రాత నాది.... రాగం మీది....
మీలో ఎవరైనా పాడగలరా??
1. గీతాజయంతి సందర్భంగా
మానవ నడతకు
మార్గమే గీత
జీవన నావకు
చుక్కాని గీత
నిత్య సంఘర్షణల
సంఘాతాలకు సమాధానమే భగవద్గీత....
మదిక్షేత్రంలో
మంచి చెడుల లోలకం
పంచేద్రియాలే
అశ్వాలుగా తేరే మేనై
చిక్కు ప్రశ్నలా
చీకట్లే కిరీటి ఐతే
దారిచూపే వికాసమే
గీతాచార్యుడు
చేతనా చేతన
సంవాదమే ఆ భగవద్గీత....
సత్యపోరాటమే
నిత్య యౌవన మార్గం
తామర ఆకు పై నీటి
బిందువే జీవం
ఏదీ సొంతమై వెంట
రాదనే భావం
త్రికాల కర్మయే
మాధవ అర్పితమై
ధర్మాచరణ నడవడి
తెలిపే గురువే భగవద్గీత.....
No comments:
Post a Comment