*గానుగపురం లోని దత్త మందిరంలో పాదుకలు దర్శనం..🙏*
శ్రీ క్షేత్ర గానుగాపురం ప్రముఖ పుణ్య క్షేత్రం ఎంతో మహిమ గలది మహిమాన్వితమైనది, గానుగాపురం సిద్ధ భూమి ఇక్కడ చేసే పూజ ఏదైనా తొందరగా ఫలితమిస్తుంది....
దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ అన్నదానం చాలా ఎక్కువగా చేస్తారు,
ఔదుంబర కల్పవృక్ష సన్నిధిలో చేసే గురు చరిత్ర పారాయణం మాటల్లో వర్ణించలేనిది వాలి యొక్క శ్రద్ధ భక్తి వర్ణనాతీతం,
ఎంతో మంది మానసిక రోగులకు ఇక్కడ ఉపశమనం లభిస్తుంది.
మానసిక వైద్యులు కూడా నయం చేసే వ్యాధులు ఇక్కడ స్వామివారి మహిమచే నయమవుతాయి..
ప్రస్తుతం ఇక్కడ భీమా నది పుష్కరాలు జరుగుతున్నాయి, వేలాదిగా జనాలు తరలి వస్తూ బీమా పుష్కర స్నానాలు చేస్తున్నారు.
ఆరాధ్య దైవం శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు, ఇక్కడ అమరజా భీమ నదీ సంగమ స్నానానికి మంచి ప్రాముఖ్యత ఉంది ఇక్కడ ప్రతిరోజు ఉదయం స్వామివారు సూక్ష్మ రూపంలో వచ్చి సంగమంలో స్నానం చేస్తారని నమ్మకం...
ఇక్కడ జరిగే మధ్యాహ్న భిక్షకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది, స్వామి వారు ప్రతిరోజు మధ్యాహ్నం సూక్ష్మరూపంలో ఇక్కడకు వచ్చి భిక్ష తీసుకుంటారని వినికిడి ...
అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కరు అన్నదానం తప్పకుండా చేస్తారు ...
ఎందుకంటే స్వామి వారే స్వయంగా ఏ రూపంలో నైనా వచ్చి వారు ఇచ్చే బిక్ష తీసుకుంటారని నమ్మకం ,
ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించవలసిన టువంటి పుణ్యక్షేత్రం శ్రీ క్షేత్ర గానుగాపురం అని చెబుతారు🙏
No comments:
Post a Comment