రాత నాది.... రాగం మీది....
మీలో ఎవరైనా పాడగలరా??
2. దశరత్న మాలిక దయగల లలితా దేవికి
జయ జయ మహా శక్తి
జయ లలితా దేవేరికి
జయమగు నారాయణి
(కి) మము కాచు మహేశ్వరికి
నిక్కమౌ నవరత్న
మాలిక మంగళ స్వరూపిణికి
పాపనాశిని పద్మ
పాదాలకి పగడపు పూదండ
మాణిక్య మాలిక
మహారాజ్ఞి మణి మంజీరాలకు
బ్రహ్మాండ
భాండోదరి మధ్యమానికిదే ముత్యాల మాలిక
అభయ ధాత్రి అమృత
హస్తానికో గోమేధిక మాల
వైడూర్య సరిగె ఇదిగో భవానీ భుజ కీర్తులకు
లోక పోషకి శ్రీ మాతృ కుచ ద్వయానికిదే మరకత
మాలిక
గోనివాసిని గంధ నాళికకొక్క నీలమణి అమరె
పుష్యరాగ పూదండ కుదిరె విశాలాక్షి వీనులకు
నెల వెలుగుల మోముల సర్వలక్ష్మి
శిరోమణికిదే వజ్రమాలిక
జయ జయ మహాదేవికి
జయ లలితా దేవేరికి
నను మోయు నారాయణికి
నా ఆత్మ నివేదనమే దశమ రత్న మాలిక....దశమ రత్న మాలిక...
No comments:
Post a Comment