*లీటరు మంచినీళ్లు రూ.36 వేలు!*
😳😳😳🙄🙄🙄🤔🤔🤔
క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో విరాట్ కోహ్లీ ఏ హోటల్లో బస
చేసినా అతడికోసం తప్పకుండా *‘ఎవియాన్’*మంచినీళ్ల బాటిళ్లను తెప్పించాల్సిందేనట. మామూలుగా అయితే ఈ
విషయాన్ని అంత ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కానీ ఈ బ్రాండ్ నీళ్ల ఖరీదు లీటరు
రూ.600కు పైనే. అంటే మంచినీళ్లకే రోజుకి కొన్ని వేలవుతాయన్నమాట.
అయ్యబాబోయ్ అంత రేటా అనకండి. ఎందుకంటే దీనికన్నా ఎన్నో రెట్లు ఖరీదైన మంచినీళ్ల
బ్రాండ్లు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే ఖరీదైన ఆ నీటి కథలేంటో చూద్దామా...
*కోనా నిగరి... 750మి.లీ రూ.27వేలు*
ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవే. వీటిని తాగితే ఆరోగ్యం మెరుగు
పడటంతో పాటు, బరువు తగ్గి, చర్మం నిగారింపును
సంతరించుకుంటుందనీ ఒత్తిడి దూరమవుతుందనేది కొందరి నమ్మకం. ఇంతకీ అంత ప్రత్యేకత ఆ
నీటికెలా వచ్చిందంటారా... హవాయి దగ్గర్లోని పసిఫిక్ సముద్ర తీరంలో రెండువేల
అడుగుల లోతు నుంచి తీసుకొచ్చే నీరిది. ప్రత్యేక పద్ధతుల్లో ఆ నీటిలోని ఉప్పదనాన్ని
పోగొట్టి బాటిళ్లలో నింపుతారు. సముద్రం కింద వేల అడుగుల లోతునుంచి వస్తాయి కాబట్టి, స్వచ్ఛంగా ఉండడంతో పాటు వీటిలో ఖనిజ లవణాలు కూడా ఎక్కువ
మోతాదులో ఉంటాయట. కోనా నిగరి నీటికి జపాన్‌లో ఎంత డిమాండ్ ఉందంటే రోజుకి 80వేలకు పైగా బాటిళ్లు అక్కడకు దిగుమతి అవుతున్నాయి.
*బ్లింగ్ హెచ్ టూవో... రూ.2,680*
సెలెబ్రిటీల చేతిలో ఉండే మంచినీళ్ల బాటిల్ కూడా
ఆకర్షణీయంగా ఉండాల్సిందే. ఎలాగూ ఖరీదైన నీళ్లను కొనేది వారే. ఈ సూత్రంతోనే తమ
నీళ్ల బాటిల్ ధరను మరింతగా పెంచింది ‘బ్లింగ్ హెచ్‌టూవో’ కంపెనీ. టెనెస్సీ దగ్గరున్న నీటి బుగ్గల నుంచి సేకరించిన
జలంతో నింపే ఈ బాటిళ్లను స్వరోవ్‌స్కీ రాళ్లతో తీర్చిదిద్దుతారు. దాంతో బాటిల్
తయారీకి అయ్యే ఖర్చు కూడా అదనమన్నమాట.
*వీన్... 750మి.లీ రూ.1500*
వీన్ నీటిని నోట్లో పోసుకున్న ప్రతిసారీ నాలుకకు ఏదో
సుతిమెత్తని అనుభూతి కలుగుతుందట. కాలుష్యం లేకుండా పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం ఉన్న వివిధ ప్రాంతాల్లోని నీటి బుగ్గల
నుంచి జలాన్ని సేకరించి బాటిళ్లలో నింపుతోంది ఫిన్లాండ్‌కి చెందిన వీన్ కంపెనీ.
అలా లాప్‌లాండ్ నుంచీ ప్రపంచంలోనే ప్రకృతి సంపద ఎక్కువున్న దేశంగా గుర్తింపు
పొందిన భూటాన్‌లోని హిమాలయ ప్రాంతం నుంచీ నీటిని సేకరించి వివిధ దేశాలకు ఎగుమతి
చేస్తున్నారు.
*10థౌజండ్ బీసీ... 750మి.లీ రూ.950*
కెనడాలోని వాంకోవర్ నగరానికి 200 మైళ్ల దూరంలో
ఉన్న ఆ పర్వత ప్రాంతంలో ఎవరూ ఉండరు. జంతువులు కూడా కనిపించవు. అక్కడ ఆరువేల అడుగుల
లోతుతో వాలుగా ఉండే హిమనీనదాలను కరిగించి బాటిళ్లలో నింపుతోంది 10థౌజండ్ కంపెనీ. ఈ చోటుకి ఎవరూ వెళ్లలేరు, జంతువులు కూడా ఉండవు కాబట్టి, అక్కడి నీరు
కలుషితం అయ్యే అవకాశం ఉండదు. పైగా హిమనీనదాల నుంచి వచ్చే నీరు కాబట్టి, వీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందనీ చర్మం మీద
ముడుతల్లాంటివి రావనీ చెబుతోంది సంబంధిత కంపెనీ.
*ఆక్వా డెకో... 750మి.లీ రూ.800*
పద్దెనిమిది వేల సంవత్సరాల కిందట ఘనీభవించిన హిమనీనదాల
నుంచి సేకరించిన నీరిది. కెనడాకు చెందిన ‘ఆక్వా డెకో’ ఉత్తమ నాన్ కార్బొనేటెడ్ స్ప్రింగ్ వాటర్‌గా 2007లో బంగరు పతకాన్ని కూడా సాధించింది.
*ఎవియాన్... లీటరు రూ.600కు పైనే*
1789లో ఫ్రాన్స్‌కి చెందిన మార్కిస్ అనే
వ్యక్తి రోజూ వాకింగ్‌కి వెళ్తూ స్థానికంగా ఎవియాన్ లెస్ బెయిన్స్ దగ్గరున్న
నీటి బుగ్గ దగ్గర నీరు తాగేవాడట. ఆ నీరు తాగడం మొదలుపెట్టాక అతడికున్న కిడ్నీ, లివర్ సమస్యలు నయమయ్యాయట. అదికాస్తా ప్రచారం కావడంతో ఆ
నీటిని అమ్మడం వ్యాపారంగా మారింది. అదే తర్వాతి కాలంలో ఎవియాన్ బ్రాండ్‌గా
విస్తరించింది. చాలామంది ప్రముఖులు ఈ నీటిని ప్రత్యేకంగా తెప్పించుకుని తాగుతారు.
మనదేశంలోనూ ఆన్‌లైన్ ద్వారా ఈ బాటిళ్లను అమ్ముతున్నారు.
*లాక్వెన్ ఆర్టెస్ వాటర్ 750మి.లీ రూ.400*
దక్షిణ అమెరికాలోని ఆండెస్ పర్వతాల దగ్గర ఎలాంటి కాలుష్యమూ
లేని మారుమూల ప్రాంతంలో 1500 అడుగుల లోతుకు
తవ్వి తీసిన నీరే లాక్వెన్ మినరల్ వాటర్. ‘బాటిల్లో నింపే
వరకూ గాలి కూడా తాకనంత స్వచ్ఛంగా ఉంటాయి ఈ నీళ్లు’ అంటూ ప్రచారం
చేస్తున్నారు ఈ కంపెనీ నిర్వాహకులు.ఇంతకూ ఆశ్చర్యంలోంచి తేరుకున్నారా... లేదా..?
No comments:
Post a Comment