Thursday, February 2, 2017

నెలకు కనీసం ఒకసారైనా వేప పుల్లతో పళ్లు తోముకోవాలట..! ఎందుకో తెలుసా..?
ఇప్పుడంతా కృత్రిమ యుగం నడుస్తోంది. ఎక్కడ చూసినా కృత్రిమంగా తయారు చేసిన పదార్థాలనే ఎక్కువగా వాడుతున్నారు. ప్రతి పనిలోనూ ఆర్టిఫిషియల్ వస్తువులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అది చివరికి పళ్లు తోముకోవడంలోనైనా సరే టూత్‌బ్రష్, టూత్ పేస్ట్, పౌడర్ వంటి వస్తువులను వాడుతున్నారు. అయితే ఇవన్నీ రసాయనాలు, ప్లాస్టిక్‌తో తయారు చేసినవే. ఒకప్పుడైతే ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థాలతో పళ్లు తోముకునే వారు. ఆ క్రమంలో అప్పటి వారి దంతాలు ఎంతో దృఢంగా ఉండేవి. దీనికి తోడు వారికి దంతాల పరంగా ఎలాంటి సమస్యలు వచ్చేవి కావు. ఫలానా వ్యక్తి తాతో, ముత్తాతో తన పండ్లతో దేన్నయినా చూర్ణంలా నమిలి తింటున్నాడు చూడండి, అంటూ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కానీ వారు దంత ధావనం కోసం పాటించిన పద్ధతులను మాత్రం మనం పాటించడం లేదు. ఆ పద్ధతుల్లో ప్రధానంగా ఒకటైన వేప పుల్ల ఇప్పుడు కనుమరుగై పోయింది. అయితే వేప చెట్లు మాత్రం కనుమరుగు కాలేదు లెండి. ఆ చెట్టు పుల్లను వాడడం మానేశారు అంతే. కానీ వేప పుల్లతో నెలకు కనీసం ఒక్క సారైనా పళ్లు తోముకోవాలట. అలా తోముకుంటే కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

వేపలో సూక్ష్మ జీవులను నివారించే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వేప పుల్లతో పళ్లు తోముకుంటే నోట్లో ఉన్న క్రిములు దాదాపుగా నిర్మూలించబడతాయి.

దంతాలు దృఢంగా మారుతాయి. దంతాలను దృఢంగా మార్చే శక్తి వేప పుల్లకు ఉంది.

చిగుళ్ల సమస్యలు తగ్గిపోతాయి. దంత క్షయం నివారించబడుతుంది. వేప పుల్లతో పళ్లు తోముకునే క్రమంలో ఆ పుల్లను నమిలినప్పుడు దాంట్లోంచి నోట్లోకి ప్రవహించే ద్రవాలు దంత క్షయాన్ని నివారిస్తాయి. అంతేకాదు భవిష్యత్తులో దంత క్షయం రాకుండా చూస్తాయి.

నోటిలో బాక్టీరియా ఎక్కువగా ఉంటే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. దీన్ని నివారించడంలోనూ వేప అద్భుతంగా పనిచేస్తుంది. తరచూ వేప పుల్లతో పళ్లు తోముకుంటే నోటి దుర్వాసన అసలు రాదు.

పంటి నొప్పితో బాధపడుతున్న వారు తరచూ వేప పుల్లతో దంత ధావనం చేసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

దంతాలకు తెల్లదనాన్నిచ్చే శక్తి వేప పుల్లలో ఉంది. తరచూ వేప పుల్లను ఉపయోగిస్తే దంతాలను తెల్లబరుచుకోవచ్చు.


వేప పుల్లను విరిచి అలాగే వాడకుండా దానిపై ఉన్న తోలుని కొద్దిగా తీసి లోపలి పుల్లతో పళ్లు తోముకుంటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి......

No comments:

Post a Comment