Tuesday, February 28, 2023

Turmeric Ganapathi పసుపు గణపతి


 *🙏🌺 పూజ చేసిన తర్వాత పసుపు గణపతిని ఏమి చేయాలో తెలుసా🌺🙏*

         


🌺హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఏ పూజ చేసినా., ఏ వ్రతం చేసుకున్నా., ముందుగా వినాయకుడి పూజ చేస్తుంటాం. అయితే ప్రథమ పూజ కచ్చితంగా వినాయకుడికే చేయాల్సి ఉంటుందని వేద పండితులు చెప్తుంటారు. 🌺


🌺అందుకే పసుపుతో గణపతిని తయారు చేసి… మనం చేసే పూజలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడమని కోరుకుంటూ ముందుగా పూజ చేసు కుంటాం. అయితే పూజ అయిపోయన తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలో చాలా మందికి తెలియదు. కొందరైతే స్నానం చేసే ముందు మొహానికి రాసు కుంటారు. అయితే అలా చేయొచ్చా.. పూజానంతరం పసుపు వినాయకుడిని ఏం చేస్తే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


పూజానంతరం పసుపు గణపతిని మనసు నిండా ప్రార్థించాలి... ‘స్వామీ వచ్చే శుభకార్యలు, పూజల్లో మళ్లీ మీ పూజ చేసుకుంటాం… అప్పటి వరకు మమ్మల్ని చల్లగా చూడమని కోరుకుంటూ పసుపు గణపతిని ఉంచిన తమలపాకు తూర్పు దిశగా కదిలించాలి. ఆ తర్వాత మనం చేసుకునే వేరే పూజలు చేసుకోవాలి. అవి కూడా పూర్తైన తర్వాత ఆ హరిద్ర గణపతిని ప్రసాదంగా భావిస్తూ… ఇంట్లోని దేవుడి గదిలో ఉంచుకోవాలి. ఆ తర్వాత అంటే కొన్నాళ్ల తర్వాత మంచి రోజు చూసుకొని పుణ్య స్త్రీలు ఆ పసుపు గణపతిని మొహానికి రాసుకోవాలి. లేదా మంగళ సూత్రాలకు పూసుకోవాలి. కాళ్లు, చేతులు, శరీరం, పాదాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పూసుకోకూడదు. 🌺


🌺అందులోనూ ఎలాంటి మైల లేని రోజుల్లోనే ఆ పసుపు గణపతిని పూసుకోవాల్సి ఉంటుంది. కుదరదు అనుకున్న వారు ఇంట్లోని బావిలో లేదా పచ్చని చెట్ల వద్ద ఉంచి నీళ్లు పోయాల్సి ఉంటుంది. అలా అని తొక్కుడు పడే చోట ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయొద్దు. బావిలో నిమజ్జనం చేయడం కూడా చాలా మంచిది. అంతే కాకుండా పుణ్య స్త్రీలు పసుపు గణపతిని ముఖానికి, మంగళ సూత్రాలకు పూసుకోవడం శుభప్రదం. అంతే కాకుండా సౌభాగ్య ప్రదం కూడా.


అందుకే ఇక నుంచి ప్రతీ ఒక్కరూ పసుపు గణపతిని మర్చిపోకుండా మంగళ సూత్రాలు లేదా మొహానికి రాసుకొని స్నానం చేయండి. ఆ స్వామి వారి కృపకు పాత్రులు కండి. వినాయకుడి కృప మనపై ఉంటే మనకొచ్చే ఎన్నో సమస్యలు మన దరి చేరవు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తుంటాడు. 🌺

Maha Ganapthi




 

వినాయక అలంకారాలు Vinayaka Alankaralu


 వినాయకుని అలంకారాలు, నామాలు ఏంటో తెలుసా?


వినాయకుని అలంకారాలు..

* స్వర్ణాభరణాలంకృత గణపతి

* విశ్వరూప గణపతి

* సింధూరాలంకృత గణపతి

* హరిద్రా (పసుపు) గణపతి

* రక్తవర్ణ గణపతి

* పుష్పాలంకృత గణపతి

* చందనాలంకృత గణపతి

* రజతాలంకృత గణపతి

* భస్మాలంకృత గణపతి

* మూల గణపతి.

గణపతి నవరాత్రుల్లో ఈ వరసని పాటిస్తారు.

వినాయకుని నామాలు...

1. తెలుగు భారతం ప్రకారం : హేరంబ, గణనాయక, గణేశ

2. పద్మపురాణం ప్రకారం : ద్వైమాతుర, లంబోదర, గణాధిపతి, వక్రతుండ, కపిల, చింతామణి, డుంఠి

3. వేదాల ప్రకారం : బ్రహ్మణస్పతి, కవి, జ్యేష్ఠరాజు, కవీనాం కవి.

4. సంగీత శాస్త్రం ప్రకారం : పిళ్ళారి, శ్రీ గణనాథ, కరివదన, లకుమికర (లక్ష్మీకరుజడు),

అంబాసుత, సిద్ధి వినాయక.


5. పూజప్రకారం : సుముఖ, ఏకదంత, గణకర్ణిక, వికట, విఘ్నరాజ, గణాధిప, ధూమకేతు, గణాధ్యక్ష, పాలచంద్ర, గజానన, వక్రతుండ, శూర్పకర్ణ,

స్కందపూర్వజ (లంబోదర, వక్రతుండ, కపిల, హేరంబ అనేవి కూడా ఉన్నా ఇవి పద్మ పురాణం, తెలుగు భారతం అనే వాటిలో ఉన్నాయి).

(సేకరణ)

Kapila Govu కపిల గోవు

 *కపిలగోవు శ్రేష్టమైనది అంటారు!!...*

'కపిల ' అంటే ఏమిటి? 

ఆ లక్షణాలను ఎలా గుర్తించాలి? 

ఒళ్ళంతా నల్లని రంగు ఉంటే కపిల గోవు అని గుర్తించాలా?


ఆవులు ఏ రంగులో, ఏ రూపంలోనున్నా శ్రేష్టమైనవే, పూజ్యములే...


 కపిల శబ్దానికి - నలుపు అని ప్రధానార్థం. 

నల్లని గోవుల్ని కపిల గోవులు అంటారు. 

అవి మరింత శ్రేష్ఠములని శాస్త్రోక్తి, గోవు అమృతశక్తితో దివ్యలోకాలలో ఉద్భవించినది... 

తొలి గోమాత సురభి, ఆమె అంశలే విశ్వములో గోవులుగా వ్యాపించాయి. 

ఒకసారి కొన్ని గోవులు హిమగిరి పరిసరాలలో సంచరిస్తుండగా, ఒక గోవు పాలను లేగ తాగుతున్నది. 

ఆ సమయంలో పొదుగునుండి స్రవిస్తున్న పాలనురగ గాలికి చింది, సమీపంలో తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరునిపై పడింది. 

దానితో కన్నులు తెరిచిన ధూర్జటి పాలనేత్రం నుండి ఎగసిన సెగ తగిలి అక్కడి గోవులు నలుపెక్కాయి. 

అవి శివుని శరణు వేడి ప్రార్థించాయి. 

శివదృష్టి శక్తిని పొందడం చేత ఆ గోవులకు ప్రత్యేక శ్రేష్ఠత లభించింది. 

శివుడు వాటికి ప్రత్యేక పూజ్యతను వరంగా అందించాడు.


కపిలగోవు శరీరమంతా నలుపు రంగుతో ఉండనవసరం లేదు, చెవులు, కొమ్ములు, కన్నులు, గిట్టలు, నాసికా పుటములు, గొంతు, ముష్కములు కపిలవర్ణంతో ఉన్నా కపిలత్వ గుణానికి చాలు. 

ముఖ్యంగా మూపురం, గంగడోలు ఉన్న భారతీయ గోసంతతి - మన శాస్త్రాల్లో వర్ణించిన ఉత్తమ గోవులుగా నిర్ణయింపబడుతున్నాయి.

Sri Ganesha Pancha Chamara Sthuthu


 *శ్రీ గణేశ పంచచామర స్తోత్రం....!!*


1) నమో గణాధిపాయతే త్వయాజగద్వినిర్మితం నిజేచ్ఛయా చపాల్యతేర్ధునావశే తవస్థితమ్|


త్వమంతరాత్మకోస్యముష్య తన్మయిస్థితః పునీహి మాం జగత్పతేంబికాతనూజ నిత్యశాం కరే ||



2) గణేశ్వరః కృపానిధిర్జగత్పతిః పరాత్పరః ప్రభుస్స్వలీల యాభవచ్ఛివాన్మదావళానః|


గిరీంద్రజాతనూ భవస్తమేవ సర్వకర్మసు ప్రపూజయంతి దేహినస్సమాప్నువంతి చేప్సితమ్ ||



3) చతుఃపుమర్థ దాయిభిశ్చతుష్కరైర్విలంబినా సహోదరేణ సోదరేణ పద్మ జాండ సంతతేః|


పదద్వయేన చాపదాం నివారకేణ భాసురాం భజే భవాత్మజం ప్రభుం ప్రసన్నవక్త్రమద్వయమ్ ||



4) బలిష్ఠమూషకాది రాజపృష్ఠనిష్ఠవిష్టర- -ప్రతిష్ఠితంగణప్రబర్హ పారమేష్ఠ్యశోభితమ్|


గరిష్ఠమాత్మ భక్తకార్య విఘ్నవర్గభంజనే పతిష్ఠ మాశ్రితావనే భజామి విఘ్ననాయకమ్ ||



5) భజామి శూర్పకర్ణ మగ్రజం గుహస్య శంకరా- -త్మజం గజాననం సమస్తదేవ బృందవందితమ్|


మహాంతరాయ శాంతిదం మతిప్రదం మనీషిణాం గతిం శ్రుతిస్మృతిస్తుతం గణేశ్వరం మదీశ్వరమ్ ||



6) యదంఘ్రిపల్లవ స్మృతిర్నిరంతరాయ సిద్ధిదా యమేవ బుద్ధిశాలినస్స్మరన్త్యహర్నిశం హృది|


యమాశ్రితస్తరత్యలంఘ్య కాలకర్మ బంధనం తమేవ చిత్సుఖాత్మకం భజామి విఘ్న నాయకమ్ ||



7) కరాంబుజ స్ఫుర ద్వారాభయాక్ష సూత్ర పుస్తక సృణిస్సబీజ పూరకంజ పాశదంత మోదకాన్|


వహన్కిరీటకుండలాది దివ్యభూషణోజ్జ్వలో గజాననో గణాధిపః ప్రభుర్జయత్యహర్నిశమ్ ||



8) గిరీంద్రజా మహేశయోః పరస్పరాను రాగజం నిజానుభూత చిత్సుఖం సురైరుపాస్య దైవతమ్|


గణేశ్వరం గురుం గుహస్య విఘ్నవర్గ ఘాతినం గజాననం భజామ్యహం నదైవమన్యమాశ్రయే ||



9) గణేశపంచ చామరస్తుతిం పఠధ్వమాదరాత్- మనీషితార్థదాయకం మనీషిణః కలౌయుగే|


నిరంతరాయ సిద్ధిదం చిరంతనోక్తి సమ్మతం నిరంతరం గణేశభక్తి శుద్ధచిత్తవృత్తయః ||



ఇతి శ్రీసుబ్రహ్మణ్య యోగి విరచితా శ్రీ గణేశ పంచచామర స్తుతిః |...🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Sarpa Stothram


 🌷🙏సర్ప స్తోత్రం🙏🌷


బ్రహ్మలోకే చ యే సర్వాః శేషనాగ పురోగమాః |

నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా |౧ || 

విష్ణులోకే చ యే సర్పాః వాసుకి ప్రముఖాశ్చ యే | నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా ॥ ౨॥ 

రుద్రలోకే చ యే సర్పాస్తక్షక ప్రముఖాస్తథా |

ఖాండవస్య తథా దాహే స్వర్గం యే చ సమాశ్రితాః | నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా ॥ ౪ || 

సర్పసత్రే చ యే సర్పాః ఆస్తీకేన చ రక్షితాః |

నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౩ || 

నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౫ || 

మలయే చైవ యే సర్పాః కార్కోటప్రముఖాశ్చ యే || నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౬ || 

ధర్మలోకే చ యే సర్పాః వైతరణ్యాం సమాశ్రితాః | నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౭ || 

సముద్రే చైవ యే సర్పాః పాతాలే చైవ సంస్థితాః | నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౮ || 

యే సర్పాః పర్వతాగ్రేషు దరీసంధిషు సంస్థితాః | నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౯ || 

గ్రామే వా యది వారణ్యే యే సర్పాః ప్రచరంతి హి || నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౧౦ || 

పృథివ్యాం చైవ యే సర్పాః యే సర్పాః బిలసంస్థితాః | 

నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౧౧ || 

రసాతలే చ యే సర్పాః అనంతాద్యాః మహావిషాః | నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా ॥ ౧౨ ||


🌹🙏|| ఇతి సర్ప స్తోత్రమ్ ||🌹🙏

Sri Siva Aparaadha Kshamapama Sthotram

 


శ్రీశివాపరాధక్షమాపణస్తోత్రం 

అథవా శివాపరాధభఞ్జనస్తోత్రమ్ 


శ్లోకము:

వార్ధక్యే చేన్ద్రియాణాం విగతగతిమతిశ్చాధిదైవాదితాపైః

పాపై రోగైర్వియోగైస్త్వనవసితవపుః ప్రౌఢహీనం చ దీనమ్ ।

మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యమ్

క్షన్తవ్యో మే ⁇ పరాధః శివ శివ శివభో శ్రీమహాదేవ శంభో ॥ 4॥

పదవిభజన: 

వార్ధక్యే చ ఇన్ద్రియాణాం విగత గతిం అతిష చ అధి దైవ ఆది తాపైః

పాపైః రోగైః వియోగై స్త్వనవ సిత వపుః ప్రౌఢ హీనం చ దీనమ్ ।

మిథ్యా మోహ అభిలాషైః భ్రమతి మమ మనః ధూర్జటేః ధ్యాన శూన్యం

క్షంతవ్యో మే అపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 4॥

భావము:

ఓ! పరమ శివా! 

ముసలి తనము కూడ వచ్చింది. 

ఇంద్రియాల చలనం తగ్గింది.

బుద్ధి మందగించింది.


1.ఆధి భౌతిక తాపత్రయములు: అనగా 

మన కంటే ఇతరులైన దారాపుత్రాదులు, ఇరుగు పొరుగు వారు, దొంగలు, ఇతర ప్రాణులు- కుక్కలు, ఇతర జంతువులు వలన కలుగు తాపములు.


2.ఆధి దైవిక తాపత్రయములు: అనగా

పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశాత్-

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము 

ల ద్వారా-ప్రకృతి శక్తులద్వారా వాటిల్లే క్లేశాలు.

అనగా భూకంపము, వర్షము, పిడుగుపాటు మొ॥


3.ఆధ్యాత్మిక తాపత్రయములు: అనగా

మనవలననే మనకు కలిగే తాపాలు- 

శారీరిక రుగ్మతలు, మానసిక సమస్యలు మొదలయినవి.


నన్ను చుట్టుముట్టాయి.


చేసిన పాపాలు,  రోగము, వియోగము, వంటి వాని మూలాన 

శరీరము శిధిలమైనది.

నా మనస్సు మిధ్య, మోహము, కోరికలతో   

దుర్భలంగా దీనంగా మారి 

నీ ధ్యానము చేయక భ్రమలో మునిగిపోయినది. 

 

కావున ఓ!  శంకరా! శివా!  శివా! పరమేశ్వరా! మహాదేవా! 

ఇపుడు  నా అపరాధమును క్షమించు,🙏🙏☘️🌿🍃

Vibheshana Krutha Hanumat Stotrsm


 శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం :


🍁🍁🍁🍁🍁

 

ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వాకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః ||


ధ్యానం ||

వామే కరే వైరిభీతం వహన్తం

శైలం పరే శృంఖలహారిటంకం |

దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రం

భజే జ్వలత్కుండలమాంజనేయమ్ 1 


సంవీతకౌపీన ముదంచితాంగుళిం

సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినం

సకుండలం లంబిశిఖాసమావృతం

తమాంజనేయం శరణం ప్రపద్యే 2 


ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీహనూమతే

అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః 3 


సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ

తాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోఽస్తుతే 4 


ఆధివ్యాధి మహామారి గ్రహపీడాపహారిణే

ప్రాణాపహర్త్రేదైత్యానాం రామప్రాణాత్మనే నమః 5 


సంసారసాగరావర్త కర్తవ్యభ్రాన్తచేతసామ్

శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోఽస్తుతే 6 


వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే

బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే 7 


రామేష్టం కరుణాపూర్ణం హనూమన్తం భయాపహమ్

శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకమ్ 8 


కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే

జలే స్థలే తథాకాశే వాహనేషు చతుష్పథే 9 


గజసింహ మహావ్యాఘ్ర చోర భీషణ కాననే

యే స్మరంతి హనూమంతం తేషాం నాస్తి విపత్ క్వచిత్ 10 


సర్వవానరముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః

శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః 11 


ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరంత్యంజనాసుతమ్

అర్థసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయః 12 


జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః

రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభేజ్జయమ్ 13 


విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః

సర్వాపద్భ్యః విముచ్యేత నాఽత్ర కార్యా విచారణా 14 


మంత్రం :

మర్కటేశ మహోత్సాహ సర్వశోకనివారక

శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ భో హరే 15 


ఇతి విభీషణకృతం సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ స్తోత్రమ్


⚜️⚜️⚜️⚜️⚜️

6 Important Temples of Lord Subrahmanyeswara Swamy


 *🌿🌼🙏సుబ్రహ్మణ్యుని ఆరు దివ్య క్షేత్రాలు🙏🌼🌿తిరుచందూర్, స్వామిమలై, పళని, తిరుత్తణి, పళముదిర్‌చోళై, తిరుపరన్‌కున్రమ్*


🌿🌼🙏సుబ్రహ్మణ్యుని ఆరు దివ్య క్షేత్రాలు🙏🌼🌿 ఆరుపడైవీడు🙏🌼🌿తిరుచందూర్, స్వామిమలై, పళని, తిరుత్తణి, పళముదిర్‌చోళై, తిరుపరన్‌కున్రమ్🙏🌼🌿


🌿🌼🙏శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రమణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యముంది. తండ్రికే జ్ఞానభోద చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలలో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే ఆలయాలు అధికంగా ఉండడం విశేషం. 🙏🌼🌿


🌿🌼🙏ఆంధ్రప్రదేశ్‌లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖ స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది.🙏🌼🌿


🌿🌼🙏#తిరుచందూర్ 🙏🌼🌿


🌿🌼🙏సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్‌లో ఉంది. సరన్ అనే రాక్షసరాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్‌లో కొలువై నిలిచారట. తిరుచందూర్‌లోని సుబ్రమణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం. 🙏🌼🌿


🌿🌼🙏#స్వామిమలై🙏🌼🌿


స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశం చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు.🙏🌼🌿


🌿🌼🙏#పళని 🙏🌼🌿


🌿🌼🙏ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి ఉందో తమిళనాడులో పళని క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళనిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. 🙏🌼


🌿🌼🙏#తిరుత్తణి 🙏🌼🌿


🌿🌼🙏తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలోనూ విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని సుబ్రమణ్యస్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.🙏🌼🌿 


🌿🌼🙏#పళముదిర్‌చోళై 🙏🌼🌿


🌿🌼🙏దట్టమైన అడవి ప్రాతంలో వెళసిన ఈ క్షేత్రం కూడా సుబ్రమణ్యస్వామి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. పైన పేర్కొన్న క్షేత్రాలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. 🙏🌼🌿


🌿🌼🙏#తిరుపరన్‌కున్రమ్ 🙏🌼🌿


🌿🌼🙏తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే ఈ తిరుపరన్‌కున్రమ్ క్షేత్రం కూడా కొలువై ఉంది. తన ఇద్దరు భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రమణ్యస్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్‌కున్రమ్🙏🌼🌿


🌿🌼🙏ఓం శం శరవణభవ

Sri Subrahmanya Shodasa Nama Stotram


 🙏🌺శ్రీ సుబ్రహ్మణ్య షోడశ నామ స్త్రోత్రం ....!! 🌺🙏


🌺అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రమహామంత్రస్య అగస్త్యోభగవానృషిః | అనుష్టుప్ఛందః | సుబ్రహ్మణ్యో దేవతా | మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః |🌺


🌺ధ్యానం |

షడ్వక్త్రం శిఖివాహనం త్రిణయనం చిత్రాంబరాలంకృతాం |

శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ||


పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా |

ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితం || 


ప్రథమోజ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ |

అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః || 


గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః |

సప్తమః కర్తికేయశ్చ కుమరశ్చాష్టమస్తథా || 


నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారిః స్మృతో దశ |

ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవ చ || 


త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః |

క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః || 


షోడశైతాని నామాని యో జపేద్భక్తిసంయుతః |

బృహస్పతిసమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః || 


కవిత్వేచ మహాశస్త్రే జయార్థీ లభతే జయం |

కన్యార్థీ లభతే కన్యాం జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ || 


విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే |

యద్యత్ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభతే ధృవం || . 🌺

Importance of Sri Rama Namam


 *🙏🌺శ్రీ రామ నామం🌺🙏*


 🌺ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే శ్రీ రామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం పొరపాటు. 


శ్రీ రామ* అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట.అదెలాగో చూద్దాం. 🌺


🌺1⃣ రామ అంటే *రాముడు* పలుకుతాడు తెలిసిందే


2⃣ రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ *హనుమంతుడే*


3⃣ *శ్రీ* అంటే *లక్ష్మి*


4⃣ *రా* అంటే *విష్ణువు* (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు)


5⃣ *మ* అంటే *శివుడు* (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు)


6⃣ శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట. 


అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారం లో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని. 


అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట. 


మరి రామ అన్నపుడు హనుమ వస్తే *పార్వతీ* కూడా వచ్చింది కదా.


రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరు. గమనించండి. 


శ్రీ రామ శ్రీ రామ* అని అంటూనే వుందాము. 

మన ఈ మానవ జన్మ తరింద్దాము.


ఓం జై శ్రీరామ్ l 🌺

Pradakshinas to Lord Hanuma


*🚩🌼🌿హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ?
ఎలా చేయాలి?*🌼🌿🚩

ఎన్ని ప్రదక్షిణలు చేయదులచుకున్నాను,
ప్రతి ప్రదక్షిణము తర్వాత ఒక చోట ఆగి
ఈ శ్లోకం చెప్పకుని తిరిగి ప్రదక్షిణము చేయవలెను.

ఏ దేవాలయానికి వెళ్ళినా 3 ప్రదక్షిణలు చేస్తాం.
కానీ హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం ఐదు ప్రదక్షిణలు చేయాలి.
'ప్రదక్షిణనమస్కారాన్ సాష్టాంగన్ పంచ సంఖ్యాయా' అని ఆర్షవాక్యం .

మామూలుగా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి.
సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభీష్టకి ప్రదక్షిణలు సుప్రసిద్దాలు.

ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసి
సంతానం పొందిన వారందరో ఉన్నారు. .
నియమాలు పాటించడం ముఖ్యం.

హనుమంతునకు ప్రదక్షిణములు అంటే ఇష్టం. ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షణలు చేసేటప్పుడు ప్రతీ ప్రదక్షిణ తరువాత ఆగి..చెప్పుకోవల్సిన శ్లోకము'...

ఆంజనేయం మహావీరం !
బ్రహ్మ విష్ణు శివాత్మకం !
అరుణార్కం ప్రభుం శమథం !
రామదూతం నమామ్యహం !'

హనుమంతునకు ప్రదక్షిణములు రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు
27 ప్రదక్షిణములు చేయాలి.
పుష్పములు, వక్కలు, పసుపు కొమ్ములు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది.

ప్రదక్షిణలు చేస్తూ చదవాల్సిన ధ్యానం..
''శ్రీహనుమన్ జయ హనుమాన్
జయ జయ హనుమాన్''

ఆంజనేయం మహావీరం -బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాతం -రామదూతం నమామ్యహం

మర్కటేశ మహోత్సహా -సర్వశోక వినాశన శత్రూన్సంహర మాం రక్ష- శ్రియం దాపయ మే ప్రభో || అని చదువు కుంటూ ప్రదక్షిణలు చేయాలి.

కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కానీ ప్రదక్షిణలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి ''యాక్రుత్తే రేభి: ప్రదక్షిణ |
శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రీత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు'' అని జలాన్ని అక్షతలతో వదిలిపెట్టాలి.

ప్రదక్షిణ కాలంలో బ్రహ్మ చర్య, శిరస్నానం , నేలపడక, సాత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.
మామూలుగా ఐదు ప్రదక్షిణలు చేయాలి.
పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి
ఆయనకు అభిషేకం ఇష్టం.
అందులోనూ మన్యు సూక్త అభిషేకస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు.

స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు
తప్పకుండా చేయాలి.
వారం, వారం నిత్యమూ చేయగలగడం
మరీ మంచిది.

మంగళవార సేవ..
మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం.
అంతా కుదరని వారు మూతికయినా తప్పక పూయాలి.
సింధూరార్చన చేయటం,
అరటి పండ్లు నివేదించడం చేయాలి.

శనివార సేవ:..
హనుమంతుడు శనివారం జన్మించాడు, కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది.
నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి.
ఆరోజున అప్పాలు, వడ మాల వంటివి స్వామివారికి నివేదించి స్వామి వారి ఆశీస్సులు పొందవచ్చు.

పంచ సంఖ్య..
హనుమంతుడుకి పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి ప్రదక్షిణాలు, నమస్కారాలు ఐదు చేయాలి. అరటిపండ్లు లేదా ఇతరములు, స్వామికి
5 సంఖ్యంలో సమసర్పించడం స్వామివారికి
మరింత ప్రీతికరం.

Sunday, February 26, 2023

Pancha Pathra in Pooja

 *పంచ పాత్ర :*


పంచపాత్ర అంటే ఒక పాత్ర కాదు. 

ఆరాధనకు అయిదు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి. 

మనం ఒక పాత్రలోనే అన్నీ ఉంచి మమ అనేస్తున్నాము.


*మొదటిది అర్ఘ్య పాత్ర:*


భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో కూడిన పాత్ర


*రెండవది పాద్య పాత్ర:*


ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర


*మూడవ పాత్ర:*


మూడవది ఆచమనీయ పాత్ర: 

ఇది భగవంతుని కి పుక్కిలించడానికి సమర్పించే శుద్దోదకం నింపిన పాత్ర. 


*నాలుగవది స్నాన పాత్ర:*


ఇది భగవంతుని కి స్నానము చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న పాత్ర


*ఐదవ పాత్ర :*


ఐదవది శుద్ధోదక పాత్ర- ఇందులో భగవంతుని కి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర


ఇవి *పంచ పాత్రలు*..ఇవి గాక ప్రతిగ్రాహక పాత్ర ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర,మరొక శుద్ధ జలం అవసరం అయితే కావాల్సిన జలాన్ని నింపుకున్న పాత్ర, ఇంక ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి. 


ఇంకా *సర్వార్థ జల పాత్ర*- ఇది మన చేతులు మరియు, ప్రతీ ఉపచారానికి మధ్య మధ్యలో ఉద్ధరిణ శుభ్రం చేసి తిరిగి మరొక ఉపచారము చేసేప్పుడు వాడే దానికి శుద్ధ జలము నింపిన పాత్ర.


🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

Importance of Bilwam (బిల్వ చెట్టు వృత్తాంతం, బిల్వాష్టకం - విశిష్టత*)


 *బిల్వ చెట్టు వృత్తాంతం, బిల్వాష్టకం - విశిష్టత*


శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. 

శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.


*శివపూజకు సంబంధించినంత వరకు*


వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.


వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.


వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.


వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.


వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.


వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.


వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.


వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.


వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.


వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.


వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. 


_శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు._


ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.


పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. 

ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.


ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు.

రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు.

మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. 

నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి,

ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. 

ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.


సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి, మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం.

లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. 

మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. 

అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.


ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. 

అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. 

అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. 

మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.


ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. 

అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు.


ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట.


గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. 

కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. 

సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. 

దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. 

బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. 

శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. 

మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.


*ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి!!*


మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. 

బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. 

వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.


దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని

శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది.

Siva Pradosha Stotram


 🙏🙏మహాశివుని మెప్పించే మహత్తర మార్గం శివ ప్రదోష స్తోత్రం🌺🙏


🌺పరమ శివుడు ప్రసన్న వదనుడై ఆనంద నృత్యం చేసే ప్రదోష సమయం లో శివ ప్రదోష స్తోత్రం పఠించడం వలన సకలైశ్వర్యాలూ ఆయురారోగ్యాలూ సిద్ధిస్తాయి. భక్తి ప్రపత్తులతో మనస్ఫూర్తిగా శివ ప్రదోష స్తోత్రాన్ని పఠించిన భక్తులకు ఆ భోళా శంకరుడు కోరిన కోర్కెలన్నిటినీ నెరవేర్చి దీవిస్తాడు. 🌺


🌺శివప్రదోషస్తోత్రం.


కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం

గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే

నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ

దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః

తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా

విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా

సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య

విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ

యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః

ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః


ఓం నమః శివాయ నమః🌺


🌺ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ పై వుండాలని...ఆ కైలాస వాసుని  శివనుగ్రహ ప్రాప్తిరస్తు. 🌺

Friday, February 24, 2023

అశ్వత్థ వృక్షం (రావి), Aswatha Vruksham (Raavi)


 *🌳అశ్వత్థ వృక్షం 🌳*


మూలంలో విష్ణువు, 

స్కందము లో కేశవుడు, 

కొమ్మల లో నారాయణుడు, 

ఆకులలో శ్రీహరి, 

ఫలాలలో సర్వదేవతల తో కలిసి, అచ్యుతుడు 

వుంటారని ప్రతీతి. 


అందుకే ఈ వృక్షాన్నిఆశ్రయిస్తే సకలపాపాలు నశిస్తాయి...


రావిచెట్టును తాకితే అశౌచదోషం పూర్తిగా నివృత్తి అవుతుందని చెప్తారు...

ఆయుర్వేదంలో చాలా రోగాలను నాశనం చేసే శక్తి అశ్వత్థవృక్షానికి వుందని చెప్పబడింది.


ఈ వృక్షానికి వక్షస్థలమును తాకించి కౌగలించుకుంటే, రోగాలన్నీ నశిస్తాయని చెప్తారు.🌳...🙏🌹

Astadala Paada Padmaradhana శ్రీవారికి అష్టదళ పద్మారాధన🙏🙏

 *ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, మంగళ, శనివారాల్లో..శ్రీవారికి..అష్టదళ పద్మారాధన.. చేస్తే..వచ్చే ఫలితం...!!!* 🙏🙏🌹


తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి అష్టదళ పద్మారాధన చేస్తారు. ఈ ఆరాధన ఎందుకు చేస్తారు.. ఎప్పుడు చేస్తారో తెలుసుకోవాలనుందా.. 


 శ్రీ మహాలక్ష్మీదేవి పద్మముల యందు నివసిస్తుందియని.. అందుకే అమ్మవారిని పద్మవాసిని అని పిలుస్తారు. అష్టదళ పద్మములందు లక్ష్మీదేవి యొక్క అష్ట లక్ష్ముల వైభవం అలరారుతుంటుంది. 


కనుకనే వేంకటేశ్వరస్వామికి అష్టదళ పద్మారాధన ఎంతో ప్రీతికరమైనది 


ప్రతి మంగళవారం నాడు స్వామివారికి అష్టదళ పద్మారాధన జరుగుతుంది. 


మంగళవారం నాడు స్వామివారిని అష్టదళ పద్మములతో పూజించటం వలన కుజదోషాలు తొలగిపోయి, కుటుంబసౌఖ్యం, సత్వర వివాహసిద్ధి, ఉద్యోగ విజయాలు లభిస్తాయి. 


శనివారం నాడు స్వామివారిని అష్టదళ పద్మములతో పూజించడం వలన శనిదోషాలు తొలగిపోయి రాజ్యాధికారం, సకల సంపదలు లభిస్తాయి.


 ప్రతి నిత్యం శ్రీ వేంకటేశ్వరస్వామిని, పద్మావతీదేవిని అష్టదళ పద్మములతో పూజించేవారికి అష్టైశ్వర్యసిద్ధి కలుగుతుంది..

సమస్త పాప నాశన శ్రీ విష్ణు స్తోత్రమ్....!! Sri Vishnu Stotram


 *సమస్త పాప నాశన శ్రీ విష్ణు స్తోత్రమ్....!!*



        🌷పుష్కర ఉవాచ:-🌷


     1) పరదార పర ద్రవ్యజీవహింసాదికే యదా !


🌷ప్రవర్తతే నృణాం చిత్తం ప్రాయశ్చిత్తం స్తుతిస్తదా... !!🌷



2) విష్ణవే విష్ణవే నిత్యం విష్ణవే విష్ణవే దృశ్యం !


నమామి విష్ణుం చిత్తస్థమహంకారగతిం హరిం !!



చిత్తస్థమీశమ వ్యక్తమనంత మపరాజితం !


విష్ణుమీడ్యమశేషేణ అనాది నిధనం విభుం !!



4) విష్ణుశ్చిత్తగతో యన్మే విష్ణుర్బుద్ధి గతశ్చ యత్ !


యచ్చాహంకారగో విష్ణుర్యవ్దిష్ణుర్మయిసంస్థితః !!



5) కరోతి కర్మభూతోऽసౌ స్థావరస్య చరస్య చ !


తత్ పాపన్నాశ మాయాతు తస్మిన్నేవ హి చింతితే !!



6) ధ్యాతో హరతి యత్ పాపం స్వప్నే దృష్టస్తు భావనాత్ !


తముపేంద్ర మహం విష్ణుం ప్రణతార్తి హరం హరిం !!



7) ప్రణతార్తి హరం జగత్యస్మిన్నిరాధారే మజ్జమానే తమస్యధః !


హస్తావలంబనం విష్ణుం ప్రణమామి పరాత్పరం !!



8) సర్వేశ్వరేశ్వర విభో పరమాత్మ న్నధోక్షజ !


హృషీకేశ హృషీకేశ హృషీకేశ నమోऽస్తుతే !!



9) నృసింహానంత గోవింద భూతభావన కేశవ !


దురుక్తం దుష్కృతం ధ్యాతం శమయాఘ న్నమోఽస్తుతే !!



10) యన్మయా చింతితం దుష్టం స్వచిత్తవశవర్త్తినా !

అకార్యమహదత్యుగ్రంతచ్ఛమన్నయ కేశవ !!



11) బ్రహ్మణ్యదేవ గోవింద పరమార్థ పరాయణ !


జగన్నాథ జగద్ధ్యాతః పాపం ప్రశమయాచ్యుత !!



12) యథా పరాహ్నే సాయాహ్నే మధ్యాహ్నే చ తథా నిశి !


కాయేన మనసా వాచా కృతం పాపమజానతా !!



13) జానతా చ హృషీకేశ పుండరీకాక్ష మాధవ !

నామత్రయోచ్చారణతః స్వప్నే యాతు మమ క్షయం !!



14) పాపం యాతు శరీరం మే హృషీకేశ పుండరీకాక్ష మాధవ !!


పాపం ప్రశమయాద్యత్వం వాక్కృతం మమ మాధవ !!



15) యద్భుంజన్యత్స్వపంస్తిష్ఠన్ గచ్ఛన్ జాగ్రద్ యదాస్థితః !


కృతవాన్ పాపమద్యాహం కాయేన మనసాగిరా !!



16) యత్ స్వల్పమపి యత్ స్థూలం కుయోని నరకావహం !


తద్యాతు ప్రశమం సర్వ వాసుదేవాను కీర్తనాత్ !!



17) పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమంచ యత్ !


తస్మిన్ ప్రకీర్తితే విష్ణౌ యత్ పాపం తత్ ప్రణశ్యతు !!



18) యత్ ప్రాప్య న నివర్తంతే గంధస్పర్శాది వర్జితం !


సూరయస్తత్ పదం విష్ణోస్తత్ సర్వం శమయత్వధం !!



19) మాహాత్మ్యం పాపప్రణాశనం స్తోత్రం యః పఠేచ్ఛృణు యాదపి !


శారీరైర్మానసైర్వాగ్జైః కృతైః పాపైః ప్రముచ్యతే !!



20) సర్వపాపగ్రహా దిభ్యో యాతివిష్ణోః పరం పదం !


తస్మాత్పాపే కృతే జప్యంస్తోత్రంసర్వాఘమర్దనం !!



21) ప్రాయశ్చిత్తమ ఘౌఘానాం స్తోత్రం వ్రతకృతే వరం !


ప్రాయశ్చిత్తైః స్తోత్రజపైర్వ్రతైర్నశ్యతి పాతకం !!


శ్రీ సమస్త పాప నాశన శ్రీ విష్ణు స్తోత్రమ్ సంపూర్ణo..🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

గోవింద నామ మహిమ:...* 🙏🌹 Importance of Govinda Namam

 *గోవింద నామ మహిమ:...* 🙏🌹


🍁గో, గోప, గోపికలను రక్షించి, ఇంద్రుని గర్వమణచి శ్రీకృష్ణుడు ‘గోవింద’ నామాన్ని బిరుదుగా పొందాడు. ఇంత కష్టంతో వ్రేపల్లె వాసుల మీద ఇష్టం సంపాదించుకున్న శ్రీకృష్ణుని, గోవిందనామంతో కాక నారాయణ నామంతో పిలవడం అన్నది ‘దగ్గరి బంధుత్వాన్ని కాదని దూరపు బంధుత్వాన్ని చెప్పడం వంటిదని’ మహాభక్తురాలు, లక్ష్మీదేవి స్వరూపమైన గోదాదేవి (ఆండాళ్‌) భావించింది. ప్రేమగలవారు ‘ప్రాణనాథా’ అని కాకుండా ‘లోకనాథా’ అని పిలవడం వంటిదే ఇదని శ్రీకృష్ణుడూ భావిస్తాడనీ ఆ అమ్మవారు గుర్తించింది.


🪴‘గోవింద’ అనే మూడక్షరాల నామం శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని సులభంగా, నిశ్చయంగా సిద్ధింపజేసే ఒక మహామంత్రం. వయసు, కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలేవీ లేకుండా అందరూ ‘నామసంకీర్తనం’గా దీన్ని జపించవచ్చు


⛰తిరుమల కొండపై, దేవాలయాల్లో, గృహాలలో జరిపే అర్చనలలో, భజనలలో భక్తిశ్రద్ధలతో భక్తులు ఉచ్చరించే ‘గోవింద’ నామం పట్ల మనందరం కూడా ప్రీతిని ఏర్పరచుకుందాం. అత్యంత భక్తి ప్రపత్తులతో ‘గోవింద’నామాన్ని నిరంతరం, మనసా వాచా కర్మణా స్మరిద్దాం. భక్త సులభుడైన పరమాత్ముని అనుగ్రహాన్ని పొందుదాం.


⛰🏔⛰🛕🏔🛕⛰🏔⛰

Govinda Raja Swamy, Tirupathi.

 *వేంకటేశ్వరుడి ‘అన్న’ అందుకే తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చాడా?*


🔅 తిరుపతిలోని గోవిందరాజస్వామిని వేంకటేశ్వరుడి అన్నగా చెబుతారు. తిరుపతి వేంకటేశ్వరుడే స్వయంగా తాను తన అన్న గోవిందరాజులు చెప్పినట్టు నడుచుకొంటానని ఒకానొక సందర్భంలో చెప్పాడు. 

ఇక ఈ గోవిందరాజస్వామి దేవాలయం దగ్గర్లోని కొలను అనేక చారిత్రాత్మక ఉద్యమాలకు పుట్టినిల్లు. వైష్ణవోద్యమానికి రామానుజాచార్యలు ఇక్కడే బీజం వేసినట్లు చెబుతారు. 


🔅 శేషశయన స్థితిలో ఉన్న గోవిందరాజులు తమిళనాడులోని చిదంబరం నుంచి ఇక్కడికి వచ్చాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. 

ప్రాణ భయంతో అక్కడి పూజారులు స్వామివారిని ఇక్కడకు తీసుకొనిరాగా రామానుజాచార్యలు వారికి ఆశ్రయం కల్పించాడని శాసనాలు చెబుతాయి.

ఇలాంటి ఆసక్తికరమైన కథనం మీ కోసం..


🔅 తిరుపతిలోని గోవిందరాజ స్వామిని కలియుగ దైవం వేంకటేశ్వరుడికి అన్నగా పేర్కొంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు నుంచి అప్పుగా తీసుకొన్న సొమ్మును కొలిచి కొలిచి అలసిపోయిన స్థితిలో పడుకొన్న భంగిమలో గోవిందరాజస్వామి కనిపిస్తాడు.

ఆయన కాళ్ల వద్ద సొమ్మును కొలవడానికి వినియోగించిన కుంచె కూడా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా చరిత్రను అనుసరించి ఈ విగ్రహం తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చిందని గోవిందరాజ స్వామి దేవాలయంలోని శాసనాల వల్ల తెలుస్తుంది


🔅 పూర్వం చిదంబర క్షేత్రంలో శేషశయనుడైన విష్ణుమూర్తి ఆలయం ఉండేది. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న క్రిమకంఠుడనే రాజు శివ భక్తుడు. అంతేకాకుండా విష్ణువు అంటే అసహించుకునేవాడు. ఈ క్రమంలోనే చిదంబరంలోని శేషశయనుడైన విష్ణుమూర్తి విగ్రహాన్ని సముద్రంలోకి తోయించాడు.

అంతేకాకుండా ఆలయ పూజారులను తీవ్రంగా హింసించి చంపించడం మొదలు పెట్టాడు. దీంతో వైష్ణవ పూజారులు ప్రాణభయంతో రాజ్యాన్ని విడిచి చెల్లాచెదురుగా పారిపోయారు.


🔅 ఇందులో కొంతమంది ఆ విష్ణుమూర్తి ఉత్సవ మూర్తులను తీసుకొని తిరుమల ప్రాంతంలోని రామానుజాచార్యులను కలిసి తమ గోడును తెలియజేశారు.

దీంతో రామానుచా చార్యులు చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని తయారు చేయించి తిరుపతిలో ప్రస్తుతం గోవిందరాజ స్వామి ఆలయంలో ప్రతిష్టింపజేసినట్లు తెలుస్తోంది.


🔅 అదే విధంగా చిదంబరం నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహాలకు కూడా ఆరాధనలు, నిత్యపూజలు జరిగేలా కట్టుబాటు చేశారు. అటుపై రామానుజా చార్యులు తన శిష్యుడైన యాదవ రాజు ద్వారా ఆ ఆలయానికి దగ్గర్లో ఒక గ్రామాన్ని నిర్మింపజేసాడు.అందులో చిదంబరం నుంచి వలస వచ్చిన పూజారుల కుటుంబాలు ఉండేలా చేశాడు. అయితే మరికొంతమంది గోవిందరాజ స్వామి దేవాలయంలో మొదట పార్థసారధి విగ్రహం పూజలు అందుకొనేదని చెబుతారు.


🔅 చిదంబరంలోని క్రిమకంఠుడి రాజు ఆగడాలు భరించలేక చిదంబరం లోని శేషశయన స్థితిలోని విగ్రహాన్ని నేరుగా ఇక్కడికి తీసుకువచ్చి 24.2.1130 లో ఆలయంలో ప్రతిష్టింపజేశారని చెబుతారు. 

ఈ రెండు విషయాల్లో కొంత బేధం ఉన్నా చిదంబరంలో శేషశయన విష్ణుమూర్తి తిరుపతికి వచ్చి కొలువై ఉన్నట్లు శాసనాల ద్వారా స్పష్టమవుతోంది.


🔅 ఇక గర్భగుడిలో గోవిందరాస్వామి విగ్రహం శేశాయి ఆదిశేషుని పై పడుకొన్నట్లు ఉంటుంది. ఉత్తర దిక్కుకు పాదాలు, దక్షిణదిశలో తల పెట్టుకొని, శంఖు, చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై, నాభి నుంచి కమలం ఉద్భవించి అందులో బ్రహ్మ ఉంటాడు. అంతేకాకుండా తలకు కిరీటం, దివ్యాభరణాలు కూడా స్వామివారికి ఉంటాయి.


🔅 మూలవిరాట్టు గోవిందరాజస్వామితో పాటు ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీరామనుజ, తిరుమంగై ఆళ్వారు, తదితర విగ్రహాలను మనం చూడవచ్చు. 

ఆలయం దక్షిణ భాగంలో రుక్మిణి, సత్యభామా సహితుడైన పార్థసారధి మందిరం ఉంది. 

వైశాఖ మాసంలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.


🔅 ఇక్కడి విగ్రహం మట్టితో చేసినందువల్ల అభిషేకం జరుగదు. అయితే తిరుమలలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలాగానే గోవిందరాస్వామి ఆలయంలో కూడా వైఖానస ఆగమ పద్దతులే పాటిస్తారు. 

ప్రధాన ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి. వీటి పై రామాయణ, మహాభారత గాధలను అందమైన శిల్పాల రూపంలో చెక్కారు.


🔅 తిరుపతి వేంకటేశ్వరుడి దర్శానానికి వెళ్లిన కొంతమంది భక్తులు తిరుపతి గోవిందరాజస్వామి దర్శనం చేసుకొని కాని వెనుదిరగరు. ఇక కొండను ఎక్కలేని భక్తులు గోవిందరాజుని దర్శనం చేసుకొని వేంకటేశ్వరుడికి తమ కోర్కెలను చెప్పాల్సిందిగా వేడుకొని వెనుతిరుగుతుంటారు.

Wonderful Slokas Rendering


 

గోవింద నామాలు Govinda Naamaalu


 *గోవింద నామాలు..* 

🙏🌺🌺🌺🌺🌻🌻🌺🌺🌺🌺🙏


ఏడుకొండలవాడా వెంకటరమణా!

గోవిందా! గోవింద!!

ఆపదమొక్కులవాడా అనాధరక్షకా ఆపద్బాంధవా!!

గోవిందా! గోవింద!!



శ్రీ శ్రీనివాసా గోవిందా 

శ్రీ వేంకటేశా గోవిందా 

భక్తవత్సల గోవిందా 

భాగవతప్రియ గోవిందా 


గోవిందా హరి గోవిందా 

వేంకట రమణా గోవిందా

గోవిందా హరి గోవిందా

వేంకటరమణా గోవిందా |


నిత్యనిర్మలా గోవిందా

నీలమేఘశ్యామ గోవిందా

పురాణపురుషా గోవిందా

పుండరీకాక్ష గోవిందా గోవిందా


నందనందనా గోవిందా

నవనీతచోర గోవిందా

పశుపాలక శ్రీ గోవిందా

పాపవిమోచన గోవిందా గోవిందా


శిష్టపరిపాలక గోవిందా

కష్టనివారణ గోవిందా

దుష్టసంహార గోవిందా

దురితనివారణ గోవిందా గోవిందా


వజ్రమకుటధర గోవిందా 

వరాహమూర్తివి గోవిందా

గోపీజనప్రియ గోవిందా

గోవర్ధనోద్ధార గోవిందా గోవిందా


దశరథనందన గోవిందా

దశముఖమర్దన గోవిందా

పక్షివాహన గోవిందా

పాండవప్రియ గోవిందా గోవిందా


మత్స్యకూర్మా గోవిందా

మధుసూదనహరి గోవిందా 

వరాహనరసింహ గోవిందా

వామన భృగురామ గోవిందా గోవిందా


బలరామానుజ గోవిందా

బౌద్ధకల్కిధర గోవిందా

వేణుగానప్రియ గోవిందా

వేంకటరమణ గోవిందా గోవిందా


సీతానాయక గోవిందా

శ్రితపరిపాలక గోవిందా

దరిద్రజనపోషక గోవిందా

ధర్మసంస్థాపక గోవిందా | గోవిందా


అనాథరక్షక గోవిందా

ఆపద్బాంధవ గోవిందా

శరణాగతవత్సల గోవిందా

కరుణాసాగర గోవిందా గోవిందా


కమలదళాక్ష గోవిందా 

కామితఫలదాతా గోవిందా

పాపవినాశక గోవిందా

పాహిమురారే గోవిందా | గోవిందా


శ్రీముద్రాంకిత గోవిందా

శ్రీవత్సాంకిత గోవిందా

ధరణీనాయక గోవిందా

దినకరతేజా గోవిందా గోవిందా


పద్మావతిప్రియ గోవిందా

ప్రసన్నమూర్తి గోవిందా

అభయహస్తప్రదర్శక గోవిందా

మత్స్యావతార గోవిందా గోవిందా


శంఖచక్రధర గోవిందా

శార్ఙ్గగదాధర గోవిందా

విరజాతీర్థస్థ గోవిందా

విరోధిమర్దన గోవిందా గోవిందా


సాలగ్రామధర గోవిందా

సహస్రనామా గోవిందా

లక్ష్మీవల్లభ గోవిందా

లక్ష్మణాగ్రజ గోవిందా గోవిందా


కస్తూరితిలక గోవిందా

కాంచనాంబరధర గోవిందా

గరుడవాహన గోవిందా

గజరాజరక్షక గోవిందా గోవిందా


వానరసేవిత గోవిందా

వారధిబంధన గోవిందా

ఏడుకొండలవాడ గోవిందా

ఏకస్వరూపా గోవిందా గోవిందా


శ్రీ రామకృష్ణ గోవిందా

రఘుకులనందన గోవిందా 

ప్రత్యక్షదేవా గోవిందా

పరమదయాకర గోవిందా గోవిందా


వజ్రకవచధర గోవిందా

వైజయంతిమాల గోవిందా 

వడ్డికాసులవాడ గోవిందా

వసుదేవతనయా గోవిందా గోవిందా


బిల్వపత్రార్చిత గోవిందా 

భిక్షుకసంస్తుత గోవిందా 

స్త్రీపుంసరూపా గోవిందా

శివకేశవమూర్తి గోవిందా గోవిందా


బ్రహ్మాండరూపా గోవిందా

భక్తరక్షక గోవిందా

నిత్యకళ్యాణ గోవిందా

నీరజనాభ గోవిందా గోవిందా


హాథీరామప్రియ గోవిందా 

హరిసర్వోత్తమ గోవిందా 

జనార్దనమూర్తి గోవిందా

జగత్సాక్షిరూప గోవిందా గోవిందా


అభిషేకప్రియ గోవిందా

ఆపన్నివారణ గోవిందా

రత్నకిరీటా గోవిందా

రామానుజనుత గోవిందా గోవిందా


స్వయంప్రకాశక గోవిందా

ఆశ్రితపక్ష గోవిందా 

నిత్యశుభప్రద గోవిందా

నిఖిలలోకేశ గోవిందా గోవిందా


ఆనందరూపా గోవిందా 

ఆద్యంతరహితా గోవిందా 

ఇహపరదాయక గోవిందా

ఇభరాజరక్షక గోవిందా గోవిందా


పరమదయాళో గోవిందా 

పద్మనాభహరి గోవిందా

తిరుమలవాసా గోవిందా

తులసీవనమాల గోవిందా |గోవిందా


శేషాద్రినిలయా గోవిందా

శేషసాయినీ గోవిందా

శ్రీనివాస శ్రీ గోవిందా

శ్రీవేంకటేశ గోవిందా |గోవిందా


గోవిందా హరి గోవిందా

గోకులనందన గోవిందా 

గోవిందా హరి గోవిందా

గోకులనందన గోవిందా గోవిందా


🙏🌺🌺🌺🌺🌻🌻🌺🌺🌺🌺🙏

Om Namo Venkatesaya


 వేంకటేశో విరూపాక్షో విశ్వేశో విశ్వభావనః |

విశ్వసృఙ్ విశ్వసంహర్తా విశ్వప్రాణో విరాడ్వపుః || 


శేషాద్రినిలయోఽశేషభక్తదుఃఖప్రణాశనః |

శేషస్తుత్యః శేషశాయీ విశేషజ్ఞో విభుః స్వభూః || 


విష్ణుర్జిష్ణుశ్చ వర్ధిష్ణురుత్సవిష్ణుః సహిష్ణుకః |

భ్రాజిష్ణుశ్చ గ్రసిష్ణుశ్చ వర్తిష్ణుశ్చ భరిష్ణుకః || 


కాలయంతా కాలగోప్తా కాలః కాలాంతకోఽఖిలః |

కాలగమ్యః కాలకంఠవంద్యః కాలకలేశ్వరః || 


పుణ్యశ్లోకో వేదవేద్యః స్వామితీర్థనివాసకః |

లక్ష్మీసరఃకేళిలోలో లక్ష్మీశో లోకరక్షకః ||


       🙏🏻 *ఓం అమృతాంశాయ నమః* 🙏🏻

🌼🌿 "శ్రీనివాసుడ్ని ఏ వారం దర్శించుకుంటే ఎలాంటి ఫలితముంటుంది?🌼🌿


 *🌼🌿 "శ్రీనివాసుడ్ని ఏ వారం దర్శించుకుంటే ఎలాంటి ఫలితముంటుంది?🌼🌿*


 అఖిలాండకోటి బ్రహ్మాండనాయ కుడైన శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు మన జీవితం ధన్యమౌతుంది. కొండ లలో నెలకొన్న కోనేటిరాయుడ్ని కళ్లారా ద ర్శించుకోవాలనే ఆతృతతో క్షణకాలం మాత్రమే లభించే శ్రీవారి దివ్యమంగళరూప దర్శనంకోసం తహతహలాడతాము. 


శ్రీనివాసుడ్ని ఆదివారం దర్శిం చుకుంటే రాజానుగ్రహం, ప్రభుత్వాధినేతల దర్శనం, అధికార కార్యానుకూలత, శత్రు నాశనం, నేత్ర, శిరోబాధలనుండి ఉపశమ నం వంటి ఫలితాలు కలుగుతాయని పురాణవచనం. 


 సోమవారం శ్రీవారిని దర్శించు కుంటే, స్త్రీసంబంధంగా పనుల సానుకూ లత, తల్లికి, సోదరీమణులకు శుభం, వా రినుండి ఆదరణ, భాగస్వామితో అన్యో న్యత కలుగుతాయి.


 మంగళవారం శ్రీవారిని దర్శించు కుంటే భూమికి సంబంధించిన వ్యవహారా ల్లో కార్యసిద్ధి, భవననిర్మాణ పనులకు అవ రోధాలు తొలగి, కార్యానుకూలత కలుగుతాయి. 


 బుధవారం స్వామిని దర్శించు కుంటే విద్యాప్రాప్తి, విదేశీయానం, సామాజి క గౌరవం లభిస్తాయి.


 గురువారం స్వామిని దర్శించు కుంటే ఉత్తమ జ్ఞానలాభం, వాక్శుద్ధి, గురు వుల ఆశిస్సులు లభిస్తాయి. 


శుక్రవారం గోవిందుడ్ని దర్శించు కుంటే సమస్త భోగభాగ్యాలు, వాహనసౌ ఖ్యం, ఇష్టకార్యసిద్ధి వంటి ఫలితాలు కలుగుతాయి. 


 శనివారం ఏడుకొండలస్వామిని దర్శించుకుంటే రుణపీడ, ఈతిబాధలు తొలగుతాయని పురాణాలు చెప్తున్నాయి.


 పౌర్ణమినాడు గరుడవాహనంపై ఊరేగే శ్రీవారిని దర్శించుకుంటే సకల సౌభా గ్యాలు కలుగుతాయి.


*ఓం నమో వెంకటేశాయ*

భక్త కన్నప్ప కథ, Bhaktha Kannappa story


 *🙏🌺భక్త కన్నప్ప కథ విన్నా, చదివినా శివానుగ్రహం తథ్యం !🌺🙏*


ఆ ముక్కంటీశుని భక్తుల గురించి స్మరించుకుంటే చాలు శివానుగ్రహం మరింత లభిస్తుందని పురాణగాథలు పేర్కొంటున్నాయి. అలాంటి పరమ శివభక్తులలో భక్త కన్నప్ప ఒకరు. ఆయన భక్తి విశేషాలను మనము ఇప్పుడు తెలుసుకుందాం!


పురాణాల ప్రకారం మహా శివుడికి 63 మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు. వారిలో ‘తిన్నడు’ ఒకడు. తరువాత కాలంలో ఆయనే కన్నప్పగా ప్రసిద్దికెక్కాడు. తిన్నడు ఓ బోయవాడు, నాస్తికుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలోని ఓ గ్రామంలో జన్మించాడు. ఆయన అర్జునుడి అవతారం.ఒకానొకప్పుడు అర్జునుడు శివుడి కోసం గొప్ప తపస్సు చేసాడు. అర్జునుడి భక్తికి, తపస్సుకి మెచ్చిన శివుడు ఒకసారి అర్జునుడిని పరీక్షించాలనుకున్నాడు. అర్జునుడి తపస్సుకి భంగం కలిగించాలని ఓ అడవి పందిని పంపించాడు శివుడు. సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు. అదే సమయంలో బోయవాని వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మొత్తానికి అర్జునుడి పట్టుదల, ప్రయత్నానికి మెచ్చిన శివుడు.. అర్జునుడికి మహా శివుడిగా దర్శనమిచ్చాడు. అర్జునుడిని రెండు వరాలు కోరుకోమన్నాడు.


అప్పుడు అర్జునుడు మొదటిగా పశుపతా అస్త్రం కోరుకున్నాడు. ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవని అర్జునుడికి చెప్పాడు. తరువాత ఆ అస్త్రం తిరిగి మహా శివుని వద్దకు చేరుతుంది. రెండోవది మోక్షం. ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరాడు. కానీ అందుకు శివుడు అంగీకరించలేదు. నీకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను. ఎందుకంటే, నువ్వు నీ బంధువులైన కౌరవులను చంపడానికి ఆయుధాన్ని అడిగావు. అందుకే ప్రసాదించలేను. నువ్వు శివుడి మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలి అని చెప్పాడు. అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించాడు.


ఒకసారి తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలోని అడవికి వేటకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక అడవి పంది కనిపిస్తే.. దాన్ని వేటాడి, తినడానికి కాల్చుకున్నాడు. అతను కాళ్ళు కడుక్కొని ఆ కాల్చిన పంది మాంసం తినాలి అనుకున్నాడు. చేతిలో పందిని పట్టుకొని నీళ్ల కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా అతనికి పూలతో అలంకరించిన ఒక శివలింగం కనిపించింది. చాలాకాలం నుంచి శివుడికి ఎవరూ నైవేద్యం పెట్టడం లేదని భావించిన తిన్నడు తన దగ్గరున్న పంది మాంసం పెట్టాలనుకుంటాడు. అంతలోనే మళ్ళీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు? అని ఆలోచిస్తూ పక్కన ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళాడు. చేతుల్లో పంది మాంసం ఉండడంతో నోటితో నీటిని తీసుకొని శివలింగం దగ్గరికి వచ్చాడు. కాలికున్న చెప్పులతో శివలింగం మీదున్న పూలను పక్కకి నెట్టి నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోసాడు. పక్కనున్న పూలు, ఆకులు తీసుకొచ్చి శివుణ్ణి అలంకరించాడు. తరువాత తన వద్దనున్న పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు.


దాన్ని శివుడు ఆరగించాడు. అప్పటినుంచి తిన్నడు ప్రతిరోజూ అలాగే చేయడం మొదలుపెట్టాడు. అయితే శివుడు పంది మాంసం తినడం వెనుక ఒక కథ ఉంది. అప్పట్లో సుందర శ్రీరాస అనే రాక్షసులు ఉండేవారు. వారు శివుడి కోసం గొప్ప తపస్సు చేసి, మోక్షాన్ని ప్రసాదించమని కోరారు. అప్పుడు శివుడు వచ్చే జన్మలో మీరు అడవిలో జంతువుల్లా జన్మిస్తారని చెప్తాడు. వేటగాడు జంతువు రూపంలో ఉన్న వారిని వేటాడి.. ఆ మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు. అప్పుడు శివుడు ఆ మాంసం తినడం వల్ల వారికి మోక్షం కలుగుతుంది. అందుకే శివుడు తిన్నడు పెట్టిన మాంసాన్ని తిన్నాడు.


శివగోచర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. శివుడు మాంసం తిన్నాడని, శివుడికి నోటితో తెచ్చిన నీటితో పూజ జరిగిందని, శివలింగం మీదున్న పూలు కాలి చెప్పులతో తీయబడ్డాయని తెలుసుకొని శివగోచర బాధపడ్డాడు. ఆ బాధని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన తలని శివలింగానికి కొట్టుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు ‘అలా చేయకు. కాసేపు అలా పక్కన దాక్కొని వేచి చూడు’ అని ఒక మాట వినిపించింది. అది విని శివగోచర శివలింగం వెనుక దాక్కున్నాడు. కొంచెం సేపటికి.. తిన్నడు రోజు లాగానే చేతిలో మాంసం, నోట్లో నీళ్లు మరియు పూలతో వచ్చాడు. పూలతో అలంకరించిన తరువాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు. కానీ శివుడు తినలేదు. దీంతో తాను పెట్టిన నైవేద్యాన్ని శివుడు ఈరోజు ఎందుకు తినట్లేదని అనుకుంటూ బాధగా శివలింగం వైపు చూసాడు. శివలింగం ఒక కంటిలో నుండి రక్తం రావడం గమనించిన తిన్నడు.. వెంటనే తన కంటిని పీకి రక్తం వస్తున్న శివుడి కంటి దగ్గర పెట్టాడు.


తరువాత శివలింగం మరో కంటి నుండి కూడా రక్తం రావడం మొదలైంది. అప్పుడు తిన్నడు తన రెండో కంటిని కూడా తీయడానికి సిద్దమయ్యాడు. కానీ ‘తన రెండో కంటిని కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాడిని అవుతాను. అప్పుడు తన రెండో కంటిని ఎక్కడ పెట్టాలో కనిపించదు’ అని ఆలోచించి ముందుగా తన కాలిని రక్తం కారుతున్న శివలింగం రెండో కన్ను దగ్గర ఉంచి.. తన రెండో కంటిని పీకబోతుండగా.. అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై తిన్నడికి కంటిని తిరిగిచ్చి చూపు ప్రసాదించాడు. ఇదంతా శివలింగం వెనుక ఉండి చూసిన శివగోచర తిన్నడు భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అతను ఎంత గొప్ప భక్తుడో తెలుసుకున్నాడు. అలా తిన్నడు కన్నప్పగా మారాడు. కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసినవాడు అని అర్థం. శివ భక్తుల కథ విన్నా, చదివినా శివానుగ్రహం కలుగుతుంది.


*🕉️ఓం నమఃశివయ🕉️*

                 

🕉️సర్వం శివమయం 🕉️

Swayambhu Venkateswara Swamy


 *🙏🌺 శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పుట్టరూపంలో పూజించే ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?అయితే పూర్తిగా చదవండి!🌺🙏*

             


🌺మన భారతదేశం ఎన్నో పుణ్యక్షేత్రాలకు పుట్టిల్లు.కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రదేశం తిరుమల తిరుపతి.


ఆ వేంకటేశ్వర స్వామి ఆలయాలు ప్రపంచం మొత్తం ఉన్ననూ ఈరోజు మనం పరిచయం చేస్తున్న ఈ తిరుమలగిరి పుణ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. 🌺


🌺అన్ని వెంకటేశ్వర స్వామి క్షేత్రాలలో వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధానంగా కొలచడం జరుగుతుంది కాని ఈ క్షేత్రములో స్వామి వారిని పుట్ట రూపంలో కొలుస్తారు.


తిరుమలగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని యన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఉన్నది.


ఒకసారి భృగు మహర్షి పరీక్షకోసం స్వామివారి వక్షస్థలమును పాదములతో తంతారు. వాస్తవంగా భృగు మహర్షి వారు లక్ష్మీ దేవి అమ్మవారికి పితృ సమానులు అయిననూ, తన నివాస స్థలము అయిన వక్షస్థలాన్ని భృగుమహర్షి తన్నినా స్వామి వారు ఏమీ అనలేదని లక్ష్మీదేవి అమ్మవారు అవమానంగా భావించి స్వామివారిపై అలిగి వెళ్ళి పోతుంది.


లక్ష్మీదేవి అమ్మవారు స్వామి వారిని వదిలి వైకుంఠం వదిలి అలిగి వెళుతుంది.అమ్మవారి కోసం స్వామివారు తిరుగుతూ తిరుగుతూ అలిసి ఒక పుట్టలో విశ్రమించడం, ఆకలి గొన్న ఆయన ఆకలి తీర్చడానికి బ్రహ్మ దేవుడు గోవు రూపంలో పాలు ఇవ్వటం ఆ కథ గురించి అందరికీ తెలిసిందే..!


వేంకటేశ్వర స్వామి వారు పుట్టలో సేదతీరిన ప్రదేశం ఇదే అనిఇక్కడి భక్తుల కోరిక మేరకు స్వామి వారు ఆ పుట్ట రూపంలో ఇక్కడ వెలిశారని క్షేత్ర పురాణం. 🌺


🌺వేంకటేశ్వరస్వామి వారు శ్రీదేవి భూదేవి సహితముగా పుట్ట రూపంలోనే ఇక్కడ కొలువుఅందుకుంటారు.


అందుకే అన్ని దేవాలయాలలో ఉన్నట్లుగా ఇక్కడ అభిషేకములు ఉండవు.


పుట్టలో ఉన్న రంధ్రాల స్థానంలో నామములు దర్శనమిస్తాయి.అందుకే ఈ వేంకటేశ్వర స్వామిని నామాల వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు.


ఈ క్షేత్రంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే దర్శనములు ఉంటాయి.మిగిలిన వేళల్లో ఇక్కడ దర్శనం ఉండదు.


అర్చకుల వారి తో సహా చీకటి పడకముందే మొత్తం కొండ దిగి రావాల్సిందే.


స్వామివారు ఇక్కడ సర్ప రూపంలో సంచరిస్తారు అని ఒక కథనం ఉంది.అలా చీకటి పడిన తరువాత ఆ రూపాన్ని చూసి చాలా మంది చనిపోయారని అప్పటినుండి రాత్రివేళల్లో కొండపై సంచారాన్ని నిషేధించారని ఒక కథనం ప్రచారంలో ఉంది.


పుట్టపై నీరు పోస్తే పుట్ట కరిగిపోతుంది.అందుకే ఈ క్షేత్రంలో ఎటువంటి అభిషేకములు జరగవు.


అయినప్పటికీ తెల్లవారి ఆలయమును తెరచినప్పుడు చూస్తే అభిషేకం జరిగిన ఆనవాళ్లు కనపడతాయట. ముక్కోటి దేవతలు ఇక్కడకు వచ్చి స్వామిని రాత్రివేళల్లో అభిషేకిస్తారని కథనాలు ఉన్నాయి.


ఇంకా ఈ క్షేత్రంలో మంచి వేసవి సమయంలో కూడా కొండపై ఉన్న పుష్కరిణిలో నీరు ఉండటం ఆశ్చర్యాన్ని కలగిస్తోంది.ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వారికి ఎన్నో వ్యాధులు నయమవుతాయని నమ్మకం స్వామివారి పుష్కరిణి సమీపంలోనే స్వామివారి పాదముద్రలు కూడా కనపడతాయి. 🌺


🌺ఓం నమో వెంకటేశాయ🌺

తిరుమల శ్రీవారి యాత్ర - అష్టాంగ యోగ సాధన! Tirumala Yathra - Ashtanga Yoga Sadhana


 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

*తిరుమల శ్రీవారి యాత్ర - అష్టాంగ యోగ సాధన!!!*

_తిరుమల లోని ఏడు కొండలు.. ఏడు శక్తి స్థానాలు!!..._


1) నిద్రిస్తూ ఉన్న కుండలినీ శక్తిని మేలుకోలపటమే ధ్యానం, ఇది క్రియాయోగం వల్ల సాధ్యపడుతుంది. 

ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని తాకుతుందో అప్పుడు ఈ నిద్రిస్తూ ఉన్న శక్తిని మనం శేషువు తో పోల్చూతాము అంటే నిద్రిస్తున్న పాము, అది మేలుకొంటుంది...

అందుకే మొదటి కొండకి.. శేషాద్రి అని  పేరు. 


2) ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిస్టాన చక్రాన్ని  తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 20% సాధించినట్లు. 

సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలనే ఆరాటం మొదలవుతాయి, ఇక్కడ అంటే స్వాధిస్టాన చక్రం వద్ద వినిపించే శబ్దం వేణు గానం. 

వేదా అంటే వినటం అని అర్ధం,

అందుకే రెండవ కొండకి.. వేదాద్రి అని పేరు.


3) ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి    మణిపుర చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడు నూటికి 40% సాధించినట్లు, ఇప్పటికి సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది, జ్ఞాన శక్తి పెరుగుతుంది, గ్రహణశక్తి పెరుగుతుంది. 

"గ ' కార శబ్దం జ్ఞానానికి ప్రతీక, ఇక్కడికి వచ్చేటప్పటికి సాధకుడు జ్ఞాన అర్హుడు అవుతున్నాడు. 

అందుకే మూడవ కొండకి.. "గ"రుడాద్రి అనే పేరు. 


4) ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి   అనాహత చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 60% సాధించినట్లు...

ఇప్పటికి సాధకుడికి స్థూల శరీర స్పృహ తగ్గుతుంది, శరీరం చాల తేలిగ్గా, గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది, సాధకుడు వాయు పుత్రుడైన ఆంజనేయుడే అవుతాడు.

అందుకే నాలుగవ కొండకి.. అంజనాద్రి అని పేరు.


5) ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి   విశుద్ధ  చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 80% సాధించినట్లు,  భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. 

సంసార చక్రాలన్నీ దాటేస్తాడు, అన్ని బంధాలు విడిపోతాయి, ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది. ఇంక.. పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటాడు. 

ఎద్దుకి అచ్చు వేసి వదిలేస్తే ఎలా దాని ఇష్టం వచ్చినట్లు పరిగెడుతుందో అలాగ,

అందుకే ఐదవ కొండకి.. వృషభాద్రి అని పేరు. 


6) ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని తాకుతుంది. 

ఇప్పుడు దాటి వచ్చిన ఆరు చక్రాలు ఆరు పడగలు విప్పినట్లు అనుకుంటే, ఆ పడగలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.. అనే ఆరు అరిషడ్వర్గాలని వేంకటరమణుడు (శ్రీ కృష్ణుడు) ఐ కాళీయ మర్ధనుడై దర్శనమిస్తూ సాధకుడి నుంచి పోగొట్టినట్లు అనుభూతి పొందుతాడు. 

మహా వెలుగు, తనే వెలుగుతునట్లు అనుభూతి చెందుతాడు. 

ఇప్పటికి సాధకుడికి, భగవంతుడు ఎదురుగానే ఉంటాడు. 

తనకి పరమాత్మకి మద్య ఇంకేమి లేదు, పరమశాంతి కలుగుతుంది. 

అది ఆరవ కొండ.. వేంకటాద్రి అనీ పేరు.


7) తరువాత సాధకుని కుండలిని శక్తి సహస్రార చక్రాన్ని తాకుతుంది, ఇది పరమాత్మ చక్రం. 

ఇంక  అక్కడ సాధకుడు లేడు, నారాయణుడే ఉన్నాడు, సాధకుడు తనే పరమాత్మ అవుతాడు, నారాయణ అంటే వ్యాపించటం అని అర్ధం.

అంతటా తానేయై వ్యాపించేవాడు కాబట్టి నారాయణుడు. 

అందుకే ఏడవ కొండకి.. నారాయణాద్రి అనీ పేరు.


*ఇది యోగ పరంగా తిరుమల ఏడు కొండల అంతరార్ధం!!...*


ఐతే... మనం నడక దారిన ఎక్కేటప్పుడు మెట్లని కూడా గమనించి చూస్తే అర్ధం అవుతుంది, 

అవన్నీ ఇలా 8, 16, 24, 32.. (ఎనిమిది గుణకాలు) లో ఉంటాయి. 

దీన్ని మనం అష్టాంగయోగం అని.. చెయ్యమని చెపుతున్నట్లు అన్వయించుకోవచ్చు.   


*అష్టాంగయోగం అంటే!!...*


1) యమ,

2) నియమ,

3) ఆసన,

4) ప్రాణాయామ,

5) ప్రత్యాహార,

6) ధారణ,

7) ధ్యాన,

8) సమాధి. 


భగవంతుణ్ణి చేరుకొనే ఏడు క్రియలని (కొండల రూపంలో) ఎనిమిది యోగాలని (అష్టాంగయోగం) మెట్ల రూపంలో ఆ ఏడు కొండల వేంకటేశ్వరుడు మనందరికి కళ్ళముందు ఉన్నారు. 

కళ్ళు తెరిచి చూస్తే నారాయణులం, తెరవకపోతే సాధారణ నరులం...


               *_🥀శుభమస్తు🥀_*

     🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

శ్రీ అరుణాచలేశ్వర పంచరత్న స్తోత్రం Sri Arunachaleswara Pancharathna Stotram


 శ్రీ అరుణాచలేశ్వర పంచరత్న స్తోత్రం


1) యమాంతకాయ యమనియమాధిష్ఠానాయ

యజ్ఞస్వరూపాయ యజనయాజనవినీతాయ

యోగీశ్వరేశ్వరాయ యోగిహృత్కమలవాసాయ

అరుణాచలేశ్వరాయ నమఃశ్శివాయ ||


2) భక్తవత్సలాయ భానుమండలచరాయ

భానుశశికోటిప్రభాయ భార్గవరామవందితాయ

భార్గవీశారదావంద్యాయ భాగ్యోదయకారకాయ

అరుణాచలేశ్వరాయ నమఃశ్శివాయ ||


3) రుద్రాక్షమాలాధరాయ రుణపాశవిమోచకాయ

రమ్యభాషణాచతురాయ రాజీవారుణనేత్రాయ

రిపుక్షయకారకాయ రాగద్వేషరహితాయ

అరుణాచలేశ్వరాయ నమఃశ్శివాయ ||


4) నందీశ్వరాదిప్రమథగణవందితాయ నతజనసంతతపూజితాయ

నమస్కారప్రియాయ నమకచమకమంత్రరూపాయ

నరఘోషనివారకాయ నామరూపరహితవిగ్రహాయ

అరుణాచలేశ్వరాయ నమఃశ్శివాయ ||


5) జ్వాలామాలాస్వరూపాయ జ్వరాదిరోగహరభిషగ్వరాయ

జరామృత్యువివర్జితాయ జన్మజన్మాంతరపాపవిమోచనాయ

జాగ్రత్స్వప్నసుషుప్త్యావస్థాతీతాయ జగత్కల్యాణకారకాయ

అరుణాచలేశ్వరాయ నమఃశ్శివాయ ||


సర్వం శ్రీ అరుణాచలేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు.

Kanchi, Sri Ekamreswara Pancha Rathna Stotram

 

శ్రీ ఏకామ్రేశ్వర పంచరత్న స్తోత్రం 


1) కామాక్షీమానససరోవరచరరాజహంసం

   కమలాసనాదిదేవగణారాధ్యపాదపీఠం 

   కందర్పసందగ్ధఘనజ్వాలావళీవిలోచనం 

   ఏకామ్రేశ్వరం చింతయామి అనిశం ||


2) అరిషడ్వర్గభంజనభవ్యకుఠారం 

   ఆయుర్వర్ధనారోగ్యశుభమంగళం

   ఇభవక్త్రషణ్ముఖప్రియజనకం

   ఏకామ్రేశ్వరం చింతయామి అనిశం ||


3) భక్తహృదయాలయనిరంతరసంచారం 

    భాషాసూత్రప్రదబహువాఙ్మయకారకం 

    భ్రమానందభంజనశాశ్వతానందకారకం 

    ఏకామ్రేశ్వరం చింతయామి అనిశం ||


4) ప్రమథగణసంతతార్చితభవ్యవిగ్రహం  

   ప్రహృష్టవదనారవిందభక్తజనపోషకం 

   ప్రజ్జ్వలజ్ఞానవిజ్ఞానప్రదపరపరంజ్యోతిం 

   ఏకామ్రేశ్వరం చింతయామి అనిశం ||


5) సంతతధ్యాననిమగ్నమాయాతీతవిగ్రహం 

   సరససంభాషణాచతురపార్వతీమనోల్లాసం 

   సామవేదనాదశ్రవణాభిలాషభవ్యమానసం 

   ఏకామ్రేశ్వరం చింతయామి అనిశం ||


     సర్వం శ్రీ ఏకామ్రేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు

Telugu Wonderful Tongue Twisters

 *మీరు తెలుగు వారేనా అయితే ఈ పద్యం చదవగలరేమో ట్రై చెయ్యండి.*


టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి 

ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో 

త్కటపటహాదినిస్వన  వియత్తలదిక్తటతాటితార్భటో

ద్భట పటుతాండవాటన, "ట"కారనుత బసవేశ పాహిమాం!


డమరుగజాత డండడమృడండ

మృడండ మృడండ మృండమృం

డమృణ మృడండడండ మృణడండడ

డండ మృడం డమృం డమృం

డమృణ మృడండడంకృతి

విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ

త్ర్పమథన తాండవాటన 

"డ"కారనుత బసవేశ పాహిమాం!


ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢం

మృణఢంమృణ ఢంఢణోద్ధణం

ధణనటన త్వదీయడమరూత్థ

మదార్భట ఢంకృతి ప్రజృం

భణ త్రుటితాభ్రతార గణరాజ 

దినేశముఖగ్రహప్రఘర్

క్షణగుణతాండవాటన

"ఢ"కారనుత బసవేశ పాహిమాం!


ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణ

ణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ

ణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖ

విక్రమ జృంభణ సంచలన్నభో

ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ 

ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన

ణ్ణ ణ్మృణ తాండవాటన 

"ణ"కారనుత బసవేశ పాహిమాం!


*మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు* *"అక్షరాంకపద్యముల" నుండి సేకరణ*.

Thursday, February 23, 2023

Types Of Mahasivarathri


 _*మహా శివరాత్రి -  పర్వదినం*_

 వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది.

అందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. 

పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. 

శివ అంటే మంగళమని అర్థం, పరమ మంగళకరమైనది శివస్వరూపం. 

ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి.


పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.


*అసలు ఈ శివరాత్రులు ఎన్ని ?*

 

శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. 

ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు. 

అవి : ...

నిత్య శివరాత్రి , 

పక్ష శివరాత్రి , 

మాసశివరాత్రి , 

మహాశివరాత్రి , 

యోగశివరాత్రి...

వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి.

మార్గశిరమాసంలో బహుళ చతుర్థి , అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది.

శివునికి అతి ఇష్టమైన తిథి అది. 

అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. 

ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. 

మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు.i.

త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. 

అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.

 

లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. 

రూపరహితుడైన శివుడు , జ్యోతిరూపంలో , లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. 

ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. 

అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు.

ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుండా మేల్కొని ఉపవాసముండి , మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు , పురుషులు కూడా ఆచరించదగినదే.

ప్రపంచమంతా శివ శక్తిమయమని తెలుసుకోవాలి, శివలింగానికి ప్రణవానికి సామ్యముందంటారు.


ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరువిధాలు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ , శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి. 

పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. 

ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. 

విభూతి అంటే ఐశ్వర్యం. 

అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. 

ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. 

రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను  , అందరు దేవతలలో ఫాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.


మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివనామాం జపిస్తే చాలు. 

నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. 

శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు, త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. 

ప్రదోష సమయంలో శివస్మరణ , శివదర్శనం విధిగా చెయ్యాలి. 

వేదాలన్నింటికీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. *‘శివ’* శబ్దాన్ని దీర్ఘంతీస్తే *‘శివా’* ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు , సూర్యుడు , అగ్ని ఈ మూడింటిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిథి నెలలో రెండుసార్లు వస్తుంది.


ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ , ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం , ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి , రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో , తర్వాత పెరుగుతో , ఆ తర్వాత నేతితో , ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. 

దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. 

కానీ , ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు.

 మహాశివుడంటే అందరికి తెలుసు. కాని , రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. *“రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి”* అయిందంటారు.

 సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది – హే రాత్రే ! 

అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక !… వగైరా –*‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!*


*ఉష ఋణేవ యాతయ||’*


నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. కోచతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో , ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.


*‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!*

*మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’*


అందుకేనేమో గరుడ , స్కంద , పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. ప్రముఖ విషయం ఒకటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసం చేసి , బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో , రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని , మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము , తపము , యజ్ఞము , తీర్థయాత్రలు , వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి రోజు ఉపవాసము , జాగరణ శివపూజ ప్రధానమైంది. అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి. అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థలు గోచరిస్తున్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం – వేద బోధితమని , ఇష్ట ప్రాపకర్మ అని వుంది. దార్శనిక గ్రంథాల్లో *‘అభ్యుదయ ‘ మని , ‘ నిః శ్రేయస్సు ‘ కర్మ అని , అమరకోశంలో వ్రతమంటే నియమమని వుంటే పురాణాల్లొ మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. అన్నింటిని కలుపుకుంటే – వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ , శాస్త్ర విహిత నియమాది , సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు. సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్ట దేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు.

మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. అలా అని *‘తిథితత్వం'* లో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది. – *‘ మీరు స్నానం చేసినా , మంచి వస్త్రాలు ధరించినా , ధూపాలు వెలిగించినా , పూజ చేసినా , పుష్పాలంకరణ చేసినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం'* అంటాడు శివుడు.


*☘ఉపవాసం అంటే ఏమిటి ?☘*


దగ్గర వసించటం , నివశించటం , ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.


*‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః*


*ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’ (వరాహోపనిషత్తు)*


*భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.*


*ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!*


*ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||*


మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత , శక్తులు , శివుడు తిరిగే సమయమన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు. *‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ , సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి  అది.


*‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ*


*యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘*


విషయాసక్తుడు నిద్రలో వుంటే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.

శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి , వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి – *‘హే మహాదేవా ! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన , తప , హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద , మోక్షాలను అనుగ్రహించు శివా !”*


వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత వస్తువులు – ఆవు పేడ – ఆవు పంచకం , ఆవుపాలు , ఆవు పెరుగు , ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో *‘ఓం నమః శివాయ‘* అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు , బియ్యము , నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమం తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివకథలు వినవచ్చు. వ్రతలు మరోకసారి రథరాత్రి మూడవ , నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు *‘ఓం నమః శివాయ* అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి.ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే – *'పరమాత్మా ! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. హే లోకేశ్వరా ! శివ – భవా ! నన్ను క్షమించు. ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా , మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ ! మా పట్ల ప్రసన్నులు కండి ! మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.


అటు తర్వాత శివ భక్తులకు భోజనము. వస్త్ర , ఛత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి జరుపు కుంటున్నాం. ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి , అవకాశం లేకపోతే , ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో , బిల్వదళాలతో అర్చించాలనీ , శక్తికొలదీ పాలు , గంగోదకం , పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ , ఉపవాస , జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు , శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.

 


*శివరాత్రికి లింగోద్భవకాలమని* కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం. ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడంలోని ఉద్దేశం మన తనువునూ , మనసునూ కూడా శివార్పితం , శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది. శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు  *'బిల్వ'* మూలంలో ఉంటాయనీ , శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం , ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్తి అనుసారం బంగారం , వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు. శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే , ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.


*☘ప్రదక్షణ విధులు☘* 


శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే , వెనక్కి రావాలి. శివలింగం , నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.


*☘బిల్వ దళం ప్రాముఖ్యత:☘*


బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది. ఇందులో కుడి ఎడమలు విష్ణు , బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ. బిల్వం ఇంటి అవరణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం , గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.


               *_🍃శుభమస్తు🍃_*

   🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏