*పంచాయతనం అంటే.*
*పంచ అంటే అయిదు. అయిదు విగ్రహాలను వాటి వాటి స్థానాలలో ప్రతిష్టించడాన్ని పంచాయతనం అంటారు.*
మనకి అయిదు పంచాయతనాలు ఉన్నాయి. అవి శివ, విష్ణు, సూర్య, గణేశ, దేవీ పంచాయతనాలు.
శివ పంచాయతనంలో, శివుడు మధ్యలో ఉంటాడు మిగిలిన నాలుగు దిక్కులలోనూ వినాయకుడు, విష్ణువు, సూర్యుడు, అమ్మవార్లను ప్రతిష్టిస్తారు.
ఇక విష్ణు పంచాయతనంలో మధ్యలో విష్ణువు ఉండి, చుట్టూ శివుడు, వినాయకుడు, సూర్యుడు, అమ్మవారు ఉంటారు.
అంటే ఏ దేవుడితో చెప్పబడే పంచాయతనం అయితే ఆ దేవుడిని మధ్యలో ప్రతిష్టిస్తారు. మిగిలిన నలుగురు దేవుళ్లను చుట్టూతా ప్రతిష్టిస్తారు.
ఇక షణ్మతాలు అంటే...
ఉన్నది ఒకే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమును శివుడిగా ఆరాధిస్తే శైవమని విష్ణువుగా ఆరాధిస్తే వైష్ణవమని, శక్తిగా ఆరాధిస్తే శాక్తేయమని, గణపతి గా ఆరాధిస్తే గాణాపత్యమని సూర్యునిగా ఆరాధిస్తే సౌరం అని, కుమారస్వామిగా ఆరాధిస్తే స్కాందం అని పేరు.
పంచాయతనంలో కుమారస్వామి లేడా అన్న సందేహం వస్తే అక్కడ దీపంగా ఉన్నది కుమారస్వామియే.
వేదంలో ప్రతిపాదించిన వాటినే శంకరాచార్యుల వారు ఆనాటి మతవిద్వేషాలను అణిచి అందరినీ ఒక త్రాటిపై తీసుకురావడానికి, వీటిని తిరిగి పునరుద్ధరించారు.
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
Mee Ratha adbhutham… chaduvuthuntene ekkado Himalaya parvatha sthanuvullo seda teruthunnattu undi…keep going andi
ReplyDelete