లావు తగ్గాలని డైటీషియన్‌ని కలిసాడు కేశవ్. ఆ డాక్టర్ అదో
టైపు.
.
కేశవ్ :- సన్నబడాలంటే మాంసం తగ్గించి, ఆకు కూరలు, ధాన్యాలు బాగా
తినాలంటారు .. నిజమేనా?
.
డాక్టర్:- ఏమక్కరలేదు, మేకలు, గొర్రెలు తినేదేమిటి. ఆకులు, గడ్డే కదా.
కోళ్ళకు దాణానే కదా వేస్తున్నాం. మాంసం తింటున్నామంటే పరోక్షంగా ఆకుకూరలు, ధాన్యాలు తింటున్నట్లే !!
.
కేశవ్:- వేపుళ్ళు మంచివి కావంటుంటారు..
.
డాక్టర్:- ఎందుక్కావు? నూనె ఎక్కడినుండి
వచ్చింది?
.
కేశవ్:- వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు.
.
డాక్టర్:- అంటే ధాన్యాల నుంచే కదా,
మరి నీ ఒంటికి అవి ఎందుకు మంచివి కావో చెప్పు?
కేశవ్:- పోనీ మద్యం మానేయాలంటారా?
డాక్టర్:- ఎవరయ్యా నీ బుర్ర పాడు చేసింది? వైన్ వచ్చేది పళ్ళ నుంచి కాదా ? బీరు బార్లీ నుంచే
కదా! దర్జాగా తాగు. పళ్ళు తిన్నంత ఆరోగ్యం.
కేశవ్:- మరి ఐస్‌క్రీమ్స్, చాక్లెట్లు..
డాక్టర్:- లాభం లేదయ్యా! నేను చెప్పేది నీకు అర్ధం
కావట్ళేదు. అవీ పాలు, కూరగాయల బై
ప్రోడక్ట్సే కదా!
కేశవ్:- వ్యాయామం చేస్తే ఎక్కువకాలం బ్రతుకుతారంటారు.
నిజమేనా?
డాక్టర్:-ఎవరు నీకు చెప్పింది? కసరత్తు చేస్తే
గుండె వేగం పెరుగుతుంది. వేగం పెరిగితే ఆయుస్షు ఎలాపెరుగుతుందయ్యా.ఇదెలా ఉందంటే, వేగంగా నడిపితే కారు మన్నిక ఎక్కువ కాలం ఉంటుందన్నట్లుంది
!!
కేశవ్:- అది కాదు. సిట్ అప్స్ చేస్తే, పొట్ట తగ్గుతుందంటారు ..
డాక్టర్:- చూడు.. వ్యాయామం చేయిస్తే చేతికండరాలు పెరుగుతాయి
కదా. అలాంటాప్పుడు సిట్ అప్స్ చేస్తే పొట్ట పెరగదా? కోరి కోరి లావు
అవుతానంటావేమయ్యా!
కేశవ్:- పోనీ మంచి ఫిగర్ కోసం ఈత కొట్టొచ్చా?
.
డాక్టర్:- ఈత కొడితే నాజూగ్గా అవుతారనేది తప్పుడు ప్రచారం.
అదే నిజమైతే తిమింగలాలు ఎందుకు అంత సైజున్నాయో చెప్పు?
.
కేశవ్:- మరి బాడీకి ఓ షేప్ ఎలా వస్తుందో చెప్పండి?
.
డాక్టర్:- రౌండుగా ఉండడం మాత్రం షేపు కాదా? ఎవరా మాట అన్నది?
No comments:
Post a Comment