Thursday, February 9, 2023

పంచోపచారాలు (Panchopacharalu - Sri Lalitha Devi) Song

    రాత నాది.... రాగం మీది....

మీలో ఎవరైనా పాడగలరా??


6. అమ్మకు పంచోపచారాలు

 

శ్రీ చక్ర సంచారిణీ శ్రీ వేద సంరక్షిణీ

శ్రీ మాతృ స్వరూపిణీ శ్రీ గణ సంసేవిణీ

పంచ భూత పంచ గవ్య పంచాత్మక

పంచారించు దేవేరికిదే పంచోపచారం

లం..... గంధమిదే భూతభ్రుత ధాత్రీరూప ధారిణికి

హం..... విశ్వవ్యాప్త పరిభ్రమణ కోమలికో సుమమాల

యం..... పంచవాయు ప్రపంచిత ప్రసువుకు దివ్యధూపం

రం..... జాజు మోము జిలుగుల జనయిత్రికి దీప దర్సనం

వం..... కోరిందిచ్చె కోమలికి మదే అమృత నైవేద్యం

సం..... సర్వ కళ్యాణ సమృద్ధి సర్వ మంగళ సమేత

సకల మూర్తికి తాంబూలాది సర్వోపచారం సమర్పయామి.....


No comments:

Post a Comment