Thursday, February 2, 2017

అనుదినం అలసి సొలసి ఇంటికి తిరిగొస్తాను ... ఇప్పటికీ అర్ధం కాదు...
పనిచేయటానికి బ్రతుకుతున్నానా? లేక బ్రతకటానికి పని చేస్తున్నానా??

బాల్యం లో అందర్నీ మరీ మరీ అడగబడ్డ ప్రశ్న ...
పెరిగి పెద్దయాక ఎమౌదామని? ఆఁ... సమాధానం ఇప్పుడు దొరికింది ...
మళ్ళీ బాల్యం కావాలని... మళ్ళీ పిల్లాడిగా మారిపోవాలని.... ...​...​...​...​...

ఓ జీవితామా! అలసిపోయాను నీ నౌకరీ తో ఇక లేక్కా పద్దు తేల్చడమే మంచిది....

మిత్రుల నుంచి దూరం వెళ్ళాక నిజం తెలిసింది...
వాళ్ళు పోకిరీ వెధవలే ... డౌటే లేదు... ఐతే ... వెలుగు చూపింది వాళ్ళే మరి...​....​...

జేబు నిండుగా ఉన్నపుడు ... ఈ దునియా ఏమిటో తెలిపింది వాళ్ళే...
జేబు ఖాళీ అయినపుడు ... తన వాళ్లెవరో తెలిపిందీ వాళ్ళే...
డబ్బు సంపాదించేటపుడు తెలిసింది...
విలాసాలన్నీ అమ్మా నాన్నల డబ్బుతోనే సమకూడేవని...
మనం సంపాదించిందంతా అవసరాలకే సరిపోతుందని...​...​...​...​...

నవ్వాలని అనిపించకపోయినా ... నవ్వాల్సిన పరిస్థితి...
ఎవ్వరైనా అడిగారనుకోండి --- ఎలా వున్నవని ...
ఓహ్ .. బ్రహ్మాండంగా వున్నా... అని అనక తప్పదు ...
ఫ్రెండ్స్...ఇది జీవిత నాటకం... ఇక్కడ అందరూ నటులే... నటించక తప్పదు....
నిప్పు రాజేయాల్సిన పనే లేదు ... ఇక్కడ మనిషి మనిషిని చూస్తే భగ్గుమంటాడు...
సైంటిస్టులు పరిశోధనలెన్నో చేస్తున్నార్ట.... బాహ్య లోకం లో జీవం ఉందా లేదా అని....
మరి... లైఫ్ లో సంతోషం ఉందా లేదా అని మనిషి వెతకడమే లేదు !!!

అసలు నిద్రకు చావుకు తేడా ఏమిటి?
ఎవరో మహానుభావుడు ఎంత అందంగా శెలవిచ్చారు!!!
నిద్ర, సగం మృత్యువట! మరి మృత్యువు, ఆఖరి నిద్రట!!!
జీవితమన్నది తనంత తానుగా నడచి పోతుంది…. గడచి పోతుంది.....
పాడెలు మాత్రమే వేరొకళ్ళ సాయంతో పైకి లేస్తాయి...   ....​....​....​.....

తెల్లారి పోతున్నది...  సాయం వేళా జరిగి పోతున్నది...
మన జీవన యాత్ర అలాగే గడచి పోతున్నది....
ఒకడు రోదించి ఆనందిస్తాడు ... మరొకడు నవ్వుతూ బాధను దిగమింగుతాడు ...
వీధి లీల విచిత్రమైంది...
బ్రతికున్న మనిషి నీటిలో మునక వేస్తాడు... చచ్చి శవమైతే పైకి తేలి కనిపిస్తాడు...
ఎంటో!! జీవితం కండక్టర్ లా తయారయింది...
ప్రయాణం ఐతే ప్రతి దినం చెయ్యాలి... చేరే గమ్యం మాత్రం లేనే లేదు....​...​...​...

ప్రతి ప్రశ్నకు సమాధానం కోసం నేను వెదుకుతూనే వున్నా ...
నా గదికి చేరాకే అసలు జవాబు దొరికింది నాకు....
గది పై కప్పు అంటోంది - ఉన్నత ఆశయాలు కలిగి ఉండాలని...
గది లోని పంఖా - చల్లగా ఉండాలంటోంది.... BE COOL!!!
గడియారం చెబుతోంది - ప్రతి నిముషం విలువైందని ...
అద్దం అంటోంది ఏదైనా చెయ్యాలనుకుంటే నిన్ను నువ్వు ఆత్మావలోకనం చేస్కోమని....
కిటికీ అంటోంది బయటి ప్రపంచాన్ని వీక్షించి తెలుసుకొమ్మని...
క్యాలండర్  చెబుతోంది – BE UPTODATE అని ...
తలుపు తట్టి మరీ చెబుతోంది ఏదైనా సాధించాలంటే శక్తి నంతా కూడదీసుకోవాలని ...​
ఈ గీతలేంటో బహు విచిత్రంగా ఉంటాయి ... నిజం....
నుదుటి మీద గీస్తే.... నీ జీవన గమ్యాన్ని చిత్రీస్తాయి...
నేల మీద రాస్తే (సరి) హద్దులే అవుతాయి ...
దేహం పై గీకితే రక్తన్నే ఓడుస్తాయి...
బాంధవ్యాల మీద గీస్తే అడ్డు గోడలైపోతాయి ...​...​...​...​...​....

ఒక రూపాయి ఒక లక్షకు సమానమౌతుందా ....​...
కానీ, అదే ఒక రూపాయిని లక్ష నుండి విడదీస్తే , అది లక్ష ఎప్పటికీ కాదు...
అందుకే... మీకున్న లక్షలాది మిత్రుల్లో ... ఆ రూపాయినే నేను ...​...
జర భద్రంగా చూసుకోండి మరి...​...​...​...

మిగతా అంతా కపటం, ప్రలోభం ...  ... వంచన, మోసం ...​...​...​...

No comments:

Post a Comment