Thursday, February 9, 2023

శివ కేశవులు (Shiva Kesavulu - Hari Haradulu) song

   రాత నాది.... రాగం మీది....

మీలో ఎవరైనా పాడగలరా??


4. శివ కేశవులు

హరుడెవ్వడు హరి ఎవ్వడు

ఆది అంతము లేని ఏకాత్మ పరమాత్మ

 

నటరాజ పాదాన ఆకాశ లింగమైన వాడు

వామన రూపాన అంబరాన్ని కొలిచిన వాడు

కాలి అందెలు ఘల్లుమన నాట్యాచార్యుడైనాడు

చిన్ని మువ్వలు మురిపింప గీతాచార్యుడైన వాడు

 

నాగాభరణాలు ధరియింప పశుపతి వాడు

గోకులం కాచగ గోపబాలుడు అయిన వాడు

త్రిశూలం పట్టిన త్రిలింగ త్రికాల పాలకుడు

పశు వాంఛలను అదిలించిన మురళీధరుడు

 

భువి కాపాడ గరళకంఠుడై మసలే వాడు

కౌస్తుభ మౌక్తిక కంటాన హరి మెరయు వాడు

ప్రాణ హరుడే ప్రాణదాతై శిర శశి ధారుడు

స్త్రీ పరివేష్టిత స్వచ్ఛపురుష మేచక దారుడు


No comments:

Post a Comment