Tuesday, February 28, 2023

Sri Siva Aparaadha Kshamapama Sthotram

 


శ్రీశివాపరాధక్షమాపణస్తోత్రం 

అథవా శివాపరాధభఞ్జనస్తోత్రమ్ 


శ్లోకము:

వార్ధక్యే చేన్ద్రియాణాం విగతగతిమతిశ్చాధిదైవాదితాపైః

పాపై రోగైర్వియోగైస్త్వనవసితవపుః ప్రౌఢహీనం చ దీనమ్ ।

మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యమ్

క్షన్తవ్యో మే ⁇ పరాధః శివ శివ శివభో శ్రీమహాదేవ శంభో ॥ 4॥

పదవిభజన: 

వార్ధక్యే చ ఇన్ద్రియాణాం విగత గతిం అతిష చ అధి దైవ ఆది తాపైః

పాపైః రోగైః వియోగై స్త్వనవ సిత వపుః ప్రౌఢ హీనం చ దీనమ్ ।

మిథ్యా మోహ అభిలాషైః భ్రమతి మమ మనః ధూర్జటేః ధ్యాన శూన్యం

క్షంతవ్యో మే అపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 4॥

భావము:

ఓ! పరమ శివా! 

ముసలి తనము కూడ వచ్చింది. 

ఇంద్రియాల చలనం తగ్గింది.

బుద్ధి మందగించింది.


1.ఆధి భౌతిక తాపత్రయములు: అనగా 

మన కంటే ఇతరులైన దారాపుత్రాదులు, ఇరుగు పొరుగు వారు, దొంగలు, ఇతర ప్రాణులు- కుక్కలు, ఇతర జంతువులు వలన కలుగు తాపములు.


2.ఆధి దైవిక తాపత్రయములు: అనగా

పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశాత్-

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము 

ల ద్వారా-ప్రకృతి శక్తులద్వారా వాటిల్లే క్లేశాలు.

అనగా భూకంపము, వర్షము, పిడుగుపాటు మొ॥


3.ఆధ్యాత్మిక తాపత్రయములు: అనగా

మనవలననే మనకు కలిగే తాపాలు- 

శారీరిక రుగ్మతలు, మానసిక సమస్యలు మొదలయినవి.


నన్ను చుట్టుముట్టాయి.


చేసిన పాపాలు,  రోగము, వియోగము, వంటి వాని మూలాన 

శరీరము శిధిలమైనది.

నా మనస్సు మిధ్య, మోహము, కోరికలతో   

దుర్భలంగా దీనంగా మారి 

నీ ధ్యానము చేయక భ్రమలో మునిగిపోయినది. 

 

కావున ఓ!  శంకరా! శివా!  శివా! పరమేశ్వరా! మహాదేవా! 

ఇపుడు  నా అపరాధమును క్షమించు,🙏🙏☘️🌿🍃

No comments:

Post a Comment