తాళం తో పాటే తాళం చెవి
కూడా తయారు చేయబడుతుంది.
ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు.
అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను
భగవంతుడు స్రుష్టించే అవకాశమే లేదు.
●●●•••••●●●•••••●●●•••••●●●
తూటా కంటే శక్తివంతమైనది మాట!
ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు,
ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు💬
●●●•••••●●●•••••●●●•••••●●●
📌మనిషి సమాజంలో
సూదిలా బ్రతకాలి,
కత్తెర లాగ కాదు.
సూది పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.
కత్తెర లాగా విడదీస్తూ కాదు..
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹💖నిజాన్ని మార్చే
శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు,
కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹🏃నీవు సంతోషంగా
ఉన్నావంటే
నీకు సమష్యల్లేవని కాదు,
వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం
నీకున్నాయని...
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸 👬స్నేహితుడిని నీ
దుఃఖసమయంలోను,
యోధుడిని యుద్ధంలోను,
భార్యను పేదరికంలోను,
గొప్పవ్యక్తిని అతని వినయంలోను
పరీక్షించాలి.
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹🔸✊చేసిన తప్పుకు
క్షమాపణ
అడిగినవాడు ధైర్యవంతుడు.
ఎదుటి వారి తప్పును
క్షమించగలిగిన వాడు బలవంతుడు.
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹💖కష్టం అందరికీ
శత్రువే, కానీ
కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే,
సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸ఓటమి లేనివాడికి
అనుభవం రాదు,
అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,
ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,
గెలుస్తావు. 👬🏃
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸🕛ఎవరికైనా ఉండేది
రోజుకు 24 గంటలే,
గెలిచేవాడు ఆ 24 గంటలూ
కష్టపడుతుంటాడు. 🏇
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా
కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు. 👼
అదే తేడా...
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸👊☝గెలవాలన్న తపన,
గెలవగలను అన్న నమ్మకం,
నిరంతర సాధన.
ఈ మూడే నిన్ను గెలుపుకు
దగ్గర చేసే సాధనాలు. 💐💖
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹👌నేను గెలవటంలో
ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను...
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.✌💪
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸✊👍స్వయంకృషితో
పైకొచ్చినవారికి
ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ,
అహంకారం ఉండదు.
●●●•••••●●●•••••●●●•••••●●●
No comments:
Post a Comment