Friday, February 24, 2023

గోవింద నామ మహిమ:...* 🙏🌹 Importance of Govinda Namam

 *గోవింద నామ మహిమ:...* 🙏🌹


🍁గో, గోప, గోపికలను రక్షించి, ఇంద్రుని గర్వమణచి శ్రీకృష్ణుడు ‘గోవింద’ నామాన్ని బిరుదుగా పొందాడు. ఇంత కష్టంతో వ్రేపల్లె వాసుల మీద ఇష్టం సంపాదించుకున్న శ్రీకృష్ణుని, గోవిందనామంతో కాక నారాయణ నామంతో పిలవడం అన్నది ‘దగ్గరి బంధుత్వాన్ని కాదని దూరపు బంధుత్వాన్ని చెప్పడం వంటిదని’ మహాభక్తురాలు, లక్ష్మీదేవి స్వరూపమైన గోదాదేవి (ఆండాళ్‌) భావించింది. ప్రేమగలవారు ‘ప్రాణనాథా’ అని కాకుండా ‘లోకనాథా’ అని పిలవడం వంటిదే ఇదని శ్రీకృష్ణుడూ భావిస్తాడనీ ఆ అమ్మవారు గుర్తించింది.


🪴‘గోవింద’ అనే మూడక్షరాల నామం శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని సులభంగా, నిశ్చయంగా సిద్ధింపజేసే ఒక మహామంత్రం. వయసు, కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలేవీ లేకుండా అందరూ ‘నామసంకీర్తనం’గా దీన్ని జపించవచ్చు


⛰తిరుమల కొండపై, దేవాలయాల్లో, గృహాలలో జరిపే అర్చనలలో, భజనలలో భక్తిశ్రద్ధలతో భక్తులు ఉచ్చరించే ‘గోవింద’ నామం పట్ల మనందరం కూడా ప్రీతిని ఏర్పరచుకుందాం. అత్యంత భక్తి ప్రపత్తులతో ‘గోవింద’నామాన్ని నిరంతరం, మనసా వాచా కర్మణా స్మరిద్దాం. భక్త సులభుడైన పరమాత్ముని అనుగ్రహాన్ని పొందుదాం.


⛰🏔⛰🛕🏔🛕⛰🏔⛰

No comments:

Post a Comment