Tuesday, March 28, 2023

Parijatham Flower

 *పంచ మహాపాత కాలను పోగొట్టే పారిజాతపుష్పం...!!*

*పారిజాత పుష్పాలు 9రకాలు*

1.ఎర్ర(ముద్ద)పారిజాతం

2.రేకు పారిజాతం

3.తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతం (ఎక్కువగా అందుబాటులో ఉన్నది)


4.పసుపు పారిజాతం

5.నీలం పారిజాతం

6.గన్నేరు రంగు పారిజాతం


7.గులాబీరంగు పారిజాతం

8.తెల్లని పాలరంగు పారిజాతం

9.ఎర్ర రంగు పారిజాతం


ఎరుపు రంగు పారిజాతం తో విష్ణువును ఆరాధించరాదు...

ఎరుపు తమోగుణం విష్ణువు సత్వగుణం, పారిజాత పుష్పాలు క్రింద పడిన వాటినే వాడాలి, చెట్టు నుండి కోసి వాడరాదు.

పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాగు కోకూడదని వరం పొందినది, రంగు,..వైశాల్యం,..గుణం,..దేవతా స్వరూపాన్ని బట్టి దేవతలను ఆరాధించాలి.


ఏ పూలను క్రింద పడ్డవి పూజకు వాడరాదు, ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పూవు తప్ప.

భూ స్పర్శ, మృత్తికా(మట్టి)స్పర్శ

జల స్పర్శ ,హస్త స్పర్శ

తరువాత స్వామి స్పర్శ.

ఈ 5 స్పర్శల తోను

పంచ మహా పాతకాలను

పోగొట్టేదే పారిజాతం...


స్వస్తి..🙏🌹


🌸🌹🌺🌷🪷🌻🍂🍃

Sri Anjaneya Dandakam


 *శ్రీ ఆంజనేయ దండకమ్...!!*


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం

భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం

భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు

సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి

నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ

నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై

రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్

నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే

నా మొరాలించితే నన్ను రక్షించితే

అంజనాదేవి గర్భాన్వయా దేవ

నిన్నెంచ నేనెంతవాడన్

దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్

దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై

స్వామి కార్యార్థమై యేగి

శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి

సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి

వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి

కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్

లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్

యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి

యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్^^జేసి

సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి

యాసేతువున్ దాటి వానరుల్^మూకలై పెన్మూకలై

యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి

బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్^వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు

సంజీవినిన్^దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా

కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని

వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ

నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,

సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,

యంతన్నయోధ్యాపురిన్^జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న

నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా

నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్^ల్బాయునే భయములున్

దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో

వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర

నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్

వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్

తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ

నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల

కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్

పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్

నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్

బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని

రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి

రారోరి నాముద్దు నరసింహ యన్^చున్ దయాదృష్టి

వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా

నమస్తే సదా బ్రహ్మచారీ

నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః...🙏🙏🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Bhadrachalam- Sri Sitha Rama


 *భద్రాచలం లో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం గురించి...!!*

భద్రుడు అనే ఋషి,,, శ్రీ రాముడిని,,  ఒక వరం అడిగాడు.

అసలు భద్రుడు,,, ఎవరు అంటే... మేరు పర్వత రాజుకి 2 కొడుకులు.

రత్నుడు,,,,భద్రుడు,,,,

ఇద్దరూ విష్ణు భక్త్తులు.,,ముక్తి పొంది పర్వతాలుగా,,, మారారు,,,,

రత్నుడు అన్నవరం లో రత్నగిరిగా ,,,,  భద్రుడు భద్రాచలం లో " భద్రగిరి' గా మారారు).

ఆ వరం ఏంటంటే నేను తిరిగే ఈ కొండల్లో నీవు కొలువై వుండాలి.,,,  దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకటానికి వెళ్తున్నాను.,,,  తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినపుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట.,,,


కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మరచిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు, అది తెలిసిన భద్రుడు ఘోరతపస్సు చేయటంతో శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి ఆ కొండపై వెలిసాడు,,


అయితే ఆయన వచ్చే కంగారులో రామావతారంలో ఉపయోగించిన బాణం, విల్లుతో పాటు విష్ణువు చేతిలో వుండే శంఖచక్రాలను కూడా తనతో తీసుకువచ్చేశాడని అక్కడ వెలిసే కంగారులో ఎప్పుడూ కుడివైపునే లక్ష్మణుడు ఎడమవైపున నిల్చొన్నట్లు పురాణాలను బట్టి తెలుస్తుంది.

అందుకే భద్రాచలం లో మూల విగ్రహం ఎక్కడా లేని విధంగా వుంటుంది. 

రాములవారి విగ్రహం నాలుగు చేతులతో వుండగా లక్ష్మణ స్వామి ఎడమవైపున వున్నట్లు కనపడుతుంది. 

ఆయన నాలుగు చేతులలో కుడివైపున వున్న రెండు చేతులలో శంఖము, బాణము వుండగా, వున్న రెండు చేతులలో విల్లు, చక్రము కనిపిస్తుంది...


జై శ్రీరామ్ ..🙏🌹

Sunday, March 26, 2023

Sivalaya Seva Phalam


 *శివాలయ సేవాఫలం...!!*

                        

🌸మనలో చాలామంది ఆలయాలకు వెళ్తాం. రోజూగానీ, వారానికోసారి కానీ, ఏదైనా పండుగలు, ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తాం.


🌸 ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకుంటాం. అక్కడ విశేషమైన ఆర్జిత సేవలు జరిపించుకుంటాం. అవకాశాన్ని బట్టి అక్కడి ఇతర ఆలయాలను, సందర్శనీయ స్థలాలను దర్శిస్తాం.


🪷 క్షేత్రంలో నిద్రచేస్తాం. అంతవరకే చాలా మందికి తెలిసిన విషయం.

భక్తులకు తెలియాల్సిన మరో విషయం ఏంటంటే ఆలయంలో ఎన్నో సేవలను మనం స్వచ్ఛందంగా నిర్వహించవచ్చు. అలా చేస్తే కలిగే ఫలితం చాలా విశేషంగా చెప్పబడింది.


🌸శివాలయం నిర్మాణం చేస్తే.. నిర్వహణ చేస్తే.. పునరుద్ధరణ చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో దానితో సమానమైన ఫలితాలు శివాలయ సేవ ద్వారా పొందవచ్చని శివధర్మశాస్త్రంలో వివరించబడింది.


     🌹🙏 దర్శిస్తే చాలు...🙏🌹


🌷దూరతః శిఖరం దృష్ట్వా నమస్కుర్యాచ్ఛివాలయమ్ |


 సప్తజన్మకృతం పాపం క్షిప్రమేవ వినశ్యతి ||🌷


🪷దూరం నుండి ఆలయశిఖరాన్ని దర్శించిన వెంటనే నమస్కరించాలి. అలా చేస్తే ఏడుజన్మలలో తాను చేసిన పాపాలనుండి వెంటనే విముక్తుడౌతాడు. 


    🌹🙏  పరిశుభ్రం చేస్తే...🙏🌹


🌷పశ్యన్ పరిహరన్ జంతూన్ మార్జన్యా మృదుసూక్ష్మయా |


శనైస్సమ్మార్జనం కుర్యాత్ చాంద్రాయణఫలం లభేత్ ||🌷


🌸శివాలయానికి వెళ్లిన భక్తులు అక్కడ ఏవైనా ప్రాణులు, పశువులు తిరుగుతుంటే వాటిని హింసించకుండా బయటకు పంపి , మెత్తటి మార్జని (చీపురు)తో ఆలయాన్ని తుడిచి పరిశుభ్రం చేస్తే చాంద్రాయణ వ్రతం ఆచరించిన ఫలితం కలుగుతుంది.


🌹🙏ఆవు పేడతో అలికితే...🙏🌹


🌸ఆవు పేడతో ఆలయాన్ని శుభ్రంగా అలికితే కూడా ఎంతో ఫలితం ఉందని చెప్పబడుతోంది. ఆ ఆవు పేడను మంచి ఆవుల నుండి సేకరించాలి. 

తన ఇంటినుంచి తీసుకురావాలి. లేదా పవిత్రమైన చోటునుండి తేవచ్చు. ఆ గోమయాన్ని కూడా పైభాగం, కిందభాగం వదిలి మధ్యలో శుద్ధం, మలినం కాని ఆవుపేడనే తీసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. 

అలాంటి గోమయంతో శివాలయ పరిసర ప్రాంతాన్ని చక్కగా అలికితే తమ పూర్వీకులు తరించి గోలోకం చేరుకుంటారు. అంతేకాక అలా చేస్తే సిరిసంపదలతో తులతూగుతారు.


    🌹🙏నీటితో శుభ్రపరిస్తే...🙏🌹


🌷యః కుర్యాత్ సర్వకార్యాణి వస్త్రపూతేన వారిణా |


స ముని స్స మహాసాధు స్స యోగీ స శివం ప్రజేత్ ||🌷


🌸వస్త్రంతో వడగట్టిన నీటితో ఆలయాన్ని పరిశుభ్రం చేసినవారు సజ్జనులు. అతడు యోగియై శివుని చేరుకుంటాడు. 

అలాగే శివాలయం నేలను అద్దంలా.. అంటే నేలవైపు చూస్తే, తన ప్రతిబింబం కనపడేలా తుడిచినా ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది.


🌹🙏పూలతో అలంకరిస్తే...🙏🌹


🌷యావద్ధస్తా భవే ద్భూమిః సమన్తా దుపశోభితా


తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే🌷


🌸శివాలయాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించినా.. అందంగా తీర్చిదిద్దినా...ఎంత ప్రదేశం తీర్చిదిద్దాడో దాన్ని అంగుళాలతో కొలిచి అంతకాలం రుద్రలోకంలో నివసిస్తారని చెప్పబడుతోంది. పుష్పవనాలను పాదుగొల్పినా శివలోకం చేరతాడు.


🌹🙏శివరూపాలను చిత్రిస్తే...🙏🌹


🌷యావంతి రుద్రరూపాణి స్వరూపాణ్యపి లేఖయేత్ |


తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే ||🌷


🪷చిత్రకారులను రప్పించి వారితో శివాలయంలో వేదపురాణాలలో పేర్కొనబడిన శివుని అవతారాలు, లీలలకు సంబంధించిన చిత్రాలు వేయించాలి. 


🌸అలా ఎన్ని బొమ్మలు చిత్రిస్తారో అంతకాలం రుద్రకాలంలో గొప్పగా ప్రకాశిస్తారు.


    🌹🙏వెల్ల వేయిస్తే...🙏🌹


🌷సుధావిలిప్తం యః కుర్యాత్ సర్వయత్నైశ్శివాలయమ్ |


తావత్పుణ్యం భవేత్ సోపి యావదాయతనే కృతే ||🌷


🪷శివాలయానికి, ప్రాకారం గోడలకు సుధాకర్మ (సున్నం పూయించడం) చేయించినవారికి ఆలయనిర్మాణం చేసిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది. 

అలాగే ప్రతి సంవత్సరం విడువకుండా, పాలవంటి తెల్లసున్నంతో లేదా వేరే రంగులతో అందంగా వెల్లవేయించినా అతడికి శివలోకవాసపుణ్యం లభిస్తుంది.

 ఎన్నోసేవలు...

అలాగే ఆలయంలోని గోడలకు సుగంధాలు పూయడం, గుగ్గిలంతో ధూపం వేయడం, చక్కగా రంగురంగుల ముగ్గులు పెట్టడం,


🌸పూలతోటలను బాగుచేయడం, ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తీసివేయడం, దీపాలకు కావాల్సిన వత్తులను సిద్ధం చేయడం, తోటి భక్తులకు సాయం చేయడం, ఆలయంలో భక్తులకు మంచినీరు ఇవ్వడం, ప్రసాదవితరణ ఇలా ఎన్నో సేవలను భక్తులు ఆచరించవచ్చు. 


🌸ఈ అవకాశం మనం గ్రామాల్లో ఉండే ఎన్నో ఆలయాల్లో మనం నిర్వహించుకుంటే ప్రతీ దేవాలయం దివ్యమైన భవ్యమైన శోభతో అలరారుతుంది. 

భక్తులకూ కల్పవృక్షమై నిలుస్తుంది. మరింకెందుకాలస్యం ?

ఆలయ సేవలో నిమగ్నమౌదాం. 

శివానుగ్రహాన్ని పొందుదాం.🙏🙏🌿☘️

Saturday, March 25, 2023

Types of Rains

 *వాన పలుకులు  *తెలుగా మజాకా*

మనకు వర్షం గురించే తెల్సు.. వానలు కురుస్తాయి. ఎప్పుడూ ఒకే‌ వాన కురిస్తే ఎలా? ఇన్ని రకాల వానలు కురిస్తే?


* గాంధారి వాన = కంటికి ఎదురుగా ఉన్నది  కనిపించనంత జోరుగా కురిసే వాన

* మాపుసారి వాన = సాయంత్రం కురిసే వాన

* మీసరవాన = మృగశిరకార్తెలో కురిసే వాన

* దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన

* సానిపి వాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన

* సూరునీల్ల వాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన

* బట్టదడుపు వాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన

* తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన

* సాలు వాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన

* ఇరువాలు వాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన

* మడికట్టు వాన = బురదపొలం దున్నేటంత వాన

* ముంతపోత వాన = ముంతతోటి పోసినంత వాన

* కుండపోత వాన = కుండతో కుమ్మరించినంత వాన

* ముసురు వాన = విడువకుండా కురిసే వాన

* దరోదరి వాన = ఎడతెగకుండా కురిసే వాన

* బొయ్య బొయ్య గొట్టే వాన = హోరుగాలితో కూడిన వాన

* రాళ్ల వాన = వడగండ్ల వాన

* కప్పదాటు వాన =  అక్కడక్కడా కొంచెం కురిసే వాన

* తప్పడ తప్పడ వాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.

* దొంగ వాన = రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన

* కోపులు నిండే వాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన

* ఏక్దార వాన = ఏకధారగా కురిసే వాన

* మొదటివాన = విత్తనాలకు బలమిచ్చే వాన

* సాలేటి వాన = భూమి తడిసేంత భారీ వాన

* సాలు పెట్టు వాన = దున్నేందుకు సరిపోయేంత వాన

.

అమ్మో ఇన్నివానలా ! *తెలుగా మజాకా*!!!

Telugu Is God

 *తెలుగు భాషలోని వాగ్దేవతలు ..వారి అద్భుత శక్తులు..!!*

తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల.. దాని అంతర్నిర్మాణం


'అ నుండి అః' వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని 'చంద్ర ఖండం' అంటారు. 

ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత 'వశిని' అంటే వశపరచుకొనే శక్తి కలది.


'క' నుండి 'భ' వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని 'సౌర ఖండం' అంటారు.


'మ' నుండి 'క్ష' వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని ' అగ్ని ఖండం' అంటారు.


ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.


సౌర ఖండంలోని ' క 'నుండి 'ఙ' వరకు గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి. అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.


'చ' నుండి 'ఞ' వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత 'మోదిని' అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.


'ట' నుండి 'ణ' వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి 'విమల'. అంటే మలినాలను తొలగించే దేవత.


'త' నుండి 'న' వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత 'అరుణ' కరుణను మేలుకొలిపేదే అరుణ.


'ప' నుండి 'మ' అనే ఐదు అక్షరాలకు అధిదేవత 'జయని'. జయమును కలుగ చేయునది.


అలాగే అగ్ని ఖండంలోని 'య, ర,ల, వ అనే అక్షరాలకు అధిష్టాన దేవత ' సర్వేశ్వరి'. శాశించే శక్తి కలది సర్వేశ్వరి.


ఆఖరులోని ఐదు అక్షరాలైన 'శ, ష, స, హ, క్ష లకు అధిదేవత 'కౌలిని'


ఈ అధిదేవతలనందరినీ 'వాగ్దేవతలు' అంటారు...

అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది...

ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి ఉద్భవించింది. అంటే బ్రహ్మమే శబ్దము. ఆ బ్రహ్మమే నాదము.


మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.


అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి.


కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.


మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత. 

మనం చేసే శబ్దమే ఆ దేవత, మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత. 

ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత. ఎంత అద్భుతం,

ఇది మన తెలుగు వైభవం. 

ఇది సనాతన ధర్మం, ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం...🙏🌹

Friday, March 24, 2023

What not to do.......

 ► బొట్టు లేకుండా ఉండటం, కాటుక పెట్టుకోకపోవడం (అధికారం, ఆచారం కలిగినవాళ్ళు)

► గడపలపై కూర్చోవటం

► నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం.

► ఎడమ చేతితో పిల్లలను కొట్టటం (కుడి చేత్తో కొడితే శుభమని అర్థం కాదు).

► స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవటం (ఉతికిన బట్టలు ఉండి కూడా) 

► రాత్రిపూట ఇళ్ళు చిమ్మటం, అన్నం ఎత్తి పడవేయటం

► కూర్చున్న కుర్చీల కింద, పీటల కింద నీళ్ళు చిమ్మటం (పోయటం)

► కాళ్ళు దాటుకుంటూ వెళ్ళటం (నడవటం)

► రోళ్ళు, రోకలిబండ, పాత్రలు కడగకుండా ఉంచటం

► చీకట్లో భోజనం చేయటం, కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేయటం

► భోజనం చేసి స్నానం చేయటం, సహపంక్తి భోజనాలలో మధ్యలో లేచిపోవటం

► భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావడం (అన్నం మనిషి కొరకు ఎదురు చూడకూడదు)

► అన్నం తింటూ చేతులు నాక్కోవటం

► బుసలు కొడుతూ కాఫీ, టీ వంటివి తాగటం  

► అదేపనిగా కాళ్ళు ఊపడం

► ఒళ్ళో కంచం పెట్టుకుని భోజనం చేయటం

► అన్నం చిన్నముద్దలుగా చేసి గాలిలో ఎగరవేస్తూ నోటితో లాఘవంగా పట్టుకొని తినడం

► మంగళ సూత్రాలతో నారింజ, బత్తాయి వంటి పండ్లను కోయడం. (మంగళ సూత్ర లోహము నిత్య ఉపయోగార్థమైన వస్తువు కాదు. పవిత్రతకు మాంగల్యానికి చిహ్నము)

► మంచం మీద కూర్చుని భోజనం చేయటం

► దీపారాధనకు ఒక్కటే వత్తి వెలిగించటం, దీపాన్ని నోటితో ఊది ఆర్పివేయటం 

► అదేపనిగా ఉమ్మి వేయటం, పళ్ళు కుట్టుకోవడం, చెవులలో పుల్లలు పెట్టి కెలకటం, గోళ్ళు కొరకటం, కనుబొమ్మలు కత్తిరించుకొనుట (రంగస్థల కళాకారులు కానివారు)

► రొమ్ము మీద వెంట్రుకలు కత్తిరించుకొనుట (రంగస్థల కళాకారులు కానివారు)

► మిట్టమధ్యాహ్నం స్నానం చేయడం.

Tuesday, March 21, 2023

Sri Anjaneya Navarathna Mala Stotram


 *హనుమగుణగణములతో /శ్రీ ఆంజనేయ నవరత్నమాలాస్తవం*


   గుణగణములు

**************

       రామ పూజారి పర ఉపకారి

       మహావీర భజరంగ బలీ        

       సద్ధర్మ చారి సద్బ్రహ్మ చారి 

       మహా వీర భజరంగబలీ!        


జ్ఞాన గుణసాగర

రూప ఉజాగర

శంకర సువన

సంకట మోచన 

మహా వీర భజరంగబలీ!        

        

కేసరి నందన

కలిమల భంజన

రాఘవ దూత

జయ హనుమంత 

మహా వీర భజరంగబలీ!        

        

అంజని నందన

అసురనికందన

మంగళహారతి

మారుతి నందన

మహా వీర భజరంగబలీ!

    

జయ రణధీర

జయ రణశూర

జయ బలభీమ

జయ బలధామ 

మహా వీర భజరంగబలీ!  


వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము. 

సుందరకాండ సారమైన 

9 శ్లోకములతో ఏర్పడినదే.........

*శ్రీఆంజనేయ నవరత్నమాలాస్తోత్రం.*


రత్ననములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామివారికి సమర్పంచబడినది.


ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది. 

ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. 

ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది. 

శ్లోకము తత్‌సంబంధిత గ్రహము, రత్నముల వివరములు స్తోత్రంలో తెలుపబడినవి. నవగ్రహములకు ఆయా శ్లోకములతో జపముచేసి ఫలితం పొందవచ్చునని చెప్పబడినది.  


     *శ్రీ ఆంజనేయ నవరత్నమాలాస్తోత్రం* 


1) మాణిక్యం (సూర్యుడు)

**************


శ్లో!! తతో రావణనీతాయా: సీతాయాశ్శత్రుకర్శన: |

ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||


అర్థము : అనంతరము అరివవీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతజాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను.



2) ముత్యం (చంద్రుడు)

**************


శ్లో!!యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర

 యథా తవ|

స్మృతిర్మతిర్ధృ తిర్ధాక్ష్యం

 స కర్మసు న సీదతి ||


అర్థము : నీవలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వముగలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు.


3) ప్రవాలం (కుజుడు)

**************


శ్లో!! అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం |

అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక: ||


అర్థము : దిగులుపడకుండా ఉత్సాహముతో నుండుటవలన కార్యసిద్ధియు, పరమ సుఖము కలుగును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి యుండటయే శ్రేయస్కరము.



4) మరకతం (బుధుడు)

****************


శ్లో!! నమోస్తు రామాయ సలక్ష్మణాయ

దేవ్యై చతస్యై జనకాత్మజాయై |

నమోస్తు రుద్రేంద్రయమనిలేభ్య:

నమోస్తు చంద్రార్కమరుద్గణభ్య: ||


అర్థము : శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు.



5) పుశ్యరాగం (గురుడు)

*****************


శ్లో!! ప్రియన్న సంభవేద్దు:ఖం అప్రియాదధికం భయం|

తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం|| 



6) హీరకం (శుక్రుడు)

**************


శ్లో!! రామ: కమలపత్రాక్ష: సర్వసత్త్వమనోహర|

రూపదాక్షిణ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే ||


అర్థము : ఓ జానకీ! శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులుగలవాడు. తన నిరుపమానకాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహసౌందర్యము, గుణసంపదయు గలవాడు.



7) ఇంద్రనీలం (శని)

***************


శ్లో!! జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: |

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ: ||


అర్థము : మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. అసహాయ శూరుడు, కోసలదేశప్రభువు ఐన శ్రీరామునకు నేను దాసుడను.



8) గోమేదికం (రాహువు)

*****************


శ్లో!!యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తప: |

యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమత: ||


అర్థము : నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచిరించియున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా! హనుమంతుని చల్లగా చూడుము.



9) వైడూర్యం (కేతువు)

*****************


శ్లో!!నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం |

అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||


అర్థము : శత్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతోగూడి అయోధ్య యందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలో చూడగలవు.


ఇతి శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం సంపూర్ణం.🙏

Sri Subrahmanya Aparaadha Kshamapana Stothram


 *సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం🙏🌿🌺🌹*


నమస్తే నమస్తే గుహ తారకారే

నమస్తే నమస్తే గుహ శక్తిపాణే ।

నమస్తే నమస్తే గుహ దివ్యమూర్తే

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 1 ॥


నమస్తే నమస్తే గుహ దానవారే

నమస్తే నమస్తే గుహ చారుమూర్తే ।

నమస్తే నమస్తే గుహ పుణ్యమూర్తే

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 2 ॥


నమస్తే నమస్తే మహేశాత్మపుత్ర

నమస్తే నమస్తే మయూరాసనస్థ ।

నమస్తే నమస్తే సరోర్భూత దేవ

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 3 ॥


నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూప

నమస్తే నమస్తే పరం జ్యోతిరూప ।

నమస్తే నమస్తే జగం జ్యోతిరూప

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 4 ॥


నమస్తే నమస్తే గుహ మంజుగాత్ర

నమస్తే నమస్తే గుహ సచ్చరిత్ర ।

నమస్తే నమస్తే గుహ భక్తమిత్ర

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 5 ॥


నమస్తే నమస్తే గుహ లోకపాల

నమస్తే నమస్తే గుహ ధర్మపాల ।

నమస్తే నమస్తే గుహ సత్యపాల

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 6 ॥


నమస్తే నమస్తే గుహ లోకదీప

నమస్తే నమస్తే గుహ బోధరూప ।

నమస్తే నమస్తే గుహ గానలోల

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 7 ॥


నమస్తే నమస్తే మహాదేవసూనో

నమస్తే నమస్తే మహామోహహారిన్ ।

నమస్తే నమస్తే మహారోగహారిన్

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 8 ॥


*ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రం🙏*

Monday, March 20, 2023

Navagraha Mangalashtakam

 *॥ నవగ్రహమంగళశ్లోకాః (నవగ్రహ మంగళాష్టకం) ॥*


*భాస్వాన్ కాశ్యపగోత్రజోఽరుణరుచిర్యస్సింహపోఽర్కస్సమి-*

*త్షట్త్రిస్థోఽదశశోభనో గురుశశీ భౌమాస్సుమిత్రాస్సదా,*

*శుక్రో మన్దరిపుః కళిఙ్గజనపశ్చాగ్నీశ్వరౌ దేవతే*

*మధ్యేవర్తులపూర్వదిగ్దినకరః కుర్యాత్సదా మంగళమ్  ౧ *


*చంద్రః* *కర్కటకప్రభుస్సితనిభశ్చాత్రేయగోత్రోద్భవ-*

*శ్చాత్రేయశ్చతురశ్రవారుణముఖశ్చాపే ఉమాధీశ్వరః,*

*షట్సప్తాగ్ని దశైకశోభనఫలో నోరిర్బుధార్కౌప్రియౌ*

*స్వామీ యామునజశ్చ పర్ణసమిధః కుర్యాత్సదా మంగళమ్  ౨ *


*భౌమో దక్షిణదిక్త్రికోణయమదిగ్వింధ్యేశ్వరః ఖాదిరః*

*స్వామీ వృశ్చికమేషయోస్సు గురుశ్చార్కశ్శశీ సౌహృదః,*

*జ్ఞోఽరిష్షట్త్రిఫలప్రదశ్చ వసుధాస్కందౌ క్రమాద్దేవతే*

*భారద్వాజకులోద్వహోఽరుణరుచిః కుర్యాత్సదా మంగళమ్  ౩ *


*సౌమ్యః పీత ఉదఙ్ముఖస్సమిదపామార్గో త్రిగోత్రోద్భవో*

*బాణేశానదిశస్సుహృద్రవిసుతశ్శేషాస్సమాశ్శీతగోః,*

*కన్యాయుగ్మపతిర్దశాష్టచతురష్షణ్ణేత్రగశ్శోభనో*

*విష్ణుర్దేవ్యధిదేవతే మగధపః కుర్యాత్సదా మంగళమ్  ౪ *


*జీవశ్చాంగిరగోత్రజోత్తరముఖో దీర్ఘోత్తరాశాస్థితః*

*పీతోఽశ్వత్థసమిచ్చసింధుజనితశ్చాపోఽథ మీనాధిపః,*

*సూర్యేందుక్షితిజాః ప్రియా బుధసితౌ శత్రూ సమాశ్చాపరే*

*సప్త ద్వే నవ పంచమే శుభకరః కుర్యాత్సదా మంగళమ్  ౫ *


*శుక్రోభార్గవగోత్రజస్సితరుచిః పూర్వాముఖః పూర్వదిక్*

*పాంచాలస్థ వృషస్తులాధిపమహారాష్ట్రాధిపౌదుంబరః,*

*ఇంద్రాణీమఘవాబుధశ్చ రవిజో మిత్రోర్క చన్ద్రావరీ*

*షష్ఠత్రిర్దశవర్జితేభృగుసుతః కుర్యాత్సదా మంగళమ్  ౬ *


*మందః కృష్ణనిభః సపశ్చిమముఖః సౌరాష్ట్రపః కాశ్యప-*

*స్స్వామీ నక్రసుకుంభయోర్బుధసితౌ మిత్రౌ కుజేన్దూద్విషౌ,*

*స్థానంపశ్చిమదిక్ప్రజాపతియమౌ దేవౌ ధనుష్యాసనౌ-*

*ష్షట్త్రిస్థశ్శుభకృచ్ఛమీరవిసుతః కుర్యాత్సదా మంగళమ్  ౭ *


*రాహుస్సింహళదేశపో నిఋఋతిః కృష్ణాంగశూర్పాసనః*

*యఃపైఠీనసగోత్రసంభవసమిద్దూర్వాముఖో దక్షిణః,*

*యస్సర్పః పశుదైవతోఽఖిలగతస్స్వామ్యాద్విశేషప్రద*

*షట్త్రిస్థశ్శుభకృచ్చ సింహకసుతః కుర్యాత్సదా మంగళమ్  ౮ *


*కేతుర్జైమినిగోత్రజః కుశసమిద్వాయవ్యకోణేస్థితః*

*చిత్రాంకధ్వజలాంఛనోహిభగవాన్యో దక్షిణాశాముఖః,*

*బ్రహ్మాచైవతు చిత్రగుప్తపతిమాన్ప్రీత్యాధిదేవస్సదా-*

*షట్త్రిస్థశుభ కృచ్చ బర్బరపతిః కుర్యాత్సదా మంగళమ్  ౯ *


*ఇతి నవగ్రహమంగళశ్లోకాః (నవగ్రహ మంగళాష్టకం) |*

Sri Hanuman Manyusuktham


 *హనుమాన్ మన్యుసూక్తం..!!*


          _మన్యుసూక్తం_

(ఋగ్వేద సంహితా; మండలం 10; సూక్తం 83,84)


యస్తే” మన్యో‌உవి’ధద్ వజ్ర సాయక సహ ఓజః’ పుష్యతి విశ్వ’మానుషక్ | 

సాహ్యామ దాసమార్యం త్వయా” యుజా సహ’స్కృతేన సహ’సా సహ’స్వతా 1 



మన్యురింద్రో” మన్యురేవాస’ దేవో మన్యుర్ హోతా వరు’ణో జాతవే”దాః | 

మన్యుం విశ’ ఈళతే మాను’షీర్యాః పాహి నో” మన్యో తప’సా సజోషా”ః  2 



అభీ”హి మన్యో తవసస్తవీ”యాన్ తప’సా యుజా వి జ’హి శత్రూ”న్ | 

అమిత్రహా వృ’త్రహా ద’స్యుహా చ విశ్వా వసూన్యా భ’రా త్వం నః’  3 



త్వం హి మ”న్యో అభిభూ”త్యోజాః స్వయంభూర్భామో” అభిమాతిషాహః | 

విశ్వచ’ర్-షణిః సహు’రిః సహా”వానస్మాస్వోజః పృత’నాసు ధేహి  4 



అభాగః సన్నప పరే”తో అస్మి తవ క్రత్వా” తవిషస్య’ ప్రచేతః | 

తం త్వా” మన్యో అక్రతుర్జి’హీళాహం స్వాతనూర్బ’లదేయా”య మేహి’  5 



అయం తే” అస్మ్యుప మేహ్యర్వాఙ్ ప్ర’తీచీనః స’హురే విశ్వధాయః | 

మన్యో” వజ్రిన్నభి మామా వ’వృత్స్వహనా”వ దస్యూ”న్ ఋత బో”ధ్యాపేః  6 



అభి ప్రేహి’ దక్షిణతో భ’వా మే‌உధా” వృత్రాణి’ జంఘనావ భూరి’ | 

జుహోమి’ తే ధరుణం మధ్వో అగ్ర’ముభా ఉ’పాంశు ప్ర’థమా పి’బావ  7 



త్వయా” మన్యో సరథ’మారుజంతో హర్ష’మాణాసో ధృషితా మ’రుత్వః | 

తిగ్మేష’వ ఆయు’ధా సంశిశా”నా అభి ప్రయం”తు నరో” అగ్నిరూ”పాః  8 



అగ్నిరి’వ మన్యో త్విషితః స’హస్వ సేనానీర్నః’ సహురే హూత ఏ”ధి | 

హత్వాయ శత్రూన్ వి భ’జస్వ వేద ఓజో మిమా”నో విమృధో” నుదస్వ  9 



సహ’స్వ మన్యో అభిమా”తిమస్మే రుజన్ మృణన్ ప్ర’మృణన్ ప్రేహి శత్రూ”న్ | 

ఉగ్రం తే పాజో” నన్వా రు’రుధ్రే వశీ వశం” నయస ఏకజ త్వమ్  10 



ఏకో” బహూనామ’సి మన్యవీళితో విశం”విశం యుధయే సం శి’శాధి | 

అకృ’త్తరుక్ త్వయా” యుజా వయం ద్యుమంతం ఘోషం” విజయాయ’ కృణ్మహే  11 



విజేషకృదింద్ర’ ఇవానవబ్రవో(ఓ)3’‌உస్మాకం” మన్యో అధిపా భ’వేహ | 

ప్రియం తే నామ’ సహురే గృణీమసి విద్మాతముత్సం యత’ ఆబభూథ’  12 



ఆభూ”త్యా సహజా వ’జ్ర సాయక సహో” బిభర్ష్యభిభూత ఉత్త’రమ్ | 

క్రత్వా” నో మన్యో సహమేద్యే”ధి మహాధనస్య’ పురుహూత సంసృజి’  13 



సంసృ’ష్టం ధన’ముభయం” సమాకృ’తమస్మభ్యం” దత్తాం వరు’ణశ్చ మన్యుః | 

భియం దధా”నా హృద’యేషు శత్ర’వః పరా”జితాసో అప నిల’యంతామ్  14 



ధన్వ’నాగాధన్వ’ నాజింజ’యేమ ధన్వ’నా తీవ్రాః సమదో” జయేమ |

ధనుః శత్రో”రపకామం కృ’ణోతి ధన్వ’ నాసర్వా”ః ప్రదిశో” జయేమ ||


భద్రం నో అపి’ వాతయ మనః’ ||



ఓం శాంతా’ పృథివీ శి’వమంతరిక్షం ద్యౌర్నో” దేవ్య‌உభ’యన్నో అస్తు |

శివా దిశః’ ప్రదిశ’ ఉద్దిశో” న‌உఆపో” విశ్వతః పరి’పాంతు న్ శాంతిః శాంతిః శాంతిః’ ||...🙏🙏☘️🌿

Sunday, March 19, 2023

Eswra -- Trayambaka


 *త్రయంబకుడు అంటే అర్థం ఏమిటి......?*

*శివుడి మూడు నామాలకి ఉన్న పరమార్థం ఏమిటి...?*


_మహా మృత్యుంజయ మంత్రం_


ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |

ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||

అంటే...

అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. 

దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక!


'మహా మృత్యుంజయ మంత్రం పై కొన్ని సందేహాలుంటాయి...

ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా, మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదా అని!!...


మరి అలాంటప్పుడు ఈ _మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు?_


అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? 

అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధమో తెలియదు!!! అర్థం కాదు!!... 


మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదు... 

పునర్జన్మ లేకపోవడం, అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. 

అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. 

ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. 

ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి.

ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. 


*అది ఎలాగంటారా?*

ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి, సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. 

ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది.


జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. 

అంటే మాయనుండి విడివడతాడు. 

పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను..


దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. 

(జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు.


ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు...

పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కద...


ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. 


_ఆ ఆరాధన ఎలాగుండాలంటే - జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం._


మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం. 

ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. 

అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి, శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -

*పంచభూతాత్మకుడు :-*

శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.


*త్రయంబకుడు :-* 

శివుని మూడుకన్నులు కాలాలను (భూత, భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. 

ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. 

ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. 

దీనినే త్రివేణి సంగమం అని అంటారు.


*నామము :-* 

శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. 

అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు.


*విభూతిదారుడు :-* 

సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. 

అంటే భస్మంగాక తప్పదు, నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.


*త్రిశూలం :-* 

సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.


*నాగాభరణుడు :-* 

సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం.


అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు.


అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.


 సేకరణ ....

స్వస్తి🙏🌿☘️

Sri Surya Ashtothara Satha Nama Stotram


 *సూర్య అష్టోత్తర శత నామ స్తోత్రం* 🙏🌹🌸


అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే

అసమానబలాయాఽర్తరక్షకాయ నమో నమః ॥ 1 ॥


ఆదిత్యాయాఽదిభూతాయ అఖిలాగమవేదినే

అచ్యుతాయాఽఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః ॥ 2 ॥


ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయైంద్రాయ భానవే

ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః ॥ 3 ॥


ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే

వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః ॥ 4 ॥


ఉజ్జ్వలాయోగ్రరూపాయ ఊర్ధ్వగాయ వివస్వతే

ఉద్యత్కిరణజాలాయ హృషీకేశాయ తే నమః ॥ 5 ॥


ఊర్జస్వలాయ వీరాయ నిర్జరాయ జయాయ చ

ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః ॥ 6 ॥


ఋషివంద్యాయ రుగ్ఘంత్రే ఋక్షచక్రచరాయ చ

ఋజుస్వభావచిత్తాయ నిత్యస్తుత్యాయ తే నమః ॥ 7 ॥


ౠకారమాతృకావర్ణరూపాయోజ్జ్వలతేజసే

ౠక్షాధినాథమిత్రాయ పుష్కరాక్షాయ తే నమః ॥ 8 ॥


లుప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయ చ

కనత్కనకభూషాయ ఖద్యోతాయ నమో నమః ॥ 9 ॥


లూనితాఖిలదైత్యాయ సత్యానందస్వరూపిణే

అపవర్గప్రదాయాఽర్తశరణ్యాయ నమో నమః ॥ 10 ॥


ఏకాకినే భగవతే సృష్టిస్థిత్యంతకారిణే

గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః ॥ 11 ॥


ఐశ్వర్యదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే

దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః ॥ 12 ॥


ఓజస్కరాయ జయినే జగదానందహేతవే

జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమో నమః ॥ 13 ॥


ఔన్నత్యపదసంచారరథస్థాయాత్మరూపిణే

కమనీయకరాయాఽబ్జవల్లభాయ నమో నమః ॥ 14 ॥


అంతర్బహిఃప్రకాశాయ అచింత్యాయాఽత్మరూపిణే

అచ్యుతాయ సురేశాయ పరస్మైజ్యోతిషే నమః ॥ 15 ॥


అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే

తరుణాయ వరేణ్యాయ గ్రహాణాంపతయే నమః ॥ 16 ॥


ఓం నమో భాస్కరాయాఽదిమధ్యాంతరహితాయ చ

సౌఖ్యప్రదాయ సకలజగతాంపతయే నమః ॥ 17 ॥


నమః సూర్యాయ కవయే నమో నారాయణాయ చ

నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః ॥ 18 ॥


ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ

ఓం ఐం ఇష్టార్థదాయాఽనుప్రసన్నాయ నమో నమః ॥ 19 ॥


*శ్రీమతే శ్రేయసే* *భక్తకోటిసౌఖ్యప్రదాయినే*

*నిఖిలాగమవేద్యాయ* *నిత్యానందాయ తే నమః* ॥ 20 ॥

Sri Surya Panjara Stothram


 *సూర్య పంజర స్తోత్రం* 🙏🌹🌻


ఓం ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం

సకలభువననేత్రం రత్నరజ్జూపమేయమ్ 

తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాం

సురవరమభివంద్యం సుందరం విశ్వదీపమ్ || ౧ ||


ఓం శిఖాయాం భాస్కరాయ నమః 

లలాటే సూర్యాయ నమః |

భ్రూమధ్యే భానవే నమః |

కర్ణయోః దివాకరాయ నమః 

నాసికాయాం భానవే నమః |

నేత్రయోః సవిత్రే నమః |

ముఖే భాస్కరాయ నమః |

ఓష్ఠయోః పర్జన్యాయ నమః |

పాదయోః ప్రభాకరాయ నమః

  || ౨ ||


ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః |

ఓం హంసాం హంసీం హంసూం హంసైం హంసౌం హంసః 

 || ౩ ||


ఓం సత్యతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |

ఓం స్థితిరూప కకారణాయ పూర్వాదిగ్భాగే మాం రక్షతు

  || ౪ ||


ఓం బ్రహ్మతేజో జ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |

ఓం తారకబ్రహ్మరూపాయ పరయంత్ర-పరతంత్ర-పరమంత్ర-సర్వోపద్రవనాశనార్థం దక్షిణదిగ్భాగే మాం రక్షతు || ౫ ||


ఓం విష్ణుతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |

ఓం ప్రచండమార్తాండ ఉగ్రతేజోరూపిణే ముకురవర్ణాయ తేజోవర్ణాయ మమ సర్వరాజస్త్రీపురుష-వశీకరణార్థం పశ్చిమదిగ్భాగే మాం రక్షతు || ౬ ||


 

ఓం రుద్రతేజో జ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |

ఓం భవాయ రుద్రరూపిణే ఉత్తరదిగ్భాగే సర్వమృత్యోపశమనార్థం మాం రక్షతు || ౭ ||


ఓం అగ్నితేజో జ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |

ఓం తిమిరతేజసే సర్వరోగనివారణాయ ఊర్ధ్వదిగ్భాగే మాం రక్షతు

  || ౮ ||


ఓం సర్వతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |

ఓం నమస్కారప్రియాయ శ్రీసూర్యనారాయణాయ అధోదిగ్భాగే సర్వాభీష్టసిద్ధ్యర్థం మాం రక్షతు || ౯ ||


మార్తాండాయ నమః భానవే నమః

హంసాయ నమః సూర్యాయ నమః

దివాకరాయ నమః తపనాయ నమః

భాస్కరాయ నమః మాం రక్షతు

  || ౧౦ ||


మిత్ర-రవి-సూర్య-భాను-ఖగపూష-హిరణ్యగర్భ-

మరీచ్యాదిత్య-సవిత్రర్క-భాస్కరేభ్యో నమః శిరస్థానే మాం రక్షతు 

 || ౧౧ ||


సూర్యాది నవగ్రహేభ్యో నమః లలాటస్థానే మాం రక్షతు 

 || ౧౨ ||


ధరాయ నమః ధృవాయ నమః

సోమాయ నమః అథర్వాయ నమః

అనిలాయ నమః అనలాయ నమః

ప్రత్యూషాయ నమః ప్రతాపాయ నమః

మూర్ధ్నిస్థానే మాం రక్షతు || ౧౩ ||


వీరభద్రాయ నమః గిరీశాయ నమః

శంభవే నమః అజైకపదే నమః

అహిర్బుధ్నే నమః పినాకినే నమః

భువనాధీశ్వరాయ నమః దిశాంతపతయే నమః

పశుపతయే నమః స్థాణవే నమః

భవాయ నమః లలాటస్థానే మాం రక్షతు || ౧౪ ||


ధాత్రే నమః అంశుమతే నమః

పూష్ణే నమః పర్జన్యాయ నమః

విష్ణవే నమః నేత్రస్థానే మాం రక్షతు || ౧౫ ||


అరుణాయ నమః సూర్యాయ నమః

ఇంద్రాయ నమః రవయే నమః

సువర్ణరేతసే నమః యమాయ నమః

దివాకరాయ నమః కర్ణస్థానే మాం రక్షతు || ౧౬ ||


అసితాంగభైరవాయ నమః రురుభైరవాయ నమః

చండభైరవాయ నమః క్రోధభైరవాయ నమః

ఉన్మత్తభైరవాయ నమః భీషణభైరవాయ నమః

కాలభైరవాయ నమః సంహారభైరవాయ నమః

ముఖస్థానే మాం రక్షతు || ౧౭ ||


బ్రాహ్మ్యై నమః మహేశ్వర్యై నమః

కౌమార్యై నమః వైష్ణవ్యై నమః

వరాహ్యై నమః ఇంద్రాణ్యై నమః

చాముండాయై నమః కంఠస్థానే మాం రక్షతు 

 || ౧౮ ||


ఇంద్రాయ నమః అగ్నయే నమః

యమాయ నమః నిర్‍ఋతయే నమః

వరుణాయ నమః వాయవే నమః

కుబేరాయ నమః ఈశానాయ నమః

బాహుస్థానే మాం రక్షతు || ౧౯ ||


మేషాదిద్వాదశరాశిభ్యో నమః హృదయస్థానే మాం రక్షతు 

 || ౨౦ ||


వజ్రాయుధాయ నమః శక్త్యాయుధాయ నమః

దండాయుధాయ నమః ఖడ్గాయుధాయ నమః

పాశాయుధాయ నమః అంకుశాయుధాయ నమః

గదాయుధాయ నమః త్రిశూలాయుధాయ నమః

పద్మాయుధాయ నమః చక్రాయుధాయ నమః

కటిస్థానే మాం రక్షతు || ౨౧ ||


మిత్రాయ నమః దక్షిణహస్తే మాం రక్షతు |

రవయే నమః వామహస్తే మాం రక్షతు |

సూర్యాయ నమః హృదయే మాం రక్షతు |

భానవే నమః మూర్ధ్నిస్థానే మాం రక్షతు |

ఖగాయ నమః దక్షిణపాదే మాం రక్షతు |

పూష్ణే నమః వామపాదే మాం రక్షతు |

హిరణ్యగర్భాయ నమః నాభిస్థానే మాం రక్షతు |

మరీచయే నమః కంఠస్థానే మాం రక్షతు |

ఆదిత్యాయ నమః దక్షిణచక్షూషి మాం రక్షతు |

సవిత్రే నమః వామచక్షుషి మాం రక్షతు |

భాస్కరాయ నమః హస్తే మాం రక్షతు |

అర్కాయ నమః కవచే మాం రక్షతు || ౨౨||


ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి | తన్నో ఆదిత్యః ప్రచోదయాత్

  || ౨౩ ||


ఇతి శ్రీ సూర్య పంజర స్తోత్రమ్🙏🌹🌸

Sri Siva Pradosha Stotram


 *మహాశివుని మెప్పించే మహత్తర మార్గం శివ ప్రదోష స్తోత్రం🙏🌿☘️*


పరమ శివుడు ప్రసన్న వదనుడై ఆనంద నృత్యం చేసే ప్రదోష సమయం లో శివ ప్రదోష స్తోత్రం పఠించడం వలన సకలైశ్వర్యాలూ ఆయురారోగ్యాలూ సిద్ధిస్తాయి.

భక్తి ప్రపత్తులతో మనస్ఫూర్తిగా శివ ప్రదోష స్తోత్రాన్ని పఠించిన భక్తులకు ఆ భోళా శంకరుడు కోరిన కోర్కెలన్నిటినీ నెరవేర్చి దీవిస్తాడు.


*శివప్రదోషస్తోత్రం🙏🌿☘️*


కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం

గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ

దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః

తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా

విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా

సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య

విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ

యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః

ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః


ఓం నమః శివాయ🙏🙏🙏

శివాలయానికి వెళ్ళినప్పుడు నంది కొమ్ముల మధ్య భాగం నుండి శివుని చూసినప్పుడు చెప్పవలసిన స్తోత్రం🙏🌿*


 *శివాలయానికి వెళ్ళినప్పుడు నంది కొమ్ముల మధ్య భాగం నుండి శివుని చూసినప్పుడు చెప్పవలసిన స్తోత్రం🙏🌿*


నందీశ్వరుని కొమ్ముల మీద ఎడమచేయి ఉంచి, వెనుక భాగంలో కుడిచేతితో స్పృశించడం చేత అతడు శిరసు వంచుతాడు. 

అప్పుడు కొమ్ముల నుండి శివుని చూడాలి. 

పశుపతి అయిన శివుడు, పశువులైన జీవులకు ప్రభువు. ఆ పశుత్వాన్ని దాటి శివుని చూడాలి. 

        మరియొక భావంలో - నంది ధర్మస్వరూపుడు. 

ఆ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, ధర్మం ద్వారానే దైవాన్ని దర్శించాలనే సంకేతం కూడా ఇందులో దాగి ఉంది.


*నందీశ్వర! నమస్తుభ్యం*

*శాంతానంద ప్రదాయక!*

*మహాదేవస్య సేవార్థం*

*అనుజ్ఞాం దాతుమర్హసి ।।*


         - అనే శ్లోకాన్ని పఠిస్తూ "హర హర - శివశివ" అనే శివ నామాన్ని పలుకుతూ, నంది కొమ్ముల మధ్య నుండి శివ లింగాన్ని దర్శిస్తే - వేదపఠనం చేసిన ఫలం, సప్తకోటి మహా మంత్ర జపఫలం లభిస్తాయని, పాప పరిహారమవుతుందనీ పురాణాలు చెబుతున్నాయి.


[శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి భాష్యం నుండి]🙏

Friday, March 17, 2023

Sri Venkateswara Dwadasa Nama Stotram


 *శ్రీ వేంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రo*


అస్యశ్రీ వేంకటేశ ద్వాదశనామ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మాబుుషిః

అనుష్టుప్ ఛందః శ్రీవేంకటేశ్వరో దేవతా ఇష్టార్థే వినియోగః


1. 🙏

ఓం నారాయణో జగన్నాథో - వారిజాసన వందితః


2.  🙏

స్వామి పుష్కరిణీవాసీ - శంఖ చక్ర గదాధరః


3. 🙏

పీతాంబరధరో దేవో - గరుడాసనశోభితః


4. 🙏

కందర్ప కోటిలావణ్యః - కమలాయత లోచనః


5.🙏

ఇందిరాపతి గోవిందః - చంద్రసూర్య ప్రభాకరః


6. 🙏

విశ్వాత్మా  - విశ్వ లోకేశో - జయ శ్రీ వేంకటేశ్వరః


ఏతత్ ద్వాదశ నామాని  త్రిసంధ్యం యఃఫఠేన్నరః

దారిద్ర్య దుఖః నిర్ముక్తో ధనధాన్య సమృద్ధిమాన్ 


జనవశ్యం రాజవశ్యం సర్వకామార్థసిద్ధిదమ్ 

దివ్యతేజః సమాప్నోతి దీర్ఘమాయుశ్చ  విందతి


గ్రహరోగాది నాశం చ కామితార్థ ఫలప్రదం

ఇహజన్మని సౌఖ్యం చలన విష్ణుసాయుజ్యమాప్నుయాత్ 


ఇతి బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే శ్రీవేంకటేశ్వాదశ నామ స్తోత్రమ్ సంపూర్ణమ్.🙏🙏🙏

Saptharshi Krutha Sri Venkateswara Saranagathi Sthothram


 *శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం*

              (సప్తర్షి కృతం)


శేషాచలంసమాసాద్య కశ్యపాద్యా మహర్షయః!

వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా!!


కలిసంతారకం ముఖ్యం స్తోత్రమేతత్‌ జపేన్నరః!

సప్తర్షి వా ప్రసాదేన విష్ణుః తస్మై ప్రసీదతీ!!


 *కశ్యప ఉవాచ :*


కారి హ్రీమంత విద్యాయాః ప్రాప్యైవ పరదేవతా!

కలౌ శ్రీ వేంకటేశాఖ్యః త్వామహం శరణం భజేత్‌!!


*అత్రీ ఉవాచ :*


అకారాది క్షకారాంత వర్ణైః యః ప్రతిపాద్యతే!

కలౌ శ్రీవేంకటేశాఖ్యః శరణం మే ఉమాపతీ!!


 *భరద్వాజ ఉవాచ :*


భగవాన్‌ భార్గవీకాంతో భక్తాభీప్పితదాయకః!

భక్తస్య వేంకటేశాఖ్యో భరద్వాజస్య మే గతిః!!


*విశ్వామిత్ర ఉవాచ :*


విరాట్‌ విష్ణుర్విధాతా చ విశ్వవిజ్ఞానవిగ్రహః!

విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుః సదా!!


*గౌతమ ఉవాచ :*


గౌర్గౌరీశ ప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభుః!

శరణం గౌతమాస్యాస్తు వేంకటాద్రి శిరోమణిః !!


*జమదగ్నిరువాచ :*


జగత్కర్తా జగత్భర్తా జగధ్ధర్తా జగన్మయా |

జమదగ్నిః ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వరః !!


*వశిష్ఠ ఉవాచ :*


వస్తు విజ్ఞానమాత్రం యన్‌ నిర్విశేషం సుఖం చ సత్‌ !

తత్బ్రహ్మై వాహమస్మీతి వేంకటేశం భజేత్‌ సదా!!


సప్తర్షిరచితం స్తోత్రం సర్వదా యః పఠేన్‌ నరః !

సో౬భయం ప్రాప్నుయాన్ సత్యం సర్వత్ర విజయీ భవెత్‌ !!


ఇతి శ్రీవేంకటేశ శరణాగతి స్తోత్రమ్‌ సంపూర్ణమ్🙏🙏

Sri Mahalaksmi Chathurvimsathi Namavali


 *శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి* 


తిరుమలక్షేత్రములో ఆనందనిలయములోని శ్రీవేంకటేశ్వరస్వామివారిమూల విరాట్టుకు

ప్రతిరోజూ మూడుమారులు అర్చనజరుగుతుంది శ్రీవేంకటేశ్వరస్వామి వక్షస్థలములో కొలువైఉన్న శ్రీమహాలక్ష్మి అమ్మవారికి

వరాహపురాణములోనిచతుర్వింశతి (24) నామాలతోఅర్చనజరుగుతుంది 


1.ఓం శ్రియై నమః 

2.ఓం లోకధాత్ర్యై నమః 

3.ఓం బ్రహ్మ మాత్రే నమః 

4.ఓం పద్మ నేత్రాయై నమః 

5.ఓం పద్మ ముఖ్యై నమః

6.ఓం ప్రసన్న ముఖ పద్మాయై నమః

7.ఓం పద్మ కాంత్యై నమః 

8.ఓం బిల్వ వనస్థాయైనమః 

9.ఓం విష్ణుపత్న్యై నమః 

10.ఓం విచిత్రక్షౌమధారి ణ్యై నమః 


11.ఓం పృధుశ్రోణ్యై నమః

12.ఓం పక్వబిల్వ ఫలాపీనతుంగస్త న్యై నమః

13.ఓం సురక్తపద్మపత్రాభ కరపాదతలాయై నమః 

14.ఓంశుభాయై నమః 

15.ఓం సరత్నాంగద కేయూర కాంచీనూపుర శోభితాయై నమః

16.ఓం యక్ష కర్దమ సంలిప్త సర్వాంగాయై నమః 

17.ఓం కటకోజ్జ్వలాయై నమః 

18.ఓం మాంగల్యాభరణై శ్చిత్రై ర్ముక్తాహారై ర్విభూషితాయై నమః

19.ఓం తాటంకైరవతంసై శ్చ శోభమానాం ముఖాంబుజాయై నమః

20.ఓం పద్మహస్తాయై నమః 


21.ఓంహరివల్లభాయై నమః

22.ఓం బుుగ్యజుసామరూపాయై నమః 

23.ఓం విద్యాయైనమః

24.ఓం అబ్ధిజాయై నమః

Tirumala -- Mada Streets


 తిరుమల : మాడ వీధి అంటే ఏమిటి


తిరుమల మాడ వీధుల యొక్క పూర్తి వివరాలు.


తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి 'మాడాం' అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది


ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావు. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు


శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తి.తి.దే. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు.


తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులున్నాయి.

వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు


1.తూర్పు మాడ వీధి.


ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి.

శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకుండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి.


ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న

(ఉండే) వీధిని సన్నిధి వీధి అంటారు


ఒకప్పుడు సన్నిధి వీధి, వేయికాళ్ళ మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరు ప్రక్కలా అంగళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయస్వామి గుడి ఉండేవి.


క్రీ.శ. 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ వెయ్యి కాళ్ళ మండపం కట్టించారు.


మాస్టర్ ప్లాన్ లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం వెయ్యి కాళ్ళ మండపం తొలగించబడింది.


2.దక్షిణ మాడ వీధి


ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది.దీని పక్కనే-ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండ కొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట ఈ వీధి మొదట్లో (ఆగ్నేయంలో) 'ఊంజల్ మండపం' ఉంది


ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. ప్రతిరోజూ సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియసఖులతో ఈ మండపం లోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు.


దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చటం జరిగింది తిరుమల నంబి గుడి తర్వాత 'ఉగ్రాణం'(ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచు చోటు )ఉంది.


3.పడమర మాడ వీధి.


ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి

ప్రస్తుతం తిరుమల చిన జీయర్ స్వామి మఠం, (తిరుమల చిన్న జియ్యర్ పెద్ద జీయర్ ఏకాంగి అనే వ్యస్థను 11 వ శతాబ్దం లో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారు) కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం ఉన్నాయి అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది.


4.ఉత్తర మాడ వీధి.


ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది అచ్యుతరాయలు 16వ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి 'అచ్యుతరాయ కోనేరు' అని పేరు మార్చాడని చెబుతారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించాడంటారు. ఏది ఏమైనా

పుష్కరిణిగానే ప్రసిద్ధి గాంచింది.


ఉత్తర మాడ వీధి లో ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహెబిల మరం శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి

స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహ స్వామి ఆలయం ఉంది ఈ వీధిలోనే తాళ్ళపాక వారి ఇల్లు ఉండేది

తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఆమె సమాధి

తరిగొండ బృందావనం - ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల గల ఉంది.


ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు.

ఉత్తరమాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం, ఆంజనేయస్వామి సన్నిధి, శ్రీ విఖనస మహర్షి సన్నిధి ఉన్నాయి.వాటి కెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ హయగ్రీవ మందిరం కలవు.


ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడ వీధులు లో చేసే ప్రదక్షిణ కి మహా ప్రదక్షిణం అని పేరు.


తిరుమాడ ప్రదక్షిణ ప్రియ గోవిందా..

మహా ప్రదక్షిణ ప్రియ గోవిందా..

ఆనంద నిలయ వాసా గోవిందా ...!గోవిందా...!

Sri Ashta Lakshmi Dhyana Slokamulu


 *అష్టలక్ష్మీ ధ్యాన శ్లోకాః*


 శ్రీ ఆది లక్ష్మీః


ద్విభుజాం చ ద్వినేత్రాం చ సాభయాం వరదాన్వితామ్!

పుష్పమాలాధరాం దేవీం అంబుజాసన సంస్థితామ్!!

పుష్పతోరణసంయుక్తాం ప్రభామండలమండితామ్!

సర్వలక్షణసంయుక్తాం సర్వాభరణభూషితామ్!!

పీతాంబరధరాం దేవీం మకుటీచారుబంధనామ్!

సౌందర్యనిలయం శక్తి ఆదిలక్ష్మీమహం భజే!!


 శ్రీ సంతాన లక్ష్మీః


జటామకుటసంయుక్తాం స్థిరాసన సమన్వితామ్!

అభయం కటకం చైవ పూర్ణకుంభం కరద్వయే!!

కంచుకం సన్నవీతం చ మౌక్తికం చాపి ధారిణీమ్!

దీప చామర హస్తాభిః సేవితాం పార్శ్వయోర్ద్వయోః !!

బాలసేనాని సంకాశాం కరుణాపూరితాననామ్!

మహారాజ్జీం చ సంతానలక్ష్మీమిష్టార్థసిద్ధయే!!


 శ్రీ గజ లక్ష్మీః


చతుర్భుజాం మహాలక్ష్మీం గజయుగ్మసుపూజితామ్!

పద్మపత్రాభనయనాం వరాభయకరోజ్జ్వలామ్!!

ఊర్ధ్వం కరద్వయే చాబ్జం దధతీం శుక్లవస్త్రకమ్!

పద్మాసనే సుఖాసీనాం గజలక్ష్మీమహం భజే!!


 శ్రీ ధన లక్ష్మీః


కిరీటముకుటోపేతాం స్వర్ణవర్ణ సమన్వితామ్!

సర్వాభరణసంయుక్తాం సుఖాసన సమన్వితామ్!!

పరిపూర్ణం చ కుంభం చ దక్షిణేన కరేణ తు!

చక్రం బాణం చ తాంబూలం తదా వామకరేణ తు!!

శంఖం పద్మం చ చాపం చ కుండికామపి ధారిణీమ్!

సకంచుకస్తనీం ధ్యాయేద్ధనలక్ష్మీం మనోహరామ్!!


 శ్రీ ధాన్య లక్ష్మీః


వరదాభయసంయుక్తాం కిరీటమకుటోజ్జ్వలామ్!

అంబుజం చేక్షుశాలిం చ కదంబఫలద్రోణికామ్!!

పంకజం చాష్టహస్తేషు దధానాం శుక్లరూపిణీమ్!

కృపామూర్తిం జటాజూటాం సుఖాసన సమన్వితామ్!!

సర్వాలంకారసంయుక్తాం సర్వాభరణభూషితామ్!

మదమత్తాం మనోహారిరూపాం ధాన్యశ్రియం భజే!!


 శ్రీ విజయ లక్ష్మీః


అష్టబాహుయుతాం దేవీం సింహాసనవరస్థితామ్!

సుఖాసనాం సుకేశీం చ కిరీటమకుటోజ్జ్వలామ్!!

శ్యామాంగీం కోమలాకారాం సర్వాభరణభూషితామ్!

ఖడ్గం పాశం తదా చక్రమభయం సవ్యహస్తకే!!

ఖేటకం చాంకుశం శంఖం వరదం వామహస్తకే!

రాజరూపధరాం శక్తిం ప్రభాసౌందర్యశోభితామ్!!

హంసారూఢాం స్మరేద్దేవీం విజయాం విజయప్రదే!!


 శ్రీ ధైర్య లక్ష్మీః


అష్టబాహుయుతాం లక్ష్మీం సింహాసనవరస్థితామ్!

తప్తకాంచనసంకాశాం కిరీటమకుటోజ్జ్వలామ్!!

స్వర్ణకంచుకసంయుక్తాం సన్నవీతతరాం శుభామ్!

అభయం వరదం చైవ భుజయోః సవ్యవామయోః!!

చక్రం శూలం చ బాణం చ శంఖం చాపం కపాలకమ్!

దధతీం ధైర్యలక్ష్మీం చ నవతాలాత్మికాం భజే!!


  శ్రీ ఐశ్వర్య లక్ష్మీః


చతుర్భుజాం ద్వినేత్రాం చ వరాభయకరాన్వితామ్!

అబ్జద్వయకరాంభోజాం అంబుజాసనసంస్థితామ్!!

ససువర్ణఘటోరాభ్యాం ప్లావ్యమానాం మహాశ్రియమ్!

సర్వాభరణశోభాఢ్యాం శుభ్రవస్త్రోత్తరీయకామ్!!

చామరగ్రహనారీభిః సేవితాం పార్శ్వయోర్ద్వయోః!

ఆపాదలంబివసనాం కరండమకుటాం భజే!!

Sri Suktham


 *శ్రీ సూక్తం*


ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్


చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ



తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్


యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్



అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినా ద ప్రబోధినీమ్


శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్



కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మార్దాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్


పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్



చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్


తాం పద్మినీమీం శరణమహాం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే



ఆదిత్యవర్ణే తపసో ధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వ:


తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ:



ఉపెతు మాం దేవసఖ: కీర్తిశ్చ మణినా సహా


ప్రాదుర్భూతో స్మిరాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాదుమే



క్షుత్పిపాసామలాం జ్యేష్ఠా మలక్షీం నాశయామ్యహమ్


అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్



గందద్వారాం దురాదర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్


ఈశ్వరీగ్మ్ సర్వ భూతానాం తామిహోపహ్వయే శ్రియమ్



మనస: కామకూతిం వాచ: సత్యమశీమహి


పశూనాం రూపమన్యస్య మయి శ్రీ:శ్రయతాం యశ:



కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ


శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్



ఆప: సృజంతు స్నిగ్దాని చిక్లీత వసమే గృహే


ని చ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే



ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగలాం పద్మమాలినీమ్


చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ




ఆర్ద్రాం య: కరిణీం యష్టిం సువర్ణామ్ హేమ మాలినీమ్


సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ



తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమన పగామినీమ్


యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వాన్, విందేయం పురుషానహమ్



య: శుచి: ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్


శ్రియ: పంచదర్చం చ శ్రీకామ: సతతం జపేత్



ఆనన్ద: కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతా:


ఋషయస్తే త్రయ: పుత్రా: స్వయం శ్రీరేవ దేవతా



పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మసంభవే


త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్



అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే


ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే



పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగోరథమ్


ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మామ్



చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీమ్


చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ హహాలక్ష్మీ ముపాస్మహే



ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు:


ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే



వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహ


సోమం ధనస్య సోమినో మహ్యాం దదాతు సోమినీ



న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతి:


భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్సదా



వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుత:


రోహంతు సర్వభీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి



పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి


విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ



యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ


గంభీరా వర్తనాభి: స్తనభర నమితా శుభ్ర వస్తోత్తరీయా



లక్ష్మీర్థివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభై:


నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా



లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్


దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం



శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం


త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం



సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ


శ్రీలక్ష్మీర్వర లక్ష్మీశ్చ ప్రసన్నామమ సర్వదా



వరాంకుశౌ పాశమభీతిముద్రాం


కరైర్వహంతీం కమలాసనస్థామ్                            


బాలర్కకోటి ప్రతిభాం త్రిణేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తామ్


సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే


శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే



మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్


శ్రీ ర్వర్చ స్వ మాయి ష్ మారో గ్యమావీ దాత్ పవమానం మహీయతే

ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు:

ఓం శాంతి: శాంతి: శాంతి:🙏

Wednesday, March 15, 2023

How to keep Bindi బొట్టు ఎలా పెట్టుకోవాలి

 *ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి - ఎరుపు రంగు తిలకమే ఎందుకు?🔴🔴🔴🔴🔴*


అతివలను చూడగానే చంద్రబింబం వంటి ముఖంలో ముందుగా కనిపించేది బొట్టు, ముఖ సౌందర్యాన్ని పెంచే బొట్టులో.. చాలా ప్రత్యేకతలున్నాయి. 

అందంగా కనిపించడమే కాకుండా.. ఆరోగ్యానికి ప్రయోజనకరమే. 

కుంకుమ బొట్టు పెట్టుకుంటే.. దాని ద్వారా సూర్యకిరణాలు శరీరమంతా ప్రసరించి.. నూతనోత్తేజాన్నిస్తాయి.


మన సంప్రదాయం ప్రకారం మహిళలు, ముఖ్యంగా పెళ్లైన ముత్తైదులు తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి.

ఐదోతనానికి బొట్టు చిహ్నం కాబట్టి పెళ్లైన ముత్తైదువులు ఎల్లవేళలా బొట్టు పెట్టుకోవాలి.

బొట్టు లేని ముఖం అందవిహీనంగా కనిపించడమే కాదు..

శుభ కార్యాలు చేయటానికి అర్హత లేదని హిందూ సంప్రదయం చెబుతోంది, మహిళలు ఉదయాన్నే స్నానం చేయగానే ముందుగా బొట్టు పెట్టుకుని పూజ చేయాలని పెద్దలు చెబుతుంటారు.


బొట్టు పెట్టుకోవడం మంచిది, సంప్రదాయం అని అందరికీ తెలుసు. 

కానీ.. బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం..? ఎలా పెట్టుకుంటే మంచిది అన్న విషయంలో చాలామందికి తెలియకపోవచ్చు. 

అందుకే అసలు బొట్టు ఎందుకు ధరించాలి ? నుదుటి మీదే ఎందుకు పెట్టుకోవాలి ? ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? అన్న సందేహాలను తీర్చుకుందాం...


గౌరవసూచకం బొట్టు పెట్టటం మర్యాదకి గుర్తింపు. 

అందుకే ఎవరినైనా ఆహ్వానించడానికి ముందుగా బొట్టు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. 

ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు బొట్టు పెట్టి గౌరవిచటము మన సంప్రదాయం.


_బొట్టు పెట్టుకునేటప్పుడు ఏం స్మరించాలి ?_

*సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే అని జగన్మాతను స్మరించుకుంటూ నుదుటన బొట్టు పెట్టుకుంటే మంగళకరం.. శుభకరం...*


ఏ వేలితో ఏం ప్రయోజనం ? బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతుంటారు. 

కొందరు మధ్య వేలు మంచిదని.. మరికొందరు ఉంగరపు వేలు మంచిదని,

అయితే ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి.. మధ్య వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది.

బొటన వేలితో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. 

చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.


నుదుటనే ఎందుకు ? బొట్టు నుదుటిపైనే పెట్టుకోవాలనే సంప్రదాయం వెనక కారణాలున్నాయి. 

జ్ఞాపక శక్తికి, ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య తిలకము పెడతాము. 

మరో అధ్యయనం ప్రకారం.. బ్రహ్మ స్థానం నుదురుగా భావిస్తారు. 

అందుకే కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటే.. 

బ్రహ్మను పూజించినట్లు అవుతుందని నమ్ముతారు...


ఎరుపు రంగే ఎందుకు ? బొట్టు అంటే ఎరుపు రంగుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. 

ఎందుకంటే.. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. 

అందుకే బ్రహ్మస్థానమైన నుదుటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. 

అంతేకాదు.. మనుషుల ఆత్మ జ్యోతి స్వరూపమని.. అందుకే ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలని సూచిస్తారు.


ఆరోగ్యానికి కుంకుమ బొట్టుపై సూర్యకాంతి ప్రసరించి.. శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి...

కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది. 

అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది. 

శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. 

కొన్ని సమయాలలో చందనము లేదా విభూతి నుదుట రాయడమూ మంచిదే.


స్త్రీలకే కాదు ధర్మాన్ని పాటిస్తూ.. భగవంతున్ని నమ్ముతున్నారనడానికి బొట్టు ప్రతీకగా చెప్పవచ్చు. 

కాబట్టి కుంకుమ పెట్టుకోవడం స్త్రీలకే పరిమితం కాలేదు, పురుషులు కూడా పెట్టుకుంటే సంప్రదాయం పాటిస్తున్నారని తెలియజేస్తుంది. 

బొట్టు పెట్టుకోవడం మూఢాచారం కాదు. 

పెద్దలు, మనకోసం పాటించిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం. ఇది భారతీయులకే ప్రత్యేకం...🔴🔴

Chathur Peethalu


 *భారతదేశంలో చతురామ్నాయ పీఠాలు, వాటి సాంప్రదాయాలు...*


శ్లోకం


" శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ..నమామి భగవత్పాద శంకరం లోకశంకరం !!


⚜️కైలాస శంకరుడు, కాలడి శంకరుడిగా ఈ పుణ్యభూమిలో కేవలం 32 సంవత్సరముల కాలము మాత్రమే నడయాడి, 5వ ఏటనే సన్యాస దీక్ష గ్రహించి వేదవేదాంగాలను అత్యల్ప సమయములోనే అధ్యయనము చేసి అసంఖ్యాకమైన స్త్రోత్ర రచనలెన్నో చేశారు. 

మానవమాత్రులెవ్వరికి సాధ్యం కాని బ్రహ్మ సూత్రాలకు, భగవద్గీతకు, విష్ణు సహస్ర నామములకు భాష్యం చెప్పారు. 

అద్వైత తత్వాన్ని భోధించారు. 

ఆసేతు హిమాచలం మూడు సార్లు కాలినడకన నడయాడి, పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన 72 అవైదిక మతాలను, సిద్ధాంతాలను నిర్మూలించి  సనాతన వైదిక ధర్మ ప్రతిష్ఠాపన గావించారు. 


⚜️అటువంటి జగద్గురు శ్రీమత్ శంకరభగవత్పాదాచార్యులవారు దూరదృష్టితో ఆలోచించి సనాతన ధర్మ పరిరక్షణకు, ధర్మ స్థాపనకు భారతదేశం నలుమూలలా నాలుగు పీఠాలను స్థాపించి మహాద్భుతమైన సేవ చేశారు. 

ఎలాగైతే దేశ రక్షణకు సైన్యం అవసరమో అలాగే మన ధర్మ రక్షణకు ఈ నాలుగు పీఠాలు అంతే అవసరమని భావించి ఈ పీఠాలను స్థాపించారు. 


⚜️నేడు మరల మన ప్రారబ్ధవశాన అనేక అవైదిక మతాలు, కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు. భారతదేశం మొత్తం అంతటా ఎవరు మఠాలు, ఆశ్రమాలు, ఆఖాడాలు, స్థాపించాలన్నా లేక స్వామీజీలు, మఠాధిపతులు, సన్యాసులు, బాబాలు, ఫకీర్లుగా, దేవుళ్ళుగా శాస్త్ర విహితంగా గుర్తింపు పడాలన్నా ఈ పీఠాధిపతుల ఆమోదము ఆత్యావశ్యకము. కాబట్టి ఈ క్లిష్టమైన సమయములో మనకు శంకరలు స్థాపించిన ఆ నాలుగు పీఠాలను స్మరించుకొని నేటి జగద్గురువుల ఉపదేశాను సారము  నడుచుకొని జన్మను సార్థకము చేసుకొందాము. 


చతురామ్నాయ పీఠాలు :


1. తూర్పున గోవర్ధన మఠం - పూరీ క్షేత్రం, ఆమ్నాయం – పూర్వామ్నాయం, సాంప్రదాయం – భోగవార,     దేవత – జగన్నాథుడు, దేవి – విమల, సన్యాసుల నామధేయాలు - వన, అరణ్య, బ్రహ్మచారుల నామధేయాలు – ప్రకాశ, ఆచార్యులు – పద్మపాదాచార్యులు, తీర్థం – సముద్రం, వేదం – ఋగ్వేదం, మహా వాక్యం - ప్రజ్ఞానం బ్రహ్మ, గోత్రం – కాశ్యప, ఈ మఠాధిపత్య ప్రదేశాలు:- అంగ (అస్సాం), వంగ, కళింగ,   మగధ (దక్షిణ బీహార్), ఉత్కల(ఒరిస్సా). 


2. పడమట శారదా మఠం – ద్వారక, ఆమ్నాయం – పశ్చిమామ్నాయం, సాంప్రదాయం – కీటవార,  సన్యాసుల నామధేయాలు - తీర్థ, ఆశ్రమ. బ్రహ్మచారుల నామధేయాలు – స్వరూప, దేవత – సిద్ధేశ్వరుడు, దేవి – భద్రకాళి, ఆచార్యుడు – హస్తామలకచార్య, తీర్థం – గోమతి, వేదము – సామవేదం, మహావాక్యం- 'తత్వమసి' గోత్రం – అభిగత, ఈ పీఠాధిపత్యంలోని ప్రదేశాలు:- సింధు (పంజాబ్), సౌవీర, సౌరాష్ట్ర (సూరత్), మహరాష్ట్ర.


3. ఉత్తరాన జోతిర్మఠం - బదరి క్షేత్రం, ఆమ్నాయం – ఉత్తర, సాంప్రదాయం – ఆనందవార, సన్యాసుల నామధేయాలు - గిరి, పర్వత, సాగర, బ్రహ్మ చారుల నామధేయాలు – ఆనంద, క్షేత్రం – బదరికాశ్రమం, తీర్థం – అలకనంద, దేవత – నారాయణ, దేవి – పూర్ణగిరి, ఆచార్యులు – తోటకాచార్యులు, వేదం - అధర్వణ వేదం, మహావాక్యం - 'అయం ఆత్మా బ్రహ్మ', గోత్రం – భృగు, ఈ పీఠాధిపత్యంలోని ప్రదేశాలు:- కురు (హర్యానా), కాశ్మీర, కాంభోజ, పాంచాల (హర్యానా, హిమాచల్ ప్రదేశ్).


4. దక్షిణాన శృంగేరి పీఠము:- ఆమ్నాయము- దక్షిణామ్నాయం, సాంప్రదాయం-భూరివార, సన్యాసుల నామధేయాలు: సరస్వతి, భారతీ, పూరి, బ్రహ్మచారుల నామధేయాలు – చైతన్య, దేవత - ఆది వరాహ,  దేవి – కామాక్షి, ఆచార్యులు – సురేశ్వరాచార్య, క్షేత్రం – రామేశ్వరం, తీర్థం - తుంగభద్ర నది, వేదం – యజుర్వేదం, మహావాక్యం - అహం బ్రహ్మాస్మి, ఈ పీఠాధిపత్యంలోని ప్రదేశాలు :-  ఆంధ్ర, ద్రావిడ, కేరళ, కర్ణాటక.


  శ్లోకం


శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం! 

సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః!!

Aaseervadam


 *శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ - ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి....*


🌿🙌 🌸 🙌 🌿 🙌 🌸 🙌    

     అందరికి సుపరిచితమైన వేద మంత్రం. 

ఋషులు మన కందిచిన నుండి గ్రహించబడినది, వివాహ మైన లేదా ఏ హందూ శుభ కార్యమైన ఆశీర్వచనంతో ముగించటం ఆనవాయితీగా వస్తోంది.


నూతన దంపతులను నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించమని క్లుప్తంగా అర్థం.


ఈ మంత్రానికి అంత శక్తి ఉందాయని సందేహం కలగక మానదు. 

నిష్టాగరిష్టులైన ఋష్యాదులు, పురో హితులు, విద్య భోదించిన గురువులు, జన్మ నిచ్చిన తలిదండ్రులు ఇతర పెద్దలు ఇచ్చిన ఆశీర్వచనాలు, దీవెనలు అత్యంత శక్తి వంతమైనవి.


వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఆశీర్వచనం పొందుట ఆవశ్యకరం.


సూర్యోపస్థానంలో “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” అని చెప్పబడింది.


“నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి, నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించాలి.


శతమానం భవతి అని వివాహమే కాక ఇతర సందర్భాలలో కూడా ఆశీర్వదించవచ్చును.


ఆశీర్వదించ వలసివచ్చినపుడు చాలా మందికి సందర్భోచితమైన మాటలు రాక అక్షతలు వేసి ఊరుకుంటారు. 


పసి పిల్లలను చిరంజీవ, ఆయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, విద్యా ప్రాప్తిరస్తు యని దీవించ వచ్చును.


సుమంగళియైన స్త్రీలను దీర్ఘ సుమంగళీ భవ యని దీవించ వచ్చు.

ఆయుష్మాన్ భవ అనేది ఉత్తమమైన ఆశీర్వచనం...


స్వస్తి..🙏🌹

Sri Guru Charana Smaranashtakam


 *శ్రీ గురు చరణ స్మరణాష్టకం..!!* 🙏🌺🌹☘️🌿


1) ప్రాతః శ్రీతులసీనతిః స్వకరతస్తత్పిండికాలేపనం తత్సామ్ముఖ్యమథ స్థితిం స్మృతిరథ స్వస్వామినోః పాదయోః !


తత్సేవార్థబహుప్రసూనచయనం నిత్యం స్వయం యస్య తం శ్రీరాధారమణం ముదా గురువరం వందే నిపత్యావనౌ !!



2) మధ్యాహ్నే తు నిజేశపాదకమలధ్యానార్చనాన్నార్పణ ప్రాదక్షిణానతిస్తుతిప్రణయితా నృత్యం సతాం సంగతిః !


శ్రీమద్భాగవతార్థసీధుమధురాస్వాదః సదా యస్య తం శ్రీరాధారమణం ముదా గురువరం వందే నిపత్యావనౌ !!



3)ప్రక్షాల్యాంఘ్రియుగం నతిస్తుతిజయం కర్తుం మనోఽత్యుత్సుకం సాయం గోష్ఠముపాగతం వనభువో ద్రష్టుం నిజస్వామినం !


ప్రేమానందభరేణ నేత్రపుటయోర్ధారా చిరాద్యస్య తం శ్రీరాధారమణం ముదా గురువరం వందే నిపత్యావనౌ !!



4) రాత్రౌ శ్రీజయదేవ పద్యపఠనం తద్గీతగానం రసా స్వాదో భక్తజనైః కదాచిదభితః సంకీర్తనే నర్తనం !


రాధాకృష్ణవిలాసకేల్యనుభవాదున్నిద్రతా యస్య తం శ్రీరాధారమణం ముదా గురువరం వందే నిపత్యావనౌ !!



5) నిందేత్యక్షర యోర్ద్వయం పరిచయం ప్రాప్తం న యత్కర్ణయోః సాధూనాం స్తుతిమేవ యః స్వరసనామా స్వాదయత్యన్వహం !


విశ్వాస్యం జగదేవ యస్య న పునః కుత్రాపి దోషగ్రహః శ్రీరాధారమణం ముదా గురువరం వందే నిపత్యావనౌ !!



6) యః కోఽప్యస్తు పదాబ్జయోర్నిపతితో యః స్వీకరోత్యేవ తం శీఘ్రం స్వీయకృపా బలేన కురుతే భక్తౌ తు మత్వాస్పదం !


నిత్యం భక్తిరహస్య శిక్షణవిధిర్యస్య స్వభృత్యేషు తం శ్రీరాధారమణం ముదా గురువరం వందే నిపత్యావనౌ !!



7) సర్వాంగైర్నత భృత్యమూర్ధ్ని కృపయా స్వపాదార్పణం స్మిత్వా చారు కృపావలోక సుధయా తన్మానసో దాసనం !


తత్ప్రేమోదయహేతవే స్వపదయోః సేవోపదేశః స్వయం శ్రీరాధారమణం ముదా గురువరం వందే నిపత్యావనౌ !!



8) రాధే ! కృష్ణ ! ఇతి ప్లుతస్వరయుతం నామామృతం నాథయో- ర్జిహ్వాగ్రే నటయన్ నిరంతరమహో నో వేత్తి వస్తు క్వచిత్ !


యత్కించిద్వ్యవహారసాధకమపి ప్రేమ్నైవ మగ్నోఽస్తి యః శ్రీరాధారమణం ముదా గురువరం వందే నిపత్యావనౌ !!



9)త్వత్పాదాంబుజసీధుసూచకతయా పద్యాష్టకం సర్వథా యాతం యత్పర మాణుతాం ప్రభువర ప్రోద్యత్కృపావారిధే !


మచ్చేతోభ్రమరోఽవలంబా తదిదం ప్రాప్యావిలంబం భవత్ సంగం మంజు నికుంజ ధామ్ని జుషతాం తత్స్వామినోః సౌరభం !!


ఇతి శ్రీమద్విశ్వనాథ చక్రవర్తి విరచితం శ్రీగురు చరణ స్మరణాష్టకం సంపూర్ణం!..🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Tuesday, March 14, 2023

Sri Runa Vimochana Ganapathi Stothram


 *ఋణ విమోచన గణపతి స్త్రోత్రం*  🙏🌾🍃☘️


అస్య శ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్ర మంత్రస్య | సదాశివ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ ఋణహర్తృ గణపతి దేవతా | గౌం బీజం | గం శక్తిః | గోం కీలకం | సకల ఋణనాశనే వినియోగః |


శ్రీ గణేశ | ఋణం ఛింది | వరేణ్యం | హుం | నమః | ఫట్ |

ఇతి కర హృదయాది న్యాసః |


ధ్యానం

సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం

బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||


స్తోత్రం


సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే  ౧ 


త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే  ౨ 


హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే  ౩ 


మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే  ౪ 


తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే  ౫ 


భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే  ౬ 


శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే  ౭ 


పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే  ౮ 


ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం

ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః  ౯ 


దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్

పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః  ౧౦ 


శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్

ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః  ౧౧ 


ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం

సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్  ౧౨ 


బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్

అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః  ౧౩ 


లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్

భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః  ౧౪ 


ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం ||

Sri Ahobala Nrusimha Stothram


 *అహోబల నృసింహ స్తోత్రం*


*లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం*

*పక్షీంద్రశైలభవనం భవనాశమీశం |*

*గోక్షీరసార ఘనసారపటీరవర్ణం*

*వందే కృపానిధిమహోబలనారసింహం ౧ *


*ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం*

*ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవం |*

*అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం*

*వందే కృపానిధిమహోబలనారసింహం ౨ *


*కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం*

*కేయూరహారమణికుండలమండితాంగం |*

*చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం*

*వందే కృపానిధిమహోబలనారసింహం ౩ *


*వరాహవామననృసింహసుభాగ్యమీశం*

*క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యం |*

*హంసాత్మకం పరమహంసమనోవిహారం*

*వందే కృపానిధిమహోబలనారసింహం ౪ *


*మందాకినీజననహేతుపదారవిందం*

*బృందారకాలయవినోదనముజ్జ్వలాంగం |*

*మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం*

*వందే కృపానిధిమహోబలనారసింహం ౫ *


*తారుణ్యకృష్ణతులసీదళధామరమ్యం*

*ధాత్రీరమాభిరమణం మహనీయరూపం |*

*మంత్రాధిరాజమథదానవమానభృంగం*

*వందే కృపానిధిమహోబలనారసింహం ౬ *


*ఇతి అహోబలనృసింహ స్తోతం ||*

Sri Ramashtakam


 *_🏹 శ్రీ వేదవ్యాస కృత శ్రీ రామాష్టకం 🏹_*


భజే విశేషసుందరం సమస్తపాపఖండనం

స్వభక్తిచత్తరంజనం సదైవ రామ మద్వయమ్‌


జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్‌

స్వభక్తిభీతిభంజనం భజేహ రామ మద్వయమ్‌


నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహం

సమం శివం నిరంజనం భజేహ రామ మద్వయమ్‌ 


సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవం

నిరాకృతిం నిరామయం భజేహ రామ మద్వయమ్‌


నిష్ర్పపంచనిర్వికల్పనిర్మలం నిరామయం

చిదేకరూపసంతతం భజేహ రామ మద్వయమ్‌


భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్‌

గుణాకరం కృపాకరం భజేహ రామ మద్వయమ్‌


మహాసువాక్యబోధకై ర్విరాజమానవాకృదై

పరం చ బ్రహ్మ వ్యాపకం భజేహ రామ మద్వయమ్‌


శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహం

విరాజమానదైశికం భజేహ రామ మద్వయమ్‌


రామాష్టకం పఠతి య స్సుకరం సుపుణ్యం

వ్యాసేన భాషిత మిదం శృణుతే మనుష్యః

విద్యాం శ్రియం విపుల సౌఖ్య మనంతకీర్తిం

సంప్రాప్య దేవిలయే లభతే చ మోక్షమ్‌

ఇతి రామాష్టకం🙏🙏🙏

Types of Lingas and Abhisheka Results


 *లింగ ఫలవిశేషము*


వజ్రముచే లింగము నిర్మించిన ఆయుష్యము, 


ముక్తామయయైనచో రోగ నాశము, 


వైడూర్యముచేనైనచో శత్రునాశము, 


పద్మరాగమైనచో లక్ష్మీప్రాప్తి, 


పుష్యరాగజమైనచో సుఖము, 


ఇంద్రనీలము యశము, 


మరకముననైనచో పుష్టి, 


స్ఫటిక మయమైన సర్వకామావాప్తి, 


రజతలింగము రాజ్యమును, పితృముక్తి,


సువర్ణలింగము సత్యలోకము,


రాగిలింగము పుష్టియు ఆయుష్యు,


ఇత్తడిలింగము తుష్టినిచ్చును, 


కంచులింగమున కీర్తి, 


లోహలింగమున శత్రునాశము, 


సీసలింగమున ఆయుష్యము, 


సువర్ణలింగము బ్రహ్మస్వపరిహారమును స్థిరలక్ష్మినిచ్చును,


గంధలింగమున సౌభాగ్యము, 


గజదంతలింగము సేనాధిపత్యము, 


వ్రీహి మొదలగు ధ్యానపు పిండితో చేసిన లింగమున పుష్టి సుఖము, రోగనాశము, 


మినుముల పిండితో చేసినను స్త్రీలాభము, 


వెన్నతోజేసినచో సుఖము, 


గోమయలింగమున రోగనాశము, 


గుడలింగము అన్నలింగము వంశాంకుర లింగమును వంశవృద్ధిజేయును.


ఓం నమః శివాయ🙏☘️🍃

Sri Anjaneya Stothram


 *శ్రీ ఆంజనేయ స్తోత్రం...!!* 🙏🍃☘️


ఓం నమో వాయు పుత్రాయ భీమరూపాయ ధీమతే!


నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే.!!


మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే!


భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ !!


వాగ్మినేగతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ!


వనౌకసాం వరిష్టాయ వశినే వనవాసినే.!!


తత్త్వ జ్ఞాన సుధాసిందు నిమగ్నాయ మహీయసే!


ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ.!!


జన్మ మృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ.!


నేదిష్టాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే!


యాతనా నాశనాయస్తు నమో మర్కట రూపిణే.!!


యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే!


మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ద్రతే.!!


హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే!


బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే.!!


లాభ దోసిత్వమే వాసు హనుమాన్ రాక్షసాంతక!


యశోజయంచ మే దేహి శతృన్ నాశయ నాశయ.!!


స్వాశ్రితానాయ భయదం య ఏవం సౌత్తి మారుతిం!


హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవత్. !!...🙏


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

Monday, March 13, 2023

అభిషేక ప్రియః ఈశ్వరః


 *'అభిషేక ప్రియః ఈశ్వరః'-*


 ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, శివుడు విశ్వరూపుడు కనుక, రుద్రాభిషేకంతో విశ్వం చల్లబడుతుంది. 

ఈ లోకం సుఖశాంతులతో చల్లగా ఉంటుంది, పంచామృతాలతో, గంగా జలంతో రుద్రుణ్ని అభిషేకించి, తుమ్మిపూలతో, మారేడు దళాలతో పూజించి, గోక్షీరాన్ని, కదళీ (అరటి) ఫలాన్ని నైవేద్యం పెట్టాలి. 

చతుఃషష్టి (64) ఉపచారాలతో అర్చించాలి, కుదరక పోతే షోడశోపచారాలతో అయినా పూజించాలి. 

మనకు పంచేంద్రియాలను అనుగ్రహించినందుకు కృతజ్ఞ తగా కనీసం పంచోపచారాలతోనైనా పూజించాలి. 

ఏ మంత్రాలూ రాకున్నా.. 

మనసు నిండా భక్తి భావంతో శివపంచాక్షరి జపం చేసినా శివయ్య అనుగ్రహం తప్పక లభిస్తుంది. 


ఓం నమః శివాయ🙏

Prasnotthara Rathna Malika ప్రశ్నోత్తర రత్నమాలిక


 *ప్రశ్నోత్తర రత్నమాలికలో అడగబడ్డ కొన్ని ప్రశ్నలకు శంకరులు ఇచ్చిన‌ జవాబులు మనకు దిశా నిర్దేశం చేస్తాయి...*


ఏది అన్నిటికన్నా ప్రయోజనకరమైనది?

జవాబు: ధర్మం 


ఏది వాంఛింపదగినది?

జవాబు: స్వ, పర హితం. 


శత్రువు ఎవరు?

జవాబు: సోమరితనం.


ఏది దుఃఖం?

జవాబు: ఉత్సాహం‌ లేకపోవడం.


ఏది‌ జాడ్యం?

జవాబు:‌ నేర్చుకున్నది ఆచరించకపోవడం.


ఏది వెలలేనిది?

జవాబు: అవసరం వచ్చినప్పుడు ఇవ్వబడేది.


ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది?

జవాబు: సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత.


 ఏది దానం?

జవాబు: అకాంక్ష లేనిది.


ఎవరు స్నేహితులు?

జవాబు: పాపాన్ని నివారించే వాళ్లు‌.


ఏది పాతకం?

జవాబు:‌ హింస.


ఎవరు ఎదుగుతారు?

జవాబు: వినయం ఉన్నవాళ్లు. 


ఎవరు ప్రత్యక్ష దేవత?

జవాబు: అమ్మ.


వేటిని మనుషులు సంపాదించాలి?

జవాబు: విద్య, ధనం, బలం, కీర్తి , పుణ్యం.


వేటిని కాపాడుకోవాలి?

జవాబు:‌ కీర్తి , పతివ్రత, బుద్ధి 


ఎవరు శూరులు?

జవాబు: భయంతో ఉన్నవాళ్లను రక్షించేవాళ్లు.


"శంకరత్వం ఒక‌ సుజ్ఞాన సత్వం

సదా అనుగమించాల్సిన తత్త్వం"


సేకరణ ...🙏