🙏సుభాషితం🙏
మూలం🌺
ఉద్యమేన హి సిధ్యంతి కార్యాణి న మనోరథైః ।
న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః ॥
పదవిభాగం🌺
ఉద్యమేన హి సిధ్యంతి కార్యాణి న మనోరథైః । న హి సుప్తస్య
సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః ॥
అన్వయం🌺
కార్యాణి ఉద్యమేన హి సిధ్యంతి। మనోరథైః న (సిధ్యంతి) ।
మృగాః సుప్తస్య సింహస్య ముఖే న హి ప్రవిశంతి॥
ప్రతిపదార్థం🌺
కార్యాణి = పనులు
ఉద్యమేన = ప్రయత్నముతో
హి = మాత్రమే
సిధ్యంతి = సిద్ధిస్తాయి
మనోరథైః = చేయాలన్నకోరికల వలన
న (సిధ్యంతి) = సిద్ధించవు
మృగాః = జంతువులు, లేళ్ళు
సుప్తస్య = నిద్రిస్తున్న
సింహస్య = సింహము యొక్క
ముఖే = నోట్లో(కి)
న హి ప్రవిశంతి = ప్రవేశించవు.
తాత్పర్యం-🌺
పనులు ప్రయత్నముతో మాత్రమే సిద్ధిస్తాయి. చేయాలన్న కోరిక
మాత్రం చేత సిద్ధించవు. మృగాలు నిద్రిస్తున్న సింహం నోట్లోకి తమకు తామే దూరిపోవు.
No comments:
Post a Comment