రాత నాది.... రాగం మీది....
మీలో ఎవరైనా పాడగలరా??
5. పంచముఖం పరమేశ్వరం
పంచ భూతం పంచప్రాణం పంచ ముఖం శివం
పంచ గుణం పంచ వక్త్రం పంచేంద్రియం రుద్రం
త్రయీమూర్త తత్వం శివ స్థావరం దేహం
పరమేశ్వరాధిపత్యం
ప్రాక్దిశ తత్పురుషం హరిద్రావర్ణం
జంగమం త్రిగుణాధిపత్యం
అఘోరం కృష్ణ వర్ణ శోభితం
స్థాణుమ్ బుద్ధ్యాధిపత్యం
రక్త శ్వేతనలుపు వర్ణ సద్యోజాతం
పశ్చిమ పశుపతిం మనస్సాధిపతిం
వామదేవ ఉదీచాభి ముఖం
కుంకుమ వర్ణం అహంకారాధిపతిం
ఊర్ద్వం ధవళ వర్ణ ధగ ధగాయ మానం
ఈశానం జీవాత్మాధిపత్యం
వాన్తరాయం దిక్పాలాధిపతిం సర్వేసం
జ్యోతిరూప నిరాకార సాకారం
No comments:
Post a Comment