Thursday, February 2, 2017

ఆనందం మిత్రులకు శుభ సాయంకాలము

వర్షం పడుతుండగా ఇంటివైపు వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు అప్పారావు.
.
" ఇంతలో అక్కడే ఆగిపో..నీ ముందున్న చెట్టు పడిపోతుంది" అంటూ ఎవరో అరచినట్టు
అనిపించి ఆగిపోయాడు.
.
వెనక ఎవరూ లేరు కానీ నిజంగానే చెట్టు పడిపోయింది. ఆశ్చర్యపోతూనే ఇంటికి వెళ్ళేందుకు ఆటో ఎక్కబోతుంటే "వద్దు ఎక్కకు. ఆ ఆటోకి యాక్సిడెంట్
అవుతుంది" అని వినిపించి ఆగిపోయాడు.
ఇంతలో మరెవరో ఆ ఆటో మాట్లాడుకున్నారు. అది కదలి కదలగానే కారు వచ్చి కొట్టేసింది.
అప్పారావు మరింత ఆశ్చర్యపోయి .
.
"నన్నింతగా రక్షిస్తున్నావు..ఎవరు నువ్వు?" అని అడిగాడు.
.
" నేను అశరీరవాణిని " అంటూ సమాధానం వచ్చింది.
.

" నా క్షేమం ఇంత కోరేవాడివి నేను పెళ్ళి చేసుకుంటున్నప్పుడు ఎక్కడ చచ్చావ్ " అంటూకోపగించుకున్నాడు అప్పారావు.

No comments:

Post a Comment