నాన్న అంటే ..!!
నాన్న అంటే చనువున్న గౌరవం,
నాన్న అంటే కారణమున్న కోపం,
నాన్న అంటే పరిమితులు లేని ప్రేమ,
నాన్న అంటే అనంతమైన
కష్టపడే తత్వం,
నాన్న అంటే స్వార్థం లేని అభిమానం,
నాన్న అంటే ఆవేశం లేని ఆలోచన,
నాన్న అంటే నమ్మకంతో కూడిన బాధ్యత,
నాన్న అంటే నన్ను అర్థం చేసుకునే నా-అన్న,
నాన్న అంటే అత్యాశలేని అల్పసంతోషి,
నాన్న అంటే అమితమైన శాంతం,
నాన్న అంటే అనుభవాల సారం,
నాన్న అంటే వెనకుండి నడిపించే శక్తి,
నాన్న అంటే ముందుచూపు నేర్పిన మనీషి,
నాన్న అంటే నిజజీవిత సారాన్ని నేర్పిన గురువు,
క్లుప్తంగా చెప్పాలంటే నాన్న అంటే నాకు దశ దిశ చూపే
మార్గదర్శి,
ఇంత చేసిన నాన్నకి Thanks చెప్తే సరిపొతుందా
జన్మ జన్మలకీ ఆయనకే పుట్టాలని కోరుకోవటంతప్ప !!
No comments:
Post a Comment