*🙏దుర్గా దేవి....!!*
పార్వతీదేవి మహిషాసురమర్దిని, అవతారం దాల్చి దుర్గముడు
అనే రాక్షసుని సంహరించి
'దుర్గాదేవి'గా పేరు పొందింది, భక్తితో దుర్గ అనే నామాన్ని ఉఛ్ఛరించినంతమాత్రమునే సకల శుభములు సంప్రాప్తిస్తాయి.
దుర్గా ఉపాసకులు శూలిని దుర్గా, వన దుర్గా, శాంతి దుర్గా, జాతవేదో దుర్గా, దీప దుర్గా, జ్వాలాదుర్గా, ఆసురీదుర్గా అని వివిధ రూపాలతో, వివిధ
మంత్రాలతో స్తుతించి,
పూజిస్తారు.
దుర్గాదేవిని ఆరాధించిన
వారికి, అప్పులబాధ, శోకం
పిశాచ భయం, పీడలు
వుండవని చెప్తారు, దుర్గా దేవి నామాన్ని భక్తితో ఉఛ్ఛరించినంత మాత్రము చే మానవులు వంశవృధ్ధి, ధనవృధ్ధి కలిగి
భాగ్యశాలురై సుభిక్షంగా వుంటారని , రాక్షస, భూత,ప్రేత , పిశాచ గణాల పీడవుండదని ,
విషసర్పాలు , దుష్టజంతువులు దూరంగా తొలగిపోతాయని , శతృభయం వుండదని , రోగాలు , అనారోగ్యం దరి చేరవని
దేవీ భాగవతంలో,
వ్యాస భగవానుడు చెప్పాడు.
మంగళవారం,
శుక్రవారములే కాకుండా
అనునిత్యం ఆ దుర్గాపరమేశ్వరిని ఆరాధిస్తే ఆవిడ కృప తప్పక లభిస్తుంది...🙏🌹
No comments:
Post a Comment