎలాంటి కాలుష్యమూ లేని మారుమూల ప్రాంతంలో 1500 అడుగుల లోతుకు తవ్వి తీసిన నీరే లాక్వెన్‌ మినరల్‌ వాటర్‌. బాటిల్లో నింపే వరకూ గాలి కూడా తాకనంత స్వచ్ఛంగా ఉంటాయి ఈ నీళ్లుఅంటూ ప్రచారం చేస్తున్నారు ఈ కంపెనీ నిర్వాహకులు.ఇంతకూ ఆశ్చర్యంలోంచి తేరుకున్నారా... లేదా..?  
*SUPERB_ Definitions*

                   

*CIGARETTE:*
A pinch of tobacco
rolled in paper
with fire at one end
and a fool at the other!

*MARRIAGE:*
It's an agreement
wherein
a man loses his bachelor degree
and a woman gains her master

*LECTURE:*
An art of transmitting Information
from the notes of the lecturer
to the notes of students
without passing through the minds
of either

*CONFERENCE:*
The confusion of one man
multiplied by the
number present

*COMPROMISE:*
The art of dividing
a cake in such a way that
everybody believes
he got the biggest piece

*TEARS:*
The hydraulic force by which
masculine will power is
defeated by feminine water-power!

*DICTIONARY:*
A place where divorce comes
before marriage

*CONFERENCE ROOM:*
A place where everybody talks,
nobody listens
and everybody disagrees later on

*CLASSIC:*
A book
which people praise,
but never read

*SMILE:*
A curve
that can set
a lot of things straight!

*OFFICE:*
A place
where you can relax
after your strenuous
home life

*ETC:*
A sign
to make others believe
that you know
more than
you actually do

*COMMITTEE:*
Individuals
who can do
nothing individually
and sit to decide
that nothing can be done
together

*EXPERIENCE:*
The name
men give
to their
Mistakes

*ATOM BOMB:*
An invention
to bring an end
to all
inventions

*DIPLOMAT:*
A person
who tells you
to go to hell
in such a way
that you actually look forward
to the trip

*OPPORTUNIST:*
A person
who starts taking bath
if he
accidentally falls
into a river

*MISER:*
A person
who lives poor
so that
he can die RICH!

*FATHER:*
A banker
provided by
nature

*CRIMINAL:*
A guy
no different
from the other,
unless he gets caught

*BOSS:*
Someone
who is early
when you are late
and late
when you are early

*POLITICIAN:*
One who
shakes your hand
before elections
and your Confidence

Later. 
*A very humble request to all Indians. Send this message at least to five persons and ask them to further send to five persons and keep the chain going*_

🔖 *1. Don't throw garbage on the roads/streets*

🔖 *2. Don't spit on roads and walls*

🔖 *3. Don't write on walls and currency notes*

🔖 *4. Don't abuse and insult others*

🔖 *5. Save water and electricity*

🔖 *6. Plant a tree*

🔖 *7. Follow traffic rules*

🔖 *8. Take care of your parents n grand parents, take their blessings & always respect them*

🔖 *9. Respect women*

🔖 *10. Give way to ambulance*

📣 *We got to change ourselves and not the country. Once we change ourselves the country will automatically change*

🔊 *If we want our kids to live in a clean and safe environment then pledge to follow these in your everyday life.*

🎙 *Whether it's Modi or Gandhi or Kejriwal no person or leader can change the country alone, it's you & me who can change our beloved nation by changing ourselves*

* Kindly forward this important message to every single Friend or Group so that reaches to every citizen of India.
Thanks. *