Thursday, February 2, 2017

 🙏సుభాషితం🙏
మూలం
గతే శోకం న కుర్వీత భవిష్యం నైవ చింతయేత్।
వర్తమానేషు కాలేషు వర్తయంతి విచక్షణాః॥
🌼
పదవిభాగం
గతే శోకం న కుర్వీత భవిష్యం న ఏవ చింతయేత్। వర్తమానేషు కాలేషు వర్తయంతి విచక్షణాః॥
🌻
అన్వయం
గతే శోకం న కుర్వీత। న ఏవ భవిష్యం చింతయేత్। విచక్షణాః వర్తమానేషు కాలేషు వర్తయంతి ।
🍀
ప్రతిపదార్థం
గతే = వెళ్ళిపోయిన దానియందు, జరిగిపోయిన దాని యందు
శోకం = బాధ
న కుర్వీత = చేయ (అనుభవించ)కూడదు.
భవిష్యం = జరుగబోవు దాని గురించి
న ఏవ చింతయేత్ = బాధపడరాదు.
విచక్షణాః = మంచి చెడుల జ్ఞానమున్నవారు
వర్తమానేషు కాలేషు = వర్తమానకాలంలో, జరుగుతున్నదాని యందు
వర్తయంతి = ప్రవర్తిస్తారు.
🍁
తాత్పర్యం

జరిగిపోయిన దాని గురించి, జరుగబోవు దాని గురించి బాధపడరాదు. మంచిచెడులవిచక్షణ కలిగిన వారెపుడూ వర్తమానంలోనే పని చేస్తారు.🎀

No comments:

Post a Comment