*ప్రమథగణాలు* :
పరమశివునికై ఎల్లప్పుడూ భక్తి తో మత్తెక్కి ఉండే శివలోకవాసులైన శివభక్తులు ప్రమథగణాలుగా పిలువబడుతారు.
వీరికి శివాజ్ఞ తప్ప వేరే భాద్యతలేమియు ఉండవు.
శివుని గణాలు కోకొల్లలు.
ధర్మ సంబంధమైన యుద్ధాలలో వీరందరూ శివుని సైన్యం గా పనిచేస్తారు.
భక్తివత్సలుడు మోక్షమిచ్చిన వారు శివలోకంలో నివసించవలసి వస్తే గణాల రూపంలో శివసేవ చేసుకుంటారు. వారందరి మనసులలో పూర్తిగా శివుడు నిండి ఉంటాడు. ఇక ఆనంద స్వరూపమైన శివుడిని మనసు నిండా నింపుకున్నవారు ఎలా ఉంటారు మరి ?
వీరికి శివుని చూస్తే ఆనందం, ఆయన మాట వింటే ఆనందం, ఆయన తాండవం మహదానందం, ఆయన తరపున మాయా యుధ్దం చేయటమానందం.. అంతా శివానందమే..
వీరిలో రాక్షస జన్మ ఎత్తి మోక్షం పొందిన వారుంటారు, మానవ జన్మ ఎత్తి మోక్షం పొందిన వారుంటారు, దేవతలు కూడా ఉంటారు. అందరికీ ఒకటే ఆనందం. బాహ్యంలో శివుడు , ఆంతరంలో శివుడు. *శ్రీ నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు* మొదలైన వారు ప్రమథగణాలలో ముఖ్యమైనవారుగా మన పురాణాలలో చెప్పబడ్డారు.
*ఓం నమః శివాయ*
*సర్వం శివమయం జగత్*
No comments:
Post a Comment